Friday, July 18, 2025

Viveka Sloka 52 Tel Eng





శిష్యప్రశంస

శ్రీగురురువాచ :_

ధన్యోఽసి కృతకృత్యోఽసి పావితం తే కులం త్వయా । (పాఠభేదః - పావితం)
యదవిద్యాబంధముక్త్యా బ్రహ్మీభవితుమిచ్ఛసి ॥ 52 ॥

శ్రీ గురుః - శ్రీగురువు, ఉవాచ - పలికెను, ధన్యః = ధన్యుడవు, అసి - అయినావు, కృతకృత్యం - కృతకృత్యుడవు, అసి = అయినావు, త్వయా - నీచేత, తే - నీ యొక్క, కులం - వంశము, పాలితం = పవిత్రము చేయబడినది, యత్ - ఏ కారణమువలన, అవిద్యాబంధముక్త్యా= అవిద్యాబంధము యొక్క ముక్తిచే, బ్రహ్మీభవితుం - బ్రహ్మయగుటకు, ఇచ్చసి - కోరుచున్నావో

"శ్రీయుతః గురుః శ్రీగురుః - 'శ్రీ'కల గురువు.

శ్రు. ఋచ స్సామాని యజూంపి, సాహి శ్రీరమృతా సతామ్ - ఋక్కులు, సామములు, యజుస్సులు (అనగా వేదములు) సత్పురుషుల యొక్క అమృతమగు సంపద అను శ్రుతిచే శబ్ద రూపములగు ఋగాదులే అమృతను సంప్రద్రూపములై నపుడు, సకలవేదాన్తములను, వాటిచే ప్రతిపాదితమగు అర్థమును సాక్షాత్కరించుకొనిన గురువు శ్రీమంతుడు అని వేరుగ చెప్పవలెనా?

సూర్యాది సకలతేజస్సుల భావమునకు హేతువగు బ్రహ్మతేజస్సుతో సంపన్నుడు అని యర్ధము.

శిష్యుని అంతఃకర ణములోనున్న అంధకారమును తొలగింపగలిగిన, అట్టి శ్రీగురువు శిష్యుని ప్రశ్నకు ఉత్తరమును చెప్పెను. మొదట అతని మనస్సును వికసింప జేయుటకై (ఆనందింప జేయుటకై) శ్లాఘించుచున్నాడు. ధన్యః = ధనమునకు తగినవాడు.

న ఖలు ధనత్వం జాతిః యస్య యదిష్టం తదేవ తస్య ధనమ్, 

తత్తదిన పామరాణాం ఆకించన్యం ధనం విదుషామ్. 

ధనత్వమనునది ఒకజాతి కాదుకదా! ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి ధనము. సామాన్య జనులకు ఆ యా వస్తువులు ధనమైనట్లు విద్వాంసులకు లేమియే ధనము అని చెప్పినట్లు, విద్వాంసులు ధనమని అంగీకరించిన వైరాగ్యాది భాగ్యము నీ కున్నది అని అర్థము. అందుకు కారణము 'కృతకృత్యో అ సి ' అనునది. శాస్త్రవిహితములగు కర్మల ననుష్ఠించుటచే శుద్ధచిత్తుడవైనావు అని యర్థము.

చిత్తశుద్ధి లేనిచో సంసారముపై వైరాగ్యము కలుగదుకదా? యేన = ఎవనిచే, కృత్యాని = శాస్త్రవిహితములును, స్వవర్ణాశ్రమాద్యుచితములును అగు కర్మలు, కృతాని = చేయబడినవో అతడు కృతకృత్యుడు.

ఈ విధముగ కృతకృత్యుడవై, చిత్తమును శుద్ధము చేసికొని, తీవ్ర వైరాగ్యమును సంపాదించుకొని మోక్షేచ్ఛ కలవాడవైనావు. ఇట్టి నీచే నీ వంశమంతయు పవిత్రము చేయబడినది. కావుననే -

కులం పవిత్రం జననీ కృతార్థా విశ్వంభరా పుణ్యవతీ చ తేన,

అపారసచ్చిత్సుఖసాగరే అ స్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః

ఎవని మనస్సు అపారసచిత్సుఖ సాగరమగు ఈ పరబ్రహ్మయందు లీనమైనదో అతని కులము పవిత్రమగును; తల్లి పవిత్రు రాలగును; ఈ భూమి పవిత్ర మగును అనియు,

స్నాతం తేన సమస్తతీర్థసలిలే సర్వాపి దత్తావని

యజ్ఞానాం చ సహస్రమిష్టముఖిలా దేవాశ్చ సంపూజితాః, 

సంసారాచ్చ సముద్ధృతాః స్వపితరస్త్రైలోక్యపూజ్యో అ ప్యసా, 

యస్య బ్రహవిచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ .

ఎవ్వని మనస్సు క్షణకాలమైనను బ్రహ్మ విచారణమునందు స్థిరముగ నుండునో అతడు సమస్త తీర్ధోదకమునందను స్నానము చేసినట్లే. భూమినంతను దానము చేసినట్లే. వేయి యజ్ఞములు చేసినట్లే. సకల దేవతలను పూజించినట్లే, అతడు తన పితృదేవతలనందరిని సంసారమునుండి ఉద్ధరించును. అతడే ముల్లోకములలో పూజ్యుడు అనియు చెప్పుదురు.

అతనికి ఇప్పుడింకను జ్ఞానము కలుగకపోయినను, అతడుత్తమాధికారియగుటచే గురూపదేశమును వినినవెంటనే జ్ఞానవంతు డగును.

పరిపక్వమతేః సచ్చృతం, జనయేదాత్మథియం శ్రుతేర్వచః.

పరిపక్వమైన బుద్ధికలవానికి, ఒక్కమాటు విన్నను శ్రుతివాక్యము ఆత్మజ్ఞానమును కలిగించును అని మాధవీయ శంకర విజయములో శ్రీమదాచార్యులు చెప్పియున్నారు.

"అత్యనవైరాగ్యవతః సమాధిః ” అని ఈ గ్రంథమునందు గూడ చెప్పనున్నారు. శ్రీఘ్రముగనే బ్రహ్మ విలీనమగు మనస్సు కలవాడై కులమును భూమిని గూడ పవిత్రీకరింపచేయును అని భావము.

న విషయభోగో భాగ్యం, యోగ్యం ఖలు

యత్ర జన్తుమాత్ర మాత్రమపి

బ్రహ్మేన్ద్రరుద్రమృగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యమ్.

విషయముల భోగము భాగ్యముకాదు. అట్టి భాగ్యము ననుభవించు ప్రతిపాణికి యోగ్యత యున్నది.

విషయముల యందు వైరాగ్యమును, భాగ్యమును, బ్రహ్మేంద్రరుద్రులు గూడ అన్వేషించుచుందురు అని చెప్పబడిన వైరాగ్యమను భాగ్యము కలవాడగుటచే, మహాపుణ్య శాలి గాన అతనికి వంశపావనత్వము ఇప్పుడుకూడ ఉన్నది.

అందులకు హేతువు చెప్పుచున్నాడు. యత్ - ఏ కారణమువలన, అవిద్యా బంధ ముక్త్యా = అవిద్యాకృతమగు అహంకారాది దేహపర్యంతమగు బంధ మును త్యజించుటచేత, బ్రహ్మీభవితుం = బ్రహ్మ స్వరూపము తోడనే ఉండుటకు కోరుచున్నావో, అందువలన;

దీనిచే తీవ్ర వైరాగ్యానన్తరము కలిగిన తీవ్ర ముముక్ష చెప్పబడినది. ఇట్టి వారు ఈ జన్మలోనే పరబ్రహ్మ సాక్షాత్కారము సంపాదించుకొని కులమును, జగత్తును పవిత్రము చేయుదురు అని అభిప్రాయము.

(అశంక) 'బ్రహ్మీభవితుం' అను పదము "అభూతతద్భా వే చ్విః" - అట్లు లేనిది అట్లు అయినది అను నర్థమున ద్విప్రత్యయము వచ్చును అను నియమము ననుసరించి ద్విప్రత్యయము చేర్చుటచే ఏర్పడినది. కావున పూర్వములేని బ్రహ్మత్వము ఇపుడు సిద్ధించినది అను నర్థము వచ్చును. అ పక్షమున బ్రహ్మభావము అగంతుకము గాన ( లేనిది వచ్చినది గాన) తద్రూపమగు మోక్షముగూడ అనిత్యము రావలసి వచ్చును కదా ?

(సమాధానము) బ్రహ్మయే జీవుడుగా నుండుటచే సర్వదా బ్రహ్మభావముండనే ఉన్నది. కాని అది ఉన్నదను విషయము తెలియుటలేదు. ఆ విషయము తెలిసినపుడు బ్రహ్మీభావము వచ్చినట్లు కేవలము గౌణ ప్రయోగముచే ద్విప్రత్యయము ప్రయోగింపబడినది. అనగా ఇపుడు అజ్ఞానవశముచే బ్రహ్మయే అబ్రహ్మవలె నున్నది.

జ్ఞానము కలిగిన తరువాత బ్రహ్మ బ్రహ్మగానే ఉన్నట్లు గోచరించును. కావున బ్రహ్మ భావము పూర్వము లేనిదీ కొత్తగా వచ్చినదను ఆశంక నిరాకృతమైనది.

అవ. ఎల్లరును భవబంధవిముక్తి కై ప్రవర్తింపవలెనను నభిప్రాయముతో, ఆ విముక్తి వారివారి ప్రయత్నముచేతనే సాధ్యమగు నను విషయమును, లోకానుగ్రహబుద్ధిచే, ముందుగనే గురువు ఉపదేశించుచున్నాడు.

జనులు దాని (ముక్తి) విషయమున నిర్లక్ష్య భావముతో నుండి, ఈశ్వరానుగ్రహ లబ్ధమగు మనుష్య జన్మను వ్యర్థము చేసికొని దుఃఖ పరంపరను అనుభవింప కుందు​రుగాక యనునది ఈ ఉపదేశము చేయుటలోని ప్రధానోద్దేశ్యము.

śrīguruvācha ।
dhanyō'si kṛtakṛtyō'si pāvitaṃ tē kulaṃ tvayā । (pāṭhabhēdaḥ - pāvitaṃ)
yadavidyābandhamuktyā brahmībhavitumichChasi ॥ 52॥

This sloka has to be interpreted as Guru's primary fulfillment in life. Adi Sankara had the famous four disciples: Suresvara, Padmapaada, Totaka and Hastamalaka. We surmise whatever Sankara taught was initially for the benefit of the four. Had he waited for a larger flock to begin teaching, it would have been quite a loss as none could be sure of how long it would take for a fifth disciple to appear at his door step.

If you ask how many attended Jesus Christ's Last Supper, most would say a dozen, out of 72 disciples. This is what Michael Angelo had depicted in his famous art. When Jesus had so many disciples, why did Sankara have so few? There are several answers:

1) Though Jesus and Sankara lived unto their thirties, Sankara came from a guruparampara and didn't claim divinity

2) The "admission" process was far stricter for Sankara. To be his disciple, he expected a severe case of mumukshatva or extreme longing for liberation. On the other hand, anyone who accepted Jesus as the son of God was welcomed as his disciple

3) A disciple of Sankara had to give up all relationships, practice severe austerities and follow him wherever he went. Only bondage with the Guru was acceptable.

The flip side of the sloka is, the Guru waxing with joy for having met a disciple so well prepared to seek his knowledge, might not have met anyone like him before. For all we know, he could be the first one seeking the Guru's advice. The Guru thought the disciple was genuine and perfect to receive his tutelage based on the erudite queries put forth by the disciple.

It is common to treat a youngster embracing sannyasa as an outlier. Some would say: if not for fame, why else would a child do it, as sannyasi's are not known to garner anything pecuniary? Anticipating this argument, the Guru promises welfare of the kula, or clan, that includes not just immediate family, when one takes up tutelage under a guru.

However, if everyone in a village took up sannyasa, there would be no one left to tend fields, cattle, and so on. The entire village soon would face extinction, as there would be no economic output. If indeed that happens, the criteria for admitting one to sannyasa would be made stricter or more stringent. Hence mumukshatva was tested and only the well prepared were selected.

This is not unlike modern education system where stundents have to clear an entrance test. But there are no supply-demand constraints. Suppose there are too many unemployed engineering graduates, little is done to curtail the eligibility. In the olden times, this has been efficiently enforced when it comes with children seeking sannyasa by choosing only the most desirous of moksha or the academic process leading up to the liberation.

Friday, July 11, 2025

Viveka Sloka 50-51 Tel Eng




శిష్య ఉవాచ:-

ప్రశ్న నిరూపణము

కృపయా శ్రూయతాం స్వామిన్ప్రశ్నోఽయం క్రియతే మయా ।
యదుత్తరమహం శ్రుత్వా కృతార్థః స్యాం భవన్ముఖాత్ ॥ 50 ॥

శిష్యః = శిష్యుడు, ఉవాచ - పలికెను, హే స్వామిన్ - ఓస్వామి, కృపయా = దయచే, శ్రూయతాం - వినబడుగాక, మయా - నాచే, ఆయం - ఈ, ప్రశ్నః = ప్రశ్న, క్రియతే - చేయబడుచున్నది, యదుత్తరం = దేనికి వమాధానమును, భవన్ముఖాత్ - నీముఖము నుండి, శ్రుత్వా = విని, అహం = నేను, కృతార్థః = కృతార్ధుడను, స్యాం= అగుదునో .

మొదట సవినయముగ తెలుపకుండగ గురుసన్నిధిలో ప్రశ్న వేయగూడదు అనెడు శిష్యధర్మము దీనిచే బోధింపబడినది. “ప్రశ్నో అయం క్రియతే మయా" అని మొదట చెప్పక, ముందుగ “కృపయా శ్రూయతామ్”, అని ప్రార్థించి, పిదప అట్లు చెప్పుటచే తనపై దయాభివృద్ధి కలుగుటకై మనోమార్దవము, శీఘ్రముగ తెలిసికొనవలె ననెడి అభిలాషము సూచిత మగుచున్నవి.

"భవన్ముఖా ద్భృత్వా " అని చెప్పుటచే తనకు వేరే ఎవరును శరణము లేరు అను విషయము సూచింపబడినది.

అవ. ఇపుడు ప్రశ్నించుచున్నాడు

కో నామ బంధః కథమేష ఆగతః
కథం ప్రతిష్ఠాస్య కథం విమోక్షః ।
కోఽసావనాత్మా పరమః క ఆత్మా
తయోర్వివేకః కథమేతదుచ్యతామ్ ॥ 51 ॥

బంధః - బంధమనగా, కోనామ - ఏది?, ఏషః = ఇది, కథం - ఎట్లు, ఆగతః = వచ్చినది?, అసౌ - దీనికి, ప్రతిష్ఠా = స్థితి, కథం = ఎట్లు?, విమోక్షః - దీనినుండి మోక్షము, కథం - ఎట్లు?, అసౌ = ఈ, అనాత్మా = అనాత్మ, కః - ఏది?, ఆత్మా = ఆత్మ, క= ఏది, తయో - ఆ రెండింటి యొక్క, వివేకము, కథం = ఎట్లు ?, ఏతత్ - ఇది, ఉచ్యతామ్ - చెప్పబడు గాక

బంధ స్వరూపము తెలిసినచో, తగు ఉపాయములచే దానిని అనాయాసముగ తొలగించుకొన వచ్చునుగాన ముందుగా "కోనామ బంధః" అని బంధస్వరూపమును గూర్చి ప్రశ్నించుచున్నాడు.

“కథమేష ఆగతః' అని దానికి కారణమును ప్రశ్నించుచున్నాడు.

'కథం ప్రతిష్ఠాస్య' అని దానిస్థితికి కారణమును ప్రశ్నించుచున్నాడు.

అస్య = ఈ బంధము యొక్క ప్రతిష్ఠా = చిరకాలము స్థితి, కథం-ఎట్లు; ఏ కారణము చేత ? విమోక్షః - నివృత్తి.

పరమాత్మవైన నీకు అనాత్మబంధమున్నది అని గురువు చెప్పియున్నాడు. అందుచే ఆ అనాత్మయేది? పరమాత్మయేది? అని ప్రశ్నించుచున్నాడు.

'తయో ద్వివకోదిత' అని గురువు చెప్పుటచే అనాత్మ , పరమాత్మ భేద జ్ఞానము ఎట్లు జరుగును ? ఈ విషయమంతయు విస్తరముగ చెప్పుడు అని పల్కినాడు.

శ్రీచరణులు సంగ్రహముగ పరమాత్మనగు నాకు అజ్ఞానమువలన అనాత్మబంధము వచ్చిన దని చెప్పుటచే, ఇది ఎందులకు వచ్చినదో కొంచెము తెలిసినట్లున్నది. అట్లే వాటి వివేకము వలన కల్గిన జ్ఞానాగ్ని అజ్ఞానకార్యమును సమూలముగ దహించి వేయును అని చెప్పుటచే, మోక్ష మెట్లుకలుగును అను విషయము కూడ కొంచెము తెలిసినట్లే ఉన్నది.

శబ్ద మాత్రమును వినుటచే కొంచెము అర్థము తెలిసినట్లు ఉన్నను ఆ విషయమున సందేహము లన్నియు తొలగుటకు విస్తరముగ చెప్పినగాని, బంధస్వరూపము, దానిస్థితికి కారణము, ఆత్మానాత్మవివేకము పూర్తిగా తెలియవు.

అందుచే ఈ విషయమునంతను బాగుగా తెలిపి దీనదీనుడనైన నన్ను కృతార్థుని చేయవలెను అని భావము.

అవ. ఈ ప్రశ్న వైఖరిచేతను, వెనుకనే తెలిసిన త్రికరణశుద్ధి చేతను, ఈతనికి బ్రహ్మవిద్యయందు ఉత్తమాధికారమున్నదని తెలిసి కొని (గురువు) అతనికి వెంటనే బ్రహ్మవిచారమున ప్రవేశము కలుగుటకై శ్లాఘించుచున్నాడు.

మహాత్ముడగు బ్రహ్మవిదుత్త మునిచే శ్లాఘితుడైనచో, తన మనస్సులో నున్న దుఃఖమునంతను తొలగించుకొని, విచారాభిముఖమగు మనస్సు కలవాడై తాత్పర్యబుద్ధితో పరమాత్మ విచారముచేసి వెంటనే కృతార్థుడగును అని భావము.

siṣya uvācha 

kṛpayā śrūyatāṃ svāminpraśnō'yaṃ kriyatē mayā ।
yaduttaramahaṃ śrutvā kṛtārthaḥ syāṃ bhavanmukhāt ॥ 50॥

kō nāma bandhaḥ kathamēṣa āgataḥ
kathaṃ pratiṣṭhāsya kathaṃ vimōkṣaḥ ।
kō'sāvanātmā paramaḥ ka ātmā
tayōrvivēkaḥ kathamētaduchyatām ॥ 51॥

The disciple, ever humble, asks in a passive voice let his query be heard by the Guru. It is considered arrogant for one who has just started sadhana to pose a direct question to an elder let alone someone donning a Guru's mantle.

The questioner also hides his impatience for a quick answer and release from his ignorance. He indicates his helplessness in his speech as there is no one else to turn to assuage his misapprehensions and clear doubts lurking in the deep recesses of his mind.

One would think the norm in the bygone era was a farmer's son became a farmer, a trader's son became a trader and so on. In the Chandogya upanishad the story of Satyakama illustrates that a son of a servant maid, called Jabala, could seek tutelage under the rishi Haridrumata Gautama. So anyone approaching a Guru need only have the qualities of humbleness, curiosity about the true nature of the world, fear of bondage and yearning for moksha.

As the Guru acquiesces, the disciple shoots rapid fire questions:

What is bondage? How did it originate? How does it exist? How to be free from it? What is non-Self? How to tell Self from non-Self?

For those advanced in sadhana, answering them is trivial.

"Bondage is samsara or what we call relationships such as friends and family members. It has originated with the universe. It exists for as long as the soul doesn't attain moksha. To be free from it requires renunciation. One has to reject everything non-Self to arrive at Self".

But they barely scratch the surface, and give raise to several more questions about samsara, soul, and moksha which are transcendental as far as the disciple is concerned.

It was said that the entire sadhana of Ramana Maharshi started as a child with a basic question "Who am I?" So vicharana or analysis can begin with the simplest of doubts leading upto the grand stage of vedanta.

Before Artificial Intelligence became common, researchers built "Deep Models", inside computers, of various physical and chemical laws based on which the universe operates. They took over a lifetime of effort and are still under construction.

Furthermore, modern AI is built by "digesting" the content of the entire world-wide web. The hope is in addition to knowing about the existing concepts, AI will be able create new concepts, develop new modes of explanation and reasoning.

Those acquainted with animations such as cartoon shows, can relate to how the animated creatures move like real ones. Notably, the gravity, inertia, motion under the application of force, etc. are captured more or less perfectly for a seamless presentation of the creatures imitating their non-virtual counterparts.

The fact is, it takes hundreds and thousands of programmers and artists to create AI models and animations. Vedantins, counting since 5000 years ago, constitute a fraction of them. They learnt from Vedas and Gurus all about virtual reality without using a computer or a smart phone!

Friday, July 4, 2025

Viveka Sloka 49 Tel Eng




అజ్ఞానయోగాత్పరమాత్మనస్తవ
హ్యనాత్మబంధస్తత ఏవ సంసృతిః ।
తయోర్వివేకోదితబోధవహ్నిః
అజ్ఞానకార్యం ప్రదహేత్సమూలమ్ ॥ 49 ॥

పరమాత్మనః = పరమాత్మవైన, తప - నీకు, అజ్ఞానయోగాన్ - అజ్ఞానసంబంధమువలన, అనాత్మబంధోహి - అనాత్మ వస్తువులతో సంబంధ మేర్పడినదికదా, తతః ఏవ = అందువలననే, సంసృతిః = సంసారము, తయోః = ఆ ఆత్మానాత్మలయొక్క, వివేకోదిత బోధవహ్నిః - వివేకము వలన కలిగిన జ్ఞానాగ్ని, సమూలమ్- సమూలమైన, అజ్ఞానకార్యం - అజ్ఞాన కార్యమును, ప్రద హేత్ = దహించును,

పరమాత్మవైన నీకు, అజ్ఞానయోగాత్ - అనాదియైన అవిద్యా సంబంధము వలన, అనాత్మబద్ధః- అనాత్మలగు స్థూలసూక్ష్మ కారణ శరీరములందు ఆత్మత్వబుద్ధి,

దానివలననే జన్మము, వార్ధక్యము, మరణము, సుఖము, దుఃఖము, జడత్వము మొదలగు ధర్మముల అధ్యాస రూపముగు సంసారము.

"ఆత్మానాత్మల, వివేక" మనగా భేదజ్ఞానము, దానివలన కలిగిన, బోధవహ్ని, అనగా సాక్షాత్కార రూపమగు అగ్ని, సమూలం = అజ్ఞాన రూపమగు బీజముతో కూడినదియు, అజ్ఞాతమును అగు అహంకారము మొదలు దేహము వరకును గల బంధమును, దానివలన కలిగిన జన్మ జరామరణాది రూప సంసారమును,

ప్రద హేత్ - పూర్తిగ భస్మము చేయును. ఈ విధముగ సంసారమునకు కారణము అనాత్మబంధము ; దానికి కారణము నీకు అజ్ఞాన సంబంధము. అది నివర్తించుటకు ఉపాయము పరమాత్మ బోధము; దానికి కారణము ఆత్మానాత్మవివేకము అని చెప్పినట్లు అయినది.

అజ్ఞానమువలన కలిగిన బంధమునుండి విముక్తి కావలె నన్నచో జ్ఞానమువలననే కలుగును గాని మరి దేనివలనను కలుగదు గాన వేదన్త విచారమువలన కలుగు ఉత్తమజ్ఞానము సంసారదుఃఖ నాశక మనుటలో ఉపపత్తి చూపబడినది.

అవ, ఈ విధముగ గురు ముఖారవిందము నుండి వెడలిన వాక్యామృత ప్రవాహముచే ఆనందమును పొందిన శిష్యుడు, అతని ముఖ కలశము నుండి నిరర్గళముగ ప్రవహించుచున్న వాక్యామృత సింధువులో పూర్తిగ మునుగవలెనని అభిలషించుచు, తన సకలసందేహములను తొలగించుటకై అతనిని ప్రశ్నించుటకు సవినయముగ ప్రార్థించు చున్నాడు.

ajñānayōgātparamātmanastava
hyanātmabandhastata ēva saṃsṛtiḥ ।
tayōrvivēkōditabōdhavahniḥ
ajñānakāryaṃ pradahētsamūlam ॥ 49॥

For common people it is not clear what the scripture means by moksha. Consider the following telugu kritis:

naanaati bratuku natakamu, kaanaka kannadi kaivalyamu

puttutayu nijamu, povutayu nijamu, natta nadimi pani naatakamu

etta edutadee prapanchamu, katta kadapatidi kaivalyamu

Here Bard Annamacharya is saying life is like a drama enacted on the stage called world that we all share. The end is the kaivalya or moksha which is all but certain. Only birth and death are certain.

koluvai yunnade kodandapani...

nammina varalake kadaganta korina varameeya

The Sage Tyagaraja says Lord Rama will fulfill the wish of his devotee who awaits his grace patiently. In other words, there is no instant gratification in the spiritual matters.

To encourage neophytes, the scripture promises moksha, that isn't exactly defined, for all sadhakas as the fruit of sadhana. One can say it is synonymous with freedom from samsara or bondage and liberation meaning no more rebirths by transmigration. Scripture, however, describes three kinds of mukti upon death:

sadyo mukti: this is attainable by one with infallible knowledge about one's own identity with Brahman. In other words, the mahavakya--tattvamasi (You are That) has been completely applied with perfection in sadhana, regardless whether "That" means Saguna or Nirguna (with or without attributes) Brahman.

jivan mukti: this is applicable to one with falliable or infallible knowledge of the atman. A jivan mukta may have knowledge of either Saguna or Nirguna Brahman (with or without attributes). If his knowledge is that of Saguna, he will proceed to Brahma Loka upon death. A jivan mukta may also suffer from the effects of prarabdha karma.

videha mukti: a sincere sadhaka who after physical death, may head for Brahma Loka via devayana path.

To drive these home, let us take an example. Suppose you want to go where Ganga landed on the earth answering King Bageeratha's prayer. Between you and Ganga there is a desert to cross. There are several oases on the way and you are running a race with time. When you become thirsty you see water at a distance. We ask what is that you are seeing? There are at least three answers:

  • (a) it is a mirage and no water exists there,
  • (b) it is an oasis and water exists there,
  • (c) it is Ganga!

If all you care about is water, and any water will do, then option (b) can fulfill your wish. Before that option (a) has to be ruled out, especially so when you have to detour from your main path that can exacerbate your thirst. So it is critical that you rule out mirage before you act. This is like overcoming maya and avidya during sadhana.

If what you are seeking is the real Ganga and not its meaning in parlance such as "water", then you don't care for immediate gratification and options (a) and (b) don't matter for you already have overcome maya and avidya. But then option (c) will make your thirst more severe and won't guarantee your success, which is to arrive at the Ganga's origin on earth alive!

This little, albeit contrived, scenario illustrates the situation faced by a mumukshu. As he progresses in sadhana, a mumukshu will face many distractions and come under the influence of maya on the path to moksha.

The easiest one to attain for a mumukshu is videha mukti with proper sadhana. This is like quenching the thirst in every oasis after chasing mirages and arriving at the destination.

The next hardest one is jivan mukti. This is like stopping at an oasis only when needed and arriving at the destination a bit faster. The same caveats as videha mukti apply.

The hardest one is sadyomukti which is like skipping all oases, not settling for any water, arriving at the Ganga's meeting point with earth and finally quenching the thirst with Ganga's water. Only exceptional people like Swami Vivekananda, Ramana Maharshi, pravachana kartas, et al. are eligible.

From the next sloka onwards the disciples take over in an effort to seek clarification from the Guru.

Viveka Sloka 52 Tel Eng

Telugu English All శిష్యప్రశంస శ్రీగురురువాచ :_ ధన్యోఽసి కృతకృత్యోఽసి పావితం తే కులం త్వయా । (పాఠభేదః - పావితం) యదవిద్య...