|
|
|
దుర్వారసంసారదవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతైః । భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యద్యదహం న జానే ॥ 38 ॥ (పాఠభేదః - అన్యం)
దుర్వార సంసారదావాగ్ని తప్తం - వారింప కష్టమైన సంసారదావాగ్నిచే తపింపచేయబడినవాడను, దురదృష్టవాతైః - పాపములనెడు వాయువులచేత, దోధూయమానం - ఇటునటు ఎగురగొట్టబడనున్నట్టి వాడను, భీతం - భీతుడను, ప్రపన్నం - శరణుజొచ్చినవాడను అగు నన్ను. మృత్యోః = మృత్యువునుండి, పరిపాహి - రక్షింపుము, యత్ = ఎందు వలన అనగా, ద్యదహం - నీ కంటె అన్యుడైన, శరణ్యం = రక్షకుని, అహం-నేను, నజానే - ఎరుగను.
సంసారమే, దవాగ్నిః = నలుమూలల వ్యాపించి తాపమును కలిగించుటచే, వనమునందలి అగ్ని : అది నీ సదుపదేశమువలన కలుగు జ్ఞానము లేనిచో నాచే స్వయముగ వారించుకొనుటకు శక్యము కానిది.
దుర్వారమగు అట్టి సంసారదవాగ్నిచే, తప్తం = కాల్చబడినవాడను; దావాగ్నికి గాలికూడ తోడైనచో అది అంతట వ్యాపించి కాల్చుట ప్రసిద్ధము.
అట్లే, దురదృష్టము లనగా పాపములు. అవే ప్రతికూల వాయువులు; వాటిచే, దోధూయమానం - మాటిమాటికిని కంపింపబడుచున్న వాడను. వాయువు అనుకూల మైనచో మరియొక ప్రక్క తీసికొని పోవచ్చును. కాని ప్రతికూల మైనచో ఈతనిని అగ్నిలో పడవేయును, లేదా అగ్నిని ఈతనిపై ప్రసరింపచేయును.
ఈ విధముగ దావాగ్ని తప్తుడైన వానిపై అమృత వృష్టి కురిపించినచో తాపము తొలగును అను అభిప్రాయముతో పూర్వశ్లోకములో ' దృష్ట్యా' అనుదానికి 'అతికారుణ్యసుధాభివృష్ట్యా’ అను విశేషణము ప్రయుక్త మైనది.
ఈ పదమున బహువ్రీహిసమాన మును అంగీకరించి వెనుక అర్థము చూపబడినది. బ్రహువ్రీహి చేయక దృష్ట్యా = దృష్టితో, అతికారుణ్యసుధాభివృష్ట్యా - కారుణ్య సుధావర్షముచే అనికూడ అర్థము చెప్పవచ్చును. వర్షణముచే దావాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువునుండి రక్షింపుము అని అన్వ యము. 'ఋజువైన కటాక్షదృష్టిచే నన్ను ఉద్దరింపుము' అని పూర్వమునందును, దృష్టిచేతనే సుధావర్షమును కురిపించి సుసారదావాగ్ని తప్తుడనైన నన్ను మృత్యువునుండి కాపాడుము అని ఈ శ్లోకమునందును అన్వయము.
మృత్యువునుండి భయపడిన వాడను, శరణాగతుడను అగు నన్ను మృత్యువునుండి రక్షింపుము అని ఉభయస్థలములందును అన్వయము.
నీ అనుగ్రహమువలన ఆత్మజ్ఞానము కలిగినచో నాకు శరీరమునుండి బయటకు పోవుట అను మరణము కలుగదని భావము.
శ్రు. "న తన్య ప్రాణాఉత్క్రా మన్తి అతైవ సమవలీయన్తే " - బ్రహ్మవేత్త యగు వాని ప్రాణములు పైకి ఎగిరిపోవు; ఇచటనే లీనమై పోవును అని శ్రుతి చెప్పుచున్నది.
‘ధ్రువం జన్మ మృతస్య చ’ మరణించినవానికి మరలజన్మ సత్యము అని చెప్పిన విధమున మరణము లేకున్నచో జన్మయే యుండదు గాన, నీ అనుగ్రహము లభించినచో జన్మమరణ ప్రవాహరూపమగు సంసారమునుండి ముక్తుడనగుదునని భావము.
గురువును అభిముఖునిగ చేసికొనుటకై నీవు తప్ప మరియొక్క శరణమేదియు లేదు, అని చెప్పుచున్నాడు. నాకు మరియొక రక్షకు లెవరును లేకుండుటచే నన్ను ఉపేక్షింపరాదు అని భావము.
అవ. నీవంటి సత్పురుషులకు మావంటి వారివిషయమున అవ్యాజమగు కరుణ ఉండును అని రెండు శ్లోకములలో చెప్పుచున్నాడు.
durvārasaṃsāradavāgnitaptaṃ dodhūyamānaṃ duradṛṣṭavātaiḥ | bhītaṃ prapannaṃ paripāhi mṛtyoḥ śaraṇyamanyadyadahaṃ na jāne || 38 ||
To be mortal means to live, play and die. Several philosophers dealt with this subject and science constantly struggles to explain what awaits after death. Our scripture says just as we change a pair of old clothes for a new one, the atma(soul) transfers from one body to another.
To be clear, the physical body is like a machine. The bones and joints have to wear out after a period of time just as iron rusts or pillars made of mortar crack. Even if there were no disease, the bodily cells constantly die and new cells are created. Sometimes nerve cells and neurons never regenerate resulting in various mental afflictions. The atma, however, with the support of antahkarana will be attached to the body until five-fold prana (pana, apana, vyana, udaana, samaana) is present in the body.
This all makes sense for one advanced in the scripture. Here Sankara is projecting the mind of a sadhaka who just entered a station in life that is still to be considered as a childhood or at best a teenage. Unlike the present day children, who are barely aware of the sacrifices their parents have to make to see that they are fed and clothed, in ancient times they were fully engaged in the household duties, for there were no distractions like television or the internet.
For an ancient teenager the biggest concern was how to get over the fear of samsara (bondage) and eventual death. It was not clear to him what Lord Krishna meant when he said "death is certain, but so is rebirth". Or what Lord meant when he guaranteed the rebirth would take place such that the sadhana in the previous life was brought forward; rather reinvested.
Furthermore, our culture inculcates early on the notion of papa which is in contrast to punya or good deed. Sin is not same as papa but a transgression of god's commandment. Papa implies the effect on others' well being while performing a karma. There are those like Jains who consider breathing in a microbe is papa. Jada Bharata in Bhagavata, while carrying the palanquin of King Rahoogana, avoided stepping on worms and insects on his path, even though the King threatened to punish him as his journey was made uncomfortable. He was worried that even if he accidentally killed a jeevi he would have to be reborn or not attain moksha.
The person who can clear such fears and apprehensions deep in the mind and heart is a guru. No amount of pep talk by the relatives and friends will be as effective as a kind hearted guru's upadesa.