Thursday, March 10, 2022

Chapter 13 Section 4

13.5

ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్ వివిధైః పృథక్ {13.4}

బ్రహ్మసూత్ర పదైశ్ చైవ హేతుమద్భిర్ వినీస్చితైః

ఈ సత్యాలు గొప్ప జ్ఞానులు పలు విధాలుగా స్తుతించి బ్రహ్మన్ గురించి హేతుబద్దమైన వ్యాఖ్యలు వ్రాసేరు

"నువ్వెలా నాటుతావో, అలాటి పంట పండించుకొంటావు" అని క్రీస్తు చెప్పెను. అది పరమ సత్యం. గలిలీ కొండ (Mount Galilee)మీద విన్న వారంతా క్రీస్తు మాటలలోని సత్యాన్ని గ్రహించేరు. విత్తనాన్ని భూమిలో పాతు, దానిని సరిగా పోషించు, అది మొలకెత్తుతుంది. నువ్వు పొందే పంట ఆ విత్తుకి సంభందించినదే కానీ వేరొకటి కాదు. "మీ కర్మలు విత్తనాలు. అలాగే మీ ఆలోచనలు కూడా" అని క్రీస్తు పలికినప్పుడు ఆయన శిష్యులు, విన్నవారు ఆశ్చర్యచకితులై వుంటారు.

ఇరవై శతాబ్దంలో అమెరికాలో నివసించేవారు ఒక పట్టాన క్రీస్తు మాటలు పట్టించుకోరు. అయినప్పటికీ ఆ మాటలలోని సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనం ఒక నిట్టూర్చి "ఆయని మాటలు ఒకానొక సందర్భానికి పనికొచ్చేవి. బహుశా గలిలీ కొండ మీద వారిని ఉద్దేశించి అలా మాట్లాడి ఉండచ్చు" అని అనుకోవచ్చు. ఆ భావాలు నేటికీ నిజం. రెండు వేల సంవత్సరాల క్రితం, ఇప్పుడు, భవిష్యత్లోనూ అవి పరమ సత్యాలుగా మిగిలి పోతాయి. ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక గురువులు పాత వాక్యాలను దేశకాలమానానుసారముగా క్రొత్త పంథాలో వివరించి మన సంస్కృతి ప్రకారం అవగాహన కల్పిస్తారు.

బుద్ధుడు మనస్సును జయించడం గురించి పల్లె ప్రజలకు బోధించినప్పుడు, వారి గ్రహణ శక్తికి అందుబాటులో ఉన్న ఉపమానాలు వాడేడు. అందులో ఒకటి గుడిస. "నువ్వు పూరి గుడిసలో నివశిస్తుంటే, వర్షం పడితే కప్పులోంచి నీళ్ళు పడవా? నువ్వు తడిసిపోతావు. దుఃఖితుడవవుతావు. న్యుమోనియ (pneumonia) వ్యాధి కూడా రావచ్చు. మనస్సు అలాంటిదే. తపస్సు (meditation) ద్వారా మనస్సులోని కారెడు కన్నాలు మూయకపోతే, కోరికలు పుట్టుకొస్తాయి". కొన్నేళ్ళ తరువాత మానసిక పరమైన శరీర జాడ్యం (psychosomatic)రావచ్చు.

బుద్ధుని గుడిస ఉపమానం పరమ సత్యం. ఈనాటి ప్రపంచంలో ప్రతీదీ మానసిక సంబంధం గలది అని తీర్మానించి, బుద్ధుని మాటలకి పెడార్థాలు తీసి ప్రగతిని సాదిద్ధామానే ప్రబుద్ధులు ఉన్నారు . మొదట మన శరీరం ఒక చిన్న ఇల్లని , అందులో మన ఆత్మ ఉందని అనుకొందాం. ఇది ఒక ఉపమానము మాత్రమే కాదు. మన శరీరం అలాంటిదే. అది ఒక నివాసయోగ్యమైన ఇల్లు. కల్పిత శాస్త్ర (science fiction) కథనాల్లో అటువంటివి చదవవచ్చు. ఇంకా పెరిగే గోడలు, మాట్లాడే పొయ్యలు, మనను చూచే టివిలు, గురించి కూడా ఆ కథానాల్లో ఉంటాయి. ఇటువంటి ఇల్లు గూర్చి నేను తరువాత వ్రాస్తాను. ఎందుకంటే అటువంటి ఇంట్లోకి వెళితే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. కాబట్టి మనం ఆ భౌతికమైన ఇంటి గురించి, అనగా మన శరీరం గూర్చి తెలుసుకొందాం.

మా ఆశ్రమంలో నేను నివసించే ఇల్లు కట్టెలతో కట్టబడినది. ఉపనిషత్తుల్లో నా శరీరమనే ఇల్లు తినే పదార్థాలమీద ఆధారపడివుందని చెప్పబడినది. నేను మా తోటలో పండించే ఆకుకూరలు , లారెల్ చేసిన బ్రెడ్ (Bread), సాండ్రా చేసిన సోయా పాలు, శోభా అనబడే ఆవు పాలనుంచి వచ్చిన వెన్న మొదలైనవి తింటాను. నా శరీరం దిట్టంగా ఉంది. కానీ నా కండరాలు, నాలో ఉన్న జీవాణువులు సదా మారుతూ ఉంటాయి. కొన్నిటిని నా శరీరం మరామత్తులు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటుంది.

నేను జూలియా --ఆమెకు 13-18 మధ్యన వయస్సుoటుంది -- అనే మిత్రముతో శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేను. అక్కడ ఒక దుకాణంలో చాకలేట్, పంచదారతో చేసిన ఇల్లు, శాంతా క్లాస్ మరియు అతని జింకల దృశ్యం కనబడింది. "జూలీ దీనిని చూచి ఎలా స్పందిస్తున్నావు?" అని అడిగేను.

"నేను ఆ మొత్తాన్ని తినేస్తాను", అని అంది.

"నీవు అటువంటి ఇల్లులో నివసించడానికి ఇష్టపడవా ?"

"అమ్మో అది అసంభవం. వర్షం పడితే ఏమి చేస్తాను?"

మనం విపరీతమైన చాకలేట్ తింటే అటువంటి ఇంట్లో ఉన్నట్టే. మనం తినే వస్తువు కాకపోయినా మన శరీరం తినే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం కణాల ద్వారా తనని తాను పునః నిర్మాణం సదా చేస్తూ ఉంటుంది. నేను రోజంతా చాకలేట్ తింటే, శరీరం నిర్మాణానికి ఒక జీవకణం అడిగితే, నేను "ఇదిగో ఈ చాకలేట్ తిను" అంటాను. నా శరీరం ఊబకాయమైతే, నా ఇంటి యజమాని వలన కాదు. దానికి నేనే మూల కారణం. మనం నిర్మాణానికి కావలసిన వస్తువులు ఎంచుకోవడానికి మన నాలుక రుచి మీద ఆధారపడకూడదు. మనం తినే ఆహారం మనని స్వస్థతతో బలవంతులిని చేయాలి.

ఇక్కడితో మన శరీర వర్ణన ఆగి పోలేదు. దానిలో అంతర్గతంగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కూడా ఉన్నాయి. ఒక గుడిసె ఆధునిక ప్రపంచoలో ఉన్న మనకి చిహ్నం కాదు. ఎందుకంటే మన మనస్సు పరిపరి విధాలుగా బయట విషాయాలకై పరుగులిడుతుంది. ఫ్రాయిడ్ (Freud) పోయిన తరువాత ఆయన చెప్పినట్లు మనం రాజభవనాల్లో నివసిస్తున్నాము. అటువంటి భవనాన్ని నేను సాన్ ఫ్రాన్సిస్కోలో చూసాను. చాలామంది తమ బాహ్య శరీరాన్ని అందంగా ఉంచడానికై ప్రయత్నిస్తారు. నా అనుభవంలో తమ ఇంటిలోపలికి వెళ్లని వారు చాలామంది ఉన్నారు. ఇంటికి తలుపున్నదని కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఇంటి బయట నివసిస్తారు. పరిశ్థితులు వానను కలుగజేస్తే తడుస్తారు. అది నాకు చాలా బాధను కలిగిస్తుంది. మనందరికీ తలదాచుకోడానికి ఇల్లు ఉంది. ఆ ఇంటి అంతర్గతం మనను ఆరోగ్యంతో , సౌఖ్యతతో, బాంధవ్యాలతో క్షేమంగా ఉండడానికి దోహదం చేయాలి. కానీ ప్రస్తుత ప్రపంచం ఇచ్చే సందేశం: "అంతర్గతంలో ఏమీ లేదు. నీవు శరీరానికే పరిమితం. తడిసి ముద్దవడం, న్యుమోనియా వ్యాధితో బాధపడడం జీవితంలో జరిగే సామాన్య విషయాలు" .

నేను రాజ భవనాన్ని ఉదాహరణగా తీసుకోవటానికి కారణం, అది మన కర్థంచేసుకోవడానికి క్లిష్టమైన మనస్సుకు ఉపమానంగా ఉంటుంది. కొన్నేళ్ళ క్రిందట నేను సాన్ హోసే అనబడే నగరానికి వెళ్ళినపుడు గొప్ప చరిత్రగల ఇంటిని చూసేను. దాని పేరు విన్ చెస్టర్ మిస్టెరీ (Winchester Mystery). విన్ చెస్టర్ అనబడే ఒక వనితకు నిగూఢమైన విషయాలను--అనగా జ్యోతిష్యం వంటివి - అంటే నమ్మకం . ఆమెకు ఎవరో ఆ ఇంటి పునః నిర్మాణము జరిగినన్న ఏళ్ళు బ్రతికి ఉంటుందని చెప్పేరు. తెలివితో ఆమె నిరంతరం ఆ ఇంటికి మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది.

నేను ఆ ఇంటిలోకి ఎప్పుడూ ప్రవేశించలేదు. కొన్ని కథనాల ప్రకారం అది చిత్ర విచిత్రంగా ఉంటుంది. చాలా మరమత్తులు అవసరం లేకపోయినా చేయిస్తూ ఉంటారు. ఆ వనిత చూడని గదులు ఎన్నో ఉన్నాయి. కొన్ని తలుపులు కవతల గోడలు మాత్రమే ఉంటాయి. కొన్ని మెట్లు ఎక్కడికీ దారి తీయవు. ఆ ఇంట్లో పుస్తకాలు పెట్టే బీరువాలు లెక్కలేనన్ని ఉండవచ్చు. అలాగే సొరంగాలు, తలుపులు లేని గదులు ఉండవచ్చు. మనం సులభంగా దారి తప్పి పోవచ్చు. అదే ఆ వనితకు అయి ఉంటుంది. ఆమె ఆ ఇల్లు నేనేనని ఆ ఇంటితో తాదాత్మ్యం చెందింది. ఎప్పుడైతే ఆ భావన పోయిందో ఆమె కూడా అంతరిస్తుంది. కొన్ని తెలియని కారణాల వలన ఆ ఇంటికి మరిన్ని మార్పులు చేయలేదు. ఆమె పండువయస్సులో చివరకి మరణించింది.

ఆ ఇంటిలాగే మన మనస్సు కూడా వుంది. దానిలో అనేకమైన సొరంగాలు, గదులు, మెట్లు ఉన్నట్టుoటుంది. దానికి లెక్కలేనన్ని కిటికీలు, బయటనుంచి చూడలేని దృశ్యాలు, బాహ్య ప్రపంచాన్ని చూడడానికి ఉంటాయి. దానిలో పలురకములైన కథలూ ఉన్నాయి. రాగము, బుద్ధి మొదలైనవి కూడా ఉన్నాయి. అవన్నీ అచేతనంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ అచేతన మనస్సుని శోధించడం బహు కష్టం.

కొంతమంది దానిలోకి ప్రవేశించరు. కొందరు ప్రవేశించి దాని వ్యూహంలో చిక్కుకుంటారు. వాళ్ళు వెలుపలికి రావడానికి నిర్వీర్యులై ఇతరులకు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. జీవితం సజావుగా సాగాలంటే మనం లోపలికి వెళ్ళడం, అలాగే బయటకు రావడం అవసరమైనవి. బయటకు రావడమంటే నిష్కామ కర్మ చేయడం. లోపలికి వెళ్ళడం అంటే మన ఆరోగ్యం, భద్రత, మనఃశక్తికై వీలయినంత ధ్యానము చేయడం. లోపలికి వెళ్ళడంతో సరిపోలేదు. అంతర్గతం తెలిసికోడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఒకమారు లోపలి కెళ్ళిన తరువాత ఎలా అన్వేషించాలో వారికి తెలీదు. ఆ ప్రయత్నంలో వాళ్ళూ చుట్టూ గోడలను, రాజ సింహాసనాన్ని, తపాలా పెట్టెలను చూసి "ఇక్కడిoతే ఉంది కాబోసు" అనుకొంటారు. నిజానికి అక్కడ ఎన్నో వింతలున్నాయి. కానీ వాటిని ఎక్కడ చూడాలో , ఎలా చూడాలో, తలుపులు ఎలా తియ్యాలి, మెట్లు ఎలా ఎక్కాలి అన్న విషయాలు తెలిసుండాలి. ఒక సమర్థుడు, అనుభవజ్ఞుడు, దయగలవాడు అయిన గురువువద్ద ధ్యానం నేర్చుకోవాలి.

ఒకసారి నేను మనస్సుగురించి ఉపన్యాసం ఇచ్చేను. ఎలాగ అహంకారం రాజ భవనంలోని అంతః పురంలో ఉంటుందో, ఎలా కల్పన చేస్తుందో, ఆర్శన్ వెల్స్ (Orson Wells) వ్రాసిన జేన్ ఐర్ (Jane Eyre) పుస్తకంలోలాగ ఎలా కనిపిస్తుందో అన్న విషయాల గురించి మాట్లాడేను. తన మతిభ్రమించిన భార్యను రాజ పీఠానికి వారసురాలుగా కాకుండుటకై ఎలా బంధించేడో కాదు అసలు విషయం. మనం మన ఆత్మను బంధించేము. మొత్తానికి అదంతా రేడియో నాటకంలాగ పనికివస్తుంది.

ఇకపోతే ఆ ఇంటి అంతర్భాగాన్ని చూద్దాం. మన మనస్సనే ఇంట్లో అనేకమైన అంతర్భాగాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆత్మతత్త్వజ్ఞుడికి జీవితాంతం సరిపోయే పని కల్పిస్తాయి. ఫ్రాయిడ్ అనే ఆత్మతత్త్వజ్ఞుడు ఒకటి లేదా రెండు అంతర్భాగాలను పరిశీలించేడు. దానివలన ఆధునిక మానవుడిపై తనను తాను ఎలా భావిస్తాడో అన్న విషయం ప్రభావితమైంది. మనకి చేతన సమయంలో ఆ అంతర్భాగాలను పరిశీలించి, వాటిని శుద్ధ పరచే చిట్కా తెలిసుండాలి.

నేనీ పుస్తకం రాస్తున్నప్పుడు చాలామంది కంప్యూటర్ లో డంజెన్స్ (Dungeons) అనే ఆటను ఆడుతున్నారు. అంటే భూగర్భంలోని సొరంగాలతో ఆట. నువ్వు ఒక శిధిలమైన ఇంటిలో ప్రవేశించి, నేలమీద ఉన్న రహస్య తలుపును తెరిచి , కారుచీకటిలో నడిచి, అనేకమైన గదులలోనున్న నిధిని పొందాలి. మన మనస్సు అటువంటిదే. కొన్ని సంవత్సరాలు ధ్యానం అభ్యశిస్తే, చేతన మనస్సుకు క్రిందనున్న అంతర్భాగానికి ప్రవేశించవచ్చు. దానిలో అనేకములైన వస్తువులను తెలిసికోవచ్చు. మొదట లైట్ స్విచ్. అది చులకనగా చూసేది కాదు. చీకటితో నిండిన అంతర్భాగాన్ని చూడడానికి లైట్ స్విచ్ ఎక్కడుందో తెలిసికోవడం ఎంతో అవసరం. తరువాత చుట్టూ చూసి మనని ప్రతి దినమూ బాధించే విషయాలను పరిశీలించవచ్చు. ఉదాహరణకు ఇతరులతో మన నడవడిక గురుంచి అంతకు ముందు రహస్యంగా ఉన్న నిజాలను తెలుసుకోవడం.

ఇంతవరకు చేసిన పనులలో ఎంతో తెలిసికొనవలసినది ఉంది. యోగులు చెప్పినట్టు "నువ్వు ఇప్పుడే మొదలెట్టేవు. లోతుకు వెళ్ళు". అంతర్భాగoనుంచి అనేక దారులు అనేకములైన గదులను చేరుస్తాయి. చాలా గదులను పరిశీలించనక్కరలేదు. నేను చెప్పినట్లు, అచేతన మనస్సులో చాలా వింతలు మన గమ్యoచేరడానికి దోహదం చెయ్యవు. నా అమ్మమ్మ సంరక్షణవలన, నేను ఒకగది నుంచి ఉంకో గదికి దిక్కులు చూడకుండా వెళ్ళగలిగేను. అక్కడక్కడ పరిశీలించడానికి కారణాలు ఉన్నాయి. కానీ నా మనస్సులో ఒకేఒక సంకల్పం ఉన్నది: అతి తక్కువ కాలంలో అచేతన మనస్సు లోతులకు చేరడం. ఎందుకంటే అందలి నిధిని వెలుపలకు తెచ్చి నలుగురికీ పంచి పెట్టడానికి .

మన అచేతన మనస్సులో చాలా అంతర్భాగాలు ఉన్నాయి. చాలా మటుకు మనకి తెలియనివే. మనము చేతనమును నుంచి అచేతనమునకు సాధారణంగా కలల్లో అవ్వడం చూస్తాం. మెలకువ వచ్చినప్పుడు ఆ కలల్లోని విషయాలు గుర్తుతెచ్చుకొని ఆశ్చర్య పడతాం. లోతుకు వెళుతున్నకొద్దీ ఆ అంతర్భాగాలు జీవరాశ్యులకన్నిటికీ ఒకటే అన్న జ్ఞానం ఉదయిస్తుంది. మొదట్లో దాన్ని నిరూపించలేము. మనం అచేతనం గురించి చేతనంలో తెలిసికొని అక్కడి వింత అంతర్భాగాలలో మన ఇంట్లో ఎలా గదులెక్కడున్నాయో తెలిసినట్టు ధైర్యంగా ముందుకు సాగాలి.

ఈ అంతర్భాగాలలో తెలిసికొనే విషయాలు చాలా ఉన్నాయి. పురావస్తుశాస్త్రజ్ఞులు (archaelogist) కొన్ని పురాతన నగరాల్లో పెద్ద కుండలలో విత్తనాలు కనిపెట్టేరు. అవి కొన్ని వందల ఏళ్లనాటివి అయినప్పటికీ, మట్టిలో పాతి, తగిన వనరులు ఇచ్చినప్పుడు, మొలకెత్తేయి. అలాగే మన అంతర్భాగాలలో కర్మ అనే విత్తనాలు పెద్ద పెద్ద కుండల్లోలాగ పొందు పరచి ఉన్నాయి. అవి తగిన సమయంలో మొలకెత్తడానికి వేచి ఉన్నాయి. ఈ విత్తన నిధిని సృష్టి ఆరంభంనుంచీ పోగుచేసుకున్నాము. ఉపరితలంలో మనకు అందుబాటులో ఉన్న విత్తనాలు వ్యక్తిగత కర్మలు. ఎలాగయితే కృష్ణుడు రాముడిని కొట్టడం. ఇంకా లోతు కెళితే మనకి యుగ కర్మ అనే విత్తనాలు కనిపిస్తాయి. ఇవి మనందరం పోగుచేసుకున్న సమిష్టి కర్మ. మనందరం ఈ శతాబ్దంలో పుట్టేం కాబట్టి మనందరిలో ఒక సూక్ష్మమైన కర్మ ఉంది. ఆ సూక్ష్మ కర్మ ఈ శతాబ్దంలో ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కర్మ విషయంలో గురి తప్పడమన్నది లేదు. మన దేశమాన కాలo,తలిదండ్రులు, సామజిక జీవితం అన్నీ మన మనుగడకి హేతువులు. మనం ఇవవ్నిటినీ విత్తనపు జాబితానుంచి పూర్వ ఆలోచన, క్రియల బట్టి ఎంచుకున్నాము.

అచేతన మనస్సు యొక్క లోతైన భాగంలో గోడలులేని ప్రదేశం ఉన్నది. అది ఎప్పటికీ ఉండే ఒక అపూర్వ ప్రదేశం. తక్కిన అంతర్భాగాలు దీనితో పోలికచూస్తే అవి వ్యష్టికి సంభందించినవి. అంటే మన ఇంటికి చెందినవి. కానీ ఆ ప్రదేశం సమిష్టి. దానిని సమిష్టి అచేతనం అని చెప్పవచ్చు. భౌద్దులు దానిని కర్మ-బీజాలయమoటారు. ప్రతిఒక్కరి అంతర్భాగం ఈ భాగంతో అనుసంధానమై ఉంది. దానిలో సమిష్టి సంస్కారములు పొందుపడుపబడినవి. కొన్ని సంస్కారాలు మానవుల పరిణామములో జంతు దశకు చెందినవి. అవి క్రోధము, మోహము, లోభము, భయము. అక్కడ కోట్లకొలది విత్తనాలు పెద్ద పెద్ద కుండల్లో ఉంచబడినవి. మనకు ప్రతిదినము ఆ భాండారాలలోంచి కొన్ని విత్తనాలు పంపబడతాయి. వాటిని మన పెరట్లో పాతి పెడతాము. మనము కోపానికి వేరొకడు లేదా వేరొకటి కారణమని తలంచవచ్చు. కానీ ప్రతివొక్కనికి ఆ విత్తనాలు అందజేయబడతాయి.

ఎప్పుడైతే మనం చేతనంగా ఆ ప్రదేశాలలో ప్రవేశించి తిరుగుతామో , వానినుంచ తరగలేని ప్రేమ, జ్ఞానము, బలము, స్ఫూర్తి లభిస్తాయి. ఆ ప్రదేశంలోని పదాలు, క్రియలు ఎనలేని శక్తివంతమైనవయి మనను ఇతరులకు సహాయము చేయుటకు, ప్రేరణ చేయుటకు ప్రోత్సాహిస్తాయి. ఎందుకంటే ఆ ప్రదేశం మనందరికీ సమిష్టిగా ఉంది.

దీనిగురుంచి ఇలా చెప్పుకు పోవచ్చు. కానీ ఈ పుస్తకం సరిపోదు. అచేతనం గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం వ్రాయాలి. అందుకే నేను మనస్సును గురించి ఎందుకు అధ్యయనం చేయాలో ఉదాహరణల ద్వారా చూపించేను. గీతలో ఉన్న మానసిక శాస్త్రము అపారం. దానిని స్వయం కృషితో తెలుసుకొని ఆచరణలో పెట్టాలి. అందుకే శ్రీ కృష్ణుడు శాస్త్రములు క్రొత్త అర్థాలతో వ్యాఖ్యానం చేయబడతాయి అని చెప్పెను. శాస్త్రము, యోగులు ఒకే విషయాన్ని పలు రకాలుగా ఒకే సందేశముతో ప్రవచించుచున్నారు. యోగాభ్యాసము మరియు సాధన అనుభవము ఎప్పటికీ ఒక్కటే. 51

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...