Thursday, March 10, 2022

Chapter 13 Section 9

13.8

ఆసక్తి రస భిష్వంగః పుత్రదారగృహాదీషు {13.9}

నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు

సంగము లేకుండుట , పుత్రుడు, భార్య, ఇల్లు మొదలగు వానియందు అభిమానము లేకుండుట, ఇష్టాయిష్టముల యందు సమ బుద్ధిని కలిగి యుండుట మరియు

మనమమిప్పుడు మన అనుబంధాల గూర్చి తెలుసుకొంటాం. వైరాగ్యం గూర్చి ఈ సంధర్భంలో చెప్పుకొంటాం. దాని నుండి పొందే మంచి గురించి తెలుసుకొంటాం.

ఒకసారి నేను 3 ఏళ్ల మిత్రుని వద్దకు వెళ్లి గౌరవంతో అడిగేను "లోరీ ఎలా ఉన్నావు?"

"నువ్వు నానుండి దూరంగా వుండు. నాకు నిద్ర సరిపోలేదు" అన్నది.

నేను ఆమెతో చాలా ఆప్యాయంగా ఉన్నాను. ఆమె జుట్టుని, దుస్తులని, పొగిడేను. ఆమె ఏమి తిన్నాదో అడిగేను. తెలివైనవాడెవ్వడూ మూడేళ్ళ బిడ్డని ప్రేరేపించడు. నేనేమి అడిగినా దానికి ఆమె తల వూపింది.

మూడేళ్ళ బిడ్డల నడవడిక సరిగ్గా లేకపోతే అది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు. ముఖ్యంగా మనని అంకుల్ అనేవాళ్లు. కానీ పెద్దవాళ్ళు ఇలా మాట్లాడితే అది వేరే విషయం. "నేను 4 గంటలే పడుకున్నాను. కాబట్టి ఏమీ మాట్లాడకు" లేదా "నేను ఆకలితో ఉన్నాను. నాకు నా ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. తిన్న తరువాత నాతో మాట్లాడు" అని పెద్దవాళ్ళంటే ఆశ్చర్య పడవలసిన విషయం. కానీ కొన్ని సార్లు మనం ఒప్పుకోకపోయినా అలాగే ప్రవర్తిస్తాం. ఈమధ్య ఒక రాజకీయ తంత్రం గురించి విన్నా. మంచి రాజ భోజనం తిన్న తరువాత మంతనాలు చేయాలట. ఎందుకంటే మద్యం, భోజనం, మన సంభాషణని మెరుగు పరుస్తాయట.

మన మెప్పుడైతే మనస్సు కాదని, కాని దాన్ని నడిపేవారలమని, తెలుసుకొంటామో మన మనస్థితినుండి వైరాగ్యం పొందుతాము. మన మనస్సుకేదైనా అయితే, అది ఒక యంత్రం కాబట్టి, సరి చేసుకోవచ్చు. ఎవరైనా మనన్ని ఖండిస్తే -- నిద్ర సరిపోకపోయినా, తలనొప్పి వున్నా-- మనం కోపం చెందుతాం. కాని అది మన ఇతరులను ప్రేమించే, గౌరవించే వైఖరి మార్చదు. మన సంభందితుల మీద ఆ మంచి ప్రభావం చూడవచ్చు.

మనస్థితుల నుండి విడబడడం నేర్చుకుంటే మనం మనస్సు కాదని భావిస్తాం. అలాగే మనం మన అభిప్రాయాలూ కాము. దీన్నే బుద్ధి అంటారు. అంటే మన ఉన్నతమైన మనోస్థితిని కూడా అధిగమించడం.

మనముండే కాలంలో నకిలీ మేధ(pseudo intellectual) చాలా ఉంది. ఇలాంటి వాతావరణంలో వైరాగ్యం అంత సులభంగా వచ్చేది కాదు. చాలా మంది తమ అభిప్రాయాలతో తాదాత్మ్యం చెందుతారు. విశ్వవిద్యాలయోల్లో కూడా చాలామంది మేధావులు తమ అభిప్రాయాలనుండి విడబడలేక "ఈ అభిప్రాయం అంత మ౦చిది కాదు. దాన్ని మార్చుకొంటాను" అని అనరు. "ఈ అభిప్రాయం అంత మంచిది కాదు" అని అనలేక "ఇది నా అభిప్రాయం. దీన్ని ఎలా మార్చుకొంటాను?" అంటారు. ఈ తర్కం అర్థం కాదు. మనమెప్పుడైతే మనం మేధాశక్తి కామని తెలుసుకొంటామో -- నమ్మడమేకాదు, దాన్ని అనుభవానికి తెచ్చుకొంటామో -- మన ప్రతిపక్ష అభిప్రాయాలను మిక్కిలి ఆసక్తితో, భద్రతతో వింటాము. మనం ఇంకొకరి అభిప్రాయం మన దానికన్నా మంచిదనుకొంటే --మనం మన అభిప్రాయాన్ని 20 ఏళ్ల నుంచి ఉంచుకున్నా -- "ఎక్కడ చెత్త బుట్ట? దానిలో నా అభిప్రాయాన్ని పారేసి, నీ అభిప్రాయాన్ని సమర్థిస్తాను" అనగలగాలి.

ధ్యానంలో ప్రవేశించి కొన్నేళ్ళు అయితే మనస్సుని ఒక పని ముట్టుగా చూస్తాం. అది వాక్యూమ్ క్లీనర్ లాగ పెద్ద శబ్దం చేస్తుంది కాని ఇల్లు శుభ్రం చేస్తుంది. నా చిన్న పిల్లలు వాక్యూమ్ క్లీనర్ వాడుతూ ఉండగా చూసేను. వాళ్ళు ఎలాగో గొట్టాన్ని తిరగామరగా పెట్టి, ఇల్లంతా దుమ్ముతోనూ, కాగితాల తోను చిందరవందర చేసేరు. మనం మనస్సునిలాగే వాడుతాం. మన ఇష్టాయిష్టాలు మన వద్దకు వచ్చిన వారి మీద వెదజల్లుతాం. మనస్సుని సక్రమంగా వాడితే మనం చెత్తని ప్రోగుచేసి బయట పారేస్తాం. ఇదే ధ్యానమంటే: "మనస్సుతో మనస్సుని శుద్ధి చేసుకోవటం. ఇంకోవిధంగా చెప్పాలంటే ఉన్నతమైన మనస్సుతో క్రింద మనస్సుని శుభ్రం చేయడం."

నా స్వీయానుభవముతో, మనస్థితి నుండి , అభిప్రాయాలనుండి విడబడడానికి నేనొక ఒక మంచి ప్రక్రియ చెబుతాను: ఇష్టాయిష్టాలను తక్కువ చేసుకోండి. అవి బాంధవ్యాలు లోనే కాక అన్నిట్లోనూ. హేతుబద్ధం చేయాలంటే, మన ప్రతి ఇష్టం లేదా అయిష్టం అహంకారంకు సంభందించినవి. అది ఈ విధంగా తన తెలివిని ప్రదర్శిస్తుంది.

సాంఖ్యులు మనస్సు ఎలా పనిచేస్తుందన్న విషయం పై చెప్పేది మన అహంకారానికి వర్తిస్తుంది. సంస్కృతంలో చైతన్యాన్ని చిత్తమంటారు. మనం దాన్ని రూపంలేనిది విరగనిది, అఖండమైనది, ఆకారం లేనిది, పరిమాణం లేని బంక మన్నుగా భావించవచ్చు. మనమీ బంకమన్నుని మనం ఏమి ఇష్టపడతామో, ఏ కలలో కంటామో, ఏది ఊహించుకుంటామో దాని కనుగుణంగా చెట్లు, పక్షులు, బొమ్మలు, మనుష్యులు, కోపం, దయ లేదా బాధగా మార్చుకోవచ్చు. అనేకమార్లు పాత ఆలోచనలతో పునరుక్తి చేస్తే మన చిత్తాన్ని మేడమ్ టుస్సాద్ వాక్స్ వస్తుప్రదర్శనశాలగా చేసినవారమవుతాం. మన సంభందితులందరూ మనస్సులో వాళ్ళతో సాంగత్యం బట్టి కొలువై ఉంటారు. తలిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, అత్త జోసీ , మన ఆఫీస్ లోని సహోద్యోగులు, మన పెంపుడు కుక్క. ఒకటేమిటి అన్నీ మన మనస్సులో దాగి ఉన్నాయి. మనం ఊహించుకున్న అత్త జోసీ బాహ్యంగా ఎవరికీ వర్తింపక పోవచ్చు. అత్త జోసీ మనం వేసుకొన్న ఒకానొక చిత్రం. మనమావిడితో తగువు పడితే, మనము మన వస్తుప్రదర్శనశాలకు వెళ్ళి ఒక కోర అంటిస్తాము. "నేను వాళ్ళను ఎలా భావిస్తానో అలాగే చూస్తాను" అని అంటుంది మనస్సు. శ్రీకృష్ణుడు తల అడ్డంగా ఊపి: "నువ్వు వాళ్ళని ఎలా మనస్సులో తయారు చేసేవో అలాగ చూస్తున్నావు" అంటాడు. మనం గ్రహించే ప్రతి విషయం, ప్రతి అనుభవం చిత్తం మీద ఆధారపడే చైతన్యం వలననే. అవి మనం జీవితాన్ని ఎలా చూస్తామో నియంత్రిస్తాయి. కాబట్టి అవి మన స్పందనను తమ ఆధీనంలో ఉంచుకొంటాయి.

ఎప్పుడైతే క్రోధం, భయం, దురాశ ఆ బంకమన్నును ధృడమైన ఆకారాలుగా మారుస్తాయో దాన్ని ఖండించడం చాలా కష్టం. "నా తప్పులు నాకు తెలుసు" అని కొందరు జాలిగొలిపేలా అంటారు. "నాకు తెలుసు నాతో సహజీవనం చేయడం మిక్కిలి కష్టం. కానీ నేను మారలేను." ప్రతివొక్కరు ధ్యానంతో మార గలరు. మనము మనుష్యుల మీద చేతనంతో వేసే దృఢమైన బంకమన్నుతో చేసిన శకలాలను మళ్ళీ క్రొత్త, సాగుతూన్న బంకమన్నుగా మార్చవచ్చు. చిత్తాన్ని బంకమన్నులాగా సాగదీయగలం. దాన్ని అలా స్పందింపజేయగలం. మనం దయ, ఓర్పు, సత్సంభందం, ధైర్యం అనే అందమైన క్రొత్త వస్తువులను తయారు చేసుకోగలం. పనితనం మారలేదు. మునుపు వినాశనానికి హేతువైన చేతనం ఉండేది. ఇప్పుడు సృజనాత్మక శక్తితో మనకూ మన తోటివారకూ ఉపయోగపడే ఆకారాల్ని చేస్తున్నాం.

అనేక మానసిక సంక్షోభాలు తుచ్ఛమైన ఇష్టాయిష్టాల వలన కలుగుతాయి. వాటిని పెద్దవిగా చూసి: "నాకిది కావాలి. కాని నాకది సాధ్యం కాదు" లేదా "నాకిది నచ్చదు. కాని వొదిలించికోను" అనుకోవడం. కానీ వీటితో సరిపెట్టకోనక్కరలేదు. అదే శ్రీకృష్ణుడు చెప్పిన "సమస్థితి" లోనున్న మనస్సు. మన ఇష్టాయిష్టాలను తక్కువగా చూసుకోవాలి. అలా చేస్తే మన సంబంధాలు మెరుగు పడతాయి.

మనం చేసే ఉద్యోగంలో గాని, లేదా కార్యంలోగాని, అతి సూక్ష్మమైన క్రియలు చేయాలని ఉండదు కానీ చేయక తప్పదు. కోటికి ఒక్కడు "నా ఉద్యోగం నాకు నచ్చదు. కానీ చేయక తప్పదు" అంటాడు. మన అంతర్యామి చెప్పవలసింది ఇంతే: "నేను ఇది చేయలేను. నేను స్టాంపులు నాలుకతో తడిపి పని చేయలేను. ఇంకా మాబెల్ ప్రక్కన నాకు పనిచేయడం ఇష్టంలేదు." మనం "అలాగే, నీ ఇష్టం" అంటాము. అంతర్యామి కాలక్రమేణా పెద్దదై, ధైర్యంతో కూడినది అవుతుంది. ఆ తరువాత అది సంప్రదాయం పాటించదు. అది "మాబెల్ గుర్తుందా?" అంటుంది. మనం "నీ ఇష్టం, పో " అంటాము. చివరకు అది అహంకారపూరితమై "ఇక మర్చిపో" అంటుంది.

మనమిలాగ అంతర్యామిని తన ఇష్టం వచ్చినట్టు ప్రతి ఇష్టాయిష్టాలను ప్రదర్శనీయనిస్తే మనం కఠిన మవుతాము. కొన్ని పరిస్థితుల వలన మనం ఇతరులకు తలవొంచితే మన అంతర్యామి నరాల వ్యవస్థను చిందరవందర చేసి "నేను తల వంచను. నేను అఖండమైన ఎముకతో చేయబడ్డాను. నేను వంగలేను" అంటుంది. మొదట్లో ఈ ఆక్షేపణ మనస్సుకే పరిమితం. క్రమంగా మనస్సుకి శరీరానికి లోతుగా ఉన్న సంబంధం వలన శరీరం మీద తన ప్రభావం చూపుతుంది. పట్టుదలతో అంతర్యామిని వింటూ ఉన్నవాళ్ళకి అనేకములైన మానసిక, భౌతిక సమస్యలు వస్తాయి. అసహనీయత, తలనొప్పి, మొదలైనవి బాధిస్తాయి. వాళ్ళ అహంకారమునకు వ్యతిరేకంగా వెళితే వాళ్ళు తమ ఇష్టాయిష్టాలను చెప్పుకోలేరు, శ్వాస క్రమం తప్పుతుంది, రక్తపోటు అధికమౌతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. హాన్స్ సెల్యే అనే వైద్యుడు ఇలా చెప్పేరు: "ఒత్తిడి మానసిక వ్యాకులతకు దారి తీస్తుంది". మొదట మనస్సుకు వ్యాపిస్తుంది. మనం దాన్ని గాని నియంత్రించకపోతే తీవ్ర దీర్ఘమైన వ్యాధులకు గురై, దీనాతిదీనంగా తయారయి ఆయుష్ని తక్కువ చేసుకొంటాము.

అధృష్టవశాత్తూ అంతర్యామి యొక్క వ్యాకులత, ఇష్టాయిష్టాలను అదుపులో పెట్టుకొంటే తగ్గి పోతుంది. బాంధవ్యాలలో సఖ్యతకు ఇది చాలా ముఖ్యం. మాబెల్ పై ఆమెను చూసి దారి మార్చు కొనేటంత అయిష్టత ఉంటే, ఆమె కళ్లలోకి చూసి చిరునవ్వు చింది౦చండి. ఇలాగ రెండు మూడు సార్లు చేస్తే ఆమెని బలవంతంతో కాక నిజంగా ఇష్టపడడం అవుతుంది. మీరు మీ నిర్బంధంను సడలించుకొని పట్టు విడుస్తారు. అది మొదట నొప్పి కలిగించవచ్చు , అతి కష్టం అవ్వచ్చు. అయినా దానివలన ఎంతో లాభం ఉంది. మీ నరాల వ్యవస్త బాగుపడి ధృడమౌతుంది. మీ హుషారు ఎక్కువవుతుంది. పరిస్థితులు అనుకూలించక పోయినా మీరు నిరుత్సాహపడరు లేదా మీకు కోపం రాదు. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే మీ సమత్వాన్ని కోల్పోరు. గాలిలో మీరు కట్టుకొన్న కోటలు పఠాపంచల్ అవ్వచ్చు. వేరొకరు బాగుపడితే, మీకే అసూయ రాదు. నిజానికి మీరు పట్టించుకోరు. 80

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...