Thursday, March 10, 2022

Chapter 14 Section 1

14.1

శ్రీ భగవానువాచ :

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం {14.1}

యజ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః

దేనిని తెలిసికొని మునులు ఉత్తమమైన మోక్షమును బొందిరో, అట్టి విద్యలలో ఉత్తమ విద్యయైన పరవిద్యను మఱల చెప్పుచున్నాను

ఇదం జ్ఞాన ముపాశ్రిత్య మమ సాధర్మ్య మాగతాః {14.2}

సర్గే అపి నోపజాయంతే ప్రళయే న వ్యథoతి చ

ఈ జ్ఞానమును ఆశ్రయించి నా స్వరూపామును పొందినవారు సృష్టి కాలమున జన్మించరు. ప్రళయ కాలమున నశించరు ఀ

ఇక్కడ ఉపనిషత్తులు చేప్పే పరాపార విద్యల గూర్చి చెప్పబడినది. అపర అనగా ఆథ్యాత్మిక జ్ఞానం. తక్కినవన్నీ పరా విద్యలు. పరా విద్య మేధా శక్తి పై ఆధారపడివుంది. దానిచే ఎక్కువ తెలుసుకొనవలెనని కాంక్ష కలుగుతూనే ఉంటుంది. అది మంచికే కావచ్చు. కానీ అపరా విద్య మనకు మృత్యువుని దాటిన తరువాత కూడా ఉపయోగపడుతుంది.

మనమెంత శరీరంతో తాదాత్మ్యం చెందుతామో, మరణం గురించి అంత వ్యధ ఉంటుంది. మనం ఇతరులని భౌతికంగా చూస్తే --ఉదాహరణకు మనము ఒకరి అందమును చూసి ప్రేమించవచ్చు -- మరణకాల మాసన్నమైనప్పుడు వారిని పోగొట్టుకుంటున్నామన్న వ్యధ కలుగుతుంది. వేర్పాటుతో కలుగు పరితాపము భరించలేనిది. ఒకరు ఇక సాకారంగా కనిపించరేమో అన్న బాధ మనని వేధిస్తుంది.

రెండవది, మరణం శరీరాన్ని బలవంతంగా లాక్కుంటుంది. మనము శరీరముతో లావాదేవీ పెట్టుకొంటే, మరణం తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. క్రుంగి కృశించి పోయినప్పుడు, శక్తినంతా వెచ్చించి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాము. భౌతికంగా ఆలోచించే వారు, మరణ కాలంలో తీవ్ర యాతనకు గురవుతారు. అది చేతన స్టితి లోనే కాదు. వాళ్ళ ఎరుక మరణమునకు చేరువలో ఉన్నప్పుడు అచేతనమనస్సుకు లాక్కో బడుతుంది. ఇదంతా శరీరాన్ని విడిచివేస్తున్నామన్న బాధ వలన. శరీరము అచేతనముగా పడి ఉన్నప్పుడు, నిశితమైన దృష్టితో ఈ బాధను చేతన మనస్సుతో చూడవచ్చు.

నేను మరణం సంబంధిత విషయాలను చెప్పడానికి ఒకే కారణం: మిమ్మల్ని శరీరముతో తాదాత్మ్యం చెందవద్దని చెప్పడానికి. మీకు ఇతరులతో నున్న స్నేహబాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉండాలి. మన బాంధవ్యాలు ఆధ్యాత్మికత పరంగా ఉంటే, ముఖ్యంగా ఆడ మగవారల బంధం, మనమధ్యనున్న ఐకమత్యం లేదా సాన్నిహిత్యం అర్థమవుతుంది. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. దాని తరువాత వేర్పాటు ఉండదు. ఇది భౌతిక పరంగా చెప్పలేము. ఇద్దరు తమను ఏ పరిస్థితిలోనూ ఎట్టి శక్తీ వేర్పాటు చేయలేదని భావిస్తారో, వాళ్ళ సాన్నిహిత్యం మరణంలోకూడా ఉంటుంది. 110

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...