Friday, April 11, 2025

Viveka Sloka 35 Tel Eng





శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః ।
బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః ।| 34 ||

అహేతుకదయాసింధుర్బంధురానమతాం సతామ్ ॥ 35 ॥

శ్రోత్రియః = ఉపనిషద్రూప వేదాధ్యయనము చేసినవాడును, అవృజినః - పాపములు లేనివాడును, అకామః = కామములచే పీడింప బడనివాడును, బ్రహ్మవిదుత్తమః = బ్రహ్మవేత్తలలో ఉత్తముడును, బ్రహ్మణి = బ్రహ్మయందు, ఉపదతః = లీనమైన మనస్సు కలవాడును, నిరంధన - ఇంధనములులేని, అనం ఇవ = అగ్నివలె, శాన్తః - శాంతుడును, అహేతుకదయా సిన్ధుః - నిష్కారణమగు దయకు సముద్రమువంటివాడును, అనమతాం = నమస్కరించుచున్న, సతాం = సత్పురుషులకు, బన్దు: - బంధువును (అగు మహాపురుషుడు గురువు).

సూ, "శ్రోత్రియశ్చందో అ ధీతే" అను పాణిని సూత్రము ననుసరించి 'శ్రోత్రియః' అనగా ఉపనిషత్తుల అధ్యయనము చేసిన వాడు అని అర్ధము. ఉపనిషదధ్యయనముచేసి వాటి అర్థమును విచారించు వానికే సాక్షాత్కారము కలుగును. అవృజినః పాపములు లేనివారు.

నావిరితో దుశ్చరితాత్ నాశాన్తో నా సమాహితః,

నాశాన్తమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్

పాపములనుండి విరమింపనివాడు, ఇంద్రియనిగ్రహము లేనివాడు, చితైకాగ్రత లేనివాడు, శాస్త్రమైన మనస్సు లేనివాడు, ఈ ఆత్మను బుద్ధిచే తెలిసికొనజాలడు అని శ్రుతి చెప్పుచున్నది.

విషయాశచేత, హతః - పీడింపబడుచున్న వాడు, స్వరూప జ్ఞానములేని వాడు, కామహతుడు కానివాడు, అకామహతుడు, స్వస్వరూపమగు ఆనందమును గుర్తించనివాడు, బాహ్యవిషయములలో మున్నదను అభిప్రాయముతో పాపముకూడ చేయవచ్చును. కాని ఈ బ్రహ్మవేత్త స్వరూపానందమును సాక్షాత్కరించు కొనిన వాడగుటచే

విషయ వినివర్తిన్తే నిరాహారస్య దేహినః,

రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.

ఆహారము లేని విషయభోగములు చేయనివానికి భోగములు తమంతట తామే దూరమగును. రసము మాత్రము, అభిలాష మాత్రము , మనస్సులో ఉండును.

ఆ పరమాత్మను చూచిన పిమ్మట ఆ రసముకూడ తొలగిపోవును అని భగవద్గీతలో చెప్పిన విధమున రాగనివృత్తి రూపమగు అకామ హతత్వము అతనికి సిద్ధించును. కావున అతడు పాపరహితుడు. కామమేకదా పాపమును చేయించునది ? కావుననే

అథ కేన ప్రయుక్తో అ యం పాపం చరతి పూరుషః,

అనిచ్చన్నపి వాగ్గేయ బలాదిన నియోజితః,

ఓ శ్రీకృష్ణా ! మానవుడు బలాత్కారమును దేనిచే ప్రేరితుడై ఇష్టము లేకున్నను పాపము చేయుచున్నాడు అని భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నింపగా, శ్రీకృష్ణుడు.

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః,

మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణమ్ .

రజోగుణమువలన బుట్టిన కామము క్రోధము అనునవి మనుష్యుని పాపాచరణమున ప్రేరేపించుచున్నవి. ఇవి తీరని ఆకలిగలవి, మహా పాప హేతువులు అనిచెప్పియున్నాడు.

బ్రహణ్యపరతః బ్రహయందు విలీనమైన మనస్సుకలవాడు. కావుననే కట్టెలు లేని అగ్నివలె శాంతమైనవాడు.

ఇంధనములు లేనిచో అగ్ని ఎట్లు జ్వాలావిహీనమై శాంతముగ ప్రకాశించునో, అట్లే ఇతడు బాహ్యవృత్తులు నన్నింటిని ఉపసంహరించుకొని నిర్గుణబ్రహ్మయందే చిత్తమును నిలుపుకొనుటచే నిర్వికారుడై యుండును అని భావము. బ్రహ్మవిత్త మునియందు అశ్రోత్రియత్వముగాని, పాపముగాని, కామ హతత్వముగాని అసంభావ్యములుగాన ఇచట ప్రయుక్తములగు శ్రోత్రియత్వాది విశేషణములు వ్యావర్తకములు కావు, అట్టి గురువు యొక్క స్వరూపమును బోధించునవగుటచే ఇవి స్వరూపలక్షణములు మాత్రమేయని గ్రహింప వలెను.

'తెల్లని అవు' అనునపుడు 'తెల్లని' అను విశేషణమును ప్రయోగించుటచే ఆ ఆవు ఎఱ్ఱనిధిగాని, నల్లనిదిగాని, మరి ఇతర వర్ణము కలదిగాని కాదు అను అర్థమువచ్చును. ఆవులలో తెలుపుకంటే భిన్నములగు వర్ణములు సంభావ్యములు గాన ఈ విశేషణము వాటి నన్నింటిని నిషేధించు చున్నది. అందుచే అది వ్యావర్తకము.

ఆ విధముగ ఇచట బ్రహ్మవిదుత్తముని విషయమున ప్రయోగించిన 'శ్రోత్రియః' ఇత్యాది విశేషణములు వ్యావర్తకములు కావు. ఆవునకు తెలుపుకంటె భిన్నములుగు వర్ణము లున్నట్లు అతనికి అశ్రోత్రియ తాదులు ఉండుటకు అవకాశము లేదు.

కావున 'శ్రోత్రియః’ ఇత్యాదిపదములు ఆ బ్రహ్మవిదుత్తముని స్వరూపమును మాత్రమే బోధించును. ' తెల్లని పాలు' అన్నప్పుడు 'తెల్లని ' అను విశేషణము నల్లని పాలు లేకుండుటచే ఏ విధముగ ఇతర వ్యావర్తకముకాదో అట్లే ఇతర వ్యావర్తకములు కావు. స్వరూపలక్షణ కథనమాత్ర పరములు.

హేతువు లేని ఏదయ- అనగా ఇతరుల దుఃఖమును తొలగింపవలెననెడు ఇచ్ఛ, గలదో దానికి సింధువు, అనగా ఆశ్రయభూతుడు.

లోకమున దయావంతులగు ఇతరులకు గూడ పరుల దుఃఖములను చూచినపుడు దయ కలుగవచ్చును. కాని ఈ దయ పరులదుఃఖమును చూచుటచే తనకు కలిగిన దుఃఖమునుబట్టి కలిగినది. కావున ఈ దయకు కారణ మున్నది.

బ్రహ్మవిదుత్తమునకు కలుగు దయ అట్టిది కాదు అని చెప్పుటకై 'అకారణ' అను విశేషణము. ఇట్టి జ్ఞానికి స్వతః కాని, పరులవల్ల కాని దుఃఖము కలుగు నవకాశము లేదు. సమాధిస్థితినుండి బైటకు వచ్చినపుడు ఈ జనులు సంసారసముద్ర మును తరింతురుగాక అని ఇచ్ఛ కలుగును. బన్ధుః= దుఃఖమును తొలగించువాడు. ఎవరియొక్క? అసమతాం సతామ్ - వినయముతో నమస్కరించిన సత్పురుషులకు; ఇట్లు చెప్పుటచే శిష్యుల లక్షణములను పరిశీలించిన పిమ్మటనే వారు ఉపదేశింతురని సూచితమైనది.

శ్రు. “ నాసూయకాయానృజవే అ శఠాయ" - అసూయకలవానికి, వక్ర స్వభావముకలవానికి, రహస్యముగ అపకారము చేయువానికి బోధింప గూడదు,

శ్రు. " ఇదమశిష్యాయ నో దేయం" దీనిని ఉపదేశార్హత లేని వానికి ఉపదేశింపగూడదని శ్రుతులు చెప్పుచున్నవి.

భగవద్గీతలోగూడ..

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన,

న చాశుశ్రూషవేవాచ్యం న చ మాం యో అ భ్యసూయతి.

తపస్సులేనివానికిని, భక్తుడు కాని వానికిని, శ్రవణేచ్చలేని వానికిని, నన్ను ద్వేషించువానికిని దీనిని బోధింపగూడదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పియున్నాడు. ఈ విధముగ ఇట్టి గురువువద్దకు వెళ్లుటకు "ఉపసధనము' అనిపేరు.

అవ. తరువాత ఏమిచేయవలెనో, భగవంతుడగు భాష్య కారుడు, శిష్యునకు కరుణతో బోధించుచున్నాడు.

śrōtriyō'vṛjinō'kāmahatō yō brahmavittamaḥ ।
brahmaṇyuparataḥ śāntō nirindhana ivānalaḥ ।
ahētukadayāsindhurbandhurānamatāṃ satām ॥ 35॥

In this sloka Sankara is delineating the qualities of a guru: without sin, desireless, meditating on self, calm, kind, a friend to the devotees, etc. There is no end to the list. He is simply a godly person.

All major religions proclaim godly qualities. Hindus consider these as godly qualities:

  • fearlessness even in the midst of sorrow;(abhayam)
  • purity of mind; (sattva samshuddhi)
  • doing work without aspiring for the fruits thereof; (yagna)
  • study of the Vedas(scripture); (svadhyaya)
  • penance and meditation;(tapas)
  • non violence; (ahimsa)
  • speaking the truth; (satya)
  • not getting angry; (akrodha)
  • controlling outward senses; (dama)
  • not resorting to backbiting or slander; (apaisunam)
  • compassion; (daya)
  • desirelessness for inappropriate objects; (aloluptvam)
  • gentleness; (mardavam)
  • splendour; (tejas)
  • patience and forbearance; (dhriti)
  • steadfastness; (gnana yoga vyavasthithi)
  • peace; (shanti)
  • non-hatred; (adroha)
  • absence of pride;(hri)
  • renunciation; (tyaga)
  • charity; (dana)
  • straightforwardness; (arjavam)
  • absence of restlessness; (achapalam)
  • forgiveness; (kshama)
  • purity; (shaucha)
  • lack of conceit; (naatimanita)

To demonstrate all these qualities, especially kindness, in Gita the Lord said in a lifetime or in several reincarnations one can aspire to rise from tamas(indolence) to rajas(action) to sattva(calmness) and attain moksha(liberation).

In a normal course of events, a jiva is born in tamas. As it grows it acquires rajas to perform various activities. In the old age, the jiva acquires sattva seeking moksha.

What if the jiva dies while still in rajas?

The Lord assures that when the jiva reincarnates it begins where it had left off in the previous life.

Many of us are like this: reincarnating again and again with tamas or rajas without acquiring suddha sattva in a lifetime let alone over several reincarnations. This is where seeking a proper guru leads us to the goal!

No comments:

Post a Comment

Viveka Sloka 35 Tel Eng

Telugu English All శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః । బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః ।| 34 || అహేతుకదయాసి...