Thursday, March 10, 2022

Chapter 13 Section 12

13.12

సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖ్యం {13.13}

సర్వత శృతిముల్లోకే సర్వమావ్ఱుత్య తిష్టతి

ఆ ఆత్మ స్వరూపము యొక్క కాళ్ళు అంతటను గలవు. చేతులు అన్ని చోట్ల కలవు. నేత్రములు సర్వత్ర గలవు, శిరములు ముఖములు, చెవులు అంతట కలవు. అది సర్వత్ర వ్యాపించి యున్నది

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం {13.14}

అసక్తం సర్వభృచ్ఛఐవ నిర్గుణం గుణభోక్తృ చ

ఇంద్రియములు లేనిదియై యున్నది. దేనితోను సంగత్వము లేనిదియై సకలమును భరించుచున్నది. గుణరహితమయ్యును గుణములను అనుభవించుచున్నది

బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ {13.15}
సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థo చాంతికే చ తత్

ప్రాణులు బాహ్యాభ్యoతరముల యందున్నది. చలించునది, చలించనిది యైయున్నది. సూక్ష్మమైనందున అగ్రాహ్యమై యున్నది . అది దూరముగను , దగ్గరగను యున్నది

నా పెంపుడు కుక్కలు నన్ను చూడడానికి, బిస్కట్ ముక్కల కోసం ప్రతి ఉదయం నా గది తలుపు దగ్గర కూర్చుంటాయి. నేను ధ్యానం నుంచి వచ్చేక వాటిని కుక్కలుగా చూడను. భగవంతుడు కుక్క వేషంలో వచ్చేడని తలుస్తాను. నా స్వానుభవాన్ని చేతనయింత వరకు వివరిస్తున్నాను. ఇది ఒక ఉపమానము కాదు. నేను నా దృష్టికి కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. అవి కర్ర ముక్కతో ఆడుకొంటూ ఉంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ఆడుకొంటున్నాడు అని తలుస్తాను. అది ఆయన లీలతో పోలిస్తే అతి తక్కువే. ఈ సృష్టి అంతా దేవుడు ఆడుకునే రంగస్థలం. ఆయన అన్ని పాత్రలను పోషిస్తాడు: నా కుక్కలు కర్ర ముక్క తో ఆడుకొంటున్నట్టుగా, నా ఇంటి ప్రక్క వారి పిల్లలు వాటి వైపు కర్ర ముక్కను విసురుతున్నట్టుగా. ఆ పాత్రలకు వేరువేరు లక్ష్యాలు ఉన్నాయి. వసంత ఋతువులో వికసించే లైలెక్ పువ్వులు నా కిటికీ దగ్గర ఉన్నాయి. యోగులు "చుట్టూ చూడు. ప్రపంచమంతటా దేవుడున్నాడు" అంటారు.

ఈ దృష్టితో చూస్తే కాంతి వైపు పెరిగే మొక్కల్లాగ, ప్రాణులు పరిణామ క్రమములో దేవునివైపు వృద్ధి చెందుతున్నారు. ఈ ప్రపంచమంతా సూర్య కాంతి వైపు వంగే మొక్కల్లాగ, భగవంతుడి వైపు వంగే జీవులతో నిండి ఉన్నది. నా కుక్క మూకా నా ధ్యానం అయిన తరువాత నాతో మనిషి చేసే శబ్దాలతో మాట్లాడుతుంది. ఉదాహరణకు ఓం . అది నాతో "నేనూ నీలాగా మనిషిగా ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను" అంటునట్టు ఉంటుంది. నేను ధ్యానం చేస్తే దానికీ అదే చేయాలని ఉంటుంది. ఇదే పరిణామానికి ఉన్న శక్తి. మూక తన లక్ష్యం చేరడానికి, పరిణామం చెందడానికి ఆ శక్తి సహకరిస్తుంది. అటువంటి ఐక్య కోరికతో నాకు మూకా మరుజన్మలో ఒక ఆశ్రమంలో మనిషిగా పుడుతుందని అనిపిస్తుంది. దేవుని వైపు ఈ విధంగా జీవులన్నీ నడుస్తున్నాయి.

అటువంటి దృష్టి దేవుని కృప వలనే సాధ్యం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు "దేవ మాత బ్రయన్ (అనబడే వ్యక్తి) కి అట్టి దృష్టి ఇవ్వాలి". ఆమే తన అందమైన కళ్ళతో క్రీగంటగా చూసి వానికి ప్రపంచ సుఖములుకన్న హృదయంలో దేవునికొరకై మిక్కిలి తపన కలిగిస్తుంది. మన అందరి హృదయాల్లో అటువంటి కోరిక గుప్తంగా వసంత ఋతువు కై వేచి వున్న విత్తులా ఉంది. ఆ తరువాత బ్రయన్ స్వార్థ పూరిత క్రియలు చేసినా, లేదా ఏమాత్రం జంకి వెనకంజ వేసినా ఆమె శక్తి ముందుకు లాగుతుంది. ఎలాగంటే వాని కోర్కెను ప్రజ్వలింప జేసి, లేదా లక్ష్యాన్ని గుర్తు చేసే కష్టాలు ఇస్తుంది. ఇటువంటి దృష్టిని కలిగినవారు ఆ పరాశక్తి ఉందని చెప్తారు. ఎవరైతే మనసా వాచా కర్మా ఆ పరాశక్తికై తపిస్తారో వాళ్ళు దాన్నే పొందుతారు. 86

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...