Thursday, March 10, 2022

Chapter 13 Section 13

13.13

అవిభక్తం చ్ భూతేషు విభక్త మివ చ స్థితం {13.16}

భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ

అవిభక్తమైనను ప్రాణుల యందు విభక్తమై యున్నట్లు తెలియుచున్నది. ప్రాణులను సృష్టించునది , భరించునది, లయింపజేయునది అదియే.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పర ముచ్యతే {13.17}

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం

అది జ్యోతులకు జ్యోతియై ఉన్నది. తమస్సునకు అన్యమైనది. అది జ్ఞానముగను, జ్ఞేయముగను, జ్ఞానగమ్యముగను భాసించుచున్నది. సకల ప్రాణుల హృదయాలలో ప్రకాశించు చున్నది

గీత పదే పదే ఆత్మ ప్రకాశమని, మూలమని చెప్పుచున్నది. అది ఒక ఉపమానము మాత్రమే కాదు. గాఢ ధ్యానంలో అది అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం వచ్చేవరకు ఆ పదాలను అర్థం చేసుకోవడం కష్టం.

ఆత్మ జ్ఞానం వచ్చేవరకు మనము చీకట్లో బ్రతుకుతున్నాము -- నిజంగా నేను శరీరమను భావంతో -- అని బుద్ధుడు వచించవచ్చు. ఇది మంచి శాస్త్ర జ్ఞానము. భౌతికంగా కూడా నిద్రలో వచ్చే కలలో అనుభవం, వేకువలో వచ్చే మాయా సంభంద కలలకు పెద్ద తేడా లేదు. జీవితమంతా మనము నిద్రలో నడుస్తున్నామని బుద్ధుడు చెప్ప వచ్చు. సూచనల ప్రకారం వెళ్ళి వచ్చి, మన వాటా చదివి, మన క్రియలను చేతన మనస్సుతో తెలిసికొనలేక, ఒక కలగంటున్న వాడికన్నా వేరుగా లేక ఉన్నాము.

"అర్థరహితము. నేను చూడలేనా ? వినలేనా? సూర్యుడు ప్రకాశించుచున్నాడు, పక్షులు కిలకిల మంటున్నాయి, ఇంటి ప్రక్క వారు వాదించుకుంటున్నారు. ఇవన్నీ నిద్రలో నాకు తెలీకుండా జరుగుతున్నాయి" అని చెప్దామనుకుంటాము. ఒక నిద్రిస్తున్న వ్యక్తి అలా అనలేడా? మనము వినడం చెవులతో కాక, చూడడం కళ్ళతో కాక వాటిని మనస్సుతో చేస్తాము. మనము నిద్రిస్తున్నంతసేపూ మనము కలలో విన్నవి, కన్నవి నిజం. ఒక కుక్క కలగంటునప్పుడు చూడ౦డి. దాని చెవులు, మూతి కదులుతాయి. అది దాని మనస్సులోని గత స్మృతులతో చేసిన ఒక పిల్లి గురించి కల గంటూ నిద్రలో రమిస్తున్నాది. నా కుక్క మూకా సముద్రపు ఒడ్డున పరిగెత్తుతున్నట్టు కల గంటుంది. ఎలా చెప్పగలనంటే నిద్రలో దాని కాళ్ళు ముందూ వెనుకకూ కదులుతూ ఉంటాయి. మీరు నిద్రలో ఎవరో చంపడానికి వస్తున్నారని కలగంటే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేహంలో రసాయనిక మార్పులు జరుగుతాయి. ఇదంతా మనం ప్రాణభయం నిజమనుకోవడమువలన.

మీరనవచ్చు: "అది సరే, కలలో జరిగే సంఘటలను ఒక క్రమంలో చూడు. ఒక నిమిషం నువ్వు 5 ఏళ్ల బాలుడివై కెనడా లో రైలులో ప్రయాణిస్తూ ఉంటావు. మరు నిమిషం నువ్వు డెడ్ సీ లో బోటు షికారు చేస్తూ ఉంటావు. కలలో ఎటువంటి తర్కము లేదు. నీ ఆధీనంలో ఏమీ లేదు."

మనం చేతనముతో అనుభవించే ప్రపంచం నిజమా? ఒక నిమిషం మీరు మిత్రురాలితో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. మరునిమిషం ఆమె ఏదో వెటకారం చేసిందని గట్టిగా గొడవపెట్టుకుంటారు. పనిచేసే చోట మర్యాదగా ఉంటారు. కానీ ఇంటికొస్తే వేరే రూపం మీ భార్యా పిల్లలకు చూపిస్తారు. మనకందరికి ఇటువంటి ఆశ్చర్యకరమైన నడవడిక తెలిసిందే. దయగల బుద్ధుడు "చేతనుడైన వానికి ఈ ప్రవర్తన కలకంటే వేరు కాదు" అనవచ్చు. వేకువలోనూ , నిద్రలోనూ మనం ఒకే మనస్సుతో, సంస్కారాలతో అనుభవిస్తాము. మన స్పందన వేకువలోనూ నిద్రలోనూ ఒకే రకంగా ఉంటుంది. అవి చేతన మనస్సుతో కప్పబడి ఉంటాయి.

మనం మెలుకువగా ఉన్నామని నిరూపించడానికి, బుద్ధుడు ఇలా చెప్పవచ్చు: మన దృష్టిని సులభంగా మనం తలచిన దానిపై చూపవచ్చు. అది కొందరికి సులభాతి సులభం. మరికొందరికి దానంత కష్టం ప్రపంచంలో మరేదీ లేదు.

మీరు మీ గదిలో రేపు ఇవ్వవలసిన నివేదిక పై మనస్సును కేంద్రీకరించేరనుకో౦డి . ఒకానొక పదం మీ కాలేజీ రోజులను గుర్తు చేస్తుందనుకో౦డి. మరుక్షణం మీ గదిలోనించి వెలుపలకు వెళ్తారు. మీ కళ్ళు గోడ మీద వ్రేలాడుతున్న చిత్రం చూడవు. మీ చెవులు బయట జరుగుతున్న వివాదం వినవు. మీరు బెర్క్ లీ కి తిరిగి వచ్చేరు. అర్థరాత్రి వీధుల్లో అనుమానాస్పద స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఇది మనందరికీ అనుభవం లోకి పలు మార్లు వస్తుంది. మన మనస్సు అంగీకరిస్తే మనం మన గదికి తిరిగి వచ్చేయ వచ్చు. కానీ కొందరికి అది సాధ్యం కాదు. వాళ్ళు మనస్సులో గిరికీలు కొడుతూ ఉంటారు. పాత స్మృతులు పునరావృతమవుతుంటాయి. వాళ్ళు గతంలోనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనలకి నిబద్ధులు. వాళ్ళ స్మృతులు వాళ్ళని అణగదొక్కుతాయి. బుద్ధుడు అలాంటి వాళ్ళు నిద్రలో ఉన్నారని అంటాడు. వాళ్ళు వేకువలో కలలుగంటున్నారు.

నేను ఒక అతిశయమైన ఉదాహరణను ఇచ్చేను. కానీ దాన్నే పరధ్యానం అంటాను. మన మనస్సు ఒక సంఘటన నుంచి వేరొకటికి, ఒక స్మృతి నుంచి వేరొకటికి, ఒక కోరిక నుంచి మరొకటికి, మారుతూ ఉంటే మీరంటారు "ఇది నిజం. ఇది ఆలోచనల గొలుసు." బుద్ధుడు "నువ్వు నిద్రపోయి ఉన్నావు. నువ్వు ఒకదాని నుంచి ఉంకోదానికి కలలోలాగ మారుతున్నావు. నిద్రలోని కలలతో పోలిస్తే మెలకువలో నీ ఆలోచనలను ప్రకటించ గలవు మరియు స్వశక్తిప్రేరిత సమాధానాలను ఇవ్వగలవు. "ఇవి స్వల్పమైన తేడాలు కాదు. అవి పరిమాణంలో తేడా. జాతిలో తేడా లేదు. మీరు మెలకువగా -- బుద్ధుడులా-- ఉన్నారని నిరూపించడానికి మీ కార్ అనబడే మనస్సును ఉంకో కారుతో ఢీ కొట్టకుండా తిన్నగా నడిపి, మీరనుకొన్న గమ్యాన్ని చేరగలగాలి.

దీనికి ఎన్నో పర్యావసానాలున్నాయి. మీరు ఒకే గాడిలో కార్ నడుపుతూ ఉంటే కోపం రాదు. కోపం రావాలంటే మనస్సు గాడి తప్పాలి. దురాశ లేదా అసూయ రావాలంటే మీరు గాడి తప్పాలి. ఇది మానవ నైజం. మీరు కలలో తప్పు చేస్తే దానికి ఎవరు బాధ్యులు? అవి కలలోని మనుష్యులతో చేసే కలలోని తప్పులు. అవి మనస్సు చేసిన సృష్టి. అలాగే కొంతమందికి తమ ఆలోచనా క్రమమును స్వాధీనంలో పెట్టుకొనకపోతే వాళ్ళను దూషించడం అన్యాయము కాదా? వాళ్ళని నిందించడం నిర్దయత్వం కాదా? వాళ్ళ కారును నడపడం నేర్చుకోలేదు.

కొంతమంది, నన్ను గౌరవించి మెచ్చు కొనేవాళ్ళు, మనము వేకువలో నిద్ర పోతున్నామని చెప్పినందుకు, అది తమ మీద వేసిన నిందని, నా మీద కోపగించుకొన్నారు. "మీరు మాతో నవ్వుతూ ఉంటారు. వెంటనే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. అది నా గుండెలోకి బాణం వేసినట్టు ఉంటుంది" అని ఒక మంచి మిత్రుడు అన్నాడు.

చాలా మటుకు లైంగిక కార్యాల వలనే. వాటికై మనుష్య జాతి చాలా నిహితమైన ఇష్టం ఉండి తమ శరీరాన్ని ఇతరులతో పోల్చుకొంటారు. "ఇది నాకు శిఖరాగ్రాము చేరినంత నిజం. లైంగిక కార్యం నిజం కాకపోతే మరేది నిజం?" అని ఆ మిత్రుడు అన్నాడు. "నీకు లైంగిక సంబంధమైన కలలు వస్తాయా?" అని అడిగేను.

"తప్పక"

"నీవు వాటివలన ఆనందం పొందుతావా?"

"తప్పకుండా"

"మెలకువలో వాటి అనుభవం ఉందా?"

నేను వేరే ఏమీ చెప్పక్కరలేదు. నేను వేసిన బాణం తిన్నగా వాని గుండెకు తగిలింది. ఒక తెలివైనవాడికి ఇంద్రియ సంబంధిత విషయాలు శాశ్వతము, నిజం కావు అని చెప్పినపుడు అర్థం అవుతుంది. కొంత కాలం తరువాత హేవ్ లాక్ ఎల్లిస్ అనే మానసికవేత్త వ్రాసినది చదివేను. ఆయన తన జీవితకాలమంతా మానవ లైంగికం మీద అధ్యయనం చేసేడు. "కలలు కల కంటున్నoత సేపూ అవి నిజం. జీవితం గురించి ఇంకా ఎక్కువగా వేరే మాట చెప్ప గలమా?" అని అతను వ్రాసేడు.

మన శరీరం పడుకున్నంత సేపూ మన వేకువతో పోలిస్తే సమమైన కలలు కంటాము. మన ఇంద్రియాలు, శరీరంలోని రసాయనాలు కూడా మనకు ఆ అనభావాన్ని ఇస్తాయి. ఇది చాలా ముఖ్యమైనది. భౌతిక ఎరుక లేకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మన ఉనికి ఉంటూనే ఉంటుంది. దీనివలన మనకు తెలిసేదేమిటంటే భౌతికమైన ఎరుక జీవించడానికి అవసరం లేదు.

గీత భౌతికమైన జీవితం వ్యర్థమనటంలేదు. చేతనం అన్నటికన్నా ముఖ్యం కాదు అని చెప్తుంది. ఏవో రెండు డబ్బులు సంపాదించి, భోజనం చేసినంత మాత్రాన మీరు మెలకువగా ఉన్నానని చెప్పలేరు. కలల్లో లాగ ఈ అప్రయత్న కార్యం జరుగుతోంది.

ఆ స్థితిలో ఇంద్రియ సుఖం ఆయస్కాంతంలా పనిచేస్తుంది. అవి మనని లాగితే చాలు వాటివద్దకు వెళతాం. కలలను నియంత్రించడం మన చేతిలో లేదు. అవి మన మాటలు, చేష్టలు, సంస్కారముల వలన జనించినవి. ఎక్కువ మార్లు మెలకువలో అదే మనం చేసేది. కానీ ఒక తేడా ఉంది: మెలకువలో ఒక కార్యం చేయాలా వద్దా అని నిర్ణయించకోగలం. ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసికొని ఒక కార్యాన్ని ఎన్నుకుంటామో, ఇంద్రియాలు వెనుకకు లాగకపోతే, మనం మేలుకొంటాం. అప్పుడు వచ్చే ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మీరు ఎల్లపుడూ మేల్కొనే ఉంటారు. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందక వాటిని కావలసినప్పుడు నియంత్రించి లేదా అనాలోచితంగా వాటితో ఒప్పుకొని జీవనం కొనసాగిస్తారు .

ధ్యానం చాలకాలం నుండి చేయక ఇప్పుడే మొదలపెడితే, అనాలోచింతగా చేయలేరు. పట్టుదలతో ఇలా వద్దు అని చెప్పగలగాలి. కానీ మనస్సు చంచలం. కొన్నాళ్ళకు దానికి ఊపిరి పీల్చుకొన్నట్టు, కాళ్లతో నడిచినట్లు అప్రయత్నంగా అలవాటైపోతుంది. సెయింట్ అగస్టీన్ అన్నారు: "నా చెయ్యి నే చెప్పే మాట వింటుంది. మనస్సు ఎందుకు వినదు?" మనం బాల్యంలో అనేక మార్లు చేతులతో పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసి మన చేతుల్ని మన ఆధీనంలో పెట్టుకున్నాము. అలాగే మన మనస్సుని కూడా మచ్చిక చేసుకొని మనం చెప్పే మాటను మనోహరంగాను, అనుకూలంగాను వినేటట్లు చేసికోవాలి. ఈ స్వతంత్రం మన వేకువ అవస్థకి నిదర్శనం. వేకువగా ఉండడం వలన మనం కోల్పోయేది బానిసత్వం మాత్రమే. 90

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...