Thursday, March 10, 2022

Chapter 13 Section 15

13.15

కార్యకారణక ర్త్రు త్వే హేతుహుః ప్రకృతి రుచ్యతే {13.20}

పురుష సుఖదుఃఖానాం భోక్త్రుత్వే హేతురుచ్యతే

దేహేంద్రియములు ప్రవర్తించుటకు ప్రకృతి కారణమనియు, సుఖదుఃఖములు అనుభవించుటకు పురుషుడు కారణమనియు చెప్పబడినది.

పురుషః ప్రకృతిస్తో హి భుఙ్క్తే ప్రకృతిజాన్ గుణాన్ {13.21}

కారణం గుణసంగోఅస్య సదసద్యోని జన్మసు

ప్రకృతియందున్న పరుషుడు ప్రకృతి జన్యములగు గుణములను అనుభవించుచున్నాడు . గుణ సంగము వలననే అతనికి నీచోన్నత జన్మలు కలుగుచున్నవి

మనము పదార్థము, మనస్సు అనబడే క్షేత్రము మీద దృష్టి కేంద్రీకరించు కారణము వలన ఈపై శ్లోకములను అర్థము చేసికొనుట కష్టము. కర్మలు, ఆలోచనలు, క్షేత్రమునందే జరుగునని గీత పదే పదే చెప్పుచున్నది. వాటి పర్యావసానము కూడా క్షేత్రమునందే జరుగును. కానీ క్షేత్రము జడము. మనస్సు, పదార్థము గల క్షేత్రమునకు ఎరుక లేదు. కావున మనస్సు తనంతటతాను ఆనందాన్ని అనుభవించలేదు. మేధ విశ్లేషణం చేయలేదు. ఇంద్రియాలు అనుభవించలేవు. శుద్ధమైన, అందరిలో సమానముగాయున్న ఆత్మ మాత్రమే ఆనందమును అనుభవించునది.

ఇది అంతయు అనుభవములో లేని సిద్ధాంతము. అనుభవం వచ్చిన ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన శక్తి వాటికున్నది. ఉదాహరణకు ఒక మంచి మిత్రుడు మేపిల్ సిరప్ కేన్ క్రిస్మస్ బహుమతిగా ఇచ్చేడు. వాళ్ళు ఉదయాన దోసలతో ఆనందంగా తింటూ ఉంటే తీపి అందరికీ ఎందుకు నచ్చుతుందని నేను ఆలోచించేను. చెక్కెర తీపేగాని ఎటువంటి ఆహ్లాదము ఇవ్వదని నేనంటే ఎంతమంది అర్థంచేసుకొంటారు అని ప్రశ్న వేసికొన్నాను. పదములు వాడడం సులభమే కాని వాటి అర్థము తెలిసికోవడం మిక్కిలి కష్టం. ఆనందము మనోహరమైనది కాదు, చెడు కాదు. అది ఇంద్రియానుభూతి.

మనము దీనిని ప్రతిరోజూ అనుభవానికి తెచ్చుకొంటాము. దానిని ఎంత పరిశీలించనా అది సర్వ జీవులకు వర్తిస్తుందని చెప్పలేము. దానినుండి అనుభవానికి అందే అభిప్రాయమును చెప్పలేము. నాకు క్రీడలు అనుభవములో చాలా అప్రీతికరం అవ్వచ్చు. కాని ఒక క్రీడాకారుడుకి తన క్రీడ అంటే చాలా ప్రీతి. గుర్రం స్వారీ అన్నిటికన్నా నాకు ప్రీతి. అది రోజు సైకిల్ తొక్కేవాళ్ళకి అర్థంకాదు. ఇంద్రియ అనుభవము ఒకటే. కాని దానిని వివరించే పదముల సముదాయము వేరు. నేను "గుర్రం స్వారీ ఆహ్లాదము కాదు" అని చెప్తే, వాళ్ళు "కాదు. అది చాలా మనోహరం" అని చెప్తారు. మేమిద్దరమూ తప్పే. ఎందుకంటే అది అమనోహరం అనే పదాల గారడీతో చెప్పవచ్చు.

ఆహారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. కొందరు చిక్కని, చేదు కాఫీని ఇష్టపడతారు. వేలమందికి బీర్ అంటే ఇష్టం. అలాగే పరమ చేదైన, నాలుకకు వికారం కలిగించే విస్కీ కూడా. మనం వాడే మసాలా నోటిని కాలుస్తుంది. మనకు వాటి తేడాల ఎరుక ఉంది. కానీ "ఇష్టాయిష్టాలు మనస్సులోనే". దానిని అన్ని జీవులందరికి వర్తింప జేసే విధంగా చెప్పలేము.

ఒక మానసిక భావన ప్రియము లేదా అప్రియము కావచ్చు. అది ఒక మానసిక అనుభవము. ఒక మానసిక స్థితి. మనం దాని ఆది చూడవచ్చు. పిదప దానిని మరచిపోవచ్చు. కానీ స్మృతికి మానసిక భావన వర్తించదు. ఏదీ స్మృతిని మాటలు లేదా క్రియగా మార్చలేదు. దాన్నే వైరాగ్యం అంటారు.

తల్లులు తమ పిల్లలకు ఆహార సంబంధిత అలవాట్లు ఎలా వచ్చాయని నన్ను అడుగుతూ ఉంటారు . మనకు కొంత అనుభవము జీవితంలో అవసరము. పిల్లలు తగిన మోతాదులో అప్పుడప్పుడు తీపి పదార్థాలను తినడంలో తప్పు లేదు. సాధారణంగా వాళ్ళు మంచి రుచి గల , పౌష్టిక ఆహారం తినాలి. కేవలం రుచికై పదార్థాన్ని తినకూడదు. నేను బాల్యంలో ఆనందంతో తినేవాడిని. ఎందుకంటే అవి ప్రేమతో చేయబడినవి. రుచుల నేర్చు కోవచ్చు కాని ప్రేమ అలా కాదు.

నా అమ్మకి రుచికరమైన పదార్థముల మీద అంత మక్కువ లేదు. కానీ నా అమ్మమ్మ విషయం వేరు. ఆమెకి రుచులు కావాలి. అలాగని ఆమె అదేపనిగా దాని గురించి ఆలోచించదు. ఎప్పుడైతే భోజనం చేస్తుందో అప్పుడే. నా అమ్మకు తినే పదార్థము అమనోహరం. ఆమెకి రుచి కావాలా వద్దా అనే సందిగ్దావస్త లేదు. ఆహారం తినేది కేవలం జీవించడానికే. అది తక్కిన క్రియల వంటిదే. ఈ భావన మిక్కిలి అరుదైనది. నాకది సంక్రమించలేదు. కాని నా అమ్మకున్న వైరాగ్యం నా ఆధ్యాత్మిక కృషికి కారణ భూతమైంది. ఆమె వంట అద్భుతంగా చేస్తుంది. ఆమె నాకై పిండివంటలు చేసి నేను తింటూవుంటే చూసి ఆనందించేది. ఆమెకు ఎందుకు తినాలనిపించదో నాకు అర్థంకాని విషయం. నా ఆనందమే ఆమె ఆనందం. ఈ భావన నాకు నా అమ్మనుంచి సంక్రమించింది. సంవత్సరాల తరబడి ఆధ్యాత్మిక సాధన చేయడంవలన నాకు రుచుల మీద పెద్ద ఆసక్తి లేదు. కాని నేను రుచిగల వంటలను ఒక పాక శాస్త్ర ప్రవీణుడు కన్న ఎక్కువ ఆనందంతో తింటాను. పిల్లలను చాకలేట్, ఐస్ క్రీమ్ తినిపించడానికి తీసికెళ్లినపుడు వాళ్ళ కన్నా నేనే ఎక్కువ ఆనంద పడతాను. వాళ్ళ వలన నా ఆనందం అనేక రేట్లు పెరుగుతుంది. నిజానికి నా ఆనందానికి అవధులు లేవు.

95

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...