Thursday, March 10, 2022

Chapter 13 Section 14

13.14

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః {13.18}

మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే

ఈ విధముగ క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయముల విషయము {13.19}
తెలుపబడినది. దీనిని తెలిసికొనిన నా భక్తుడు నా స్వరూపామును పొందుటకు అర్హుడగుచున్నాడు

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విధ్ధి ప్రకృతిసంభావాన్

ప్రకృతి పురుషులకు ఆది లేదు . వికారములు, గుణములు ప్రకృతి వలన పుట్టిన వానివిగ తెలిసికొనుము ఀ

3 పదములు ఇక్కడ క్రొత్తగా చెప్పబడినవి. ఇవి సాంఖ్య సిద్ధాంతమునకు చెందినవి. ప్రకృతి అనగా శక్తి, పదార్థం, మనస్సు. మనమా శక్తి యొక్క క్రియలను చూడకపోయినా భౌతిక ప్రపంచము శక్తి నుండి ఆవిర్భవించినది. పదార్థమే కాక మనస్సులోని విభాగాలను మనకు ఇంద్రియముల ద్వారా చూడ శక్యమకాని మౌలిక శక్తి వలన వచ్చినవిని సాంఖ్య చెప్తుంది. ఇది అన్ని వస్తువులలోను, ఘటనలలోనూ మన అనుభవానికి వస్తుంది. ముందు చెప్పిన క్షేత్రము యొక్క 24 విశ్వ మూల సూత్రములలో ప్రకృతి మొదటిది. అది అవ్యక్తమై యుండి, కనబడే ప్రపంచమునకు మూలమై యున్నది.

పురుషుడనగా క్షేత్రమును తెలిసినవాడు. ఏది జ్ఞేయమో -- తెలిసికొనబడినది -- అది ప్రకృతి. పురుషుడు జ్ఞాత అనగా తెలిసికొనువాడు. అదే ఆత్మ లేదా పరమాత్మ అనుబడునది.

మూడవ పదము గుణమునకు ఈ పుస్తకములో విశేషమైన స్థాన మున్నది. సాంఖ్య సిద్ధాంతం ప్రకృతి 3 స్థితులుగా మారిన ఎరుక కలిగిఉంటుందని చెప్తుంది. అవి మూడు గుణాలు. అన్ని పదార్థములు, మనస్సు వీటి సముదాయము. అవి తమస్సు, రజస్సు, సత్వ గుణములు. తమస్సు నిద్రను సూచిస్తుంది. రజస్సు క్రియలను ప్రేరేపించునది. సత్వ మనగా సామరస్యము లేదా సమత్వము.

బడిలో మనము పదార్థము యొక్క 3 స్థితులను: ఘన, ద్రవ, వాయువుగా నేర్చుకొన్నాము. 3 గుణాలను కూడా ఇలాగే వివరింపవచ్చు. తమస్సు అనగా ఘనీభవించిన శక్తి. జడత్వముతో అడ్డంకులు కలిగిoచునది. ఒక ఘనీభవించిన నీటిలో (ice) అణువుల మధ్య శక్తి దాగి ఉన్నది. కాని ఆ శక్తి బంధింపబడినది లేదా అవ్యక్తమైనది. మళ్ళీ నీరు ద్రవ రూపములో మారిన కొంత శక్తి విడుదలచేయబడుతుంది. అది రజస్సుకు ప్రతీక. మనకు పోటెత్తిన నదియొక్క శక్తిని గూర్చి తెలుసు. అది రజస్సు. అదే నీరు వాయు రూపంలో ఆవిరిగా ఉంటే అది సత్వం ఎందుకంటే దానితో యంత్రములను నడుపవచ్చు.

గుణాలను మనస్సు దృక్పథంతో చూస్తే అవి వివిధమైన మానసిక స్థితులు. తమస్సు అన్నటికిన్న క్రిందనున్న స్థితి. అది అచేతనమైన బేస్మెంట్ లాంటిది. చాలామంది ఇళ్ళలో పనికిరాని సోఫాలూ, డబ్బాలూ, పనిముట్లూ, పాత పుస్తకాలూ, చెత్తా చెదారం బేస్మెంట్ లో పడేస్తారు. అచేతన మనస్సు అటువంటిదే. అలజడితో, కోట్ల జన్మల సంస్కారములతో నిండి ఉంటుంది. దానిలో గొప్ప శక్తిఉంది. కానీ అది బుద్ధికి అందుబాటులో లేదు.

రజస్సు బేస్మెంట్ మీద ఉన్నది. అది కోర్కెలు, క్రోధం, కుతంత్రాలు, పోటీ పడడం, నిరుత్సాహంతో నిండి ఉంటుంది. అది శక్తి వ్యక్తమైన స్థితి. కానీ దానిని కట్టడి చేయడానికి వీలు పడదు. అలాగే అది అహంకారి.

సత్వం ఉన్నత స్థితి. వైరాగ్యంతో, చెదరనిదై, స్వతహాగా అణిగిమణిగి ఉన్నది. దాని స్థితిలో ఇది నియంత కాక సామరస్యం, లక్ష్యం, బుద్ధి, కోరికతో నిండి ఉన్నది. నిరుత్సాహం ఉండచ్చు కాని దాన్ని నివారించవచ్చు.

ఈ విధంగా మూడు గుణాలూ మనిషిని ప్రవర్తింపజేస్తాయి. ఇటువంటి విశ్లేషణం నేను ఏ సిద్ధాంతములోనూ, మానసిక శాస్త్రంలోనూ చూడలేదు. వీనివలన మన వ్యక్తిత్వం ఏ విధంగా చేయబడినదో, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య తేడా ఎందుకు వుందో తెలియబడును. తద్వారా మనం ఒక ఉన్నత ఆదర్శం ఏర్పరుచుకోవచ్చు.

మిగతా పుస్తకంలో వీటిని గూర్చి చెప్పబడుతుంది. తన సహజ స్థితిలో ఎరుక చైతన్యంయొక్క ప్రవాహం. క్రియలపై గుణముల ప్రభావము వలన మనమా సహజ స్థితి నుండి ఖండితమైన, ముక్కలైన, ఒక్కొక్కప్పుడు నిశ్చల మైన ఎరుకగలిగిన వారాలమౌతాము. ఈ విధంగా గుణాలు కంటి అద్దాలలా జీవితాన్ని పరిశీలించడానికి తోడ్పడతాయి. అవి మనమెక్కడ చూసినా ఖండమైనవి, వేర్పడినవి. మన విరుద్ధమైన ఇష్టాయిష్టాలు, మనలోని సంఘర్షణ, వేర్పాటు వీని వలనే.

పరిణామం మన సహజ స్థితికి అతి నెమ్మదిగా తీసికెళుతుందని గీత చెపుతుంది. అంటే నిర్మలమైన, ఖండింపబడని ఎరుక. మొదట తమస్సును రజస్సు గా మార్చాలి. అంటే ఉదాసీనత, సున్నితమకాని గుణమును శక్తివంతమైనదిగా, ఉత్సాహమైనదిగా మార్చడం. కానీ రజస్సు యొక్క శక్తి అహంకారంతో, చెల్లాచెదరై ఉంటుంది. దాన్ని సత్వంగా మార్చాలి. దానివలన శక్తినంతా పరోపకారనికి వెచ్చించవచ్చు. ఈ స్థితిలో అత్యంత ఆనందం ఉంది. శాంతమైన మనస్సు, మిక్కిలి ఉత్సాహము, బుద్ధి కుశలత ఏర్పడుతాయి. కాని ఇదే గమ్యం కాదు. మనము కళ్ల అద్దాలతో జీవితాన్ని చూసినంతసేపూ అది ముక్కలైనట్లుగా కనిపిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం ఆ కళ్ల అద్దాలని తీసివేసి సమాధి స్థితి పొందడం. అంటే మనస్సును స్థిరపరచడం. దానివలన మనము శుద్ధమైన, అఖండమైన చైతన్యంతో ఉంటాము. అది శాశ్వతమైన ఆనందం. గుణాతీతులు ఎక్కడా వేర్పాటు చూడరు. తమ ప్రతిబింబాలు ఇతరులలో, అందరి ప్రతిబింబాలూ తమలో చూస్తారు. ఇది జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం. అది అఖండం, సర్వం.

రైబ్రూక్ ఇలా చెప్పేరు: మనం వీక్షించేది మనలాగా ఉంటుంది. మనం వీక్షింప బడినట్టుగా ఉంటాము. మనము మనస్సుకున్న అద్దాలతో చూస్తాము. మనమెప్పుడైతే ఖండితమైనామో ఇతరులను వేర్పాటుతో చూస్తాము. మనం సర్వం అయితే, మన హృదయంలో దేవుని, ఇతరుల హృదయాలలో దేవుని చూస్తాం.

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...