Thursday, March 10, 2022

Chapter 13 Section 17

13.17

ధ్యానేనాత్మని పశ్యoతి కేచిదాత్మాన మాత్మనా {13.24}

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే

దేహము నందలి ఈ ఆత్మను కొందరు శుద్ధబుద్ధితో ద్యానము చేసి దర్శింతురు. కొందరు జ్ఞానయోగము చేతను, మరికొందరు కర్మయోగము చేతను దర్శింతురు

అన్యే త్వేవ మజానంతః శృత్వా అన్యేభ్య ఉపాసతే {13.25}

తే అపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః

ఈ విధముగ గ్రహించలేని కొందరు అన్యులవలన ఆలకించి ఉపాసన చేయుచున్నారు. శ్రవణాసక్తులగువారు కూడా మృత్యువును దాటుచున్నారు ఀ

హిందూ సంప్రదాయములో 4 యోగాలు అనగా దేవుని చేరడానికి మార్గములు, ఉన్నవి. అవి: జ్ఞాన యోగ అనగా జ్ఞానము ద్వారా, కర్మ యోగ అనగా నిస్వార్థ కర్మ ద్వారా, రాజయోగ అనగా ధ్యానం ద్వారా, మరియు భక్తి యోగ అనగా దేవునిపై ప్రేమ ద్వారా. భారత దేశంలోని యోగులు సాధనకు ఇందిలో ఒక మార్గాన్ని ఒకని స్వభామువలన గాని వాని అవసరాలను బట్టి సూచిస్తారు. ఇందులో ఏ ఒక్క మార్గమూ మిగతా వాటిని నివారించదు. సాధనకి అన్ని మార్గాలూ ముఖ్యమే.

శ్రీ రమణ మహర్షి జ్ఞాన యోగమును అనుసరించిన మహనీయుడు. ఆయన దక్షిణ భారతదేశంలో ఇతరులకు తెలియబడక, అజ్ఞాతంగా 1950 వరకు తన సాధనను చేసెను. మహాత్మా కర్మ యోగమునకు చక్కని ఉదాహరణ. ఆయన చేసిన నిస్వార్థ సేవ వర్ణింప శక్యము కానిది. శ్రీ రామకృష్ణ భక్తి యోగానికి ప్రతీక. మిగతా మతస్తుల లాగ, ముఖ్యంగా క్రిస్టియన్ లలాగ, ఆయనకు దేవుడంటే ఎనలేని ప్రేమ. ఈ మూడు పద్దతులూ నీరు చొరబడని గోడలతో కట్టబడినవి అనుకునేవారికి, నా అమ్మమ్మ, నా ఆధ్యాత్మికకి మొదటి గురువు, ప్రేమకు ప్రతీక, ఇలా వివరిస్తుంది. ఆమె గొప్ప మేధావి కాకపోయినా నన్ను ప్రోత్సహించిన గురువు. ఎవరైనా ఆమెను జ్ఞానము, ప్రేమ, నిస్వార్థ సేవలలో, ఏదో ఒకటి ఎన్నికచేసుకోమంటే, ఆవిడ ఆ భావన అర్థరహితమని చెప్తుంది. జ్ఞానము, సేవ కలిగేవి ప్రేమ భావన వలననే. ఆ మూడూ ధ్యానము తదితరుల వలన వ్యక్త మవుచున్నవి. ఒకవేళ మహాత్మా గీత కర్మ యోగానికి, అనగా నిస్వార్థ సేవకి, చిహ్నమనంటే నేను ఆయనను ఖండించకుండా గీత ప్రేమకు కూడా చిహ్నమని నా అమ్మమ్మను దృష్టిలో ఉంచుకొని అంటాను. శ్రీ అరబిందో జీవితమే యోగమని వచించారు. గీత సూచించిన 4 మార్గములు ధ్యానంచేయడం , ప్రేమతో పని చేయడం, నిస్వార్థ సేవ చేయడం వలన మేళవించ బడతాయి.

యోగా పదములోనే మనకీ కిటుకు తెలుస్తుంది. యోగ గురువు పతంజలి యోగ రసాన్ని ఇలా చెప్పేరు: "యోగమనగా మన మనస్సులోని అన్ని ఆలోచనలను నిలిపివేయుట." దీని వలన మనకు తెలిసినదేమిటంటే ఏ మార్గమైనా మన ఆలోచనలను నియంత్రిస్తే అది యోగం. ఇలాగ ఇతర మతములు సూచించిన మార్గములను కూడా కలుపుకోవచ్చు. గీత సూచించిన యోగా భావగర్భితమైన అనుభవానికి మూలం. 99

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...