Thursday, March 10, 2022

Chapter 13 Section 18

13.17

యావ త్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమం {13.26}

క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ

అర్జునా ! ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక వలననే కలుగుచున్నవని గ్రహించుము.

హిందూ మతము శివ శక్తులు సృష్టికి కారణమని చెప్పును. శివుడు అనాది పురుషునిగను, శక్తి అనాది స్త్రీగాను హిందువులు తలంతురు. శక్తి అనగా బలం, సామర్థ్యం, పరాక్రమము. ఇటువంటి అద్వితీయ సంప్రదాయములో బలాన్ని స్త్రీగా ఆపాదించేరు. శివుడు నిర్వికల్పము. శక్తి మార్పు చెందునది. శక్తి అనగా ప్రకృతి. మనస్సు మరియు పదార్థము లను కలుపుకొని, సమస్త సృష్టి క్షేత్రము. ఆమె తన సామర్థ్యముతో సృష్టి యొక్క ఆకారమును నిర్దేశించునది. ప్రతి స్త్రీ, ఆధ్యాత్మికతో చూచిన, పురుషుని కన్న మిక్కిలి సామర్థ్యం కలది కనుక, ఆమె శక్తికి ప్రతిరూపము. ఒక నిస్వార్థ స్త్రీ తన చుట్టూ ఉన్నవారిని పెంపొందించును. అట్లే ఒక అభద్రత, స్వార్థ పూరిత స్త్రీ తక్కిన వాళ్ళ పురోగతిని నిరోధించును. కాబట్టి ఆమె బాధ్యత విచిత్రమైనది. నా అమ్మమ్మను చూసినట్టే నేను ప్రతి స్త్రీని ప్రేమతో, గౌరవము తో చూస్తాను. ఎందుకనగా ఆమె గర్భిత, అవ్యక్త సామర్థ్యము గలది. ఆమె మిక్కిలి శక్తివంతురాలు.

సృష్టి జరగవలెనన్న శివ శక్తులు ఏకమవ్వాలి. వారి కలయికవలన సమస్త జీవులు ఆవిర్భవించుచున్నవి. ప్రసిద్ధమైన కవి, నాటక రచయిత కాళిదాసు రఘువంశ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములో శివశక్తుల గూర్చి ఇట్లు రచించెను: "పదము దాని అర్థమువలె మిళితమైన ఆది దంపతులను ప్రార్థించెదను". పదమునుండి దాని అర్థమును వేరుచేయలేము. ప్రపంచము మనకు విదితమవ్వవలెనన్న తలిదండ్రుల వలె నున్న ఆ భగవంతుడు కరుణించవలెను . 100

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...