13.20
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః
{13.29}
యః పశ్యతి తథాఆత్మానాం ఆకర్తారం స పశ్యతి
సర్వకర్మలు ప్రకృతి చేతనే చేయబడుచున్న వనియు, ఆత్మ కర్మలకు కర్త కాదనియు ఎవడు చూచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు
యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి
{13.30}
తత ఇవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా
భిన్నములైన భూతజాలమంతయు ఒక్కదాని యందే ఉన్నవనియు, దానివలననే విస్తరించుచున్నదనియు ఎవ్వడు గాంచునో అతడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు
నేను బాలుడిగా ఉన్నప్పుడు అలెక్సాన్డర్ డ్యూమస్ రచించిన నవలలంటే ఇష్టపడేవాడిని. ముఖ్యంగా ది మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్ (The Man In The Iron Mask) అనే నవల. నాకు తెలిసిన మటుకు మాస్క్ వేసుకున్న మనిషి ఎవరో నిర్ణయింపబడలేదు. ఒకడు లూయీ xiv అనే రాజుచే 40 సంవత్సరాలు శిక్షింప బడి బాస్టిల్ అనే నగరంలో మరిణించేడని చరిత్ర చెపుతోంది. అతని పేరు, ఊరూ ఎవరికీ తెలీదు. డ్యూమస్ అతని గూర్చి మంచి కథ అల్లేడు. ఆ వ్యక్తి లూయీ రాజు కవల తమ్ముడు; అతను రాజుని అనుకరించి అతనిని బంధీని చేయబోయేడని డ్యూమాస్ వ్రాసేడు.
ఇది ఒక మంచి దృష్టాంతము కూడా. మనందరము ఇనుప ముసుగు వేసికొని జీవితాన్ని గడుపుతామని గీత చెపుతుంది. ముసుగులో నున్న భద్రత వలన -- హిందువుల, భౌద్ధుల దృక్పథంలో అనేక జన్మల వలన -- మనకు ముఖముందని మరచిపోతాం. ఆ ముసుగే మనమనుకుంటాం. ఇతరులకూ అలాగే అనిపిస్తుంది. కానీ ముసుగు క్రింద రాజు ఉన్నాడు. వాడే మనం.
ముసుగు మన వేరే వ్యక్తిత్వం. అది వింతగా ఎందుకుందంటే అది ఒక వస్తువు కాదు. హిందూ మానసిక శాస్త్రం మనం రెండు ముసుగులు వేసుకొన్నామని చెప్పచ్చు: ఒకదాని క్రింద మరొకటి. పై ముసుగు మన భౌతిక శరీరము. లోపల వున్నది సూక్ష్మ శరీరము. అది మనస్సు, బుద్ధి, అహంకారములతో కూడి యున్నది. మనం శరీరం మనస్సులతో తాదాత్మ్యం చెందడంవలన, ప్రకృతి ఈ ముసుగులను చేసింది. దాన్ని ధరించినవాడు పురుషుడనబడును. అనగా మనలో ప్రతి ఒక్కరు.
ఈ రెండు ముసుగుల మధ్య సామరస్యముంది. దాని వలన మన స్వస్థతకి పర్యావసాన ముంది. శరీరము పాతుకుపోయిన వ్యక్తిత్వాన్ని అద్దంలాగా ప్రతిబింబింప చేస్తుంది. మనం తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వలన వ్యాధులు మొదలవుతాయి.
ఈ విషయం నిఘూడ మైనది కాదు. తప్పక చేయాలనే మానసిక ఒత్తిడి వలన మన నడవడిక కూడా అలాగే మారి మన శరీరము మీద ప్రభావిత మవుతుంది. చాలా కాలము రక్తపు పోటు తో ఉన్న వ్యాధిగ్రస్తుడు కలహశీలి అయినట్లు. ఇంకా లోతైన విషయం కూడా ఉంది. సూక్ష్మ శరీరం అతి క్లిష్టమైనది, అది ప్రాణముతో బాటు శక్తులతో --క్రోధం, భయం, కోరికలు తో -- కూడుకొని యున్నది. మనస్సును పోషించే ప్రాణము, మన మెదడును, శరీరాన్ని పోషించే ప్రాణము ఒక్కటే. మనస్సులో ఆలోచనలు గాఢమైతే శరీరములోని కొన్ని అవయవాలకు తగినంత ప్రాణ శక్తి చేరదు . దీని వలన కొన్ని సంవత్సరాల పిదప అనేక దౌర్భల్యములు వస్తాయి.
నేను చెప్పింది సులభ౦గా అర్థం చేసుకోవడానికి మాత్రమే. వ్యక్తిత్వం క్లిష్టమైనది. ప్రతి వ్యక్తి అనేక భౌతిక, మానసిక కారణాల వలన వ్యాధిగ్రస్తుడవుతాడు. నయము చేయ శక్యము కాని వ్యాధులు-- హృద్రోగము, కీళ్ల వాతం, క్యాన్సరు -- ఇటువంటి కారణాలవలన వస్తాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. భవిష్యధ్యానముగల సర్ విలియం ఆస్లర్ తోటి వైద్యులనుద్దేశించి ఈ విధంగా అన్నారు: "రోగికి ఏ వ్యాధిఉందో అడగకు. కానీ ఎటువంటి రోగికి వ్యాధి ఉందో అడుగు."
హిందువులు, భౌద్ధులు ఏమని చెప్తారంటే : మనము ఎన్నో జన్మలుగా సూక్ష్మ శరీరమనే ముసుగును తయారు చేసుకొంటున్నాము. మనకు కలిగే ప్రతి ఆలోచన, స్పందన, చేసే క్రియ, ఎన్నిక ఆ ముసుగును మారుస్తూ ఉంటాయి. నాకిది సమంజసమనిపిస్తుంది. మనలో ఉండే స్వార్థ పూరిత ఆలోచన -- లేదా నిస్వార్థమైనది -- మన చేతన మనస్సులోని శక్తులను ప్రభావితం చేసి -- స్వార్థ లేదా నిస్వార్థ క్రియలు చేయిస్తుంది.
మొదట మనము నూనెతో, రంగుతో, బంకతో, మీసంతో తాత్కాలిక ముసుగును చేసికొంటాం . ఇది సూక్ష్మ శరీరము యొక్క సహజ స్థితి: సాగేది, వంగేది, స్వతఃసిద్ధమైనది, ఖచ్చితమైన ఆకారము లేనిది. కానీ మనస్సు అలా కాదు. అది దాని సహజ స్థితిలో ఉండదు. అది ఆలోచన చేస్తూ, చేస్తూ, కోరికలు కోరుతూ, కోరుతూ ఉంటుంది. అలా పోయి, అది స్వార్థ పూరితమై, కఠినముగా అవుతుంది. చివరికి మన ముసుగు ఇనుముతో చేయబడినదై అది మనల్ని అవయవమనిపించే లేదా వ్యక్తిత్వమనిపించే స్థితికి దిగజారుస్తుంది. ఈ ముసుగును, అదృష్టవశాత్తూ, తీసి వేయ వచ్చు. ధ్యానం తదితరమైనవి ఇందుకు ఉపయోగపడతాయి. మనమెప్పుడైతే ఆ ముసుగును తీసేస్తామో మనల్ని శుద్ధమైన, సంపూర్ణమైన, మిగతా సృష్టితో వేరు కాని వారములుగా చూస్తాము. 105
No comments:
Post a Comment