Thursday, March 10, 2022

Chapter 13 Section 19

13.19

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం {13.27}

వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి

సమస్త భూతములయందు సమముగా ఉండి, ఆయా భూతముల శరీరములు నశించుచున్నను తాను అవినాశిగనుండు పరమేశ్వరుని ఎవడు గాంచుచున్నాడో వాడే నిజముగ చూచువాడు

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం {13.28}

న హినస్త్వాత్మనా ఆత్మానాం తతో యాతి పరాం గతిమ్

అంతట సమముగ యున్న భగవంతుని ఏ మనుజుడు గాంచుచున్నాడో అట్టివాడు తన ఆత్మను తాను హింసించుకొనడు. కావున పరమగతిని పొందుచున్నాడు

నాకు ఒక చలన చిత్రములో భీకరమైన మంటలతో ఒక అడవి మండుచున్న వృత్తాంతం గుర్తుంది. అది పచ్చికలోకి పాకి ప్రతి గడ్డి మొక్కను ఆవరించింది. అది చెట్ల పై పాకి వాని ఆకారమును పొందియున్నది. ప్రతి కొమ్మ దారువుతో కాక మంటతో నిండినది. చెట్లు అలా నిలిచి, అగ్నితో కాల్చ బడుచున్నవి. వాటి కొమ్మలు నారింజ, బంగారు రంగుల్లో మండుతున్నాయి.

అగ్ని స్వతహాగా నుంచోదు, అబద్ధం చెప్పదు. అది దేనిని ఆవరిస్తుందో దాని ఆకారాన్ని పొందుతుంది. కఠ ఉపనిషత్తులో ఇలా ఉంది:

ఒకే అగ్ని వివిధ రూపాలు ధరించునట్టుగా

అది వివిధ ఆకారాలు గల పదార్థములను దహించుచున్నట్టుగా

ఆత్మ జీవిని బట్టి వివిధ రూపాములు ధరించుచున్నది

ఎవరిలో ఐతే అది అంతర్గముగా ఉందో

గాలి లాగా ఆ రూపాన్ని పొందుతుంది

అది వివిధ రూపాలుగల వస్తువులలో ప్రవేశించిన

ఒకే ఆత్మ ప్రతి జీవి ఆకారాన్ని పొందుతుంది

దానిలో అట్లు స్థితమై ఉన్నది

ఇది ఒక సిద్ధాంతము మాత్రమే కాదు. దానిని అనుభవంలోకి తెచ్చుకోవచ్చును. జీన్ మేయర్ అనే ఆయన ప్రపంచంలో అతి ప్రసిద్ధ ఆహారాన్ని శోధించే శాస్త్రజ్ఞుడు. ఆయన 1974 లో రోమ్ నగరములో జరిగిన సమావేశంలో వ్రాసిన వ్యాసంను నేను చదివేను. నేను ఆయని అభిప్రాయాలను గౌరవిస్తాను. అది ఆయన గొప్పతనం వలన కాదు. ఆయన ఆర్ధ్రత, దయాగుణముల వలన. ఒక బంగ్లాదేష్ శాస్త్రజ్ఞుడు తన దేశంలో త్వరలో రాబోయే కరువుగూర్చి ప్రసంగిస్తున్నాడు. మేయర్ ఇలా వ్రాసేరు: "ఆ గదిలో ఎవరూ లేరు. చాలామంది బయట ధాన్యంతో చేయబడిన మద్యాన్ని సేవిస్తున్నారు. అనగా మన ఆహారపదార్థంతో చేసిన మద్యం." ఆయన ఇంకా ఇలాగ వ్రాసేరు: "1973 లో మద్యం తయారు చేయుటకు వాడిన ధాన్యం కోట్ల మందిని పోషించేది." ఆయన అడిగేరు ఈ సమావేశంలో హాజరైన వారిలో ఎందరికి ఈ విషయం తెలుసు?

కొందరు అడగవచ్చు "మేమెందుకు పట్టించుకోవాలి? మద్యం తయారయిపోయింది. ఉన్నందుకు ఎందుకు త్రాగకూడదు?" దానికి సమాధానం: మనం త్రాగక పోతే ధాన్యంతో మద్యం చేయ బడదు. మేయర్ ఇలా అన్నారు: మనము ఒక ఎన్నిక చేసుకోవచ్చు. అది ఇతరులకు లాభంలేని -- మద్యం తయారుచేసే పరిశ్రమలకు తప్ప- అలవాటు చేసుకోవచ్చు లేదా ఆకలితో బాధపడుతున్న కోట్లమంది పొట్టలు నింపవచ్చు.

ఈ విషయం బుద్ధికి తెలుసు. కానీ బుద్ధిని ప్రేరేపించే శక్తి హృదయానికుంది. సున్నితమైన మనిషి, ఈ విషయం తెలికొన్న, ప్రతిసారి మద్యంతో నిండియున్న గ్లాస్ ని ఎత్తినపుడు, దాని అంచులలో ఆకలితో అలమటిస్తున్న పిల్లవాడిని చూస్తాడు.

ఉంకో అభ్యంతరం ఉంది: "నేను మద్యం సేవించడం మానేస్తే ఒరిగేదేమిటి? నా వంతు ధాన్యాన్ని మద్యం చేసే పరిశ్రమలు బీదవారికి ఇవ్వరు. వాళ్ళు దానితో గ్యాసహాల్ ఇంధనం చేస్తారు. లేదా ధరలు పెంచడానికి దాన్ని తగలెట్టచ్చు. లేదా ఆవులను బలిష్టం చేయడానికి వాటికి గ్రాసముగా పెట్టవచ్చు." ఈ అభ్యంతరములలో నిజం లేక పోలేదు. ఒక సంస్థ చేసే పదార్థాలను కొనకపోవడం మొదటి అడుగు మాత్రమే. కాని వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడం ముఖ్యం . గీత సంపూర్ణమైన జ్ఞానం ఇస్తోంది. మనకు ఎన్నిక చేసికోడానికి చాలా ఉన్నాయి. ప్రతి ఎన్నికను పరిశీలించాలి. సాధారణ బుద్ధికి ఆ శక్తి లేదు. దానికి నిశితమైన బుద్ధి కావాలి. చేతన మనస్సు మార్పుతో ఎన్నికను విశ్లేషించాలి. మనము తద్వారా భగవంతుని అన్నిటియందు చూసి, దాని ప్రకారము క్రియలుచేసి జీవి౦చాలి.

మేయర్ ఇంకా ఇలా వ్రాసేరు: ప్రపంచ దేశాలు, ప్రజలు తిండిలేక బాధపడుతున్న వర్ధమాన దేశాలను కలుపుకొని, కోట్లాన కోట్లు ఆయుధాలపై వెచ్చిస్తున్నారు. 1987 సంవత్సరములో ఆయుధాలకై రోజుకి 7 కోట్లు ఖర్చుపెట్టేరు. అందులో ఒక భాగం స్వయం ప్రపత్తికై వినియోగిస్తే, ఆహార పదార్థ లేమిని అరికట్టవచ్చు. నేను వాదించటంలేదు. ఆయుధాలు చేసే సంస్థలను చూడండి. మేధావులైన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు కొన్ని దశాబ్దాలలో ఒకానొక అంశముపై దృష్టిని కేంద్రీకరించి ఎలా నమ్మశక్యం కాని వస్తువులను చెయ్యగలరో చూడవచ్చు. ఆ ఉత్సాహాన్ని ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవాడానికి వ్యచ్చిస్తే, బీద దేశాలేకాదు, అభివృద్ది చెందిన అమెరికా వంటి దేశాలలో ఉన్న బీద వారికి కూడా, ఒక తరంలో తిండిలేమిని తొలగించవచ్చు. ఇదేమీ జటిలమైన సమస్య కాదు. కాని స్వార్థం వలన, అయిష్టత వలన, దృష్టిని దీనిపై సారించటంలేదు.

మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎన్ శైక్ లో పీడియా బ్రిటానికా బుక్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 1975 లో ఇలా వ్రాసేరు:

"ఏ దేశమూ తన స్వార్థంకోసం సంకుచిత భావాలతో తమ ఇష్టం వచ్చినట్టు ఉండుట తగదు. ఎందుకంటే మనమందరమూ ఒకే సంధింపబడిన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. సంపన్న దేశాలు వాళ్ళ బాధ్యతను విస్మరించకూడదు. పేదరికంలో ఎక్కువమంది ఉండగా అతి కొద్ది ధనవంతులు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ప్రపంచ శాంతి లేకపోవడానికి కారణం ప్రపంచ యుద్ధం ఒకటే కాదు. తారతమ్యాలు కూడా యుద్ధంలాగే ప్రమాదం"

ఆమె ఇలా ఉపసంహరించేరు: "మన అన్వేషణ మానవాళికి సమానత్వ సంఘమును స్థాపించుటకే కాదు, ప్రపంచంలో తారతమ్యాలు లేకుండా చేయడం. ప్రపంచం ఒక పద్దతిలో కొనసాగాడానికి, అవగాహనతో, దయతో మనస్సులను మార్చక పోతే, కరువుకాటకాలను నిర్మూలించక పోతే, ప్రగతి సాధించలేము."

ఇది ఒక అర్థంలేకుండా వాదించడం కాదు. నాలాంటి ఆమెరికన్లు చరిత్రలోనే అత్యంత సంపన్నమైన దేశంలో మనుగడ సాగిస్తున్నారు . అయినప్పటికి ఏమి సాధించేము? పిల్లలకు చేయూతనిచ్చే, బీదవారిని ఆదుకొనే, మరియు సాంఘిక సమస్యలను తీర్చే ప్రణాళికలు చేయటంలేదు. అదేసమయంలో ఆయుధాలకై కోట్లానుకోట్లు, అప్పులుచేసి ఖర్చు పెడుతున్నారు. నిజంగా లక్షల పిల్లలు, ముసలివారు తిండిలేక అతి దీనావస్థలో ఉన్నారు. నేను అతిశయోక్తి చేయటంలేదు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. దీనికి కారణం మనం స్వార్థంతో ప్రజలను దృష్టిలో పెట్టుకోవటంలేదు. బీదవారేకాదు మధ్య తరగతిలో ఉన్నవారు కూడా ఈ భౌతిక వాదన సంబంధిత ప్రగతి వలన బాధపడుతున్నారు. ఎవ్వరూ పేదల సంక్షేమమునకు ముందుకు రారు.

ప్రపంచ ఆహార సమావేశం జరిగిన కొన్ని నెలల తరువాత, నేను జేమ్స్ రెస్టన్ న్యూయార్క్ టైమ్స్ లో వ్రాసిన సునిశిత వ్యాసాన్ని చదివేను. ఆయన కూడా సంపన్న దేశాల జీవన ప్రమాణం మితిమీరిన వ్యర్థాలకు దారి తీస్తున్నాదని తప్పుబట్టేరు. వాళ్ళ విలాశాలకై వర్తమాన దేశాలలోని ముడి సరుకు నుపయోగించుకొని, తక్కువ జీతంతో ఎక్కువ శ్రమపడే వారల కష్టాన్ని అనుభవిస్తున్నారు. కాలం మారుతోంది. వర్ధమాన దేశాల ప్రజలు మనం చేసే కార్యాలను చూస్తూ నోరుమూసుకొని ఉండలేరు. మనం అంతర్జాతీయ ఉగ్రవాద శకములో ఉన్నాము. కొన్ని ఉగ్రవాదుల గుంపులు, అణ్వాశ్త్ర ములను చేజిక్కుంచుకొని ఒక దేశాన్ని చెఱపట్టచ్చు లేదా ఒక దేశంతో యుద్ధం చేయవచ్చు. ఈ శతాబ్ద చివరికి, పరిస్థితులు మారకపోతే, విచ్చిత్తి శక్తితో కూడిన పదార్థాలను రవాణాచేసి, వేల కొలది అణ్వాశ్త్రాలను తయారు చేస్తారు. ఫ్రెడ్ ఇక్లే ఇలా వ్రాసేరు: "నిజంగా మనం మనను రక్షించుకోలేం. అది అతి సున్నితమైన విషయం కావచ్చు లేదా శిక్షితమైన అణ్వాశ్త్రాల యుధ్ధం కావచ్చు. భారీగా సొమ్ము ఖర్చు చేసి, మనం చేసికొన్న రక్షణ వ్యవస్థవలన ఏమీ ప్రయోజనం లేదు. మనం ఎవ్వరితోనైతే శతృత్వము ఉండ కూడదో, వారి దాడికి అనువుగా ఉన్నాం." దయ, ఐకమత్యంతో కూడిన సిద్ధాంతాన్ని పర్యావసానము లేకుండా ఉల్లంఘించలేము.

మన సహజీవనానికి ఒకే ఒక మార్గమున్నది. అది ఇతరులను నమ్ముట. మానవాళికి అవసరమైన వస్తువుల్లో మనం ఆనందంగా తక్కువ వాటా తీసికోవాలి. ఇది ప్రతికూల అంశంకాదు. ఈ విషయాల్లో ఎక్కువ ప్రగతి కలుగలేదు. నిజానికి చాలా తక్కువ జరిగింది. ప్రజలకు అవగాహనకు తక్కువ పాటుపడ్డాం. ఇలా నిస్వార్థంగా బ్రతకడంలో చాలా ఆనందం ఉంది. మన స్వంత సాధనములతో కలసికట్టుగా అర్పితమై ఆత్మహత్యలతో బెదిరించే పరిస్థితిని తొలగించాలి. 103

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...