13.6
[శ్లోకం 13.5 లో ఉన్నది ]
క్రిందటి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఘటనా ప్రపంచం (phenomenal world) లోని ఘటకములను (ingredients) చెప్పెను. ఇప్పుడు ఆ ఘటకములను మేళవించి ఒక వ్యక్తిని తయారుచేసే పద్దతి చెప్పబోవుచున్నాడు. శరీరము ఆ పద్దతిలో ఒక భాగము, కానీ అది ఒక చిన్న పాత్రను పోషిస్తుంది. ఒక వ్యక్తిలో ఎక్కువ శాతం అంతర్గత ప్రపంచం. దానిని మనస్సు అనవచ్చును. ఆ ఘటకములన్నీ ఒకే ఘటనా ప్రపంచమునకు చెందినవి. అది సదా మారుతూనే ఉంటుంది. మనకు దానితో తక్కువ సంభందం ఉంది.
ఉదాహరణకు నా శరీరం తీసికోoడి. అది దిట్టంగా, వెచ్చగా, చామనచాయి రంగులో ఉంది. అయినా నా వైద్య మిత్రులు అది సదా మారుతూ ఉంటుందని చెప్తారు. నా చేతులు ఎప్పుడూ ఉన్నవే. నా చర్మము వేరు. నా కండరాలు వేరు. నా ఎముకలు కూడా వాటిలాగే సదా మారుతున్నాయి. నేనిలా కూర్చున్నప్పుడు నా చేయిలోపల నాకు తెలీకుండా కణాలు మారుతున్నాయి. అయినప్పటికి అది ఒక చేయి. అది నా చేయి. దానియందలి కణాలు చేపగా మారవు. అవి నా శరీరానికి అనుగుణంగా మారుతాయి.
నా పూర్తి శరీరం అంతే. అది 20 ఏళ్ల క్రిందటి శరీరం కాదు. అయినప్పటికీ అది ఒక సంపూర్ణ శరీరం. నా శరీరం. అది ఒక పదార్థమే కాదు. ఒక వ్యవస్థ కూడా. ఈ జ్ఞానం వలన మనకి తెలిసినదేమిటంటే శరీరం మీద వ్యామోహము, దురభిమానము తగదు. ముక్కు సూటిగా ఉన్నదని అహంకారం చెందవచ్చు. కానీ అది చెందే మార్పులు మనం తెలిసికోనక్కరలేదు.
ఆ ప్రక్రియ చాలామటుకు ఆకాశానికి (space) కి చెందినదే. శరీరంలో ఘన పదార్థం చాలా తక్కువ. ఎక్కువ ఉన్నది ఆకాశమే. ఆకాశాన్నంతా తీసేస్తే పదార్థo ఒక వేరుశెనగ తొక్కoత ఉంటుందని ఎక్కడో చదివేను. ఇది ఆశ్చర్యకరమైనది అతిశయం కాదు. దీని వలన తెలిసినదేమిటంటే పదార్థం ఎంత ఉపయోగకరమో ఆకాశం కూడా అంతే ఉపయోగకరం. అందుకే ఆకాశం పంచ భూతాల్లో ఒకటని చెప్పబడినది. గాలితో నిండిన ఆకాశమే మన శరీరం అని ఎలా నమ్మడం?
మనం నిజంగా నమ్మితే, బహుశా మనం కలవరం చెందుతాము. ప్రణయం చేయుట మిక్కిలి కష్టం. రోమియో అక్కడ గాలితో నిండి కనిపించని జూలీయట్ గురించి ఏమనుకొంటాడు? వేరుశెనగ తొక్కతో సమానమైన శరీరంని చూసి ప్రేమలో పడతాడా? మాయ ఇటువంటి గ్రాహ్యతను సహించలేదు. కాబట్టి దాని మీద ముసుగు వేస్తుంది. మన నైజం విచిత్రం. రోమియో ఎన్నిమార్లు "అది వేరుశెనగ తొక్కే, అది వేరుశెనగ తొక్కే" అనుకున్నా, జూలియట్ చేయి పట్టుకోగానే శరీరంలో మార్పులు చెందుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తం వేగంగా ప్రవహిస్తుంది. మోహం వలన చేయి ఘన పదార్థంగా గ్రహించబడుతుంది
ఇది ఇప్పటికే మూర్చావస్తని కలుగజేసింది. దాన్ని ఇంకొంచెం పొడిగిద్దాము. మనస్సును చూద్దాం. ప్రతిరోజూ క్రిందటి దినములాగే మార్పు లేకుండా నిద్రనుంచి లేస్తాము. ఎందుకు? మార్పు లేనిదెందుకు? నువ్వు భిన్నంగా చూస్తావు. బహుశా క్రిందటి రోజు రాజాగా తలంచేవు. ఈరోజు విశేషంగా చూస్తావు. "భోజనం చేసిన తరువాత చూద్దాం. నేను భోజనం చేసే వరకు నేను కాదు." భోజనం చేసిన తరువాత నువ్వు నిజంగా మారవచ్చు. మనమంతా అటువంటి భావనలు గలవారమే. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వ్యక్తులతో మనం వేర్వేరుగా ఉంటాము. ఆఫీసులో అందరినీ గౌరవంగా పలకరిస్తారు. ఇంట్లో స్వార్థపూరితంగా ఉండచ్చు. ఈ విధంగా మనకు రెండు వ్యక్తిత్వాలు ఉండచ్చు. ఇది సమత్వం ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఇదేవిధంగా మన కోరికలు మారుతాయి. ఒక వ్యక్తిత్వంలో నువ్వు చెత్తలబండిని నడిపించే వాడిగా భావించవచ్చు. ఉదయాన్నే బండిని ఇంకా నిద్రపోతున్న చుట్టుప్రక్కలివారిని కలవర పరిచేలాగా తోలుతావు. నీ మనస్సులో వేరే ఉద్దేశం ఉండవచ్చు. అభిప్రాయాలు మారుతాయి. దయపూరిత వారలెందరో నాకు తెలిసి ఇప్పుడు సంప్రదాయ బద్దంగా ఉన్నారు. మార్పు మనస్సు యొక్క స్వభావము.
జ్ఞానులుకూడా అలాగే తలిచేరు. "మరినేను ఎవర్ని" అని ప్రశ్నించు కొన్నారు. మనం అవయవాల సమూహం కాదు. అవి ఏవీ కావు. అవి శూన్యాన్ని సూచిస్తాయి. మనస్సు కూడా మార్పు చెందేదే. ఆలోచిస్తే వేరుశెనగలో చాలామంది ఇముడుతారు అన్న భావన కలుగుతుంది.
ఒక భౌతిక శాస్త్రవేత్తకు, ప్రపంచం పరమాణువులు, శక్తి తో కూడినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనస్సు అభిప్రాయాల, ఆలోచనల మహా సముద్రం. వ్యక్తి మార్పు చెందినప్పటికీ, వానిలో ఏదో శక్తి దినదినం మార్పు చెందకుండా ఉంటుంది. మనస్సు స్వభావం పునరుచ్ఛరించడం. అది దేనినైనా ఆలోచించ గలదు. నిజానికి అది పాత ఆలోచనలు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎలాగంటే నా చేయి పాత కణాలు విసర్జించి కొత్త కణాలను తయారు చేసికోవడం లాగ. కానీ ఉన్న చేయి ఉన్నట్టే ఉంటుంది. అలాగే మనస్సు కూడా పని చేస్తుంది. ధ్యానం వలన మనస్సును మార్పు చేసుకోవచ్చు. మనస్సులో ఘన పదార్థం , మార్పులేనిదంటూ ఏమీ లేదు. మనం దాని స్వరూపాన్ని పట్టుకోవాలి. మనకున్న అలవాట్లు, గుణాలు, స్వీయ భావావరోధం ని సంస్కృతంలో సంస్కారాలు అంటారు.
ఇవన్నీ మన అహంకారాన్ని గాబరా పెడతాయి. అది ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాదని తలస్తుంది. కానీ అది అబద్ధం. కోరికలు, అలవాట్లు, కోపము, అభద్రత లతో గజిబిజిగా చేసిన కట్టలా యాధృచ్చికంగా ఉన్నది. ఈ కట్టను ఎవరు మోస్తున్నారు? చేతులతో మోద్దామని ప్రయత్నిస్తే అది చిందరవందరగా నేల పడుతుంది. కాబట్టి దానితో కూడి ఉంటే మన అభద్రత ఎక్కువవుతుంది. దానిలో అతిశయోక్తి లేదు. ఈ పేకముక్కలతో చేయబడిన నీడ వంటి ఇల్లుని ఏదైనా భయపెట్టగలదు. దానివలన తాడుతో కట్టబడడానికి ప్రయత్నిస్తున్న అహంకారం తన రక్షణ కొరకై ప్రాకులాడుతుంది .
ఎలాగైతే మనస్సులోని ఆలోచనా ప్రవాహం అహంకారానికి వర్తిస్తాయో, అది ఆత్మ తప్ప వేరే వస్తువుకు వర్తించదు. అన్నిటికీ మూలమైన ఆత్మను అహంకారం ఆక్రమించి దాని గుణాలను స్వంతం చేసుకోవడానికి తయారవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అహంకారం ఆత్మ లక్షణాలను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది కోటు వేసుకొని, టోపీ పెట్టుకొని నన్ను ఆత్మలాగా తెలివైన, ప్రతిసృష్టి చేయగల, ప్రేమించదగిన, మరణంలేనిదానిగ చూడండి అని దబాయించి అడుగుతుంది. కానీ ఒక చిన్న భాగం దాన్ని నమ్మదు. అది అద్దంలో చూసుకొని తనను తాను పొగుడుకోడానికై ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ప్రతిబింబం లేదు. ఘనమైన పదార్థము లేదు. నిమిషనిమిషానికి మార్పు చెందుతుంది. అవన్నీ ఏకమై దానికి అభద్రత, భయము కలిగిస్తాయి. అవి చేతనావస్తలో తొలగాలంటే ముందు మనమెవరో తెలిసికోవాలి.
ఈ ప్రక్రియనంతటిని క్షేత్రంగా శ్రీకృష్ణుడు అభివర్ణించేడు. అది ఎంత నిజమో మన ఆధునిక జీవన శైలిని చూస్తే తెలుస్తుంది. మనము పదార్థము, శక్తిని వరసగా గోచరమై, సూక్ష్మమై ఒక బలవంతమైన భౌతిక శక్తిగా తలుస్తాము. ఇది పాఠశాలలలోనూ, టివి లోనూ బోధించరు. ఆపై అది ఎందుకూ పనికిరానిదని, నిరూపణ చేయలేనిదని అవహేళన చేస్తారు. మన ఒక విషయం అర్థం చేసుకోవాలి. వస్తువుకి సంబంధించిన జ్ఞానం ఎలా అతిశయోక్తికి గురి అవుతుందో జ్ఞప్తి పెట్టుకోవాలి . అదే గీత చెప్తున్నది. శక్తులతో కూడివున్న ఆ క్షేత్రం అణువుకన్న సూక్ష్మమైన వస్తువుల్లో వ్యాప్తి కలిగినది. అదే మనస్సుకున్న శక్తి.
ఇది వాక్చాతుర్యము కాదు. మనo కరెంటును (electricity) చూడలేము. దాని కార్యాలన్నీటినీ చూడగలం. అలాగే మన వ్యక్తిత్వంలో ఉన్న శక్తులను కూడా చూడలేం. అయస్కాంతం చూస్తే ఒక ఇనప ముక్కలాగ ఉంటుంది. కానీ అది ఒక కుప్పగా ఉన్న ఇనుప రజను దగ్గరకు తెస్తే ఆ రజను కుప్ప సమాంతర రేఖలుగా మారుతుంది. మనం ఆ రేఖలను చూడగలం. అది అయస్కాంత క్షేత్రం యొక్క రూపం.
అదేవిధంగా మనం వ్యక్తిత్వం యొక్క ఆకారాన్ని దాని క్రియలద్వారా తెలిసికోవచ్చు. మొదట శరీర ఆకారం. సూక్ష్మమైన అణువులలో, ఒక శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు, శరీరo వర్ణింప శక్యం గాని శక్తిగా తెలియబడుతుంది . మనము శరీరమని దేన్ని అంటామో అది ఘన పదార్థము. ఎందుకంటే అది మన ఇంద్రియాలకు అనుభూతి కలిగిస్తుంది. హిందూ-బౌద్ధ శాస్త్రాలు ఒక అడుగు ముందుకు వేసి: మన భౌతిక శరీరం వ్యక్తిత్వం యొక్క ఘన పదార్థం. అది ఎన్నో సంవత్సరాల కాలంలో మన ఆలోచనల క్రమంతో చేయబడినది. ఇది గుహ్యమైన సిద్ధాంతము కాదు. శాస్త్రాలు స్వస్థత, ఆరోగ్యం, ఎలా బాల్యం నుంచి ఉన్న జీవన శైలిలో నిర్ణయింపబడినవో మన జ్ఞప్తికి తెస్తాయి. మనమేమి తింటామో, రోజుకు ఎన్నిమార్లు తింటామో, పని ఎలా చేస్తామో , జీవితంలో తటస్తిoచే చిక్కులను ఎలా విడదీస్తామో, మన తీరిక సమయం ఎలా గడుపుతామో ఇవన్నీ బాల్యంనుంచి వచ్చినవి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. ఈ శ్లోకం మన ఇష్టాయిష్టాలను, పట్టుదలను , మనను క్రియాశీలులను చేయు కోరికలను జ్ఞప్తికి తెస్తుంది. అది జన్యు సంభందమైన విషయంగూర్చి చెప్పటంలేదు. చాలా సార్లు మన వ్యక్తిత్వం జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. మన సమర్థత జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. తక్కువ కదలిక వలన తిండిని నియంత్రించకపోతే లావు అవతాం. మనను ఎక్కువ బరువుగా ఉండమని ఎవ్వరూ శపించరు. మన కోరికలు, నడవడిక, మనం చేసుకొన్న ఎన్నికలు, గుప్తంగాఉన్న ప్రవృత్తులను వెలుపలికి తెస్తాయి.
ఇతరులపైన జరుగు కార్యములు ద్వారా శక్తివంతమైన క్షేత్రం గూర్చి ఇంకా చెప్పవచ్చు.
సాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో ఒక శక్తివంతమైన కరెంట్ తో పనిచేసే ఆయస్కాంతాన్ని చూసేను. నా నడుముకున్న ఎత్తులో రెండు స్థoబాలు ఒకదానివైపు ఇంకోటి వంచ బడి ఉన్నాయి. చెయ్యిని వాటి మధ్య పెడితే ఎటువంటి చలనం ఉండదు. కానీ కరెంటు వాటి లోకి పంపితే అది వేరే విషయం. వాటి మధ్య కొంత ఇనుప రజనను వేస్తే, అవి సమాంతర రేఖల వలె మార్పు చెంది ఒక వంతెనలా గాలిలో తేలుతాయి. నువ్వు దాన్ని కదపవచ్చు. దాని మీద చేయి పెట్ట వచ్చు. ఎటువంటిదీ ఆ రజనును మొయ్యకపోయినా ఆ వంతెన దిట్టంగా ఉంటుంది. కంటికి అగుపడని క్షేత్రం నిజంగా ఇలా ఉంటుంది. అది తన చుట్టూ ఉన్న ఆకాశాన్ని (space) వంచుతుంది.
ఒక మనిషికూడా అలా ఉండవచ్చు. మనము వాడుక భాషలో "ఆమె వ్యక్తిత్వం దృఢంగా ఉంటుంది" అంటాం. అయస్కాంతం లాగ మన వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళినా శక్తివంతమైన క్షేత్రాన్ని ప్రసరింపజేస్తుంది. అది మంచికయినా లేదా చెడుకయినా కావచ్చు. అందుకే ఒక మనిషి కొందరికి ఆకర్షణీయంగా ఉంటాడు. మరికొందరికి అసహ్యకరoగా ఉంటాడు. సమస్య ఏమిటంటే: మనం కావలసిన వారిని ఆకర్షించ౦. అలాగే మనం అసహ్యించే వారి బారినుండి తప్పించుకోలేం. ఇoకోవిధంగా చెప్పాలంటే మనం కర్మ బీజాన్ని నాటి దాని పంటను పొందే వాళ్ళనే ఆకార్షిస్తాం. ఒక కోపిష్టికి తన కోపాన్ని ప్రేరేపించే మనుష్యులు, సంఘటనలు ఎదురౌతాయి.
తగిన పరిస్థితులు కలుగజేస్తే ఒకని శక్తివంతమైన క్షేత్రం చాలా దూరం ప్రసరించవచ్చు. గీత ఆదిలో చీకటిలో ఉన్న శక్తిలా దుర్యోధనుని వర్ణిస్తుంది. జీవితమనే నదిలో అతడు సుడిగుండం వంటి వాడు. మీరు సుడిగుండాన్ని చూసేరో లేదో నాకు తెలీదు. బాల్యంలో నదిలో ఈదుతూ ఉంటే నాకు భయoకరమైన సుడిగుండాలు కనబడ్డాయి. ఎక్కువగా వర్షా కాలంలో. అది ఒక భయానకమైనది. ఒక కనబడని చెయ్యి దానిని ఈవొడ్డు నుంచి ఆ వొడ్డుకి కదిపినట్టు ఉంటుంది. అది వేగంగా, చీకటిలోలాగా, బలమైన సుడులుగా కనిపిస్తుంది. అలా కదులుతూ దారిలోనున్న వాటినన్ని తనలోకి లాక్కుంటుంది. దుర్యోధనుడు అటువంటి వాడే. అతడు క్రోధం, బలమైన అహంకారలతో ప్రపంచాన్ని తన చుట్టూ త్రిప్పికొని దాని నాశనానికి కారణమయ్యేడు. నేను ఒక వాచ్యార్థానికై ఇది చెప్ప లేదు. హిట్లర్ జీవిత చరిత్ర చదివిన వారికి వాని క్రోధానికి ఎంత మంది బలి అయ్యేరో తెలుసు. దుర్యోధనుడూ ఆ కోవకు చెందినవాడే.
శక్తివంతమైన క్షేత్రం యొక్క చిత్రం మనకు ఒకరిమీద మరొకరు ఎలా ఆధారపడి ఉన్నామో తెలుపుతుంది. మరియ మన మనోవాచాకర్మలు ఎంత దూరం వెళ్లగలవో వివరిస్తుంది. ఎలా అయితే ఒక కెరటాన్ని నదినుంచి విడదీయలేమో, మనలోఉన్న శక్తిగల క్షేత్రం మనం నివసించే శరీరానికే పరిమితమని అనలేం. ఆ కెరటాల సమూహం -- మనలాంటి సాధారణ మనుష్యుల లెక్కపెట్టలేని కోరికలు, కర్మలు -- ఒక సుడిగుండాన్ని సృష్టించి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందవచ్చు .
ఉదాహరణకు నేను ఒక సాధారణ, అమాయకమైన విషయం యొక్క కార్యం గురించి ఆలోచిస్తున్నాను. అది ఆవు మాంసం తినాలనే కోరిక. కొంతమంది అవసరమున్నా లేకపోయినా అదేపనిగా మాంసం తింటారు. రోజూ మాంసాన్నే ఆకాంక్షిస్తారు. కొందరు రోజుకు రెండు సార్లు తింటారు. అది ఆహారంలా కాక ఒక చిహ్నం లా ఉన్నది. ఇది సాధారణంగా మోతాదులో తినే మాంసం గురించి చెప్పబడలేదు. నేను చెప్పేది మాంసం తినాలనే స్థిర భావం. నియంత్రణ చేయని బలమైన కోరిక. ఎప్పుడైతే ఒక కోరికకు నియంత్రణ లేకపోయిందో, కొందరు డబ్బు చేసికొoటారు . ఎపుడైతే బలమైన కోరిక, దురాశ కలసి ఉంటాయో, వాని దుర్మార్గం అన్నిటినీ వ్యాపిస్తుంది.
రస్సెల్ బేకర్ అమెరికాని ఆవు మాంసం మత్తులో ఉన్నట్టు వర్ణించేరు. అమెరికాలో మాంసాహార మార్పు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వచ్చింది. యుద్ధం ముగిసిన తరువాత ఆవు మాంసం -- ముఖ్యంగా స్టేక్ అనబడేది--ఎక్కువ వాడుకలోకి వచ్చింది. అది ఒకని గొప్పతనానికి, ధనానికి చిహ్నం అయ్యింది. 1950 దశాబ్దంలో ఆవు మాంస విక్రయం కొన్ని కోట్ల వ్యాపారంగా మారింది. నేను ఈ దేశానికి వచ్చినపుడు ఆవు మాంసం సర్వ సాధారణంగా ఉండేది. ఆవు మాంసంతో చేయబడిన అనేక ఆహార పదార్థాలు మధ్యాహ్నం తినేవారు; స్టేక్ లు సాయంత్రం తినేవారు. అతిథులు వచ్చినపుడు బార్ బెక్యూ లు విపరీతంగా చేసేవారు. స్టేక్ బర్గరు లేని జీవన శైలి అమెరికాలో లేదని చెప్పడం అతిశయం కాదు.
క్రమంగా బర్గరు సంపన్నదేశాలకు వ్యాపించింది. పశ్చిమ ఐరోపా, జపాన్, లాటిన్ అమెరికాలో ధనికులు ఆ వ్యాప్తికి దోహదం చేసేరు.
ఇప్పుడు దాని ఫలితాలను కారణ కార్య రూపంలో చూద్దాం. ఆవుల్ని పెంచడానికి లాటిన్ అమెరికాలోని అరణ్యాల్లో చెట్లని నరికేశారు. ఆవు మాంసం తినాలనే కోరిక ఈ విధంగా ప్రపంచాన్నే కబళిస్తోంది.
బ్రజిల్ లో సగం అమెజాన్ అరణ్యము ఉంది. అది కొన్ని కోట్ల విస్తీర్ణం గలది. కేలిఫోర్నియా అంత వైశాల్యం గలది. 1970 సంవత్సరంలో బ్రజిల్ ఆ అరణ్యాన్ని పాశ్చాత్యులకు అమ్మింది. ఎవరైతే ఆవుల్ని పెంచడానికి పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా లబ్దిని ఇచ్చింది.
అరణ్యాల్లోని చెట్లను నరకడానికి కారణం: ఆవులు మసలడానికి, వాటికి కావలసిన గడ్డిని పెంచడానికి. ఉష్ణ ప్రదేశ్శాల్లో ఆవుల్ని పెంచడంవలన పర్యావరణానికి మిగతా వాటి కన్న అత్యంత ప్రమాదకరం. రెయిన్ ఫారెస్ట్ అనబడే అరణ్యం ఆవులను పెంచేవారు వలన గాక ముఖ్యంగా బహుళ దేశ వ్యాపారస్తుల దూరాశకు గురయ్యింది. ట్రాక్టర్లతో ఉపరితల మొక్కలను నరికేరు. ఏజెంట్ ఆరెంజ్ అనబడే గుల్మ నాశినిని (herbicide) వాడి చెట్లను పీకేశారు. వాటి అవశేషాలను, చచ్చిన జంతు శరీరాలతో కలిపి, దహనం చేసేరు. కొన్ని సంవత్సరాల తరువాత మట్టిలో సారం తగ్గింది. విషపూరిత కలుపు మొక్కలు పెరిగేయి. ఆ తరువాత ఆ ప్రదేశాన్ని ఆవులను పెంచే వారు విడనాడడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఉంకో ప్రదేశానికి వెళ్ళి ఈ విషవలయాన్ని ఆవృత్తి చేసేరు.
పెట్టుబడుదారులు ఇలా అన్నారు : "అయితే ఏమిటంటా? చాలా అరణ్యం చెట్లతో మిగిలి ఉంది. కోట్ల ఎకరాల భూమి సాగులేకుండా ఉంది. పర్యావరణం గురించి గుండెలు బాదుకొనే వారి వలన మేము ఆ భూమిని వాడుకోలేకపోతున్నాం. వాళ్ళకి అరణ్యం అంటే మక్కువ ఉంటే ఉండచ్చు". బ్రజిల్ ప్రభుత్వం వాళ్ళతో అంగీకరించింది. వాళ్ళకి కావలసింది విదేశీ పెట్టుబడులు.
తరువాత వరదలు వచ్చేయి. సైన్స్ అనే పత్రికలో డిసెంబర్ 1980 లో ఒక కధనం వచ్చింది. "గత దశాబ్దంగా అమెజాన్ వరద నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అది అదుపులేకుండా అరణ్యంలోని చెట్లను నరకడం వలననే. నాల్గవ వంతు అమెజాన్ అరణ్యం నరకడం జరిగింది. అది విపరీతం అవుతున్నది." వరద నీటిమట్టం ఎక్కువవడం వలన ఉపరితలంలోని మట్టి వరద నీటిలో కొట్టుకు పోతుంది. అలాగే తక్కువ వృక్షాలు వుండడంవలన గాలిలో తేమ తక్కువై, వర్షాలు తగ్గేయి. అంటే అనావృష్టి. కొన్నేళ్లలో పచ్చటి అరణ్యం ఉండవలసిన ప్రదేశం ఎడారిగా మారవచ్చు.
ఈ విషయం గూర్చి అనేక కథనాలు వార్తల్లో వచ్చేయి. అవి ఒక పెద్ద చిత్రీకరణకు దారితీసేయి. దక్షిణ అమెరికాలో ఆహార వనరులు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచ పర్యావరణం అమెజాన్ అరణ్యం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే అరణ్యం విస్తీర్ణం తగ్గినదో భారత దేశంలో వర్షాలు సాగుభూమి మీద కాక సముద్రంలో పడ్డాయి. అలాగే బర్మా (మయనమార్), ఈశాన్య ఆసియాల్లో కరువు వచ్చింది. ఎక్కడో 12 వేల దూరంలో వున్న బ్రజిల్ లోని ఆవుల పెంపకం గూర్చి జరిగిన సంఘటనల వలన నీటి ఎద్దడి, కరువు, వరదలు వాళ్ళపై తాండవించేయి.
కొద్ది సంవత్సరముల తరువాత శాస్త్రవేత్తలు పర్యావరణంలో చెడుకు దారి తీసిన మార్పులు గురించి అధ్యయనం చేయడానికి సమావేశం అయ్యారు. "అమెజాన్ అరణ్యాలను ఏఒక్క సహజ వనర౦ కన్న వేగంగా నాశనం చేస్తున్నారు." అని సందేశం ఇచ్చారు. ఆహారముకు సంబంధించిన సంస్థ (Institute for Food and Development Policy) 1987 లో ఇలా చెప్పింది: "ప్రస్తుత పరిస్థితులు గానీ కొనసాగితే ఇంకో 75 ఏళ్లలో అమెజాన్ అరణ్యం కనుమరుగవుతుంది." ప్రపంచంలో ఉన్న అరణ్యాలలో మూడవ వంతు బ్రజిల్ లోనే ఉన్నది. బ్రజిల్ కి అనిశ్చయమైన ఘనత లభించింది. ఎందుకంటే అక్కడ కోట్ల ఎకరాల అరణ్యాలు భూతలంలో ఎక్కడా లేనట్లు నాశనమయ్యేయి.
శాస్త్రవేత్తలు అమెజాన్ అరణ్యాలను భౌగోళిక వనరులుగా భావిస్తారు. ఒకటికి 12 వ వంతు భూమి అరణ్యాలతో కప్పబడినది. మన జీవనం సజావుగా సాగాలంటే అవి ఎంతో అవసరం. మన ఆహార వనరులు వాటి మీద ఆధార పడి ఉన్నాయి. వాటిని "తల్లి భూమి ఊపిరి తిత్తులుగా" వర్ణించేరు. ఎందుకంటే అవి ప్రమాదకరమైన కాలుష్యకారక బొగ్గు పులుసు వాయువుని, ఓజోన్ ని వడపోసి మనకు కావలసిన ప్రాణ వాయువుని, నీటిని సమకూరుస్తాయి. వాటివలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అనగా పరిశ్రమలు కారణంగా పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రత అరికట్టబడుతుంది. లేకపోతే మనము ఐస్ ఏజ్ కి వెళ్ళవలసి వస్తుంది. అమెజాన్ అరణ్యాలు విచిత్రంగా తప్పుడుగా అర్థం చేసుకోబడ్డా పరిశ్రమలు నుండి వచ్చే కాలుష్యాలను నివారించి మన మనుగడకి తోడ్పడుతున్నాయి.
ఉష్ణ ప్రదేశాల్లో ఉన్న అడవుల్లో సగం జీవరాస్యులు నివసిస్తాయి. వాటి జన్యు నాశనం ఎటువంటి అనార్థాలకు దారితీస్తుందో ఎవళ్ళకీ తెలీదు. మనకు తెలిసినది అమూల్యమైన ఓషధులు, ఆహార దినుసులు మనకు అందకుండా పోతాయి. అతికొద్ది వృక్ష, జంతు జాతులను ఇప్పటివరకు అధ్యయనం చేసేరు. అవి 4 వేల ఫల, కూరగాయల జాతులు. నూటికి 90 శాతం ఇంకా వృద్ధి చెందలేదు. మనను రక్షించే మందులు తయారీలో నాల్గవ వంతు అక్కడి నుంచి వచ్చినవే. అక్టోబర్ 3, 1988 సైన్స్ పత్రికలో ఇలా వివరించేరు: "అరణ్యాలు కనుమరుగు ఐతే భూమి పై ఉన్న జంతువులు, వృక్షాలు, కీటకాలు 50 శాతం నాశనమవుతాయి. " చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ రాప్ ఇలా చెప్పేరు: "6 కోట్ల సంవత్సారల క్రిందట జరిగిన అతి పెద్ద వినాశనంతో డైనోసార్లు (dinosaurs) అంతరించిపోయేయి. వాటితో పాటు 60-80 శాతం జీవరాసులు కూడా కనుమరుగయ్యేయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న జీవరాసులలో 50 శాతం నాశనమైతే 6 కోట్ల సంవత్సరాల క్రిందన జరిగిన వినాశనం పునరావృత్త మైనట్లే"
ఈ పంథాలో కొన్ని విషాదకరమైన కార్యాలు మనకు అగుపించవు. కొన్ని ఏళ్ల క్రింద న్యూ యార్కర్ అనే పత్రికలో ఈ విషయం చదివేను. రాబిన్ హాన్ బరీ టెనిసన్ అనబడే వ్యక్తి సర్వైవల్ ఇంటర్ నాషనల్ (Survival International) అనే సంస్తను నడుపుతుంటాడు. అతను సమూలంగా నాశనమవుతున్న మానవ జాతులగూర్చి అధ్యయనం చేసేడు. ఆయనకు స్పూర్తి లన్ డన్ టైమ్స్ పత్రిక యొక్క ఆదివార అనుభందంలో ప్రచురించబడ్డ "జినొసైడ్" అనే కథనం. అది జర్మనీ నాజీల గురించి కాదు. అది అమెజాన్ ఇండియన్స్ కు సంబంధించినది. 1500 శతాబ్దంలో అరకోటి ఇండియన్స్ బ్రజిల్ లో ఉండేవారు. అది కాబ్రల్ రాక పూర్వం. నేడు వాళ్ళ సంఖ్య 5 శాతం తగ్గింది. వాళ్ళ వినాశనం ఎంతో దూరంలో లేదు. 20 వ శతాబ్దంలో సంవత్సరానికి ఒక మానవ జాతి కనుమరుగవుతున్నాది. ఇది ఒక క్రూరమైన పద్దతిలో జరుగుతున్నాది. ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేసిన ప్రదేశాలను ఆవులతో వ్యాపారం చేసే వాళ్ళు, ఖనిజాలను వెతికేవాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, తమ హస్తగతం చేసుకొంటున్నారు. ఇదంతా నాగరీకతలో ముందంజ వేసిన దేశంలో జరుగుతున్నది. నేను ఇవన్నీ భూమిని కొల్లగొట్టే సంస్కృతి లేదా మానసిక కారణాల వలన జరుగుతున్నాయని నమ్ముతాను.
నేను ఒక సామాన్య కోరిక గూర్చి విచారణ చేసేను. అదేంటంటే మనకు ఒక పదార్థాన్ని తినాలనే కోరిక ఉద్భవించిందనుకోండి. అది చాలా మంచి పదార్థము. దాని వలన మనమెంతో ఉన్నత స్థానంలో ఉన్నామని తెలియజెప్పబడుతుంది అనుకోండి. ఎవరికైనా ఇది ఒక చిన్న కోరికే. కానీ అది సర్వ వ్యాప్తమైతే, ప్రశ్నలు రానీకుండా డబ్బు చేసుకోవడానికి వీలవుతుంది. డబ్బుచేసుకోదలచిన వాపారస్తులు టివిలో ప్రకటనలు ఇచ్చి, మన సహజ అభిలాషను పెంపొందిస్తారు. మనం మంచి పోషకాహారం తినాలనుకొంటాం. మన పిల్లలకు సుఖాలను అందివ్వాలనుకొంటాం. మనం కష్టపడి సంపాదించినది అనుభవిద్దామనుకొంటాం. ఇలా ఉండగా వ్యాపార సంస్థలు వాటిని మనలోని బలహీనతలుగా తలచి ఎక్కువ సంపాదనకై ప్రయత్నిస్తాయి. అవి భూగోళమంతటా పెట్టుబడులు పెడతాయి. సంపన్న దేశాలు --అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లెక్కలో-- కూడా ఈ ఆటలో ప్రవేశిస్తాయి. తద్వారా విలువైన సహజ సంపదలను సంపన్నుల విలాశాలకై కట్టబెడతారు. వారి దేశ ప్రజలకు వొరిగిందేమీ లేదు. అది అలా వ్యాప్తి చెందుతుంది. ఎప్పటివరకంటే మన చిన్న కోరిక ఒక అలవాటుగా మారి, మనం ప్రకటనలు ఇచ్చే సంస్థల నియంత్రణలో ఉన్నంతవరకు. అందుకే కోరికలను, అవి ఎంత చిన్నవైనా, ఆలోచించుకొని కోరాలి. లేదా ఒక చిన్న కోరిక వేరొకరికి మనను మోసగించడానికి చేయూత నిస్తుంది. 66
No comments:
Post a Comment