13.7
అనామిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం
{13.7}
ఆచార్యోపాశనం శౌచం స్థైర్య మాత్మ వినిగ్రహః
అభిమానము లేకుండుట, దంభము లేకుండుట , అహింసా, సహనము, ఋజుత్వము , గురుసేవ, శుభ్రత, స్థిరత్వము , మనోనిగ్రహము మరియు
ఈ శ్లోకం, వచ్చే 4 శ్లోకాలు అసంగత్వంగా జీవించేవారి గూర్చి చెప్పబడినది. అనగా ఎవరైతే తాము శరీరము, మనస్సు గానివారమని భావింతురో వారిని గూర్చి.
ప్రతి సంప్రదాయంలో ఇటువంటి మనుష్యులున్నారు. మాటలు వేరై ఉండచ్చు కానీ వాటి అర్థము ఒకటే. బుద్ధుడు అహంకారం జ్ఞానానికి చిహ్నం అని ఎన్నడూ అనలేదు. జీసస్ "దంభం ఉన్నవారు అదృష్టవంతులు" అని ఎప్పుడూ అనలేదు. ఈ 5 శ్లోకాలలో చెప్పబడిన గుణాలు నిజమైన జ్ఞానులకు చెందినవి. ఎక్కడైతే స్త్రీగాని పురుషుడు గాని ఆత్మ సాక్షాత్కారం చేసుకొంటారో ఈ గుణాలు వలనే. అవి దేశకాల, సంస్కృతులకు అతీతం.
ఇవి ఉత్తేజ పరిచే సద్గుణాల జాబితా మాత్రమే కావు. ఇవి విత్తనాల జాబితా: ఒక్కొక్క గుణాన్ని పండించి వైరాగ్యం పొందవచ్చు. అవి విత్తనము మరియు ఫలం. వాటిని పాతి, పెంచితే అవి పెద్దవై మనోక్షేత్రంలో వ్యాపించి, జీవితాంతం సరిపోయే పంటను ఇస్తాయి.
ఈ గుణాలు ఒకదానితో ఒకటి సంభందం ఉన్నవి. నా దృష్టిలో ఈ శ్లోక సారాంశం క్షమ. ఎవరైతే క్షమని -- మాటాలతోనే కాక హృదయంతో -- ఎలా ఇవ్వాలో తెలుసుకొంటే వారు ఎక్కడైనా సామరస్యంతో పని చేస్తారు. వారికెట్టి భయం ఉండదు. ఇదేమి పెద్ద రహస్యం కాదు. చిన్నపాటి అహంకారం. దానిలోంచి వైరాగ్యమనే సద్గుణం వస్తుంది.
మొదట నిగర్వము. శ్రీకృష్ణుడు దానిని పొగరు లేకుండుట అని చెప్పాడు. నాకు తెలీని విషయమేమిటంటే గర్వాన్ని పటుత్వం గాను, వినయాన్ని బలహీనంగాను చూస్తారు. అందరికీ గర్వం బలహీనపరుస్తుందని తెలుసు. గర్వమంటే కాఠిన్యం. మానవ సంభందాలలో అగాధమైన వేర్పాటు మనకున్న అభిప్రాయాలు, విలువలు వలన కాదు. ఒక్క గర్వం వలనే. ఏ పక్షము మొదటి అడుగు వేయడానికి ముందుకు రాదు. ఎవరికైతే భద్రత, బలము ఉన్నాయో గర్వాన్ని వీడి రాజీకై ముందడుగే గాక లెక్కలేనన్ని అడుగులు వేయవచ్చు.
ఇక్కడ అహింసతో సంబంధం ఉంది. అహింస అనగా హింస చేయకుండా ఉండడము మాత్రమే కాదు. అది ఒక తత్వం. మన మనస్సులో క్రోధం లేకుండా చేసుకొనుట. అనుభవంలో క్రోధాన్ని దయగా, జాలిగా మార్చుకోవడం.
అహింస మన సహజ స్థితి. అది ఒక సారమైన భూమి వంటిది. దానిలో దయ అనే విత్తనాలు వేయనక్కరలేదు. మంచి మాటలు, క్రియలు దానిలోంచి సహజంగా వస్తాయి. కానీ క్షేత్రం స్వార్థంతో నిండిపోయింది. స్వార్థ పూరిత, లోభముతో కూడిన నడత, మనమెప్పుడైతే అధికులమనుకొన్నామో, అప్పుడు వస్తుంది. స్వార్థమనే కలుపు మొక్కలను తీసేస్తే భద్రత, తృప్తి పెరుగుతాయి. అది ఏదో బాహ్య శక్తి వలన కాదు. మనలో సహజంగా ఉన్న దయ వలన. అలాగే రాక్షస దంతాలను నాటితే విరోధము మొలకెత్తుతుంది. ఇటువంటి తోట వలన పర్యావసానము జీసన్ కి రాలేదా? ఎక్కడైతే ఒక దంతం పడిందో దానినుంచి సైనికులు యుద్ధానికై ఆవిర్భవించేరు. ఇది నమ్మశక్యం కానిదవవచ్చు. కానీ ఇది మనం రోజూ పత్రికలలో చదివే హింసను గూర్చి చెప్పేది అక్షరాలా నిజం.
హింసపూరిత భావనలు ఒక గొలుసులా ప్రతిస్పందిస్తాయి. ఒకరోజు నా మిత్రుడు మూకా అనబడే నా కుక్కను చూస్తున్నాడు. మూకా ప్రక్కింటివాళ్ళ పిల్లిని చూస్తున్నది. ఆ పిల్లి ఒక పక్షుల గుంపును చూస్తున్నది. పిల్లి సహజంగా ఆ పక్షుల వైపు దూకింది. మూకా వెంటనే పిల్లి మీదకు దూకింది. నా మిత్రుడు మూకా వెనక పడ్డాడు. ఇదే మన జీవితంలో జరిగేవి. మనని ఆఫీసులో ఎవరైనా అవమానిస్తే, మనతో ఇంట్లో సహజీవనం చేసే వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాo. వాళ్ళు తక్కినవాళ్ళ మీద రోషంగా ఉంటారు. ఇది ఒక వ్యష్టికి మాత్రమే చెందదు. ప్రపంచ దేశాలుకూడా ఇలాగే ప్రవర్తిస్తాయి.
చాలా ఏళ్ల క్రిందట టివి లో ఒక వ్యక్తి గొలుసుకట్టును చూపించేడు. అతడు ఒక గదిని ఎలకలను పట్టే స్ప్రింగ్ లతో (mouse trap) నింపేడు. ఎప్పుడైతే ఆ స్ప్రింగ్ ని కదిలిస్తామో అది రెండు బంతులను విసురుతుంది. ఒక పలక మీద ఎలా ఒక యురేణియం కణాన్ని ఒక న్యూట్రాన్ పరమాణువు తాకితే రెండు న్యూట్రాన్లు వస్తాయో వివరించేడు. ప్రకటించకుండా ఒక బంతిని స్ప్రింగ్ మీద వేసేడు. ఆ స్ప్రింగ్ నుండి 2 బంతులు విడిపించుకొని తక్కిన స్ప్రింగ్ ల మీద పడాయి. వాటినుంచ్చ 4 బంతులు ఎగిరేయి. ఇలాగ అవి వ్యాపిస్తే గదంతా ఎగురుతున్న బంతులతో నిండి పోయింది.
మన ప్రపంచం అలాగే ఉందనడం అతిశయోక్తి కాదు. ఒకడు చాలా కాలం క్రోధ పూరితుడై తన క్రోధాన్ని నలువైపులా వ్యాపింపజేస్తాడు. ఎప్పుడైతే చాలా మంది క్రోధంతో, ద్వేషంతో , అసహనంతో , వైరంతో ఉంటారో, హింస పెరుగుతుంది . అది మన హృదయాల్లో , ఇళ్ళల్లో , వీధుల్లో , నగరాల్లో, వివాదంతో ఉన్న జాతుల్లో , ముఠాలలో, దేశాలలో విలయ తాండవం చేస్తుంది.
వైరాగ్యం ఈ గొలుసుకట్టును నివారిస్తుంది. ఒక పిల్లి సహజంగా పక్షులపైకి గెంతుతుంది. దానికి తెలిసిందంతా అదే. మూకా అనబడే నా కుక్క పిల్లి వెనక పడడం దాని సహజ గుణం. కాని మనుష్యులకు తమ ప్రతిక్రియను నియంత్రించుకొనే శక్తి ఉంది. మన స్పందన-ప్రతిస్పందన అనే గొలుసుకట్టును నివారించవచ్చు. ఎలాగంటే అసహ్యన్ని ఓర్పుతో, ద్వేషాన్ని దయతో , భయాన్ని నమ్మికతో విశ్వసనీయంగా, నియమంగా పాటిస్తే పెరుగుతున్న హింసను అరికట్టవచ్చు.
ధ్యానంతో మన మనస్సును కుదుట పరచుకొంటే స్వార్థం తగ్గి, వైరాగ్యం వచ్చి మన దృక్పథం మారుతుంది. అప్పుడే మనం క్షమించడానికి ఉన్న అవరోధాలు ఏవో సైద్ధాంతిక, తత్వజ్ఞానం వలన కాదని తెలుస్తుంది. అవరోధాలు మన స్వార్థం, అహంకారం, ఇతరులమీద ప్రదర్శిస్తే వాళ్ళు మనమీద కూడా ఆదేరీతి స్పందిస్తే వచ్చేవి. దీన్ని సరిగా భావన చేస్తే క్షమను పెంపొందిచ్చవచ్చు. వోల్టైర్ ఇల్లా చెప్పేరు: "అందరినీ అర్థం చేసుకోవడమంటే వారిని క్షమించడమే". మనకు మరింత పదునైన చూపు ఉండాలి. అది మన పట్టుదల. పరిస్థితులు ప్రకోపించినప్పుడు శాంతంగా ఉండడానికి ఎంతో ఆత్మస్థైర్యము అవసరము. ఎప్పుడూ మన సమత్వాన్ని కోల్పోక, దురుసు మాటలాడక ఉండాలి. అలా చేస్తే ఒక అద్భుతం మనందరి అనుభవానికి వస్తుంది. మన ప్రత్యర్థి శాంతిస్తాడు. అతని కళ్ళు తేట అవుతాయి. మళ్ళీ సఖ్యత పెరుగుతుంది.
నూతన నాగరీకతలో క్రోధం ఒక మంచి సంస్కారంలా చిత్రీకరింప పబడినది. మంచి సంస్కారం అనగా మంచి సంబంధం. అది నిజం కాదు. క్రోధం బంధాలను త్రెంచుతుంది. మానవుల మధ్య అగాధం ఏర్పడిస్తుంది. బంధాలను నాశనం చేస్తుంది. "నీవంటే నాకు లెక్కలేదు" అని చెపుతుంది. "నువ్వు గౌరవింపబడే వ్యక్తి కాదు" అని అంటుంది. సంభాషణ ఒకే ఒక్క విధానంగా చేయగలం. అది ఓర్పు, సహనం ద్వారా. వానివలన మన మనస్సులో గాయాలేర్పడవచ్చు. నిజానికి గాయాలు ఏర్పడుతాయి. మన సహనాన్ని పరీక్షిస్తుంది. అందువలననే ఆధ్యాత్మిక జీవితం అతి కష్టం. మనం ఎంత ఇతరులకు ఇస్తే అంతకన్నా రెట్టింపు మనకు తిరిగి వస్తుంది. జీసస్ ఈ విధముగా చెప్పెను: "ఎవ్వరికి ఉందో, వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ లేదో, వాళ్ళ కున్నది లాక్కోబడుతుంది". ఆయని శిష్యుడు "అది న్యాయం కాదు", అంటే ఆయన చిరునవ్వుతో "ఏది న్యాయం కాదు? ఆ ఎన్నిక నీ చేతిలో ఉంది" అనవచ్చు.
దీన్ని ఒకే విధంగా తెలిసికోగలం. అది ఇచ్చి-పుచ్చుకోవడమనే మన మధ్య ఉన్న బంధం. మనకి దగ్గరి వాళ్ళు మనను ప్రేరేపింపవచ్చు. మనమూ వాళ్ళను ప్రేరేపింపవచ్చు. ఇది ప్రతీ దేశంలోనూ సహజంగా జరిగేదే. ఒక మగవాడు, ఆడది భిన్నమైన విద్యాలయాలికి వెళ్ళి చదివి, భిన్న సంస్కృతిలో పెరిగి, భిన్నంగా పని, ఆట, తినడం, మాట్లాడడం, ఆలోచించడం చేసి, అప్పుడప్పుడు కలహించకపోతే అది మనము ఆహ్లాద పడవలిసిన విషయం. మన మధ్య గల వేర్వేరు గుణాలు సహనం, ఓర్పు, గౌరవం ప్రదర్శించుకోవడానికి దోహదం చేస్తాయి. దీని కన్నా నేర్చుకోవడానికి వేరొక మార్గం లేదు.
క్షమ ఎటువంటి బంధాలకైనా మూలం. ముఖ్యంగా ప్రేమించడానికి. ఇద్దరు ప్రేమించుకున్నారనుకుందాం. ఒకరు తప్పు చేస్తే "నేనూ అదే చేస్తాను. చెల్లుకు చెల్లు" అని మరొకరు అనరు. ఒకరిమీదవొకరికి గౌరవం తగ్గదు. ఆ సమయంలో ప్రేమికునికి చేయూతవనివ్వాలి. అంతేగానీ వానిని కించ పరచకూడదు. వానిని తప్పును అధిగమించేలా చేసి, మానసికంగా ఎదగడానికి ప్రోత్సాహించాలి. ఇది ఒక కళ. ఇది ఒకని నడవడిపై తీర్పు లేదా అసహ్యం పడవలసిన విషయం కాదు. అంటే మన అహంకారాన్ని పూర్తిగా లేకుండా చేయాలి. మనలో చాలామంది లోతుగా ఆలోచింపక, ఉన్నత జ్ఞానం లేక, బంధం చెడితే దానినుంచి విముక్తిని కోరుకొంటారు. దీని గురించి దుఃఖించ నవసరము లేదు. నేను అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసాను. అలాగే నా చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా. ఇప్పడినుంచీ ధ్యానంతో మన జీవితాలను గడుపుదాం. మనం దృఢనిశ్చయంతో జావ కారకుండా ఉందాం. ఎక్కడైతే ద్వేషం, విరోధం, పగ చూపించేమో ఇప్పుడు ప్రేమ, గౌరవం చూపిద్దాం.
మనం పరిపూర్ణితను కోరనక్కరలేదు. రోబర్ట్ బ్రౌనింగ్ ఒక గొప్ప ఉపమానము చెబుతూ ఇలా అన్నారు: "మనం అర్థచంద్రాకృతి గీస్తే చాలు, పరమాత్ముడు దాన్ని పూర్ణ వృత్తాన్ని చేస్తాడు. అతడు మనముంటున్న క్లిష్ట పరిస్తితులను పరిగణలోకి తీసికొంటాడు. పత్రికల్లో తరచూ కామం , డబ్బు గురించి వ్రాస్తున్నారు. ప్రపంచమంతా అర్థంలేని ఉన్మాదంతో నిండి ఉన్నది. ఆయన మన దేశ, సాంస్కృతిక, భౌతిక లేదా బుద్ధి కున్న లోటుపాటులను అర్థంచేసికొని ఇలా అంటాడు: ఇతరుల గురించి నువ్వు వీలయినంత మంచి చెయ్యి. అందరి పురోగతికై పాటు పడు. నువ్వది చేయగలిగితే నువ్వు ఐక్యతకు, సామరస్యానికి, శాంతికి ఒక గొప్ప శక్తి అవుతావు." "
పరమాత్మ మనను గాఢంగా ప్రేమిస్తాడు. ఆయనకు ఎనలేని దయ, క్షమ ఉన్నాయి. ఆయన ప్రేమ ఎంతవరకంటే మనం ఇతరులను ప్రేమించినంత. దీనిలో ఎటువంటి చిత్రం లేదు. నేను ఒకరిని క్షమించినపుడు నా మనస్సులోని అంతర్గత ప్రపంచంలో చాలా నిజంగా అనిపించి నా బాధలను మరచిపోతాను. దానివలన నా నరాల వ్యవస్తకు, ముఖ్య ఆవయవాలకి మంచి జరుగుతుంది. పురాతన భాషలో చెప్పాలంటే నాపై దైవ కృప ఉన్నది. కోపం అనేకమైన శారీరక బాధలను కలుగజేస్తుంది. క్షమ బాధలను ఉపశమనం చేస్తుంది. అవి మానసిక బాధలవ్వచ్చు లేదా శారీరకమైనవి కావచ్చు.
ఒకరోజు నేను బెర్క్ లీ దగ్గర కార్ పార్ కింగ్ చేసి వస్తూ వుంటే పూర్వపు రాజ కోటల దగ్గర ఉండే పెద్దపెద్ద మేకులవంటి ఇనుప శలాకలు నేల మీదు కనిపించేయి. అక్కడ ఒక సూచన ఉంది: "ఇక్కడ ప్రవేశించ వద్దు. టైర్ లు నాశనమవుతాయి". ఆ శలాకలు చూస్తూ ఉంటే టైర్ లు పచ్చడి అవుతాయి. మనలో కూడా ఇటువంటి సూచన ఉంది: "స్వార్థంతో బ్రతుకకు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా కష్టాలను అనుభవించవలసి వస్తుంది." జీసస్ మరియు శ్రీకృష్ణుడు మనకు "ఇతరులపై పగ తీర్చుకో వద్దు. ఇతరులను దూషణ చేయవద్దు" అని బోధ చేయడం ఏదో మతమునకు పరిమితం కాదు. అవి సజీవ సిద్ధాంతాలు. నిర్దయమైన ఆలోచనలు, మాటలు, నడవడిక వలన మనకే అమిత నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడైతే మీరు బద్ద శత్రువును క్షమిస్తారో అది మీ బంధాన్ని పునః నిర్మాణము చేయడానికి తోడ్పడుతుంది . దానితో బాటు మీలో పేరుకుపోయిన క్రోధం, వైరం సమసిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. నన్ను అడుగుతూ వుంటారు: "నేను వేరే వారి స్వస్థత కై ప్రార్ధిస్తే అది పని చేస్తుందా?" నా సమాధానం: "అది పరులకు ఎంత ఉపయోగకరమో నాకు తెలీదు. కానీ నీకు మాత్రం చాలా ఉపయోగ పడుతుంది."
ఇది శ్రీకృష్ణుడు మంచి జ్ఞానం అని అంటాడు : మన మధ్య ఎన్నో భేదాలు ఉన్నా దేవుని అందరిలోనీ చూడాలి. దేవుడుని తెలుసుకోవాలంటే కష్టాల నెదుర్కొని అతనిలా మార్పు చెందాలి. జీసస్ ను తెలిసికోవాలంటే అతనిలాగ నిగర్వముతో ఉండాలి. ఆయన శిలువ మీద నుండి శత్రువులను క్షమించేడు. మనకు ఎలా జీవించాలో చెప్పడానికి తన జీవితాన్ని దారపోసేడు. ఎలాగంటే తెలివిగా, సహనంతో, అందరి సౌఖ్యం గురించి. ఆయన్ని గౌర వించడానికి పరిమితులు లేవు. మనని మనమే ఆయనకు శిష్యులుగా చేసికోవాలి. అలాగ మన అనుబంధాలలో క్షమ అనే ఉన్నత గుణాన్ని ప్రదర్శించాలి. ఆయన అన్నట్టు: "తండ్రీ , వారిని క్షమించు. ఎందుకంటే వారేమి చేస్తున్నారో వారికి తెలీదు." 71
No comments:
Post a Comment