14.10
లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహో
{14.12}
రజస్యేతాని జాయ౦తే వివృద్ధే భారతర్షభ
అర్జునా! రజోగుణము వృద్ధి బొందినపుడు లోభము, వ్యాపారము, కార్యారంభము, అశాంతి, ఆశ మొదలగునవి కలుగును ఀ
ఆత్మ యొక్క కాంతి నలుదిక్కుల వ్యాప్తి చెందకుండుట దేనివలన ? మనకు ప్రేమ పూరిత సంబంధాలు లేకుండుటకు కారణమేమిటి? శ్రీకృష్ణుడు దానికి కారణము రజస్ అని చెప్పుచున్నాడు. రజస్ యొక్క మొదటి చిహ్నం ఆశ.
రాజసికునికి ఉద్రేకం ఎక్కువ. కఅది స్వాధీనంలో ఉండదు. అది కోపం, భయం, ఆశ మొదలగువానిగా వ్యక్తమవుతుంది. అతడు ఎక్కడికి వెళ్ళినా "దీని వలన నాకేమి లాభం?" అని తనను తాను ప్రశ్నించుకొంటాడు. అతడు అందమైన అడవిని చూస్తే, అక్కడి చెట్లను నరికి అమ్మబోతాడు. ఒక సుందరమైన పచ్చిక చూస్తే దానిమీద ఇళ్ళు కట్టాలని తలుస్తాడు. అలాగే చేపల గుంపును చూస్తే వాటిని వల వేసి పట్టదలచుకొంటాడు. ఇటువంటి ఆలోచనలే మన పర్యావరణాన్ని కాలుష్యంతో నింపుతున్నాయి. గాంధీ చెప్పేరు "ప్రపంచంలో అందరినీ తృప్తి పరిచే వనరులు వున్నాయి. కానీ అందరి ఆశలు నింపేటన్ని లేవు. " భారత దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే షర్టు మీద ఒక బత్తాయి ఎక్కువుంటే మీరొక దొంగ. ఎందుకంటే అది వేరొకని చొక్కా మీదవాడవచ్చు. సంపన్న దేశాలలో ఇటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ తాహతుకు తగినట్టు బ్రతకవచ్చు. మన జీవితాన్ని సుఖమయం చేయాలంటే సమయం, శక్తిని వెచ్చించి వస్తువులను సేకరించడం మానుకోవాలి. ఎందుకంటే వాటిని తయారు చేయడ౦వలన పర్యావరణంలో కాలుష్యం పెంచడం, భూమిని తవ్వి వనరులను వాడడం జరుగుతున్నాది.
ఆశ భయానకమైన, సులభంగా వదలని జిగట. అది మనను దేనికైనా మనకు తెలీకుండా అతికిస్తుంది.
వాహనాలను చూడండి. నేను వాటికి వ్యతిరేకిని కాను. అవి అవసరమైన క్రియలు చేస్తాయి. కాని మనకి ఇంకా ఎక్కువ క్రియలను చేయాలనే ఆశ ఉంటే వాటికి బంకలా అతుక్కుపోతాం. అవిలేకుండా జీవితం లేదనిపిస్తుంది. వాటి గురించి మన జీవన శైలిని మార్చుకుంటాం. పట్టణాలను వాటికి అనుగుణంగా మార్చుతాము. అవి అలా పెరిగి, పెరిగి, ఇంకా ఎక్కువ వేగం, శర వేగంగా నడవాలని ఆశ పడతాం. ఏ వస్తువు లోపాలు లేకుండా ఉండదు. అలాగే వాహనాలు కూడా. కానీ బంకలా వాటినంటిపెట్టుకుంటే "వీటి వలన అయే ఖర్చు సమంజసమా?" అని అడగం. ప్రతి ఏడాది వాహనాల సంఖ్య పెరగాలా? శర వేగంగా వెళ్ళే వాహనాల గురించి రహదారులను నిర్మించాలా? దానికయ్యే ఖర్చు కాలుష్యం, దుఃఖం. అమెరికాలో వాహనాల వలన ఏడాదికి 50 వేలమంది మరణిస్తున్నారు. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం వాటి వలన ప్రభావితమై ఎనలేని ఖర్చు కలిగిస్తున్నాయి.
ఒక దేశ పురోగతిని అక్కడ ఉన్న వాహనాల సంఖ్యతో ముడి పెడతాము. అరటి పళ్ళ సంఖ్యతో ఎందుకు ముడిపెట్టలేము? మనం వాహనాలకు ఎంత అతుక్కుపోయామంటే అవి లేక మానవాళి బ్రతకలేదనుకొంటాము. వాహనాలు అవసరమే. కానీ వాటికి మన సంస్కృతి తో సంబంధంలేదు.
కాలిఫోర్నియా లో కార్ల సంఖ్య కోట్లలో ఉంది. ఇది విచారించవలసిన విషయం. నేను సాన్ ఫ్రాన్కిస్ కో కి వాహనంలో వెళ్తున్నప్పుడు చాలా వాహనలలో నడిపేవాడు తప్ప ఇంకెవరూ ఉండరు. 75 శాతం వాహనాలు ఖాళీగా వెళ్తాయి. మనం ఒకే ఆఫీస్ లో పనిచేసి, ఒకే నివాసనా స్థలంలో ఉండి, ఒకే సమయానికి వెళ్ళి వస్తూ ఉంటే, మనకు రెండు వాహనాలు అవసరమా?
నాకు కొంచెం ఊరట కలిగించే విషయం వాహనాలను పూల్ చేయడం. ఒకే నివాస స్థలంలో ఉన్నవారు వాహనాలను పూల్ చేసికొని, ఒక ఐదు, పది నిమిషాలు ఆలస్యమైనా సద్దుకుంటున్నారు.
రజస్ వలన మనం సవా లక్ష పనులు నెత్తిన వేసికొంటాం. దాని వలన పెద్ద వ్యూహరచన జరుగుతుంది. అలాగే ప్రాణం వృధా అవుతుంది. మనం పెద్ద ఊహలతో కర్మ మొదలు పెట్టినంతలోనే నిరుత్సాహం ఆవరిస్తుంది. వాని ఉత్సాహం కొంతమటుకే . ఉత్సాహం పోతే మనం మొదలెట్టిన క్రియను అక్కరకు రానిదిగా చూస్తాము. దానిలోని అనుకోని అనేకమైన చిన్న చిన్న వివరాలను తలచుకొంటే నిరుత్సాహం రెట్టింపు అవుతుంది. ఆ ఊహ మారలేదు. కానీ ప్రాణ శక్తి వ్యయమయింది. మనము ఏ కార్య మైతే ఇష్టమనుకొంటామో, దానిలో ఇష్టత అనే అంశం మనల్ని బంకలాగ పట్టుకొని ఉండి కాదు. మనలోని ప్రాణ శక్తి మన ఇష్టాయిష్టాలను నిర్ణయిస్తుంది. రజస్ ప్రాణ శక్తిని దొంగిలించి పరారవుతుంది. తమస్ దాని స్థానంలో వచ్చి కూర్చుంటుంది.
ఎవరైతే క్షణిక ఆవేశానికి గురి అవుతారో వారు జీవితంలో ఏమీ సాధించలేరని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వాళ్ళకి క్రియలు కొనసాగించుటకు పట్టు లేదు. చాలా మందికి ఉత్సాహంతో, పట్టుతో క్రియలు చేయడానికి కావలిసిన ప్రాణ శక్తి ఉంది. క్రియ చేసినంత మాత్రాన కార్యం సాధించినట్టు కాదు అని గీత చెప్పుచున్నది. పనులు మొదలెట్టినంత మాత్రాన లాభంలేదు. వాటిని సాధించుటకై ప్రయత్నము చేయాలి. ఇది ఆధ్యాత్మిక క్రియలకే పరిమితం కాదు. జీవితం సార్థకం చేసికోవడానికి మొదలుపెట్టిన పనులన్నీ సాధించాలి. ఒక శాస్త్రజ్ఞుడు, లేక కళాకారుడు కి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక క్రియని మొదలపెట్టిన తరువాత దానిని చివరి వరకు అంటి పెట్టుకొని ఉంటారు. అది లేకపోతే మన జీవితం అతలాకుతలం అవుతు౦ది దున్నని పొలంలో విత్తనాలు వేస్తే ఎలా పెరగవో, అలాగే మన కర్మలకు ఫలము రాదు.
ప్రస్తుత ప్రపంచంలో వ్యాకులత చాలా ఉంది. ఇది పూర్తిగా చెడ్డది కాదు. ధ్యానము చేయవలెనను నిశ్చయము కలగడానికి చిహ్నం. ఎప్పుడు మనము వ్యాకులతతో ఉంటామో అప్పుడు మన శక్తి వృద్ధిచెందుతుంది. మనము ఆ శక్తిని ఎక్కడిపడితే అక్కడికి వెళ్ళి, ఖండతారాలకు వెళ్ళి, ప్రమాదకరమైన క్రియలు చేస్తూ వృధా చేయకూడదు.
యువకులు మిక్కిలి శక్తి వ్యాకులతతో నిండియుండి, ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఉదాహరణకు: హాంగ్ గ్లైడింగ్ , సర్ ఫింగ్, పర్వతాలు ఎక్కడం, వొంటరిగా విమానాన్ని నడపడం. వారికి ధనార్జన లేదా తమ స్థితిని పెంపొందించికొనుటకు మక్కువలేదు. వాళ్ళకు కావలసింది జీవితంలో సవాలు. ప్రపంచంలో తక్కిన వారు ఏమి చేస్తున్నారో వాళ్ళు పట్టించుకోరు. అందువలన వారు తమకి, ఇతరులకి చాలా ఇబ్బంది కలిగిస్తారు. ఇదంతా తమకున్న శక్తి వలనే. అలా౦టి వాళ్ళు ధ్యానం చేయడానికి అర్హులు.
ధ్యాన౦లో ప్రవేశించుటకు రెండు ప్రశ్నలుగల పరీక్ష ఉంది: ఒకటి మీకు తగినంత శక్తి ఉందా? రెండు, మీకు వ్యాకులత వలన ఏదీ సంతృప్తి నివ్వదా? ఆ రెండు ప్రశ్నలకూ అవునని సమాధానము ఇస్తే వారు ధ్యానానికి అర్హులు. ఆ రెండూ ఫలవంతమైనవి. అధికమైన వ్యాకులత, శక్తులవలన ఏమైనా సాధించవచ్చు.
ఆధ్యాత్మిక గురువులలో కొందరు మాత్రమే ఆశ మంచిదే అంటారు. నేనూ ఆ కోవకు చెందినవాడినే. ఆశ శక్తికి కారణము. శక్తి చెడ్డది కాదు, మంచిదీ కాదు. మంచిచెడ్డలు ఆ శక్తిని వినియోగించడంలో ఉంది.
దృఢమైన ఆశకు మనము లొంగి అయినా ఉండాలి లేదా దానిని అణచుకోవాలి. దానికి లొంగితే సంతోషం కలుగుతుంది. అణచుకుంటే దాని పర్యావసానము ఎంత దూరం వెళుతుందంటే మన మానసిక వ్యవస్థ దెబ్బ తినేవారకు. గీత మూడవ మార్గమున్నదని చూపుతున్నది. ఒక దృఢమైన ఆశ వలన మన మనస్సు వ్యాకులత చెందుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, శరీర గ్రంధులలో మార్పులు వస్తాయి. ఆ ఆశను సాధించుకోడానికి ప్రతి అణువు స్పందిస్తుంది. శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా ఒక ప్రశ్న అడుగుతాడు: "నీవు సాహసించగలవా?" మీ సమాధానము "తరువాత మాట్లాడండి". ఆయన ఇలా బోధిస్తారు: "ఎవరైనా సుఖాన్ని కాంక్షిస్తారు. దానిలో సవాలు ఏముంది? నీవు బలవంతుడిననుకుంటే దానిని నియంత్రించు" ఒక వాహనంతో పోటీ పడుతున్నప్పుడు, ఇంధనం అయిపోయే వరకు వేచి చూడకూడదు. అది అణచివేయడం. ఇంధనాన్ని ఉపయోగించి ముందుకు సాగాలి. నేను చెప్పే ఆశని పరివర్తించటమంటే ఇదే.
గాఢమైన కోర్కె ఉన్నవారు ధ్యానంలో పండుతారు. నేను ధనార్జన చేయాలనే మిక్కిలి కోర్కె ఉన్నవారిని "రండి, నాతో ధ్యానం చేయండి" అని ఆహ్వానిస్తాను. వారు చేయవలసినది, మనస్సుని ధనార్జన నుండి విడదీసి, ధ్యానం చేయడమే. దానికో పద్దతి ఉంది. అది లైంగిక కామం అవ్వచ్చు లేదా దృఢమైన సంకల్పమవ్వచ్చు. ప్రతి కోర్కెను ఆధ్యాత్మికతతో అనుసంధానము చేయవచ్చు. 143
No comments:
Post a Comment