14.11
అప్రకాశో అపవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ
{14.13}
తమస్యేతాని జాయ౦తే వివృద్ధే కురునందన
అర్జునా! తమోగుణము వృద్ధి చెందినపుడు అవివేకము, సోమరితనము, ప్రమాదము, మోహములు కలుగును ఀ
శ్రీకృష్ణుడు తమస్ ని ఇంకా వివరిస్తున్నాడు. తమస్ ను అప్రకాశ అని వర్ణించేడు. ప్రకాశమనగా ధగధగ మెరిసే చర్మము, దేదీప్యమానమైన కళ్ళు, డోలాయమాన పలుకు, మొత్తానికి నిస్వార్థమైన శక్తితో వెలుగుతున్న శరీరం. అట్టివాడు తప్పకుండా జీవిస్తూ, ఎటువంటి విఘ్నాన్ని అయినా దాటగల సమర్థత గలవాడు. అప్రకాశ అంటే తమస్. తామసికుని కళ్ళు కాంతి విహీనమై ఉండును. వాటిని తెరిచి ఉంచుటకు శ్రమ పడతాడు. ప్రేమ అనే కాంతి ప్రసరించిన, చర్మము కాంతివంతముగా ఉండును.
భౌతికంగా కూడా తమస్ మనను కురూపిగా చేస్తుంది. యుక్తవయసులో మన శరీరము ధృఢంగా ఉండి, మంచి ఆహారము తీసికొన్న భౌతిక రూపంలోని తామసికమును కప్పివేయవచ్చు. ఆ తరువాత శరీరము మందగించును. తామసికుడు సుఖాలలో ఓలలాడి కళ్ళు, చర్మము, నోరులకున్న సహజమైన ప్రకాశమును పోగొట్టుకొంటాడు.
రెండవది అప్రవృత్తి అనగా స్తబ్ది. తామసికుని ఎందుకు ఇతరుల పురోగతికై సహకరించవని అడిగిన "నేనెందుకు చేయాలి? నా పురోగతినే నేను చేయుటలేదు" అని సమాధాన మిస్తాడు. తామసికుడు నిష్పక్షపాతి. ఎవరి గురించి పట్టించుకోడు.
కాని ఇది మంచిది కాదు. డాక్టర్ సెల్యే చెప్పేరు కర్మ చేయడం పుట్టుక ఉన్న ప్రతి జీవికీ వర్తిస్తుంది. అంటే ఏ జీవి పూర్తిగా తమస్ చే బంధింపబడడు. తనకు ఇష్ట౦ ఉన్నప్పుడు తామసికుడు గంటలపాటు తన పాటల రికార్డులను సద్దుతాడు, పేకాట ఆడుతాడు, లేదా పత్రికలను తిరగేస్తాడు. తన పట్టుదల పెరిగితే తామసికుడు నిద్రాహారాలు మాని పని చేస్తాడు. మనందరికీ కష్టపడి పనిచేయడమంటే ఏమిటో తెలుసు. మనం చేయవలసినది గూఢంగా ఉన్న శక్తిని మేల్కొలిపి, దానిని ఉపయోగించుకొంటూ, అసంగత్వంగా ఉండడం.
మూడవది ప్రమాద అనగా మనఃపూర్వకత లేకపోవడం. మనకందరికీ ఉత్సాహపూరితుడైన, మనస్పూర్తిగా కర్మలను చేయువాడు ఇష్టము. ఇతరులను పరిశీలించుట ఆధ్యాత్మిక జీవనానికి మంచిది. తమస్ దానికి వ్యతిరేకం. తామసికుడు చిత్రలేఖనం ఇష్టపడితే, రంగులు వేస్తాడే గాని వానిని సరిదిద్దడు. తోట పని చేస్తాడుగాని మొక్క నాటడానికి నేల త్రవ్వాలంటే బద్దకిస్తాడు.
మనస్పూర్తిని కలుగజేసుకోవచ్చు. నాకు సహజంగా మనఃపూర్వకత ఉన్నవానికన్న, మనఃపూర్వకతను కలుగుజేసుకున్న తామసికుడు ఇష్టము.
చివరిగా మోహ౦ అనగా కామము. తామసికుడు సులభంగా మోహితుడవుతాడు. ఏలనగా వాని బుద్ధి పనిచేయక, ప్రతి చిన్న విషయము వాని మనస్సును ఆకర్షిస్తుంది. ఒక పిల్లవాడు వీడియో గేమ్ ఆడుతుంటే చూసి అతుక్కుపోతాడు. తనూ వాటిని ఆడుతూ ఉంటాడు. అతను కొత్త వస్తువులను చూచి ఆకర్షింపబడతాడు.
ప్రతిఒక్కరికి ఇది అనుభవంలో ఉంది. కొన్ని సంవత్సరాల క్రింద సాన్ ఫ్రాన్కిస్ కో నగరం గర్వంగా శృంగారానికి సంబంధించిన వేడుక చేసింది. దానిని చూడడానికి నాగరికులు, చదువుకున్నవారు, స్త్రీలు, వారి విక్టోరియన్ చరిత్ర మరచి , కోకొల్లలుగా వచ్చేరు. అలాగే ఒకమారు శవ పేటికల (coffin) వేడుక జరిగింది. ఒక పేటిక కారు ఆకారంలో ఉంది. అలాగే జీన్స్ , వైన్ సీసాలను తెరిచే కార్క స్క్రూ, మద్యానికి వాడే క్యాన్ లు, బ్రెడ్ తో చేసిన ఆకారాలు, చాకలేట్ ను చుట్టిఉన్న కాగితాలు, బటన్లు గురించి వేడుకలు జరిగేయి. ఇవి అవివేకుల క్రియలు. మోహము మంచువలే ఆవహించిన, ఇట్టి కార్యాలు చేస్తారు.
ప్రకటనలు మోహాన్ని ఉపయోగించుకుంటాయి. రాజసికుడు ప్రకటనలు ఇస్తాడు, తామసికుడు వాని వలలో పడతాడు. తనకు ప్రమాదకరమని తెలిసినా ప్రకటనల వలన మోహితుడై ఒక వస్తువును కొంటాడు. ఎమర్సన్ చెప్పినట్లు అతడు సులభంగా మోసపోతాడు. రాజసికుడు "నువ్వు సుఖంగా ఉండ దలచుకున్నావా?" అని అడుగుతాడు. తామసికుడు "తప్పకుండా. దానికి నేనేమైనా చేయాలా?" అని అడుగుతాడు. "అయితే దీన్ని నోటిలో పెట్టుకొని ఆనందించు" అంటాడు రాజసికుడు. సాత్వికుడు "వాడికి దానివలన కలిగే నష్టం చెప్పు. సుఖాలతో జీవించి, బాధతో చావడం వంటిది" అని చెప్తాడు.
తామసికుడు ఎవరికీ ఉపయోగ౦లేని చిన్న చిన్న పనులు చేస్తాడు. కాని చేయగా చేయగా ఈ చిన్న పనులు పెద్దవిగా కనిపిస్తాయి. అతడు ఆ పనులు చేయడంలో నిమగ్న మవుతాడు. అవి ప్రమాదకరమైనవి కాకపోయినా, వాని అంతరాత్మ ఇలా చెప్తుంది "నాకు లెక్క లేదు. అవతలి వారికి ఏమైతే నాకేం? నాకేమైనా పట్టించుకోను. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను."
సాత్వికుడు "వాటికి అసంగత్వంగా ఉండు" అని చెప్తాడు. మనం వైరాగ్యం చెందుతున్నకొద్దీ జీవితం దృష్టిలోకి వస్తుంది. వీడియో గేమ్ లు, వ్యాపకాలు, ప్రపంచంలో కోట్ల మందిని ఎంతో కొ౦త సహాయపడడంతో పోలిక పెడితే, అతి చిన్నవిగా కనిపిస్తాయి. మన జీవితం, కర్మలు వాటిచే నిర్దేశింపబడును. 145
No comments:
Post a Comment