Thursday, March 10, 2022

Chapter 14 Section 7

14.7

సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత

జ్ఞాన మావ్రుత్య తు తమః ప్రమాదే సంజయత్యుత {14.9}

భారతా! సత్త్వ గుణము సుఖములో జీవుని ప్రవర్తింపజేయును. రజోగుణము కర్మలలోనికి నెట్టును. తమోగుణము జ్ఞానము నావరించి జీవుని ప్రమాదమున ముంచును

ఏ విషయానికైనా మన స్పందన యాంత్రికము. ధనము వచ్చిన మనము దాని వ్యామోహములో అనాలోచితంగా పడతాము. సుఖం దానికన్నాఎక్కువగా ఆకర్షిస్తుంది. పేదవాడు, ధనవంతుడు అని తేడాలేక వాటిచే ఆకర్షింపబడతారు. మనం "నేను తీసికోవచ్చు లేదా వదిలేయవచ్చు" అనుకోవచ్చు. కానీ ధన-సుఖాలకు వేరే మార్గముంది.

మనము ధ్యానం మొదలుపెట్టిన తరువాత, సుఖం వచ్చి మనను తనవైపు లాగుకొ౦టే, అప్రయత్నంగా మనము దానివైపు వెళదామనుకున్నా, వెళ్లము. దానికి కోపంవస్తుంది. సుఖము ఇలా అంటుంది: "ఇది క్రికెట్ కాదు. నీవు నా వైపు రావాలి. జీవితమంటే అదే. చుట్టూ చూడు. ఎవరయినా నన్ను చూసి దూరంగా పరిగెడుతున్నారా? ప్రతి ఒక్కరు నన్ను కాంక్షిస్తారు. నేను ప్రతిఒక్కరికి మిత్రుడను." సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా తలుస్తారు: "నేను ఆకర్ష-వికర్షణలకు బద్దుడను కాను. నేను నాకు కావలసినది చేస్తాను. సుఖం నన్ను ప్రభావితం చేయలేదు".

ఎంతో ధ్యానం చేసిన పిదప, మనం తీసికొన్న నిర్ణయాలు కాకతాళీయంగా, బయట విషయాల వలన కాక, ఉన్నా, అవి వేరే గతి లేని స్పందనలు మాత్రమే. అవి నిర్ణయాలు కావు. గాఢమైన కోర్కెలు. అవి యాంత్రికంగా మన మనస్సుకు వస్తాయి. మనం వాటిని నియంత్రించాలి. మోక్షమనగా అట్టి కోర్కెలకు బానిస కాకపోవడం.

తామసికుడు, జడత్వంతో, ఇలా ఆలోచిస్తాడు: "నేను ఈ రోజు పక్క మీదే ఉంటాను". తమస్ "నేను వీడిని ఒక వేలుతో నా స్వాధీనంలోకి తీసుకొన్నాను. వీడు మంచానికి తాళ్లతో కట్టి పడేసిన వాడిలా ఉన్నాడు" అంటుంది. వాడితో "నీకు స్వతంత్రం లేదు " అంటే నమ్మడు . "చూడు నా చేయిని ఎత్త గలుగుతున్నాను. నా కాళ్ళను కదపగలను. నేను స్వతంత్రుడిని" అని అంటాడు.

మనం అడుగుతాం "అయితే పక్క మీదనుంచి ఎందుకు లేవలేక పోతున్నావు?"

"నేను తలచుకొంటే లేవగలను. కానీ నేను పక్క మీదే ఉండాలని నిర్ణయం తీసికొన్నాను"

ఒకడు ఆఫీస్ కు వచ్చి "నేనీ ఆదివారం ఊరెళుతున్నాను" అని అంటాడు. రాజసికుడు నవ్వి "వీడు మనస్సు వికల్పమైనది. నేను వాడిని ఎక్కడికైనా ప్రయాణం కట్టించగలను." ఇవి నిర్భంధమైన విషయాలు. అవి మనను కర్మ చేత బంధిస్తాయి. ఎందుకంటే మనను ఒక ధ్రుక్పధంలో బంధిస్తాయి. దీనిని శ్రద్ద అంటారు. ఒక దృఢమైన, స్థిరమైన, తిరిగి ప్రశ్నించ బడలేని, నమ్మకం బయట వస్తువేదో ఆనందాన్ని కల్గిస్తుందని అనిపిస్తుంది. అది ప్రస్తుత కాలంలోనే కాదు. సుఖమును కోరినవారు చరిత్రపుటలలో చాలా మంది ఉన్నారు. సుఖానికై ప్రతిఒక్కరు వెతుకుతారు. కానీ దాన్ని సంపూర్ణముగా పొందలేరు.

మనలో చాలామంది ఇంద్రియ సుఖము ఎక్కడో ఉందని తలుస్తాము. మన కది దొరకటం లేదని భావిస్తాము. అతి కొద్ది మందికి జ్ఞానోదయం కలుగుతుంది: "సుఖం బయటెక్కడో లేదు. నా అంతర్గతంలోనే ఉంది." ఈ విధమైన పరిపక్వమయిన జ్ఞానము సత్త్వ గుణమువలననే సాధ్యము. తద్వారా మన౦ మంచి నిర్ణయాలు చేయగలిగే శక్తిని పొందుతాము.

పరిపక్వాన్ని చాలా విధాలుగా ఊహిస్తారు. ఈనాటి మంత్రం: "నీకు బాగా అనిపించేదాని కోసమై వెళ్ళు." అంటే "ఎంత వీలయితే అంత మూర్ఖంగా వుండు." పరిపక్వతకి అసంగత్వం ఉండాలి. అదిలేని వాడు స్వార్థంతో: తన కోర్కెలు, అభిప్రాయాలు, క్రియలు గురించే ఆలోచిస్తాడు. పరిపక్వత చెందినవాడు తన ఇష్టాయిష్టాలకు అతీతుడై , సహనంతో వాటిని ఎదుర్కోగలడు.

శ్రీకృష్ణుడు "సత్త్వ౦ మనను ఆనందంలో ఓలలాడిస్తుంది" అని చెప్పేడు. అంటే మనం ప్రపంచంలో ఏదీ శాశ్వత సుఖం ఇవ్వదని తెలుసుకొంటాం. మనం మార్పు చెందని సుఖం గురించి వెదుకుతా౦. దీనివలన మనం సత్త్వాన్ని దాటి, త్రిగుణాల కతీతంగా శాశ్వతమైన స్వతంత్రం, ఆనందాన్ని పొందుతా౦.

నాకు పదేళ్ళ వయస్సులో ఆంగ్ల సాహిత్యం పరిచయం చేయబడింది. అంత మంచి కథలు, పాత్రధారులు ఉన్నారని ఊహించలేకపోయేను. నా స్కూల్ లో గ్రంధాలయం అంతా ఒక బీరువాలో హెడ్ మాస్టర్ కుర్చీ వెనుక ఉండేది. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. నిజంగా శ్రద్ధ ఉన్న వారికి ఆయన పుస్తకాలు ఇచ్చేవాడు. ఆంగ్ల నవలలు చాలా పెద్దగా కూడా ఉండేవి. ముఖ్యంగా చార్లెస్ డికన్స్ వ్రాసిన నవలలు. ఆంగ్లం నేర్చుకోవడం నాకు అతి కష్టం అనిపించేది. అందువలన నేను నెమ్మదిగా చదివేవాడిని. ఆ పొడుగాటి నవలలో పూర్తిగా మునిగిపోయేవాడిని. వాటి ముగింపులో నాకు చాలా బాధ వేసేది. ఎందుకంటే అంతటితో నవల చదవడం అయిపోయింది. నేను దాన్ని ఇంకా పొడిగించటాకి దాన్ని మూసి, ప్రక్కన పెట్టేవాడిని. నా చిన్న మేనకోడలికి నా భార్య క్రిస్టినా చకలేట్ ఇస్తే అది దాన్ని దాచి అప్పుడప్పుడు తింటూ ఉండేది. అది చిన్న పిల్లలు చేస్తే ఫరవాలేదు. కానీ పెద్దవారు అలా చేయరు.

ధ్యానం గురించి నా ప్రసంగాన్ని వినడానికి అప్పుడప్పుడు క్రొత్తవాళ్ళు వచ్చేవారు. వాళ్ళు అశాశ్వతమైన విషయాలగురించి ఎంత నిరుత్సాహంగా ఉన్నారో చూద్దామని వాళ్ళని పరీక్షించే వాడిని. ఎవరైతే అశాశ్వత సుఖాలను కాంక్షి౦చరో వారు ఆధ్యాత్మికంగా పైకి ఎదగగలరు. అట్టివారు జీవితమనే బొమ్మలాటకు అతీతమైనవారు. వాళ్ళకి అప్పటికీ బట్టల విషయంలో వ్యామోహం ఉండవచ్చు. ఆధ్యాత్మికత వస్తే అదీ పోతుంది. ఆధ్యాత్మిక జీవితం కష్టమైనది. దానిపై గట్టి పట్టు ఉండాలి. వాళ్ళకి అది అలవాటైతే ముందుకు సాగగలరు.

శ్రీకృష్ణుడు "రజస్ మనను కర్మతో బంధిస్తుంది" అంటాడు. రాజసికుడు సవా లక్ష పనులు చేస్తూ ఉంటాడు. కానీ దేని మీదా వాడికి ఏకాగ్రత లేదు. ఎంతసేపూ చలనంలో ఉండి, అశాంతిగా ఉంటాడు.

ఇవాళ ఇంటికి వెళుతూ ఉంటే ఒక చెత్తలబండి మీద "ఇది ఎక్కువగా ఆగుతుంది" అని వ్రాసి ఉన్నది. ఇది రాజసికునికి వర్తిస్తుంది. చెత్తల బండి చెత్త ఉన్న అన్ని చోట్లా ఆగుతుంది. అది పెద్ద శబ్దం చేస్తుంది. చెత్తను ఎత్తి మీద వేసికొంటుంది. మరికొంత దూరం వెళ్ళి అదే పని చేస్తుంది. ఎవరైతే లక్ష్యంలేని పనులు చేస్తారో, సుఖానికి బద్ధులవుతారో అటువంటి వారే. వాళ్ళు దుకాణం నుంచ దుకాణంకు, హోటల్ నుంచి హోటల్ కు, దేశం నుంచి దేశంకు మారి తిరుగుతూ ఉంటారు. మార్పుకై జీవితాన్ని వృధా చేస్తారు. "నాకు మార్పు కావాలి" అనుకుంటాం. మనకి మార్పు ఆఖరుగా కావాలి. అది కానివి చాలా ఉన్నాయి. మనకి అత్యవసరం శాశ్వతమైనది.

కర్మ చేయాలనే పట్టువలన ఒత్తిడి కలుగుతుంది. ఒకనికి ధనార్జనపై ఎక్కువ కోరిక ఉంటుంది. వాడు ఇంటి గురించి ఎక్కువ ఆలోచించడు. తన కుటుంబంతో ఆనందంగా కాలం గడపడు. వాడు సెలవు రోజు కూడ దుర్భరంగా తలుస్తాడు.

రాజసికుడి మంత్రం: "లక్ష్య సిద్దికి ఏ పనైనా చెయ్యచ్చు ." అతడు లక్ష్యం నెరవేర్చుకోవడానికి సదా ఆలోచిస్తూ ఉంటాడు. అది పని చేస్తుందా? అది అధర్మం కావచ్చు కాని వృధా. మంచి దారులతో మంచి లక్ష్యాన్ని సాధించడమనేది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతం. మనం శాంతిని తయారు చేయలేం. శాంతి శాంతి వలననే కలుగుతుంది. యుద్ధం తననితాను పెంచుకుంటూ పోతుంది. దురాశ సంతృప్తి నివ్వదు. అది మరింత దురాశ కలిగిస్తుంది. పోటీ ఒకడికి క్షేమం కలిగించదు. అది వేర్పాటుని కలిగిస్తుంది.

మహాత్మా చెప్పేరు లక్ష్యం, దాన్ని సాధించే మార్గాలు ఒక్కటే. మంచి మార్గంలో వెళ్ళి, ఇంటిలో ఒకరినొకరు అర్థం చేసుకొని, ఐకమత్యంతో ఉంటే "నేను విజయం సాధించేనా?" అని అడగనక్కర లేదు. ఆ ప్రశ్న నిరర్థకం. గాంధీ చెప్పేది: "పూర్తి ప్రయత్నము పూర్తి విజయాన్ని ఇస్తుంది. " మనం చేయవలసినదేమిటంటే హింసా కాండకి పరిష్కారం కనుగోవడం. మా ధ్యాన పాఠశాలవంటి దానికి సమయం, శక్తి, వనరులు సమకూర్చడం. బౌద్ధులు లాగ మనము గొప్పదైన క్రియను, కోపం, భయం, దురాశ లేకు౦డా చెయ్యాలి. మనం ఆడగవలసింది "నేను పూర్తి ఏకాగ్రతతో ప్రతి రోజూ ఏదో చేతనైనంత మంచి చేస్తున్నానా?"

పై శ్లోకం తమస్ భ్రాంతిని కలుగజేస్తుందని చెప్తుంది. అది జ్ఞానాన్ని కప్పివేసి అజ్ఞానాన్ని కలిగిస్తుంది. మన ఎరుకను తెలియకుండా చేయిస్తుంది. తామసికుడు మానవాళిలో అతి క్రింద ఉన్నవాడు. వాడు కర్మ ససేమిరా చేయడు. ఎందుకంటే వాడికి ఖాతరు లేదు.

మన అయిష్టమైన క్రియ చేయాలంటే తమస్ ఆవహించి మనని నిశ్చేష్టులిని చేస్తుంది. పక్షవాతంలా ఉంటుంది. తామసికుడు ఏ కర్మను చేయలేడు. సున్నిత స్వభావం వానిలో లేదు. వాని వలన ఇతరులకు కలిగే ఇబ్బందిని తెలుసుకోలేడు. వాడు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని తెలియక, తన స్వార్థాన్ని తాను చూసుకొంటాడు. ఎన్నో ద్రోహాలు, విశ్వాసఘాతక పనులు, తమస్ ఆవహించినప్పుడు కలుగుతాయి. మనకు విశ్వాసమంటే తెలియకపోతే దాని పర్యావసానము కూడా తెలియదు.

తమస్ వలన ఒక మనిషి, జాతి, దేశం స్వార్థానికి ఉపయోగింపబడితే మనకి ఏమీ పట్టనట్టు ఉంటాము. ఎటువంటి సానుభూతి, కోపం కలుగదు. ఒకనికి జరిగిన అన్యాయము, వాడు పడే యాతన, మన గుండెను కరిగించదు. అది చాలా బాధాకరమైన విషయము. చాలా మందికి ప్రపంచంలో జరుగుతున్న యాతన గురించి తెలియదు. ఎందుకంటే వారికి స్వార్థ బుద్ధి తప్ప వేరేది లేదు.

కొంత కాలం క్రిందట దినపత్రికలో సాన్ ఫ్రాన్సిస్ కో నగర అధ్యక్షుడు (mayor) తన సహోద్యోగి చే కాల్చి చంపబడ్డాడాని చదివేను. చంపినవాడు ఆ అధ్యక్షుడు వానికి అన్యాయం చేసేడని వెళ్ళి ఒక తుపాకీ కొన్నాడు. నేను ఆ నగరవాసులు కలత చెంది తుపాకీలకు సంబంధించిన చట్టాలను బలోపేతం చేస్తారని తలంచేను. కానీ వారు కొన్ని రోజులు శోకం చెంది, ఆ విషయం మరచిపోయేరు. క్రోధం వలన చాలా గొప్పవారు - కెనెడి, మార్టిన్ లూథర్ కింగ్ వంటి వారు--వేలకొలది సామాన్యులు, ఆడవారు, పిల్లలు తుపాకీలచే కాల్చబడి మరణించేరు. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతన్నా ప్రజలు షరా మామూలు అని ఉన్నారు. చాలా మందికి తెలీని విషయం మనం నిస్వార్థమైన, అహింసా చట్టాలను దబాయించి అడగాలి.

శ్రీకృష్ణుడు మనమందరమూ జీవితానికి తోడ్పడాలి అని మన కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. మన భూలోక వాసానికి ఉన్న కారణమదే. ఎవ్వడైతే స్వార్థంతో, దేహాభిమానంతో, ఇతరులకేమైనా జరిగినా పట్టించుకోకుండా, పర్యావసానాలను తెలిసికోకుండా, ఉన్నాడో వాడు తమస్ అనే మసుగేసుకొని, తను తక్కిన వారిని ప్రభావితం చేయనట్టు ఉన్నాడు. అయినప్పటికీ వాడు తమస్ ను వీడి ధ్యానంలో ప్రవేశిస్తే బాగుపడతాడు. 137

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...