Thursday, March 10, 2022

Chapter 14 Section 8

14.8

రజస్తమశ్చాభిభూయ సత్త్వ౦ భవతి భారత

రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా {14.10}

భారతా! సత్త్వగుణము రజో తమోగుణములను, రజోగుణము సత్త్వ తమో గుణములను, తమోగుణము సత్త్వరజోగుణములను అణుచుచు ఆయా గుణము ప్రధానమగుచుండును

ఎవ్వరూ రజో, తమో గుణములతో జీవించాలని కాంక్షించరు. కాని చాలామంది వాటితోనే జీవిస్తారు. మంచి ఉద్దేశము ఉన్నా, ఎందుకు నిస్వార్థ కర్మల చేయుటకు మానసిక అవరోధాలు ఉన్నాయి? అపాయం కలిగించే స్వార్థ కర్మలు ఎందుకు చేస్తున్నాం?

ఇదే మానవులకున్న సందిగ్దావస్థ. కొన్నిసార్లు మనకు పని చేయవలసినప్పుడు బద్దకం ఆవహిస్తుంది. మనం "నేనిది చేయలేను. వేరేవాళ్ళచేత చేయిస్తాను" అనుకుంటాం. మనకు ఇష్టమైన పని చేయవలసినపుడు పూనుకొని మనః పూర్వకంగా చేస్తాం. దాని వలన ఏ లాభం ఉండకపోవచ్చు. దానివలన మనకు, ఇతరులకు అపాయం కలగవచ్చు. మరుసటి రోజో, కొన్నినెలల తరువాతో, లేదా తరువాత తరంలోనో దాని ప్రభావం తెలుస్తుంది. మనం పని మీద దృష్టి కేంద్రీకరించి సమయాన్ని మర్చిపోతాం. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని మరచిపోయేం.

ఈ శ్లోకం ఒక గుహ్యమైన విషయం చెప్తోంది. సత్త్వ గుణంతో బ్రతకాలంటే రజస్ తమస్ లను నియంత్రించుకో. ఈ విధంగా రెండు గుణాలను స్వాధీనంతో పెట్టుకొంటే మూడవది అనుభవంలోకి వస్తుంది.

మీ స్వీయానుభవంతో తెలుసుకోవచ్చు. మీరు సోమవారము గీత చదివి ఉత్సాహపూరితలు అవుతారు. ఆ బోధ మనస్సులో బాగా నాటుకు౦ది. మీరు జీవితాన్ని తదనుగుణంగా మార్చుకొని దాని పరమార్థం తెలిసికొన్నారు. మరుసటిరోజు ఉదయం వేరంగా లేచి, ధ్యానం చేసి, సాత్విక టిఫిన్ తిని, పనిమీద పూర్తి ధ్యాస పెట్టి, తోటివారలను గౌరవంగా చూసి, నిర్దయులకు ప్రేమ చూపిస్తారు. బద్దకం వస్తే నడక మొదలెట్టి మంత్రం జపించుకొంటూ వెళతారు. లేదా జాప్యం చేసిన పనిని మొదలెడతారు. మనస్సు వేగంగా ఉంటే మంత్ర సహాయంతో దాని వేగం తగ్గిస్తారు. ఒక ముఖ్యమైన పని చేయడానికి తక్కిన వాటిని ప్రక్కన పెడతారు. వీటివలన రజస్ తమస్ ల నుండి విడివడి ఒక మూడు రోజులు సాత్వికంగా ఉంటారు.

ఆ తరువాత నెమ్మదిగా పట్టు సడలుతుంది. నిరుత్సాహం ఆవరిస్తుంది. ఆఫీస్ లో పని ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ ఉన్న వారు ఏదో పని వెంటనే చేయమని అడుగుతారు. మనకు తెలీకుండానే పాత అలవాట్లు తిరిగి వస్తాయి. మనస్సు వేగంగా చలిస్తుంది. ఇతరులు మీ పనికి అడ్డం వస్తే వాళ్ళ మీద చికాకు పడతారు. గురువారం మీరు ఇంటిలో ఆఫీస్ పని చేయ బూనుతారు. భోజనం చేస్తున్నప్పుడు దానిపైనే ధ్యాస పెడతారు. భార్యను, పిల్లలను పలకరించరు. ఈవిధంగా సత్త్వగుణాన్ని వదలి, రజస్ తో ఉన్నారు.

శనివారం పడిపోతారు. పక్క మీద నుంచి లేవరు. కలలు కంటూ వాటితో రమిస్తారు. ధ్యానం చేద్దామని కూర్చొని, నిద్ర పోతారు. "నాకు ఈ వారమంతా పని ఒత్తిడి ఎక్కువయింది. ఇప్పుడు పూర్తిగా విశ్రమిస్తాను" అని అనుకొంటారు. టిఫిన్ ఎక్కువగా తిని కాఫీ కప్పు పట్టుకొని బయట ఎండలో కూర్చొని ఆనందిస్తారు.

ఆదివారం అయోమయంగా ఉంటుంది. ఎక్కడా నొప్పి లేకున్నా మనస్సు సరిగా ఉండదు. దేహంలో శక్తిలేనట్టు అనిపిస్తుంది. "ఏదో వైరస్ వలన కాబోలు" అనుకొంటారు. "నేను వేరే వాళ్ళని చూడను. పక్కమీదే ధ్యానం చేస్తాను" అని గుడికి వెళ్ళే కార్యక్రమాన్ని విరమించుకుంటారు. ఏవో పిచ్చి పుస్తకాలను తిరగేస్తారు.

రజస్ తాండవం చేస్తున్నప్పుడు సత్త్వ౦ కొరకు పెద్ద యుద్ధమే చేయాలి. ఏమైనప్పటికి తమస్ ను ఆశ్రయించకూడదు. సత్త్వ గుణం తగ్గుముఖం పడుతూంటే, దానికి ఊత నివ్వండి. ఇది చాలా బాధించేదే కాని పట్టుతో దాన్ని విడువకండి. వేరే మార్గం లేదు. 139

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...