Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 1 Section 12

Bhagavat Gita

1.12

సంజయ ఉవాచ:

{1.47}
ఏవముక్త్వార్జున స్స౦ఖ్యే రథోపస్థ ఉపావిశత్

విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః

అర్జునుడు ఈ విధముగ పలికి దుఃఖము చేత చలించిన చిత్తము గలవాడై, ధనుర్బాణములను వదలిపెట్టి రణరంగమునందు రథము మీద కూర్చొనెను

మనలోని పరమాత్మని గుర్తించడమే మన జీవిత లక్ష్యం. మనలో చాలామందికి బాధ, దుఃఖం వలన జీవితంలో ఎదుగుదల కలుగుతుంది. అది ఎలాగంటే ఒక పిల్లవాడు అడుగులు వెయ్యడానికై క్రింద పడీ, లేచినట్లు. చాలామంది యోగులు జీవితం చేసే సవాళ్లను ఎదుర్కొని, విజయం పొందేరు. స్వామి రామదాసు సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇలా అన్నారు:

"మనస్సు మీద విజయం పొందడం అంత ఆనందం ఇంకే విజయానికి వచ్చిన ఆనందానికి సరి తూగదు. ఎవరైతే తమకు కలిగే గాఢమైన కోర్కెలను, తద్వారా కలిగే హింసాత్మకమైన చర్యలను, అరికట్టగలరో వారే నిజమైన యోధులు. భౌతిక ప్రపంచంలోని సమస్యలన్నీ మనస్సులో కలిగే అలజడుల వలననే. కాబట్టి సత్యమునెరిగి మనస్సును జయించుట నిజమైన విజయము. దానివలన వ్యష్ఠి, సమిష్ఠిలలో సామరస్యం, శాంతి కలుగుతాయి. బయటకాక మనస్సుతో పోరాడేవాడే నిజమైన సైనికుడు"

ధ్యానం వలన ఇతరులతో పోరుకై ఉన్న కలహశీలతను నియంత్రించి దానిని మన స్వచ్ఛంద భావాలను, వేర్పాటును తగ్గించుకోవడానికి వ్యచ్చిస్తాము. ఇది సర్వ కాల, సర్వావస్థలలో కొన్నేళ్ళు సాధన చేస్తే ఆశించిన శాంతి కలుగుతుంది.

ప్రతి ఉదయం ధ్యానం చేస్తే రోజల్లా మన అసహనంతో, లేమితో, ద్వేషంతో పోరాడడానికి కావలసిన రక్షణ కవచం ధరిస్తాము. ఇతరులకు మనకన్నా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడం కొంత కష్టమే. కానీ రాత్రి పడుక్కునే ముందు మనమెంతో కొంత కుటుంబం, సమాజం యొక్క మేలుకై, ఆనందానికై, మనము దుఃఖాన్ని అనుభవించినా, వాటికై పాటు పడ్డామన్న భావన ఆనందాన్నిస్తుంది. చాలామార్లు ఇతరులకు బాధ కలుగకుండా ఉండాలంటే మనమే బాధలు పడి, అర్జునుని లాగ "నేను యుద్ధము చెయ్యను, చెయ్యలేను" అని అనుకొంటాం.

దేవుని కరుణ, సహాయం లేనిదే మనకు ఏదీ సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు మనమెన్ని తప్పులు చేసినా ఆత్మ పరిశుద్ధమై, నిష్కళంకమై, ఉంటుందని చెప్పి మనను కర్మలు చేయుటకు ప్రోత్సాహిస్తాడు. అవిద్యతో మనమెన్నో తప్పులు చేసి ఇతరులను లేదా మనలను ఎంతో బాధ పెట్టి ఉండవచ్చు. మనలోని ప్రేమ పూరితుడైన దేవునికి దాసోహం అయితే అతను మనల్ని రక్షిస్తాడు. అప్పుడు అహంకారమనే ముసుగుని తొలగించి ధ్యానంలో ప్రవేశించి, ప్రపంచానికి శాంతి, భద్రత కలిగించుటకై ప్రయత్నించవచ్చు. 47

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...