Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 1 Section 11

Bhagavat Gita

1.11

యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః {1.46}

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్

ప్రతీకారము చేయక, ఆయుధములను పట్టిన నన్ను, శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్దమునందు చంపుదురేని అదియును నాకు క్షేమకరమే కాగలదు

నా ప్రథమ ఆధ్యాత్మిక గురువైన నా అమ్మమ్మకి చదవడం, వ్రాయడం రాదు. కానీ ఆమె గీత సందేశాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పింది. జీవితం ఒక రణరంగం. మనకి ఇష్టమైనా, లేకున్నా మనం పుట్టింది రణం చెయ్యాడానికే. మనకు వేరే మార్గం లేదు. కానీ మనకు కావలసిన ఆయుధం, ప్రత్యర్థిని ఎన్నిక చేసికోవచ్చు. మనను ప్రేమించే వారితో పోరు చేస్తే మనం గెలవలేము. అలాగే మనలోని స్వార్థంతో, క్రోధంతో పోరు చేసి గెలవగలం. శ్రీకృష్ణుని నమ్మి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే గెలుపు తప్పక వస్తుంది.

మనం ఇతరులతో యుద్ధాలు చేస్తే అది వారికి బాధ కలిగించవచ్చు. కానీ మనలోని దుర్గుణాలతో పోరాడితే మనం అందరికి ఉపయోగ పడతాం. ఇదే మన మత గ్రంథాలు ఇచ్చే సందేశం. మనం గ్రంథాలను చదివేవారిని, వాటిలోని విషయాలను వల్లించేవారిని గొప్పగా చూడకపోవచ్చు. ఎవరైతే తమను బాధ పెట్టినవారిని క్షమిస్తారో, పేరు ప్రతిష్ఠలను కాంక్షించరో, పరోపకారానికై జీవిస్తారో వారిని తప్పక గౌరవిస్తాము. మన స్మృతులలో ఇలా చెప్పబడినది: ఎవరైతే క్రోధాన్ని వీడుతారో వారు పెద్ద యోధులకన్నా గొప్పవారు.

ఈ రోజుల్లో క్రోధం సమంగా సంభాషించడానికి అవసరమని తలుస్తారు. మనలో క్రోధాన్ని ప్రదర్శించడానికై అనేక సదస్సులు, అభిప్రాయ వేదికలు ఉన్నాయి. అలాచేసి మనం క్రోధాన్ని ఇంటిలోకి, సమాజంలోకి ఆహ్వానిస్తున్నాము. అలాగే క్రోధంతో నిండి ఉన్న పుస్తకాలు, నాటకాలు, సినిమాలు ఉన్నాయి. వాటిని అనుకరించి కొందరు బాధ కలిగించే విమర్శాస్త్రాలను ప్రయోగిస్తారు. అట్టివారలు మనమీద దాడి చేస్తే, వారిని సహనంతో, ప్రేమతో వారు చెప్పినది వింటే సరిపోతుంది.

సహనం, ఒకరికి అన్నివేళలా బలమైన దన్ను ఇస్తూ ఉండడం ధ్యానం చేసేవారికి అందుబాటులో ఉన్నాయి. అందుకై మనము నిస్వార్థతని అలవాటు చేసికోవాలి. మనలో స్వార్థంతో బ్రతక కుండా ఉండగలిగే శక్తి ఉందని చాలామందికి తెలియదు. తాము ధైర్యములేక, వేర్పాటుతో ఉ౦డి, బలం లేక పరోపకారము చెయ్యలేమని తలుస్తారు. కానీ మనము శ్రీకృష్ణుని బోధను పూర్తిగా విని, జీర్ణించుకొని, ఆచరణలో పెట్టగలిగితే మనలోని నిజమైన శక్తిని విడుదల చేసి, పరులకు ఉపయోగపడేలా బ్రతకవచ్చు. 44

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...