Bhagavat Gita
11.25
శ్రీ భగవానువాచ:
సుదుర్ధర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ
{11.52}
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః
నీవు చూసిన ఈ విశ్వరూపము చూడ శక్యము గానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శింప గోరు చుందురు.
నాహం వేదైర్న తపసా న దానేన స చేజ్యయా శక్య ఏవంవిధో ద్రష్టు౦ దృష్టవానసి మాం యథా
{11.53}
నీవు దర్శించిన ఈ రూపము వేదముల చేత గాని, యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యము గాదు.
భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవ౦విధో అర్జున
జ్ఞాతుం ద్రష్టు౦ చ తత్త్వేన ప్రవేష్టు౦ చ పరంతప
{11.54}
పరంతపా! విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగ గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము.
చిత్తశుద్ధితో ఉన్నవారే భగవంతుని చూడగలరని జీసస్ చెప్పెను. ఎందుకంటే అట్టి వారలకే దేవుని మీద పూర్తి నమ్మకం ఉండి, సృష్టి అంతటా దేవుడ్ని చూస్తారు.
హరిదాసు అనబడే ఒక బాలుని తల్లి గొప్ప కృష్ణ భక్తురాలు. ఆ బాలుడు పాఠశాలకు ఒక కీకారణ్యం లోంచి వెళ్ళాలి. దానిలో అనేక కృూర మృగాలు ఉండి హరిదాసుకి మిక్కిలి భయం కలిగించేవి. అతడు అమ్మని సాయం రమ్మంటే, ఆమె హరిదాసు అన్న గోపాలుడు అరణ్యంలోనే ఉంటాడు, వానిని పిలువు అని చెప్పింది. హరిదాసు తన అమ్మ చెప్పినట్టే పలుమార్లు గోపాలా, గోపాలా అని పిలిచేడు. అప్పుడు పింఛ౦, పట్టువస్త్రాలు ధరించిన బాలుడు వచ్చి హరిదాసుకు అడవి చివర వరకు సాయం వచ్చేడు. ఇలాగ కొన్నాళ్ళు గడిచేయి. ఒకమారు హరిదాసు పాఠశాలలో విందుకై అందరినీ ఏదో ఒక తినుబండారాన్ని తీసికొని రమ్మన్నారు. హరిదాసు తన అమ్మను అడిగితే, మనం బీదవాళ్ళం, నీ అన్న గోపాలునే ఏదో ఒకటి అడుగు అని చెప్పెను. హరిదాసు గోపాలునితో ఆ విషయం చెప్పగా, గోపాలుడు వానికి ఒక గిన్నెలో పెరుగు ఇచ్చేడు. విందులో ఆ గిన్నెలోనుంచి ఎంత పెరుగు తీసినా ఇంకా మిగిలి ఉంది. దానిని చూసి ఒక ఉపాధ్యాయుడు ఆశ్చర్యపడి హరిదాసుని ఆ గిన్నె ఎక్కడినుంచి వచ్చిందని అడిగేడు. తరువాత అతను హరిదాసుతో కలిసి గోపాలుడ్ని చూడడానికి అడవికి వెళ్ళేడు. హరిదాసు పిలవగానే గోపాలుడు వచ్చేడు. హరిదాసు గోపాలుడితో తన ఉపాధ్యాయునితో మాట్లాడమని చెప్పి ఇంటికి పరిగెత్తేడు. కాని ఆ ఉపాధ్యానికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు.
ఇది ఒక కథ. ఇక్కడ తెలిసికోవలసినది ఏమిటంటే దేవునిమీద పూర్తి నమ్మకం కలిగి, నిస్వార్థంగా ఉంటే మన జీవితం సజావుగా ఉంటుంది.
మనలో చాలామంది ఆధ్యాత్మిక జీవితం అనన్యమైన భక్తితో మొదలుపెట్టం. దేవనిమీద భక్తి ఎక్కడినుంచో వచ్చి పడిపోదు. దాన్ని అలవరచుకోవాలి. మన భక్తి ప్రస్తుతం అనేక విషయాల మీద నుండి, దేవుని మీద కొంత ఉండవచ్చు. మన చైతన్యం ఇతర విషయాల మీద ఉంటే దానిని కట్టడి చేసి దేవునివైపు త్రిప్పడం, ఒక లోయను నింపడానికి చిన్న చిన్న రాళ్ళు వేసినంత కష్టం.
అలాగని మనము నిరుత్సాహ పడనక్కరలేదు. రాళ్ళను వేస్తూనే వుంటే అవి కొన్నాళ్ళకు ఒక పోగు అవుతాయి. ఉదాహరణకి అప్పుడప్పుడు జీడిపప్పు తినడం ఆరోగ్యానికి హానికరం కాదు. మనకు జీడిపప్పు తినాలనే కోరిక బలంగా ఉంటే, దాన్ని నియంత్రించుకోవడం లోయలో రాళ్ళు వేసినట్టు. కొంతకాలానికి ఒక కొండ చరియలు విరిగి పడితే ఆ లోయ పూడుకుపోవచ్చు. అనగా మన జీడిపప్పు కోరిక పూర్తిగా సమసిపోయినట్టు.
మన ప్రాణ శక్తి ఇతర విషయాల మీద వెచ్చించబడుతుంటే, ఒక నదికి ఆనకట్ట లాగా, వాటిని నియంత్రించవచ్చు. కాని ప్రాణ శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటి అది ఆనకట్టపై నది పొంగి ప్రవహించినట్టు. దానికి పరిష్కారం, ఒక కాలువ నిర్మించి, నీటి ప్రవాహాన్ని మళ్లించడం. అలాగే మనం కొంత ప్రాణ శక్తిని భగవంతుని వైపు మళ్లించాలి. మొదట్లో అది చాలా తక్కువ ప్రవాహం కలిగి ఉండవచ్చు. కాల క్రమేణా దానిలో ప్రవాహం పెరిగి, మన ప్రాణ శక్తి అంతా దేవునివైపు ప్రవహిస్తుంది. ఈ విధంగా మన కోరికలన్నీ ఏకమై దేవుని వైపు ఒక వరాదలా పొంగి పొరలుతాయి.