Bhagavat Gita
11.26
మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్స౦గ వర్జితః
{11.55}
నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ
పాండు తనయా! ఎవడు నా కొరకే కర్మలాచరించుచు, నేనే పరమగతి యని భావించి, నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైర బుద్ధి లేక యుండునో వాడు నన్నే పొందుచున్నాడు ఀ
కొందరు గాఢమైన భక్తి గలవారు దేవుడ్ని ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ, శ్రీ రామకృష్ణ వారలు అట్టివారు. దేవుని ప్రత్యక్షంగా చూడడం, దేవదూతల వాక్కు వినడం మనని ఆశ్చర్య పరచినా, నేను ఒక సాధారణమైన విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పేది: ఎవరైతే తమ సర్వ కర్మలు దేవునికి నిస్వార్థంగా, దురాలోచన లేకుండా అర్పిస్తారో, వారు దేవుని సదా స్మరిస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ అటువంటి మనీషి. ఆయనకు దేవుడు ప్రత్యక్షము కాలేదు; దేవదూతలు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అమితమైనది. ఆయన తన మిత్రుల, --శత్రువులకై కూడా-- క్షేమానికై తన లాభం చూసుకోకుండా చాలా పాటు పడ్డారు. ఆయన తన ప్రత్యర్థులను బలంతో కాక, ప్రేమతో చూసేవారు.
ఇటువంటి దైవ భక్తి మనం ఎప్పుడైనా అలవరచుకోవచ్చు. ఎప్పుడైతే మనము నిస్వార్థ౦తో కుటుంబము, సమాజము, ప్రపంచము యొక్క క్షేమానికై పాటు పడతామో మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. మనను నొప్పించే పరుష మాటలు ఇతరులను కూడా నొప్పిస్తాయని తలచి, మనసా వాచా కర్మా మంచినే చేస్తే మనము దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. ఎవరైతే మనపై క్రోధం చూపిస్తారో వారియందు దయతో ప్రవర్తిస్తే కూడా మనం దేవుని గురించి కొంత తెలిసికొన్నట్టే. కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పే భక్తి, దేవునికి భక్తునికి మధ్యనున్న సంబంధమే కాక, సకల ప్రాణులను కలుపుకొని.
మనం జీవైక్య౦ గురించి ఎరుక గలిగి ఉంటే, దేవుని అన్ని జీవులలోనూ చూస్తాము. బుద్ధుడు మనం ప్రతి మనిషిని, జంతువుని ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్టు ప్రేమించాలని చెప్పెను.
9 వ అధ్యాయం చివర్లో మనం ఆయన మీద గాఢమైన భక్తితో ఉంటే ఆయనతో ఐక్యమవుతామని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు.
ఈ ఉత్తమ లక్ష్యం మనం కలిగి ఉంటే మన జీవితం అర్థవంతమై, మనం చేసే ప్రతి నిర్ణయం సమిష్ఠి క్షేమానికై ఉంటుంది. ప్రతి ఉదయం మనం మన గురించేకాక, ఇతరుల క్షేమానికై బ్రతకాలని అనుకుంటే, మనం ఏ దేశంలోనైనా, ఏ సమాజంలోనైనా ఉత్తమ పౌరులుగా బ్రతకవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఒకే పాలు చేయరు. కొందరు వైద్యులు, మరికొందరు ఉపాధ్యాయులు, ఇంకొందరు తలిదండ్రులు. మనమే ఉపాధి అవలంబించినా మన వంతు మంచి మనం కాక ఇతరులు చెయ్యలేరు. మనం నిస్వార్థంగా ఉండి, దేవుడు అందరి అంతర్గతములలో ఉన్నాడు కనుక, మనము ప్రపంచ క్షేమానికై పాటుపడవచ్చు.
దీనికి ఒక కథ చెప్తారు. సూర్యుడు సృష్టింపబడిన రోజున సూర్యోదయం చూసి ప్రజలందరూ చాలా సంతోషించేరట. కానీ సూర్యాస్తమైన తరువాత ఏమి చెయ్యాలో పాలు పోక వారు నిరాశ చెందారట. అప్పుడు ఒక పిల్లవాడు క్రొవ్వొత్తి వెలిగిస్తానని చెప్పేడట. అందరూ దానికి సమ్మతించి క్రొవ్వొత్తులు వెలిగించి ప్రపంచాన్ని వెలుగుతో నింపేరట.
దీనివలన తెలిసేది ప్రతి మానవుడు, గొప్పవాడు కానప్పటికీ, విలువగలవాడు. మనము బహిర్గతంగా సాధారణమైనప్పటికీ, అంతర్గతంలో ప్రేమ, సేవా గుణాలు కలిగి ఉంటాము. మనం మన చూపుని సదా దేవునిపై పెడితే, ప్రపంచంలోని ఏ సమస్యా మన చేత పరిష్కరింపబడలేనిది కాదు.