Saturday, April 9, 2022

Eknath Gita Chapter 11 Section 3

Bhagavat Gita

11.3

న తు మాం శక్యసే ద్రష్టు మనేనెవ స్వచక్షుషా {11.8}

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్

చర్మ చక్షువులతో నీవు నన్ను చూడలేవు. నా ఐశ్వర్యమును చూచుటకు నీకు దివ్యదృష్టి నొసగుచున్నాను. దర్శి౦పుము

మన కళ్ళు, తక్కిన ఇంద్రియాలలాగే, బాహ్య ప్రపంచంలోని మార్పులను తెలుసుకోడానికి పనికివస్తాయి. అవి మనకు తెల్లారిందని, సూర్యుడు ఉదయిస్తున్నాడని మొదలగునవి తెలపడానికి తప్పిస్తే ఇంక దేనికీ పనికిరావు. అందుకే ధ్యానంలో బాహ్య ప్రపంచం మీద జరిగే ఇంద్రియ ప్రసరణను వెనక్కి తీసుకొంటాం. గాఢ ధ్యానంలో, మన ఏకాగ్రత ఇంద్రియాలను జయించి బయట కార్లు, విమానాలు చేసే శబ్దాలు వినకుండా చేస్తుంది.

మనము ఈ విధంగా దృష్టి కేంద్రీకరిస్తే బాహ్య ప్రపంచానికి, మనస్సు అనుభవించే ప్రపంచానికి మధ్య అడ్డు గోడ లేదని తెలిసికొంటాము. ఒక బ్రిటిష్ తత్త్వవేత్త మనము బయట, లోపల అనే తేడాలు కృత్రిమంగా చేసుకొంటాము అని చెప్పను. ఆ రెండిట్లోనూ మనము నిజంగా గ్రహిస్తుంది మన మనస్సులోని భావాలు. అంటే మనం పదార్థాలని అవి ఉన్నట్టుగా కాక మన భావాలబట్టి చూస్తాం. మనం ఇతరులను వేర్పాటుతో చూసి, వారిని మనకు అనుగుణంగా మార్చుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ మన చేతన మనస్సును ధ్యానం ద్వారా పెంపొందించితే, మనము ప్రపంచాన్ని వేర్వేరు శకలాలుగా కాక, ఒకటే అవిభాజ్యమైనదిగా చూస్తాం.

శ్రీరామకృష్ణ "కొందరు దేవుని చూడలేమని అంటారు. ఎవరు ఎవరిని చూస్తారు? దేవుడు బయట ఉండి మన కళ్ళతో చూడబడతాడా? మనము మన ఆత్మనే చూడగలము." అని చెప్పెను. అర్జునుడు చూడబోయే శ్రీకృష్ణుని దేహం దేశ కాలములు కలదై, అది అతనికి బాహ్యంగా కాక, చేతనపు మనస్సు లోతులలో ఉండి స్వీయానుభవం పొందిస్తుంది. 274

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...