Bhagavat Gita
11.2
శ్రీ భగవానుడు పలికెను:
పశ్య మే పార్థ! రూపాణి శతశో అథ సహస్రశః
{11.5}
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ
అర్జునా! అనేక విధములైన రంగులు, రూపములు గలవియును, దివ్యములైనవియును, అసంఖ్యాకమైనవియు నగు నా యొక్క రూపములను గాంచుము
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా నశ్వినౌ మరుత స్తథా
{11.6}
బహూ స్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత
అర్జునా! ఆదిత్యులును, వసువులును, రుద్రులును, అశ్వినులను, మరుత్తులను ఇంకను నీవు చూచి యుండని అనేకములైన అద్భుతములను చూడుము
ఇ హైకస్థ౦ జగత్ కృత్స్న౦ పశ్యాద్య సచరాచర౦
{11.7}
మమ దేహే గుడాకేశ యచ్చాస్యద్దృష్టు మిచ్చసి
గుడాకేశా! నీవు చూడగోరిన సమస్తమైన చరాచర ప్రపంచమును ఇంకను ఏమి చూడదలచితివో వాటిని నా శరీరము నందు ఒకే చోట దర్శించుము ఀ
ఇప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపబోవుచున్నాడు. ఉపనిషత్తులలో మన దేహాన్ని ఒక పట్టణంగా వర్ణించేరు. దాన్ని పాలించేది మన ఆత్మ. మనమొక సూక్ష్మ జీవి దృష్ట్యా దేహాన్ని చూస్తే, అది ఒక మహా నగరంగా -- ముంబాయి లేదా న్యూ యార్క్ లాగా -- కనిపిస్తుంది.
మనమెలాగ మన దేహ పురంలో భూమి మీద బ్రతికినంత కాలం నివాసిస్తామో, విశ్వమంతా ఆ దేవుని దేహమై యున్నది. దేవుడు మనుష్యులలో కలవాలంటే కృష్ణుడు లేదా బుద్ధుడు లేదా జీసస్ రూపేణా వస్తాడు. కానీ అలా కాకపోయిన ఆయన సమస్త సృష్టిని ఒక హారం లాగ తన మెడ చుట్టూ వేసుకొంటాడు.
మన విశ్వం యొక్క విశేషాలు చూద్దాం. గంటకు 186000 మైళ్ళు ప్రయాణించే కాంతి అతి దగ్గరగా ఉన్న నక్షత్ర౦ నుంచి మన వద్దకు రావటానికి 4 ఏళ్లు పడుతుంది. మన పాల పుంత ఒక చివరినుంచి ఉంకోచివరికి కాంతి వెళ్ళాలంటే 100000 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటి పాల పుంతలు కోట్లానుకోట్లు ఉన్నాయి. కాంతి విశ్వం ఒక చివరినుంచి ఉంకో చివరికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో మన ఊహకు అందదు. మనం రాత్రి చూసే నక్షత్రాలలో కొన్ని ఇప్పటికే అంతర్ధానమయి ఉండచ్చు. ఎందుకంటే వాటి కాంతి కొన్ని వేల సంవత్సరాల క్రిందట నాటినుంచి ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటికి మానవాళి ఇంకా భూమిమీద అడుగు పెట్టక పోయి ఉండచ్చు.
ఈ విశ్వంలో సతతము ఉంటాయనుకొన్న నక్షత్రాలు మిణుగురు పురుగుల వలె ఒక వేసవి రాత్రే బ్రతికేవిగా ఉన్నాయి. దేనికైతే జన్మ ఉందో, దానికి అంతం కూడా ఉంటుందనే సిద్ధాంతం ప్రకారం ఆ నక్షత్రాలు కొన్ని వేల ఏళ్లు బ్రతికి నశిస్తాయి. వాటినుంచి మళ్ళీ క్రొత్త నక్షత్రాలు పుడతాయి. ఈ లీల కోట్లాను కోట్ల సంవత్సరాలనుంచి జరుగుతున్నాది. ఒక యోగి ఇలా వ్రాసెను:
హిమాలయాలు మనం వాడే నల్ల సిరాలా అయిపోనీ,
సముద్రము ఒక గిన్నెలా ఉండి దానిని తనలో ఇమిడ్చు కోనీ
విశ్వం ఒక కాగితంలా, కల్పవృక్షం ఒక కలంగా, మారనీ
ఆ కలాన్ని సరస్వతీ దేవి చేతబట్టి ప్రతి నిత్యం వ్రాయనీ
కానీ ఆమె ఆ దేవుని సృష్టి అంతము ఎన్నటికీ చేరదు