Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 20

Bhagavat Gita

2.20

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి {2.31}

ధర్మ్యాద్ధి యుద్ధాచ్చ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే

నీ స్వధర్మమును గాంచినను నీవు యుద్ధ విషయమున చలింపవలసిన పనిలేదు. క్షత్రియునకు ధర్మ యుద్ధము కంటెను శ్రేయమైన కార్యము వేరొకటి లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతం {2.32}

సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశం

పార్థా! అప్రయత్నముగ ప్రాప్తించునట్టిది, స్వర్గమునకు తెరచి పెట్టిన వాకిలి వంటిదియునగు ఈ యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకే లభించును

అథచే త్త్వమిమ౦ ధర్మ్య౦ సంగ్రామం న కరిష్యసి {2.33}

తత స్స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి

ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయకుండినచో స్వధర్మమును, కీర్తిని పోగొట్టు కొనుటయే గాక పాపమును కూడా పొందెదవు

అకీర్తిం చాపి భూతాని కథయిష్య౦తి తే అవ్యయాం {2.34}

సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే

లోకులు నీయొక్క అపకీర్తిని శాశ్వతముగ చెప్పుకొందురు. మాననీయునకు అపకీర్తి కన్నను మరణమే మేలు

భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాంమహారథాః {2.35}

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్

ఇంతవరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులకు నీవు చులకన యగుదువు. నీవు భయము వలన యుద్ధమును మానినట్లు వారు భావింతురు

అవాచ్య వాదాంశ్చ బహూ న్వదిష్యన్తి తవాహితాః {2.36}

నిందంతి స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్

నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి ఎన్నో అనరాని మాటలను పలికెదరు. దానికి మించిన దుఃఖమేమున్నది?

హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం {2.37}

తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః

అర్జునా! చంపబడినచో స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యము ననుభవింతువు. కనుక యుద్ధమునకు కృతనిశ్చయుడవై లెమ్ము

సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ {2.38}

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవ౦ పాప మవాప్స్యసి

సుఖ దుఃఖములను, లాభనష్టములను, జయాపజయములను సమముగ భావించి యుద్ధము చేయుము. అటుల చేసినచో నీవు పాపమును పొందవు

తతో యుద్ధాయ యుజ్యస్వ -- మనందరమూ ముగ్గురు శత్రువులతో ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాము. అవి : భయము, క్రోధము, మోహము. మనం పునర్జన్మ ఉంటుందని నమ్మినా, నమ్మక పోయినా, ఈ యుద్ధం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ ద్వంద్వాలతో కూడా: స్వార్థం-నిస్వార్థ౦, అశుద్ధము-శుద్ధము, అసంపూర్ణము-సంపూర్ణము.

సుఖదుఃఖే సమే కృత్వా -- మనము సుఖదుఃఖాల్లో ఒకేలాగ ఉండాలి. మనము బాధలోనూ, ఆనందంలోనూ ఒకేలాగ లేకపోతే మనమెంత కష్టపడి పోరుచేసినా, అహంకారానికే ఎప్పటికీ పైచేయి ఉండి, అనేక జన్మములెత్తవలసి వస్తుంది. కానీ అలా చేయడం ఎలాగ? మనకు సుఖముల వలన ఆనందం కలిగి, దుఃఖములవలన విచారం కలగడం సహజం. అందుకే శ్రీకృష్ణుడు సుఖదుఃఖే సమే కృత్వాఅంటున్నాడు: మరణం పొందకూడదనుకుంటే సమదృష్టి కలిగి ఉండాలి. మన౦ మరణం రాకూడదని గాఢంగా నమ్మితే సుఖదుఃఖాల యందు సమదృష్టి కలిగి ఉండాలి.

మనకి మంచి కలిగితే మనస్సు ఉల్లాసమై "నేను ఆనందంగా ఉన్నాను" అని అనుకుంటాము. క్షణికమైన ఆనందంతో తాదాత్మ్యమవుతాము. ఆనందం దుఃఖాన్ని తోడుగా తెచ్చుకొ౦టుంది. ఎందుకంటే అవి ద్వంద్వాలు కనుక. మనమిలాగ చాలా కాల ముంటే అవి మన సంస్కారాలుగా మారుతాయి.

మన రూపాన్ని ఒకరు పొగిడితే, మన మనస్సు అలజడి చెందుతుంది. అలాటప్పుడు మనము "నన్ను పొగడకు. నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవాడిని" అని చెప్పనక్కరలేదు. శ్రీకృష్ణుడు పొగిడేవానికి ధన్యవాదాలు చెప్పి మనస్సును స్వాధీనంలో పెట్టుకోమని చెప్తున్నాడు. మనకు మంచి జరుగుతూ, పొగడ్తల వెల్లువ వస్తే, మంత్రజపం చెయ్యడమే ఉత్తమం. ఇది కష్టతరమే. ఇక్కడ తెలిసికోవలసినది, ఎలాగైతే పొగడ్తలు వస్తాయో, అలాగే దూషణ కూడా వస్తుంది. ఆ రెండిటిలోనూ సమదృష్టి కలిగివుండడం మంచిది.

మనలో చాలామంది ఇతరులు మీరు మంచి వారలని చెప్తే కాని సమంగా ఉండరు. గాంధీ మహాత్ముని లాగ మనకి కూడా ఇతరులు సమ్మతించే లాగ ప్రవర్తించక పోతే వారు విమర్శలు చేస్తారు. మనము నిశ్చింతగా ఉంటే ఎన్ని విమర్శలు కలిగినా, ఎంత దూషణ వచ్చినా మనలో ద్వేషం లేక భద్రంగా ఉంటాము. మనకు మంచి మార్గంలో ఉన్నామనే నమ్మకం ఉంటే, ప్రపంచాన్ని ఎదిరించి బ్రతకగలం. మంచి విమర్శ అయితే మనకు లాభిస్తుంది.

గాంధీకి అనుచరులుగా ఉండమని అనేక సార్లు ప్రజలు చెప్పేరు. "మీరు ఋషుల వంటివారు. కలలు కంటారు. అవాస్తవమైనవి చెప్తారు. మేము మీకు అనుచరులము కాలేము" అని ఆయనను విమర్శించేవారు. దానికి ఆయన సమాధానము: "నేను నన్ను అనుసరించమని చెప్పటం లేదు. నేను పూర్తిగా అహింసా వాదిని. అది మీకు నచ్చక పోతే ఉంకో నాయకుడ్ని అనుసరించండి". ఇలాగ అనేకమార్లు జరిగింది. ప్రతిసారీ వాళ్ళు వెళ్ళిపోయి, కొన్నాళ్ల తరువాత గాంధీ వద్దకు వచ్చి ఆయనను అనుసరిస్తామని చెప్పేవారు. ఇదే విశ్వాసమంటే. అవసరమైతే మనము ఒంటరిగా పయనించాలి. నాలో దేవుడు౦డగా, నాకింకేమి కావాలి? ఎవరి విమర్శని ఎదుర్కోవడానికి భయపడతాను?

లాభోలాభౌ అనగా--లాభము, నష్టము. లాభ నష్టాలు వ్యాపారంలో ఎక్కువగా చూస్తాం. శ్రీకృష్ణుడు అలాటప్పుడు సమదృష్టి కలిగి ఉండమని బోధిస్తున్నాడు. అలాగే జయాజయౌ -- అనగా జయాపజయాలలో సమదృష్టి కలిగి ఉండాలి. ఇవే మనల్ని మరణాన్ని దాటించి ఉత్కృష్టమైన స్థితిని కలగజేస్తాయి. 87

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...