Bhagavat Gita
12.19
దేహీ నిత్య మవద్ధ్యో అయం దేహే సర్వస్య భారత
{2.30}
తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి
అర్జునా! సర్వప్రాణుల దేహములందు శోభించు ఆత్మ చంపుటకు వీలుపడదు. కనుక సర్వ ప్రాణులను గూర్చియు నీవు దుఃఖి౦ప పనిలేదు
నా చిన్నప్పడు పెరిగిన గ్రామంలో ఎవరైనా మరణ శయ్య పైనుంటే నా అమ్మమ్మను తమ వద్దకు రమ్మనమని కోరేవారు. ఎందుకంటే వాళ్ళకు ఆమె ధైర్యం ఇచ్చేది. ఆమె కళ్ళు చూసి వారు చావంటే భయపడకూడదని గ్రహించేవారు. సమాధి పొందినపుడు ఇదే దేవుని ప్రేమించే యోగి తెలుసుకొంటాడు. దేవునితో హృదయంలో ఐక్య మైనప్పుడు దేహాభిమానం పోతుంది. దేహాన్ని సరిగ్గా పోషించడం ఎందుకంటే ఇతరులుకు అమృతత్వ౦ గురించి చెప్పి వారిని తరింపచేయడానికి.
మనం ధ్యానం గాఢంగా చేసినప్పుడు మన దేహం నుండి విడబడతాం. ఒక్కొక్కప్పుడు మనకు దేహం ఉందనే భావన కూడా కలగదు. శ్రీరామకృష్ణ ఒకమారు కలకత్తా వీధులలో నడుస్తూ ఉండగా ఆయన ధోతి క్రింద పడిపోయింది. ఆయన వివస్త్రితుడై కూడా సాగిపోతున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయనకు ఆ విషయం చెప్పేరు. ఆయన "మీరు నా ధోతి ఎక్కడుందని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని నా శరీరం ఎక్కడుందని అడుగుతున్నాను." అని పలికేరు.
దేహాభిమానం దైవ చింతనకి అడ్డు వస్తుంది. ప్రతిరోజూ మన దేహాభిమానం ఏది తగ్గిస్తుందని ప్రశ్నించుకోవాలి. ఏదైతే మన దేహాభిమానం పెంచుతుందో అది ఆధ్యాత్మిక సాధనకు అనుచితము. ఉదాహరణకు అతిగా తినడం దేహాభిమానాన్ని పెంచుతుంది. మనం టివిలో ప్రకటలను చూడడం వలన, పూర్వ సంస్కారాలవలన, ఆ పరిస్థితి కలిగినప్పుడు, మనం ప్రశ్నించు కోవలసింది తిండి దేహాన్ని పోషించడానికా లేదా నాలుకని సంతృప్తి పరచడానికా. అలాగ మనము చేస్తే కొంత కాలానికి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తో కూడిన ఆహార౦ మాత్రమే స్వీకరిస్తే సాధనకి మంచిదని తెలుసుకొంటాం. అలాగే ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలను వాడకుండా ఉండాలి. అలా చేయడం మతపరంగా కాదు. అవి మనని దేహాభిమానం పెంచేవి కాబట్టి. ఈ విధంగా దేహంనుంచి విడవడితే, మన సాధన వృద్ధి చెంది, మనం ఎటువంటి ఊతా లేకుండా, విశ్వమంతా వ్యాపించి ఉన్నామనే భావన కలుగుతుంది. 83
No comments:
Post a Comment