Bhagavat Gita
4.2
ఏవం పరంపరా ప్రాప్త మిమ౦ రాజర్షయో విదుః
{4.2}
స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప
పరంతపా! ఇట్లు పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొని యుండిరి. చాలాకాల మగుటచేత ఈ యోగము ఇపుడు గోచరించుట లేదు
శ్రీకృష్ణుడు పరంపర అనే పదాన్ని ఈ శ్లోకంలో వాడేడు. పరంపర అంటే ఒక వంశంలో ఒక తరం నుంచి ఉంకో తరంకి ఇచ్చిన జ్ఞానం, వస్తువులు, మొదలైనవి. నే పెరిగిన గ్రామంలో బాగా పాడే బాలకుడు ఉండేవాడు. మేము వాడ్ని "నువ్వు ఇంత బాగా పాట పాడడం ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగేం. "మీరు పాడడం నేర్చుకోనక్కరలేదు. నేను పుట్టడం పాడడం కోసమే" అని వాడు సమాధానమిచ్చేడు. వాడి పితృదేవతలు మంచి సంగీత విద్వాంసులు అవ్వచ్చు.
ఆధ్యాత్మికతకూడా ఒక తరం నుంచి ఉంకో తరానికి అందించవచ్చు. వంశంలో ఒకడు ధ్యానం అలవరుచుకుంటే, అతడు పరంపరను మొదలు పెడతాడు. కొన్నేళ్ళ తరువాత ఒక వంశీయుడు, మిత్రుడు, లేదా నాస్తికుడు ఉత్తేజితుడై ఆధ్యాత్మిక చింతన వానినుంచి అలవరుచుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు పరంపర భగ్నం అవుతుంది. ఒక కూతురు సాహిత్య వేత్త అవ్వవచ్చు, కొడుకు కుండలు చేసేవాడు అవ్వవచ్చు. కానీ అది ఎన్నటికీ మాటు మాయం అవ్వదు. మన దేశంలో ఋషుల పరంపర 5000 ఏళ్ల నాటినుంచి కొనసాగుతోంది. మనమీదకి ఎంత మంది దండయాత్రలు చేసినా, శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి, మహాత్మా గాంధీ లాంటివారు మనల్ని ఉద్ధరించడానికై పుట్టేరు.
నేటి కాలంలో పర్యాటకులు దేశంలో అన్ని చోట్లా ఆధ్యాత్మికత ఉందని తలుస్తారు. వారు విమానం దిగినవెంటనే దేవుని గీతాలు, ధ్యానం చేస్తున్న ఋషులు విమానాశ్రయంలో ఉంటారని తలుస్తారు. నగరంలో ఎక్కడికి వెళ్ళి చూసినా ఆధ్యాత్మికత కనపడదు. అలా చూసుకుంటూ పోతే ఏదో ఒకనాడు రమణ మహర్షి లాంటివారు ఏ చెట్టు కిందో కూర్చొని ధ్యానం చేస్తూకనపడతారు.
రాబోయే శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పేది: అధర్మం చెలరేగినప్పుడు ఒక గొప్ప మత గురువు, సరైన సమయంలో, మనం డబ్బు, దస్కం, పేరుప్రతిష్ఠలు కాక పరోపకారానికై బ్రతకాలని చెప్పడానికి ఉద్భవిస్తాడు. 215
No comments:
Post a Comment