Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 4 Section 1

Bhagavat Gita

4.1

శ్రీ భగవానువాచ:

{4.1}
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్

వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్

అవ్యయమగు ఈ యోగమును మొదట నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు మనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకునకు చెప్పెను

శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని వివస్వత్ కు చెప్పేననడంలో అంతరార్థం వివస్వత్ నకు తనపై ధ్యానం చేసి ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొనే, ఇతరులను తనకంటే ముఖ్యులుగా చూసుకొనే, అంతర్గతంలో ఉన్న దేవుని దర్శించుకొనే స్పూర్తి కలిగించేడు. వివస్వత్ తన జ్ఞానాన్ని మనువుకు అందించేడు. అతనూ ధ్యానం చేసి భగవంతుని దర్శించేడు. మనువు ఇక్ష్వాకునికి బోధించేడు. అతనూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందేడు.

అన్ని మతాలు దేవుని కృప గూర్చి చెప్తాయి. ఒక్కొక్కప్పుడు మన మీద దేవునికి కృప అనుకోకుండా కలుగుతుంది. మయిస్టెర్ ఎక్ హార్ట్ చెప్పినట్లు మనము బెస్తవాడి గాలంలో చిక్కుకున్నచేపలా అవుతాం. ఎంత ప్రయత్నించినా గాలం నుండి బయటపడలేని చేప వలె మనం కొట్టుమిట్టాడుతాం.

కానీ దేహమనే గృహాన్ని వదలలే౦. దేవుని కృప పొందినా, ఆయనే అంతా చేస్తాడని అనుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలంటే మన మనస్సు యొక్క కృప కూడా ఉండాలి. అందుకై మంచిని ఎన్నుకోవాలి. నా అమ్మమ్మ చెప్పినట్లు: "దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వాలి".

కృప ఒక అస్త్రంలాగ పని చేసి మనస్సును అతలాకుతలం చేస్తుంది. డబ్బు, దస్క౦, పేరుప్రతిష్ఠలు మనను సంతృప్తి పరచవు. నాలుక కూడా రుచులు కోరదు.

అసంతృప్తితో మనశ్శాంతి కలుగదు. మనము తిన్నగా కూర్చోలేము, పడుకోలేము. ఇది మన అంతర్గత దేవుడు ధ్యానం చెయ్యమనే ఇచ్చే సూచన. అశాంతిని మనము ధ్యానం వైపు మళ్ళించి ఉపశమనం పొందాలి. 214

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...