Bhagavat Gita
6.15
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృటా
{6.19}
యోగినో యతచిత్తస్య యుంజతే యోగ మాత్మనః
యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా
{6.20}
యత్ర చైనాత్మ నాత్మానాం పశ్యన్నాత్మని తుష్యతి
సుఖ మాత్య౦తికం యత్త ద్భుద్ధిగ్రాహ్య మతీ౦ద్రియమ్
{6.21}
వేత్తి యత్ర న చైవాయం స్థిత శ్చలతి తత్త్వతః
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః
{6.22}
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే
తం విద్యా ద్ధుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితమ్
{6.23}
స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణచేతసా
ఆత్మ ధ్యానము నభ్యసించు యోగి యొక్క నియమిత చిత్తము గాలిలేనిచోట నుండు దీపము వలె నిశ్చలముగ నుండును. యోగోభ్యాసముచే నిగ్రహింపబడిన మనసు ఎచ్చట ఉపరతి నొందుచున్నదో, ఎచ్చట ఆత్మను ఆత్మయందు ఆత్మ చేత దర్శి౦చి సంతసించుట జరుగుచున్నదో, ఇంద్రియములకు లభించక, బుద్ధికి లభించు సుఖము ఎచ్చట తెలియబడుచున్నదో, ఎచ్చట చేరిన పిమ్మట చలనము ఉండదో, దేనిని పొందిన పిదప దుఃఖములు కూడా కదలింపలేవో, సర్వ దుఃఖములకు దూరమైయున్న దేదియో అదియే యోగమని చెప్పబడినది. అట్టి యోగమును విసుగు చెందక నిశ్చయ బుద్ధితో అభ్యసింపవలెను
కేరళలో గుళ్ళలో ప్రమిద దీపాలు ఈదురు గాలి లేని గూళ్ళలో పెట్టేవారు. మన మనస్సు నిశ్చలంగా ఉండే దీపం లాగ ఉండాలి.
మనం గొప్పవారిని--దేశ అధ్యక్షుడు, అతి పెద్ద పరిశ్రమ అధినేత, సినిమాలలో నటించే కథా నాయకీనాయకులు-- కలవాలని కాంక్షిస్తా౦. మనలోని ఆత్మ దర్శనం అన్నిటికన్నా లేదా అందరికన్నా ముఖ్యం.
ఆత్మ దర్శనం చేసుకొంటే ప్రపంచంలోని ధనం, సుఖం, పేరు ప్రఖ్యాతులు దాని సాటి రావు. ధ్యానం వలన వచ్చే ఆనందం వాటితో పోలిక పెట్టే అవకాశం కలిగిస్తుంది. ధ్యానం చెయ్యకపోతే అవి అల్పమైన వాంఛలని తెలియదు.
సమాధి స్థితిలో విచారము, ద్వేషము, ఎదురుచూపు, అశాంతి తొలగిపోతాయి. అది దుఃఖానికి అతీతం. మనం దేవునిలో స్థితమై, జీవులన్నిటిలోనూ దేవుని దర్శిస్తాము. శ్రీకృష్ణుడు అర్జునికి ఇలా చెప్పేడు: "నీవు పట్టుదలతో ఆధ్యాత్మిక సాధన చేసి, దుఃఖాన్ని జయించి, జీవైక్య సమానతా దృక్పథాన్ని పొందు" 364
No comments:
Post a Comment