Saturday, April 26, 2025

Viveka Sloka 37 Tel Eng





స్వామిన్నమస్తే నతలోకబంధో
కారుణ్యసింధో పతితం భవాబ్ధౌ ।
మాముద్ధరాత్మీయకటాక్షదృష్ట్యా
ఋజ్వ్యాతికారుణ్యసుధాభివృష్ట్యా ॥ 37॥

నతలోకబన్ధ = నమస్కరించు జనులకు బంధువైన, స్వామిన్ - ఓ ప్రభూ!, తే - నీకు, నమః - నమస్కారము, హే కారుణ్య సింధో - ఓ కారుణ్య సముద్రుడా, భవాబ్దౌ = సంసార సముద్రమునందు, పతితం- పడిన, మాం - నన్ను. ఋజ్వ్యా - వక్రము గానదియు, అతికారుణ్యసుధా భివృష్ట్యా - అత్యధికముగు కారుణ్య మనెడు అమృతమును వర్షించునదియు అగు, కటాక్ష దృష్ట్యా - కటాక్ష వీక్షణముచే, ఉద్ధర - పైకి లేవదీయుము,

నతానాం = నమస్కారముచేయు జనులకు, బంధ-దుఃఖ విమోచకుడు, అతనికి సంబుద్ధి 'నతలోకబంధో,'

"ఓ స్వామీ! నీకు నమస్కారము, ప్రహ్వీభావము అగు గాక" అని యర్థము.

నీవు నతలోక దుఃఖమోచకుడవు గాన నిన్ను దుఃఖవిముక్తి కై నమస్కరించు చున్నాను అని భావము.

'కారుణ్య సింధో;' అను సంబోధనముచే అందులకు కారణమును చెప్పుచున్నాడు. 'అహేతుక దయాసింధుః' అనుపదమును వ్యాఖ్యానించు నవసరమున దీని భావము వివరింపబడినది. తనకున్న దుఃఖ మేదియో చెప్పుచున్నాడు.

'భవాబ్ధా పతితం '= జన్మ - జరా - రోగ - మరణాది మహానర్ధములతో వ్యాకులముగనున్న సంసారసముద్రములో పడినవాడను అని యర్థము.

ఇపుడు దానికి నివృత్తిని ప్రార్థించుచున్నాడు “ఆత్మీయకటాక్షదృష్ట్యా ” = నీ లోచనాంతము చేత అని యర్థము.

బ్రహ్మసాక్షాత్కారముచే సకల మాలిన్యములును తొలిగిపోయిన నీ పవిత్ర కటాక్షము ప్రసరింపగనే నా పాపములన్నీ పటాపంచలై నేను సంసారసాగరమును దాటగల నని భావము.

యస్యానుభవపర్యన్తా బుద్ధి నత్వే ప్రవర్తతే,

తద్దృష్టిగోచరాః సర్వే ముచ్యస్తే సర్వకిల్బిషైః

బ్రహ్మానుభూతిని పొందినవారి దృష్టి ప్రసరించిన అందరి పాపములును తొలగిపోవును అని చెప్పబడినది.

ఇట్లు చెప్పుటచే ‘శిష్యుడు గురువు నకు పూర్తిగ ఎదురుగ కూర్చుండగూడదు' అను వినయపద్దతి సూచిత మైనది. మరియు, నీ కటాక్షపాతముగూడ సంపూర్ణావలోకనమే కావున దానిని కోరుచున్నానని అర్థము. నిత్యశుద్ధ బ్రహ్మానందమగ్న మగు (నీ) మనస్సు నేత్రాంతము ద్వారా పరిపూర్ణముగ నాపై ప్రసరింపగనే నేను సర్వవిధముల పూతుడనై దుఃఖవిముక్తుడ నౌదును అని భావము.

లేదా "ఆత్మీయకటాక్షదృష్ట్యా ' అనగా 'నీ యొక్క సానుగ్రహ దృష్టితో' అని యర్థము. ఋజ్వ్యా - స్వభావముచే సరళమైనది. ఈ విశేషణముచే లోకమున అగాధ జలములో పడిన వాడు పొడవైన త్రాడునుగాని కఱ్ఱనుగాని ఊతగ గొని ఎట్లు పైకి వచ్చునో అట్లే నేను అతిదీర్ఘమగు నీకటాక్షమును ఊతగగొని సంసార సముద్రమునుండి ఉద్ధరింపబడుదును అని సూచితమగుచున్నది.

సూర్యమండలము, దీపము మొదలగు వాటినుండి కిరణములు పుంజీ భూతములై త్రాడువలె ఎట్లు బయల్వెడలునో అట్లే చక్షురింద్రియము గూడ తేజోరూపము గాన దాని నుండి బయల్వెడలిన కిరణములు ఈతని పై సంక్రమించి, బ్రహ్మనిష్టముగు (గురువుయొక్క) మనస్సుతో సంబంధించినవగుటచే ఈతనిని ఉద్ధరించునని భావము.

అతికారుణ్య సుధాభివృష్ట్యా = అత్యంతము కారుణ్యము అతికారుణ్యము; అదియే సకల తాపహారక మగుటచే సుధయని ఆరోపింపబడుచున్నది. సుధ యనగా అమృతము. దానియొక్క వర్షము, అంతటను ఏ దృష్టి యందు ఉన్నదో అట్టి దృష్టిచేత అమృతవృష్టిచే పురుషుడు జరా మరణాదులు లేనివాడగు నని ప్రసిద్ధము.

యుద్ధమునందు మరణించిన వానరులను ఇంద్రుడు అమృతమును కురిపించి పునర్జీవితులను చేసెనని రామాయణమున ప్రసిద్ధము. ఆ అమృతమే అట్టి ఫలమును కలిగించ కలిగిన దన్నచో దయామృతమును కురిపించెడు బ్రహ్మనిష్ఠుని దృష్టి శాశ్వతమగు జరామరణరాహిత్యమును ఈయగల దనుటలో సందేహమేమి ?

అవ. తన ఉద్ధరణము విషయమున ఆలస్యము నేమాత్రము సహింపనివాడై తనకు గల తీవ్రముముక్షుత్వమును ప్రకటించు చున్నాడు …

svāminnamaste natalokabandho
kāruṇyasindho patitaṃ bhavābdhau | 
māmuddharātmīyakaṭākṣadṛṣṭyā
ṛjvyātikāruṇyasudhābhivṛṣṭyā || 37 ||

Why should we pray? The simple answer is to thank the god who possesses everything we come in contact with our senses, mind and intellect. After all, he is the creator and primary owner of everything.

After it is established that one should pray, the question is: For how long? How often? This is debatable and requires elaboration. When we begin to do aerobic exercise, the instructor gives a formula to raise the heart-beat above the resting heart-beat of 72 per minute.The Aerobic Heart Zone is defined as in the range 70-80% of the Maximum Heart Rate that varies by age, body mass index, etc. It is not enough that the Aerobic Heart Zone is attained; it has to be sustained for a variable period of time as well to get full benefit. One need not go through such complex biomechanical aspects for prayer.

The frequency of prayer, similarly, is once a day or more depending on one's station in life: child, youth, elder, etc. There are those who visit temples once a week to offer prayers to their favorite deity. The devotees of Anjaneya will set aside everything on Tuesday evenings, for example, to visit his temple. The Lord Venkateswara devotees consider Saturdays as the best to visit the temple. The Ayyappa devotees, on the other hand, endure great austerities for weeks and embark an arduous trek to see their Lord in Sabarimalai.

Then we come to the question: what should we pray about? Generally, during prayer we seek favors for ourselves and immediate family members and friends. There are those who pray for world peace. Some go to the extent of conducting yagnas (fire ceremonies) to invite rains following a drought. Given all these, the general pattern is to pray for "something" or "someone". Indeed the Chamakam provides a comprehensive list of things that the devotees of Lord Siva seek ranging from food to cows. In Namakam, however, the devotees seek protection from natural calamities and diseases for their families and clan.

Is there a prayer without seeking anything? There has to be because most of the hymns in our scripture have phala sruti that comprehensively summarizes the list of boons the deity of the hymn will confer automatically.

Thus, Sankara in this sloka is advising the sadhaka to pray the guru who can lift him from samsara (bondage) and pave the way for brahma gnana (enlightenment about Self). Our scripture already has a simple guru prayer: "guru brahma; guru vishnu; guru devo maheswara; guru sakshat parabrahma; tasmaisree gurave namaha", where the guru is elevated to the level of the gods of creation and sustenance.

Thursday, April 17, 2025

Viveka Sloka 36 Tel Eng




తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వప్రశ్రయసేవనైః । (పాఠభేదః - ప్రహ్వః)
ప్రసన్నం తమనుప్రాప్య పృచ్ఛేజ్జ్ఞాతవ్యమాత్మనః ॥ 36 ॥

భక్త్యా = భక్తిచే, ప్రహ్వ - వంగినవాడై, ప్రశ్రయసేవనైః = వినయముతోడను, సేవనముతోడను, తం= అట్టి, గురుం= గురువును, ఆరాధ్య = సేవించి, ప్రసన్నం = ప్రసన్నుడైన, తం = ఆ గురువును, అనుప్రాప్య - సమీపించి, ఆత్మనః - ఆత్మకు సంబంధించిన, జ్ఞాతవ్యం - తెలియవలసిన విషయమును, పృచ్చేత్ -- ప్రశ్నింపవలెను.

భక్తిః = పూజ్యుల విషయమున ప్రేమ. ఇది మానసమగు ధర్మము; దానిచేత, ప్రహ్వః = ఆ భక్తిని సూచించు ఆకారముకలవాడై, వంగిన శరీరముకలవాడై, దోసిలియొగ్గినవాడై, 'ప్రశ్రయసేవనైః'- వినయముతో మాటలాడుట ప్రశ్రయము. సాష్టాంగ ప్రణామము, పాదములు ఒత్తుట, ఆయన ఆజ్ఞ ప్రకారము చేయుట మొదలగునవి సేవనములు.

వాటిచే ఆతనిని సేవించి, నిష్కపటమగు ఆ సేవచే ప్రసన్నుడైన తన విషయమున అభిముఖుడుగానున్న, ఆయనను, అనుప్రాప్య = ఆయన నిర్దేశించిన సమయమున ఆయన సమీపమున యథావిధిగ ఉండి, ఆత్మ యథార్థస్వరూప విషయమున తెలియదగిన విషయమును గూర్చి ప్రశ్నింపవలెను.

"భక్త్యా ప్రహ్వః ప్రశ్రయ సేవనై రారాధ్య" అని చెప్పుటచే ఆరాధనము చేయువాడు మనస్సు, వాక్కు, శరీరము అను త్రికరణములను శుద్ధముగ నుంచుకొనవలెను అని చెప్పబడినది.

అవ. భక్తి పురస్సరముగ వాక్కుతో ఏ విధముగ సేవింప వలెనో భగవత్పాదులు జిజ్ఞాసువుల విషయమున దయచే 'స్వామి న్నమస్తే 'అను శ్లోకముమొదలు 'తథావదనం' అను శ్లోకము వరకును గల ఏడు శ్లోకములలో బోధించుచున్నారు.

tamārādhya guruṃ bhaktyā prahvapraśrayasevanaiḥ | 
prasannaṃ tamanuprāpya pṛcchejjñātavyamātmanaḥ || 36 ||

In this sloka Sankara is laying down the qualities of an ideal disciple: humbleness, service, obedience, softness, etc. The purport of them is to obtain the knowledge about self or atma.

Atma has been described by Charvakas or materialists as nothing but a body. This was also the understanding of Virochana, the king of asuras. But in sruti pramana, especially upanishats, atma was described as all pervading, of atomic size and blissful. If one thinks of atma as indriyas (senses), budhi (intellect), manas(mind) or consciousness, then all of these are absent in deep sleep (sushupti). So we conclude atma is not an insentient part of the body but a sentient witness.

Indeed the rishis say the only way to grasp atma is to use "neti, neti" ("not this, not this"). So whatever has existence and is cognisable, automatically, won't qualify as atma. Since science also deals with existence and cognition, it is prudent to say atma can't be found with scientific instruments.

The scripture says atma can't be inferred by any pramana and not tacticle. In Gita, Lord Krishna preaches to Arjuna: "atma can't be pierced by an arrow, made wet by water or destroyed with fire." This is to show that atma has no birth (anadi), therefore, has no end. The mahavakya "tattvamasi" (thou art that) says the quality of atma is same as that of the omnipotent, omniscient, omnipresent brahman, just as science tells us mass is nothing but frozen energy.

So what more can a guru tell an obedient disciple about atma? It is self-effulgent and makes our bodies function (chaitanya). One can say it is prana (breathing) that makes bodies function, for, when prana stops, the body becomes inert. But prana can be controlled with pranayama and we don't see the body turn inert. On the other hand, science tells us an organ for transplant is functional even when it is taken out of the body without the presence of prana.

It is apparent that atma can't be described with our consciousness other than as the enjoyer of physical and psychological experiences and has the quality of bliss. It is necessary to counter materialists who profess: we are born by accident; the purpose of life is to enjoy; there are no heaven or hell; there is no soul; when we die that's the end of it, etc. The chink in their argument is the inability to explain deep introspective questions like "why are we born to a certain parents?", "why do some newborns have genetic defects?", etc. In our scripture, such questions are dealt in the form of reincarnation of atma, which even some religious people don't believe, in a different body based on karma: a soul is born as a child to a couple either as retribution or because of indebteness; a genetic disorder is the phala(fruit) of the karma in earlier lives of the soul, and so on.

Since religion always has an answer where science fails to explain, the proper gurus enlighten their disciples with the knowledge about atma, so they won't be waylaid in their sadhana because they have no clue to answer simple questions like "Who am I?".

Friday, April 11, 2025

Viveka Sloka 35 Tel Eng





శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః ।
బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః ।| 34 ||

అహేతుకదయాసింధుర్బంధురానమతాం సతామ్ ॥ 35 ॥

శ్రోత్రియః = ఉపనిషద్రూప వేదాధ్యయనము చేసినవాడును, అవృజినః - పాపములు లేనివాడును, అకామః = కామములచే పీడింప బడనివాడును, బ్రహ్మవిదుత్తమః = బ్రహ్మవేత్తలలో ఉత్తముడును, బ్రహ్మణి = బ్రహ్మయందు, ఉపదతః = లీనమైన మనస్సు కలవాడును, నిరంధన - ఇంధనములులేని, అనం ఇవ = అగ్నివలె, శాన్తః - శాంతుడును, అహేతుకదయా సిన్ధుః - నిష్కారణమగు దయకు సముద్రమువంటివాడును, అనమతాం = నమస్కరించుచున్న, సతాం = సత్పురుషులకు, బన్దు: - బంధువును (అగు మహాపురుషుడు గురువు).

సూ, "శ్రోత్రియశ్చందో అ ధీతే" అను పాణిని సూత్రము ననుసరించి 'శ్రోత్రియః' అనగా ఉపనిషత్తుల అధ్యయనము చేసిన వాడు అని అర్ధము. ఉపనిషదధ్యయనముచేసి వాటి అర్థమును విచారించు వానికే సాక్షాత్కారము కలుగును. అవృజినః పాపములు లేనివారు.

నావిరితో దుశ్చరితాత్ నాశాన్తో నా సమాహితః,

నాశాన్తమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్

పాపములనుండి విరమింపనివాడు, ఇంద్రియనిగ్రహము లేనివాడు, చితైకాగ్రత లేనివాడు, శాస్త్రమైన మనస్సు లేనివాడు, ఈ ఆత్మను బుద్ధిచే తెలిసికొనజాలడు అని శ్రుతి చెప్పుచున్నది.

విషయాశచేత, హతః - పీడింపబడుచున్న వాడు, స్వరూప జ్ఞానములేని వాడు, కామహతుడు కానివాడు, అకామహతుడు, స్వస్వరూపమగు ఆనందమును గుర్తించనివాడు, బాహ్యవిషయములలో మున్నదను అభిప్రాయముతో పాపముకూడ చేయవచ్చును. కాని ఈ బ్రహ్మవేత్త స్వరూపానందమును సాక్షాత్కరించు కొనిన వాడగుటచే

విషయ వినివర్తిన్తే నిరాహారస్య దేహినః,

రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.

ఆహారము లేని విషయభోగములు చేయనివానికి భోగములు తమంతట తామే దూరమగును. రసము మాత్రము, అభిలాష మాత్రము , మనస్సులో ఉండును.

ఆ పరమాత్మను చూచిన పిమ్మట ఆ రసముకూడ తొలగిపోవును అని భగవద్గీతలో చెప్పిన విధమున రాగనివృత్తి రూపమగు అకామ హతత్వము అతనికి సిద్ధించును. కావున అతడు పాపరహితుడు. కామమేకదా పాపమును చేయించునది ? కావుననే

అథ కేన ప్రయుక్తో అ యం పాపం చరతి పూరుషః,

అనిచ్చన్నపి వాగ్గేయ బలాదిన నియోజితః,

ఓ శ్రీకృష్ణా ! మానవుడు బలాత్కారమును దేనిచే ప్రేరితుడై ఇష్టము లేకున్నను పాపము చేయుచున్నాడు అని భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నింపగా, శ్రీకృష్ణుడు.

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః,

మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణమ్ .

రజోగుణమువలన బుట్టిన కామము క్రోధము అనునవి మనుష్యుని పాపాచరణమున ప్రేరేపించుచున్నవి. ఇవి తీరని ఆకలిగలవి, మహా పాప హేతువులు అనిచెప్పియున్నాడు.

బ్రహణ్యపరతః బ్రహయందు విలీనమైన మనస్సుకలవాడు. కావుననే కట్టెలు లేని అగ్నివలె శాంతమైనవాడు.

ఇంధనములు లేనిచో అగ్ని ఎట్లు జ్వాలావిహీనమై శాంతముగ ప్రకాశించునో, అట్లే ఇతడు బాహ్యవృత్తులు నన్నింటిని ఉపసంహరించుకొని నిర్గుణబ్రహ్మయందే చిత్తమును నిలుపుకొనుటచే నిర్వికారుడై యుండును అని భావము. బ్రహ్మవిత్త మునియందు అశ్రోత్రియత్వముగాని, పాపముగాని, కామ హతత్వముగాని అసంభావ్యములుగాన ఇచట ప్రయుక్తములగు శ్రోత్రియత్వాది విశేషణములు వ్యావర్తకములు కావు, అట్టి గురువు యొక్క స్వరూపమును బోధించునవగుటచే ఇవి స్వరూపలక్షణములు మాత్రమేయని గ్రహింప వలెను.

'తెల్లని అవు' అనునపుడు 'తెల్లని' అను విశేషణమును ప్రయోగించుటచే ఆ ఆవు ఎఱ్ఱనిధిగాని, నల్లనిదిగాని, మరి ఇతర వర్ణము కలదిగాని కాదు అను అర్థమువచ్చును. ఆవులలో తెలుపుకంటే భిన్నములగు వర్ణములు సంభావ్యములు గాన ఈ విశేషణము వాటి నన్నింటిని నిషేధించు చున్నది. అందుచే అది వ్యావర్తకము.

ఆ విధముగ ఇచట బ్రహ్మవిదుత్తముని విషయమున ప్రయోగించిన 'శ్రోత్రియః' ఇత్యాది విశేషణములు వ్యావర్తకములు కావు. ఆవునకు తెలుపుకంటె భిన్నములుగు వర్ణము లున్నట్లు అతనికి అశ్రోత్రియ తాదులు ఉండుటకు అవకాశము లేదు.

కావున 'శ్రోత్రియః’ ఇత్యాదిపదములు ఆ బ్రహ్మవిదుత్తముని స్వరూపమును మాత్రమే బోధించును. ' తెల్లని పాలు' అన్నప్పుడు 'తెల్లని ' అను విశేషణము నల్లని పాలు లేకుండుటచే ఏ విధముగ ఇతర వ్యావర్తకముకాదో అట్లే ఇతర వ్యావర్తకములు కావు. స్వరూపలక్షణ కథనమాత్ర పరములు.

హేతువు లేని ఏదయ- అనగా ఇతరుల దుఃఖమును తొలగింపవలెననెడు ఇచ్ఛ, గలదో దానికి సింధువు, అనగా ఆశ్రయభూతుడు.

లోకమున దయావంతులగు ఇతరులకు గూడ పరుల దుఃఖములను చూచినపుడు దయ కలుగవచ్చును. కాని ఈ దయ పరులదుఃఖమును చూచుటచే తనకు కలిగిన దుఃఖమునుబట్టి కలిగినది. కావున ఈ దయకు కారణ మున్నది.

బ్రహ్మవిదుత్తమునకు కలుగు దయ అట్టిది కాదు అని చెప్పుటకై 'అకారణ' అను విశేషణము. ఇట్టి జ్ఞానికి స్వతః కాని, పరులవల్ల కాని దుఃఖము కలుగు నవకాశము లేదు. సమాధిస్థితినుండి బైటకు వచ్చినపుడు ఈ జనులు సంసారసముద్ర మును తరింతురుగాక అని ఇచ్ఛ కలుగును. బన్ధుః= దుఃఖమును తొలగించువాడు. ఎవరియొక్క? అసమతాం సతామ్ - వినయముతో నమస్కరించిన సత్పురుషులకు; ఇట్లు చెప్పుటచే శిష్యుల లక్షణములను పరిశీలించిన పిమ్మటనే వారు ఉపదేశింతురని సూచితమైనది.

శ్రు. “ నాసూయకాయానృజవే అ శఠాయ" - అసూయకలవానికి, వక్ర స్వభావముకలవానికి, రహస్యముగ అపకారము చేయువానికి బోధింప గూడదు,

శ్రు. " ఇదమశిష్యాయ నో దేయం" దీనిని ఉపదేశార్హత లేని వానికి ఉపదేశింపగూడదని శ్రుతులు చెప్పుచున్నవి.

భగవద్గీతలోగూడ..

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన,

న చాశుశ్రూషవేవాచ్యం న చ మాం యో అ భ్యసూయతి.

తపస్సులేనివానికిని, భక్తుడు కాని వానికిని, శ్రవణేచ్చలేని వానికిని, నన్ను ద్వేషించువానికిని దీనిని బోధింపగూడదు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పియున్నాడు. ఈ విధముగ ఇట్టి గురువువద్దకు వెళ్లుటకు "ఉపసధనము' అనిపేరు.

అవ. తరువాత ఏమిచేయవలెనో, భగవంతుడగు భాష్య కారుడు, శిష్యునకు కరుణతో బోధించుచున్నాడు.

śrōtriyō'vṛjinō'kāmahatō yō brahmavittamaḥ ।
brahmaṇyuparataḥ śāntō nirindhana ivānalaḥ ।
ahētukadayāsindhurbandhurānamatāṃ satām ॥ 35॥

In this sloka Sankara is delineating the qualities of a guru: without sin, desireless, meditating on self, calm, kind, a friend to the devotees, etc. There is no end to the list. He is simply a godly person.

All major religions proclaim godly qualities. Hindus consider these as godly qualities:

  • fearlessness even in the midst of sorrow;(abhayam)
  • purity of mind; (sattva samshuddhi)
  • doing work without aspiring for the fruits thereof; (yagna)
  • study of the Vedas(scripture); (svadhyaya)
  • penance and meditation;(tapas)
  • non violence; (ahimsa)
  • speaking the truth; (satya)
  • not getting angry; (akrodha)
  • controlling outward senses; (dama)
  • not resorting to backbiting or slander; (apaisunam)
  • compassion; (daya)
  • desirelessness for inappropriate objects; (aloluptvam)
  • gentleness; (mardavam)
  • splendour; (tejas)
  • patience and forbearance; (dhriti)
  • steadfastness; (gnana yoga vyavasthithi)
  • peace; (shanti)
  • non-hatred; (adroha)
  • absence of pride;(hri)
  • renunciation; (tyaga)
  • charity; (dana)
  • straightforwardness; (arjavam)
  • absence of restlessness; (achapalam)
  • forgiveness; (kshama)
  • purity; (shaucha)
  • lack of conceit; (naatimanita)

To demonstrate all these qualities, especially kindness, in Gita the Lord said in a lifetime or in several reincarnations one can aspire to rise from tamas(indolence) to rajas(action) to sattva(calmness) and attain moksha(liberation).

In a normal course of events, a jiva is born in tamas. As it grows it acquires rajas to perform various activities. In the old age, the jiva acquires sattva seeking moksha.

What if the jiva dies while still in rajas?

The Lord assures that when the jiva reincarnates it begins where it had left off in the previous life.

Many of us are like this: reincarnating again and again with tamas or rajas without acquiring suddha sattva in a lifetime let alone over several reincarnations. This is where seeking a proper guru leads us to the goal!

Friday, April 4, 2025

Viveka Sloka 33.1 Tel Eng




ఉక్తసాధనసంపన్నస్తత్త్వజిజ్ఞాసురాత్మనః ।
ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధవిమోక్షణమ్ ॥ 33 ॥

ఉక్త సాధన సంపన్న=పూర్వోక్తములగు వివేకాది సాధనములతో సంపన్నుడగు పురుషుడు, ఆత్మనః = ఆత్మయొక్క, తత్త్వజిజ్ఞాసుః = తత్త్వమును తెలియదలచినవాడై, యస్మాద్ - ఏ గురువువలన, బంధ విమోక్షణం = బంధ మోక్షము కలుగునో, అట్టి, ప్రాజ్ఞం = బ్రహ్మనిష్ఠుడైన, గురుం - గురువును, ఉపసీదేత్ = సమీపించవలెను.

ఉక్త సాధన సంపన్న విచారసాధనములుగా చెప్పబడిన ఏ వివేకాదిసాధనములు గలవో వాటితో కూడిన, 'పుమాన్ ' అని అధ్యాహారము. తనయొక్క యథార్థ స్వరూపమును తెలియదలచిన వాడై, ఉపసీదేత్-శరణము పొందవలెను.

గురుం ఉపదేశకర్తనుః 'ప్రజ్ఞా' అనగా నిరతిశయము, అత్యుత్కృష్టము అగు జ్ఞానము. అనగా బ్రహ్మసాక్షాత్కారము. 'బ్రహ్మాత్మనః శోధితయోః' అని మున్ముందు చెప్పనున్న ఈ ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు.

ప్రజ్ఞుడే ప్రాజ్ఞుడు; అనగా బ్రహ్మనిష్ఠుడు. యస్మాత్- ఏ గురువునుండి, అజ్ఞాన కల్పితమగు అహంకారాది దేహాన్తమగు బంధమునకు నివృత్తి కలుగునో అట్టి వానిని, శరణు పొందవలెను అని పురుషునకు గల్గు లాభమును చెప్పుచున్నాడు.

అట్టి గురువును సేవించినచో అతని ఉపదేశముచే తన యథార్థస్వరూపము తెలియును. అపుడు బంధ నివృత్తిరూపమగు మోక్షము సిద్ధించును అని భావము.

అవ. ఆ గురువు యొక్క లక్షణములనే విశదీకరించుచున్నాడు -

uktasādhanasampannastattvajijñāsurātmanaḥ ।
upasīdēdguruṃ prājñaṃ yasmādbandhavimōkṣaṇam ॥ 33॥

In this sloka Sankara is extolling the importance of a guru. Nowadays, people have gurus for individual activites like yoga guru, math guru, investment guru, etc. Sankara suggests that there should a praagna as a guru for a sadhaka. What he means is one who has abided in Self and able to communicate effectively his feelings and thoughts. The guru takes care of the needs of the sadhaka and teaches him scripture in return for service, devotion and loyalty.

Lord Rama had several gurus: Viswamitra, Vasishtha, etc. In Yudha Kanda of Valmiki Ramayana Sage Agastya became a guru to Rama when fighting Ravana's army for several days and feeling exhausted. Without a recourse he was dejected. At that juncture Sage Agastya visited Rama and taught him the hymn Aditya Hrudayam. Aditya is one of the many names of the Sun god. But why worship Sun god?

It is generally accepted that Rama traveled from north to south in search of his beloved Sita. The temperatures in the deep south of India are intolerable, especially in the summer months, for a northener. Only locals could adapt to the scorching sun and carry on their tasks. Rama, on other hand, had no in built adaptation to withstand the searing heat let alone fight Ravana. Even though Rama is a god, he was in human form and found himself unable to win over Ravana who had always beeen a southerner.

Sage Agastya understood that the Sun god needed to be appeased if Rama had to win in the war. Therefore, he composed Aditya Hrudayam and revealed the secret to Rama so that he could better fight Ravana. Such is the power of a guru!

Viveka Sloka 38 Tel Eng

Telugu English All దుర్వారసంసారదవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతైః । భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యద్యదహం న జాన...