Thursday, March 10, 2022

Chapter 14 Section 13

14.13

కర్మణ స్సుకృత స్యాహుః సాత్వికం నిర్మలం ఫలం {14.16}

రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం

సుకృతములైన సాత్విక కర్మలకు నిర్మలత్వము ఫలము. రాజస కర్మలకు దుఃఖమే ఫలము. తామస కర్మలకు అజ్ఞానము ఫలము

సత్త్వ గుణము వలన దయతో కూడిన కర్మలు చేయబడతాయి. దయకు ఫలం నిర్మలమైన హృదయం. దానివలన అసూయ, ద్వేషము, మొదలగునవి ఉండవు. అలాగే ఒకే విషయాన్ని పట్టుకొని వ్రేలాడుట, ఇతరులను వంచించుట వంటి భావములు ఉండవు. ఇతరులు ఏమనుకున్నా, వారు దయలేనివారయినప్పటికీ సాత్వికుడు వారియందు దయతోనే మెలగుతాడు. ఇటువంటి గుణము చేతనమును పరిశుద్ధము చేయును. ఎందుకంటే దానికి మారే గుణము లేదు. అట్లే క్రోధము, విరోధము, భయములు లేవు. ఇతరులతో ఉన్న తారతమ్యమును సత్త్వ గుణముతో తగ్గించి మన హృదయమును శుద్ధి చేసుకోవచ్చు. సాత్వికులు గాని వారలను దూరముగా పెట్టుటవలన కలిగే లాభమేమీ లేదు.

సామరస్యము, పరిజ్ఞానం, వివేకం సత్త్వ గుణము వలననే సాధ్యము. రాజసికుడు ఒక విషయముపై తీవ్ర పరిశోధన చేయవచ్చు. దాని వలన అనేకమైనవి తెలిసికొనవచ్చు. కాని వానికి ఎటువంటి జ్ఞానోదయము కలుగదు. రాజసికుడు 20 ఏళ్లు ఆధ్యాత్మిక చింతన చేసినా జీసస్ లేదా బుద్ధుడు చెప్పిన బోధ వాని బుర్రకెక్కదు. వానితో పోలిక చేస్తే సామాన్య మానవులు వందల కొద్ది సంవత్సరాల క్రింద చేసిన బోధను బాగా అర్థంచేసికొ౦టారు.

సాత్వికుడు జీవితము యొక్క అంతర్భాగం, దానిలోని సంయోగము చూస్తాడు, లోతుగా తెలిసికొ౦టాడు. రాజసికుడు కూడా ఎక్కువ తెలిసికోవాలని ప్రయత్నం చేస్తాడు. దానివలన వానికి కలిగేది గందరగోళము. శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనకు కలిగే ఫలము మన మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది.

ఎవ్వడి కర్మలైతే వ్యాకులతతో, దూరాశతో, స్వార్థంతో కూడిఉంటాయో, వాటి ఫలం మొదట్లో ఆనందం కలిగించినా, పోను పోను వేదన, దుఃఖము కలిగిస్తాయి. ఒక పొగాకు సంస్థలో పనిచేసే వాడు ఎక్కువ ధనమును ఆర్జించి తన కుటుంబాన్ని సుఖంగా ఉంచవచ్చు. తన ఆర్జితం ఎక్కడ నుంచి వస్తున్నాదో తెలియకపోవచ్చు. తన కారణం వలన పొగాకు వాడే వేలమంది క్యాన్సర్, హార్ట్ ఎటాక్, స్ట్రోక్, ఎంఫిసీమా మొదలైన వ్యాధులతో మరణిస్తున్నారని తెలుకోలేకపోవచ్చు. ఏమైనప్పటికి వాని కర్మ ఫలం ఇతరులు పడే దుఃఖం లేదా క్రమంగా తనకు కలిగే దుఃఖం.

ప్రతి మానసిక స్థితికి పర్యావసానముంది. అది నడవడిలోనే కాదు మనస్సులో కూడ. సాత్వికుడు కరుణ కలిగి ఉండడం వలన పొందేది సుఖం. వ్యాకులత, దురాశ రాజసికునికి కలిగే దండన. మనందిరికి ఇటువంటి అనుభవం అవసరం. ఎందుకంటే స్వార్థంయొక్క పర్యావసాన్ని తెలిసికొంటాం. ఈ పాఠం నేర్చుకోపోతే మనం తిరిగి చిన్న తరగతికి వెళ్ళి నేర్చుకోవాలి. అది మన మానసిక పరిస్థితి వలన కలిగే ఫలం.

తామసికుని ఫలము అజ్ఞానము. ఎందుకంటే వాడు కర్మ చేయడు. చేసినా మనస్పూర్తిగా చేయడు. కర్మ అనబడే బాకీ తీర్చక, దానికి పై అప్పు చేస్తాడు. బహిర్ముఖముగా ఏముందో తెలిసికోలేక ఒక చీకటి గది నుండు ఉంకో చీకటి గదికి మారుతూ ఉంటాడు.

దుఃఖం ఒక్కటే అన్నిటికన్నా నికృష్టం అనడం కల్ల. దాని కన్నా సున్నితత్వం లేకపోవడం మరింత నికృష్టం. ఇప్పటి ప్రపంచంలో దుఃఖం అనగా భయపడవలసినదిగా తలుస్తారు. నా దృష్టిలో సుఖాలతో పైకి ఎదగలేని స్థితి కంటే దుఃఖం అనుభవిస్తూ ముందుకు సాగడం ముఖ్యం. మన౦ ఆధ్యాత్మికతతో జీవించాలంటే, దుఃఖం అంటే భయపడకుండా, ఇతరులయందు సున్నితత్వముతో ఉండాలి. తామసికుడు ఉన్న దానితో సంతృప్తిపడి ఆనందం తప్ప దేన్నీ కోరడు. అట్టివాడు విధికి బద్దుడు. 154

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...