14.14
సత్త్వా త్స౦జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ
{14.17}
ప్రమాదమోహౌ తమసో అజ్ఞానమేవచ
సత్త్వ గుణము వలన జ్ఞానము కలుగును. రజోగుణము వలన లోభము ఏర్పడును. తమో గుణమువలన అజ్ఞాన ప్రమాద మోహములు సంభవించును
తమస్ తో మొదలు పెడతాను. ప్రమాదమోహౌ అనగా గందరగోళము మరియు వ్యామోహం. ఈ రెండూ కలసి ఒక సంస్థను స్థాపించేయి అనుకోండి. తమస్ కి ఎక్కువ స్టాక్ ఉంటుంది. ఎక్కడా పొంకము లేకుండా తామసికుడు తన శక్తితో చిన్న చిన్న పనికిరాని కర్మలు చేస్తాడు. ఎందుకంటే వాడికది ఇష్టం. వానికవి ఆనందం కలిగిస్తాయి. అతని అహంకారాన్ని పెంచుతాయి. తామసికుడు మేధావి కాకపోవచ్చు. కాని వాడు చాలా పుస్తకాలు చదువుతాడు. పుస్తక ప్రచురణ కర్తకి కూడ తెలియని పుస్తకాలను తిరగేస్తాడు. నేను చెప్పే పుస్తకాలు నవలలు కావు. ఈ పుస్తకాలు వ్రాసేవారు మేధావులు, ప్రజ్ఞావంతులు. వారిని గూర్చి దినపత్రికలలో చక్కని పునర్విమర్శ (review) వ్రాయబడెను. కాని ఆ పుస్తక కర్తలు తమకు తోచినది వ్రాసి, వాటివలన కలిగే పరోపకారం గురించి ఆలోచించలేదు.
కొన్నేళ్ళ క్రితం ఒక లైంగిక విషయాలకు సంభందించిన పుస్తక౦ బాగా ప్రచారం లోకి వచ్చింది. కొన్ని కోట్ల ప్రతులు అమ్మబడినాయి. విద్యాలయాల్లో దాని విశ్లేషణము కూడా జరిగింది. దాని కర్త నిజాయతీపరుడు. సంఘంలో ప్రతిష్ఠ కలవాడు. ఆ పుస్తక౦ మంచి ఉద్దేశం తోనే వ్రాసేడు. కాని తన రచనలతో తాదాత్మ్యం చెంది వాటియొక్క పర్యావసానము తెలిసికోలేక పోయేడు. కోట్ల మంది ఆ రచనలను చదివి, ఆ రచయిత చెప్పినట్లు చేసి, ఎంత మోసపోయేరో ఆ కర్తకు తెలీదు. వాళ్ళ జీవితాలు స్తబ్దతతో కూడి ఉండడంవలన మోహం కలిగించే పుస్తకాన్ని చేతబట్టేరు.
ఆ పుస్తకం యొక్క సారాంశం: నీ బాగు ముందు చూసుకో, తక్కినవారిని తరువాత చూడు. అటువంటి సలహా పాటించిన వారు ఏకాకులు అయి, సంఘంతో వేర్పడి, నిరాశా నిస్పృహలతో ఉంటారు. మనం ఇంద్రియసుఖం ఆశిస్తే అందులో కొంచెం సుఖం లేకపోలేదు. క్రమంగా మనం వాని పట్టులోకి వచ్చి వాటితో మమేకం చెందుతాము. ఆ తరువాత చిక్కుల్లోపడతాం. ఇంద్రియాల వలలో చిక్కుకొని, మనకి తెలీకుండానే వాటిని అనుసరిస్తాము.
ఆ పుస్తకం యొక్క పేరు "ప్రేమలో రుచులు" అని ఉండవచ్చు. అది ఆశ కలిగించేది. ప్రేమించడం, ప్రేమలో పడడం ఎంత సులభం, ఎంత సుఖం అనిపిస్తుంది. క్షణిక సుఖం కోరేవారు ఆ పుస్తకంచే ఏమార్చబడతారు. అతి తక్కువ కాలం లోనే ప్రేమలో పడడం అనే ప్రయోగం వాళ్ళ మీద వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే వారికి వేరే దారి లేదు. అసంగత్వంతో ఉన్నవారు ఆ రచయిత ఇచ్చిన సలహా వలన బాంధవ్యాలు ఎలా తెగుతాయో తెలిసినవారు. ఆ పుస్తకం చదివిన వారు ఒక ప్రేయసి తరువాత ఇంకో ప్రేయసి దగ్గరకు అతి తక్కువ కాలంలోనే క్షణిక సుఖానికై మారుతూ ఉంటారు. నేనైతే ఆ పుస్తకం పేరు "బాంధవ్యాలను త్రెంపే రుచులు" అని పెడతాను. ఆనందానికి బదులు, బాంధవ్యాలను తెగతెంపులుచేసికోవడం వలన కలిగే అగచాట్ల గురించి వ్రాస్తాను. అది దుఃఖానికి దారితీస్తుంది. నాణానికి ఒక వైపు ఆనందం, రెండోవైపు ఏకాకిగా దుఃఖం. గీత చెపుతుంది నీ కేది కావాలో నిర్ణయించుకో. కానీ నీ ఎన్నికవలన దుఃఖాన్ని పొందితే దేవుడిని లేదా సంఘాన్ని తిట్టవద్దు. శృంగారం పెళ్లి అయిన వారలకు అతి ముఖ్యం. కాని ఎక్కడైతే విశ్వాసము, నమ్మకము, నిజాయితీ, సున్నితత్వము లేవో ఆ కర్మ ఒక విధ్వంసకారి అవుతుంది.
సాత్వికుడు ఎలా జ్ఞానానికి చిహ్నమో తామసికుడు అజ్ఞానానికి అలా చిహ్నం. "నాకు మిగతావాళ్ళంటే లెక్కలేదు. నాకు స్వయంగా ఉపయోగము లేకపోయినా, నాకు తోచినది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను" అని అంటాడు. నేను సాన్ ఫ్రాన్సిస్ కో నగరంలో ఒక పాడుబడిన ప్రదేశంలో బారులు తీరిన ప్రజలను చూసేను. వాళ్ళు ఒక సంగీత కచేరికై హాలు బయట నుంచున్నారు. వాళ్ళ కున్న ఉత్సాహము, సహనం కొంత ఆ ప్రదేశాన్ని బాగుపరచడానికి ఉపయోగిస్తే ఇంకా బాగుండేది.
శ్రీ రామకృష్ణ ఇలా అన్నారు : ప్రతి చెడ్డ ఆలోచననైనా మంచిగా మార్చవచ్చు. నీకు ఆశ ఉందా? అయితే నిజంగా ఆశాపరుడవు అవ్వు. వస్తువులు నీకే కాదు, అందరికీ ఉండాలని కోరుకో. అంతకు తప్ప వేరే దాన్ని అంగీకరించకు". మనము మంచి వస్తువులను మన గురించే పోగుచేసుకోవడంతో సంతృప్తి పడతాం. మిగతావారికి కూడా మంచి వస్తువులు ఉండాలని ఎందుకు కోరుకోము? మన పనులకై ఉన్న శ్రద్ద ఇతరుల కొరకై ఎందుకుండదు ? మనం ఇతరులగురుంచి ఆలోచించడం మొదలపెడితే వారికి మంచి చేసిన వాళ్ళమౌతాము. ఒక ఆశాపూరిత వ్యక్తి కనిపిస్తే వానిని అభినందించండి. వాడు తన దూరాశను మానవాళి అభ్యుదయమునకు వర్తి౦పజేస్తే అందరికీ ఆదర్శనీయుడు అవుతాడు. ఆశ ఉంటుంది కాని అది మంచి పనులకు ఉపయోగింపబడుతుంది. కోపం, భయం కూడా ఆశ వంటివే. వాటికి మార్పుచెందే శక్తి ఉంది. మహాత్మా కార్యదర్శి మహాదేవ దేశాయిని` ఎవరో గాంధీగారికి అంత శక్తి ఎలా వచ్చిందని అడిగేరు. ఆయన సమాధానం: ఆయన మానవ గుణములను -- అనగా భయము, క్రోధము, మోహము, దురాశ మొదలగునవి -- మేళవించి ఇతరుల బాగుకయి తనివితీరలేని గుణముగా మార్చేరు.
బెర్క్లీ లో ఒక సినిమా హాలు టార్జాన్ అండ్ జేన్ అండ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స (Tarzan and Jane and the Planet of the Apes) అనే చిత్రాన్ని చూపిస్తోంది. వాళ్ళ ప్రకటన ఇలాగుంది: "Go Ape!" అనగా వాళ్ళను అనుకరించండి. నేను చాలా విద్యార్థులు లైన్లలో నుంచుని ఉండడం చూసాను. నాకు "Go Ape" కి సరియైన అర్థము తెలీదు. ఇది తిరోగతి. "Go Human" అని గట్టిగా అరుద్దామని అనుకున్నాను. పరిణామంను వెనక్కు తీసికెళ్లాడానికి కారణాలు ఎన్నో: మొండి తనము, విరుద్ధ భావన, లేదా పగ సాధించాలని అనుకోవడం మొదలైనవి. జంతువులకు వేట చేసి పచ్చి మాంసము తినడం సహజం. కానీ మానవులమైనందుకు అట్టి పనులు చేయము. మనం మొండి వాళ్ళ మైతే దేవుడ్ని ఇలా ప్రార్ధించే వాళ్ళం: నాలో హింస కలిగించే స్వభావం ఇంకా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అడవిలోనే ఒక రెండు శతాబ్దాలు బ్రతుకుతాను. 157
No comments:
Post a Comment