Thursday, March 10, 2022

Chapter 14 Section 15

14.15

ఊర్థ్వ౦ గచ్ఛ౦తి సత్త్వస్థాః మధ్యే తిష్ఠ౦తి రజసాః {14.18}

జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛ౦తి తామసాః

సాత్త్వికులు ఊర్థ్వలోకముల కేగుచున్నారు. రాజసులు మధ్యలోకమున జన్మించుచున్నారు. తామసులు నికృష్టకర్మలు చేయుచు అధోగతి పోవుదురు ఀ

నా బాల్యంలో మా ఊరిదగ్గర ఒక అనూహ్య పద్దతిలో భోధించే సాధువొకాయన ఉండేవాడు. ఆయన పేరు మద్ నారాయణ. ఆయన ప్రతి ఉదయం ఒక కొండ దగ్గరకు వెళ్ళి ఒక రాయిని ద్రొల్లిస్తూ కొండమీదకి తీసికెళ్ళడానికి ప్రయత్నించేవాడు. ఎండాకాలంలో అది ఎంతో కష్టమైన పని. జనులు ఆయనను చూడడానికి వచ్చేవారు.

సాయంత్రానికి ఆ రాయిని కొండ మీదకి తీసికెళ్ళేవాడు. ఒక చెయ్యితో జనాలను ప్రక్కకి వెళ్ళమని చెపుతూ రెండో చెయ్యితో రాయిని తోసేవాడు. అది తానంతట తనే ద్రొల్లుతూ వెళ్ళి వెళ్ళి చివరకు కొండ క్రిందన గల ఒక చెట్టును గుద్దుకొన ఆగిపోయేది. మద్ నారాయణ నవ్వుతూ "కొండపైకి ఎక్కడం చాలా కష్టం. క్రిందకు వెళ్లాలంటే పెద్ద కష్టం కాదు" అనేవాడు.

దానిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడానికి నాకు అనేక సంవత్సరాలు పట్టింది. జీవితంలో అడ్డంకులని దాటుకొని వెళ్ళడం కష్టం. ప్రతి అడుగు ముందుకు వేయడానికి కొట్టుమిట్టడాలి. ఆగి సేద తీసికొనడానికి సమయం ఉండదు. అలా చేయకపోతే బరువు భాధ్యతలు మనను వెనక్కి లాగుతాయి. కాని ఎవ్వరైనా కొండ దిగగలరు. దానికంత శక్తి అవసరము లేదు. ఎటువంటి నిర్ణయాలు తీసికోనక్కరలేదు, , కోరికలను చంపుకోనక్కరలేదు. మీకు ఇష్టం వచ్చినట్లు చేసి, అప్రయత్నంగా, క్రిందకి పడిపోవచ్చు.

ఇది బుద్ధి, కోరికకు ఉన్న స్వభావము. తమస్సు, అచేతనము అనబడే సముద్రపు లోతులో ఉండి, ఒక వాహనపు ట్ర౦కు లాంటిది. దానిలో బుద్ధి, కోర్కె బంధింపబడి ఉన్నాయి. తామసికుని బుద్ధి, కోర్కె రెండూ లేని మాయ ఆవరించింది. వాడు నిర్మల౦గా, ప్రసన్న౦గా , శాంతంగా కనబడవచ్చు. వాడు తన గురించి ఆదేవిధముగా భావిస్తాడు. ఇంకా తను సాధు స్వభావము, స్నేహశీలత ఉన్నవానిగా తలచును. "ఒక సామాన్య మానవుడు" అని పరులు అనుకొంటారు. గాంధీగారు చెప్పినట్లు ఒక శ్మశాన వాటికలో ఎవ్వరూ కదలరు, మాట్లాడరు, నివసించరు. అనగా సత్త్వ గుణానికి వ్యతిరేకం.

కోరిక వారి బంధాలను క్రమక్రమంగా తీసివేస్తుంది. వాళ్ళు ఇంకా వాహనపు ట్ర౦కు లోనే ఉన్నారు. కోర్కె ఉదయించగానే బంధాలను వదిలించుకొని: "నాకు కొంచెం కాఫీ అవసరము" అనుకొంటుంది. అది ఎంతో మార్పు కాదు. కోర్కే సాధించుకొనే ప్రయత్నము ఇంకా బంధనములోనే ఉన్నది. కొంత శ్రమతో ఒక కప్పు కాఫీ చేసుకొంటుంది. దాన్ని తాగుతున్న కొద్దీ కోర్కె ఇంకా బలం పుంజుకొ౦టుంది. మనస్సు తలుస్తుంది : "దేహ శ్రమ సంతృప్తికి దారితీస్తుంది". దీనివలన రజో గుణము మేల్కొంటుంది.

కోర్కె తెలివైనది. వాహనపు ట్ర౦కు లోంచి బయట పడగానే నాదే పైచేయి అనుకొంటుంది. బుద్ధితో ఇలా చెప్తుంది: "ఇప్పుడు మనల్ని విడిపించి, నిన్ను ఊరంతా తిప్పుదామనుకొంటున్నాను. నువ్వు సీట్ మీద కూర్చుని నిద్రపోతే పో, నేను వాహనాన్ని నడుపుతాను."

బుద్ధి ఇప్పుడే బంధాలనుండి విడిపింపబడినది. అది ఇంకా తేరుకోలేదు. "మంచి సలహా. కోర్కె మంచి స్నేహితుడు" అని తనలో అనుకొంటుంది. సరే అంటుంది. "నీవు వాహనం నడుపు, నేను వెనుక కూర్చుంటాను. అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాను" అంటుంది.

కోర్కె మంచి మంచి హొటేల్స్ కి వెళ్దామనుకొంటుంది. "ఎక్కడికి వెళ్తున్నాం" అని బుద్ధి అడుగుతుంది. "నా దగ్గర అంత డబ్బు లేదు" అంటుంది. కోర్కె బలంగా అవుతుంది. రుచికరమైన వంటలు తలుచుకుంటూవుంటే నోట్లో లాలాజలం ఊరుతున్నది. "నువ్వు నోరు మూసుకొని ఉండు" అంటుంది. "నాకు నీకేమి కావాలో తెలుసు" అంటే దానికి బుద్ధి "అవును" అంటుంది.

అవి అలాగ హొటేళ్లలో తింటూ, తింటూ, తమలో క్రొవ్వు పెంచుకొ౦టాయి. బుద్ధికి ఒళ్ళుమండి "నాకు ఈ హొటెళ్ళతో ఇంక సరి" అంటుంది.

కోర్కె పైచేయితో ప్రలాపనము చేస్తూ "నువ్వు నన్ను నిరుత్సాహ పరుస్తున్నావు. నేను వాహనాన్ని నడుపుతుంటే నీవు హాయిగా వెనక కూర్చొని నిద్రపోతున్నావు" అని, బుద్ధిని మందలిస్తుంది. క్రమంగా వాళ్ళిద్దరూ ధూమపానం చేయడం మొదలు పెడతారు.

కోర్కె ఉద్దేశంలో బుద్ధికి ఒక పాడు అలవాటు నేర్పి, వాహనము వెనకాల పడేస్తే, తన ఇష్టం వచ్చినట్టు వాహనంతో షికారు చెయ్యవచ్చు.

కోర్కెకి తనకేమి కావాలో తెలీదు. తగినంత శక్తి మాత్రం ఉంది. అది సవాలు కై ఎదురు చూస్తుంది. ఎంత పెద్దదైతే అంత మంచిది. కానీ దానికి గమ్యమేమిటో తెలియదు.

దానికి అవ్యక్తమైన బలం చాలా ఉంది. రాజసికులు అతి ఉత్సాహంగా ఉంటారు. వారు ధ్యానంలోకి అడుగుపెడితే తమ వ్యాకులతను తగ్గించుకొని, సవాలుకై వేచిచూచే తత్త్వమును స్వాధీనంలో పెట్టుకొంటారు.

సత్త్వ గుణము బుద్ధి, కోర్కె ఇద్దరు నడిపే వాహనంలో వెళుతున్నాది. కోర్కె బండి నడుపుతుంది. కానీ బుద్ధి దాన్ని నియంత్రిస్తుంది. మనం ఎంతసేపు మన కుటుంబాలకు, సంఘాలకు, ప్రపంచం మొత్తానికి ఉపయోగపడడానికి ప్రయత్నిస్తామో అంతసేపూ బుద్ధి వెనుక కూర్చొని ఉంటుంది. కోర్కె వాహనాన్ని అడ్డదారి ఎక్కిస్తే అది వాహనాన్ని మంచి ద్రోవలో పెడుతుంది.

మొదట్లో కోర్కె మారాం చేసి, "నేను పోలీసులను పిలుస్తాను" అంటుంది. బుద్ధి బదులిలా ఇస్తుంది "నేనే పోలీసుని. నువ్వు ఎవ్వరినీ పిలువలేవు. ఎందుకంటే నేనే నీకు వాహనాన్ని నడిపే పద్దతిని నేర్పించేది. నేనే అన్నీ". కోర్కెకి కొంత కాలం తరువాత జ్ఞానోదయం అవుతుంది. బుద్ధి తన మిత్రుడు. అనేకమైన విపత్తులనుండి రక్షించేడు అనుకొంటుంది.

సత్త్వ గుణమువలన కోర్కెలు లేకుండా పోవు. సరియైన కోర్కెలు పోగు అవుతాయి. బుద్ధి అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకొంటుంది. రాజసికులు వాహనాన్ని నడుపుతున్నంత సేపూ వింతలు విడ్డూరాల కొరకు అంతా వెతుకుతారు. చీకటి పడినా వాళ్ళు ఇంకా గమ్యం లేకుండా తిరుగుతారు. తామసికునికి ఇంకా వాహనాన్ని నడిపే తాళం ఎక్కడుందో కూడా తెలీదు. వాడి వాహనానికి ఇంజన్ ఉంది కాని వాడికి అది ఎలా వాడాలో తెలియదు. వాడు చేయ గలిగింది అంతా వాహనాన్ని కొండ ఎత్తునుంచి దిగువకు నడపడం. "సాత్వికులు ఊర్థ్వ లోకాలకు వెళతారు" అని శ్రీకృష్ణుడు చెప్పడంలో ఉద్దేశమేమంటే గురుత్వాకర్షణను దాటి చైతన్యానికి ఆవల తీరాన్ని చేరుకొంటారని. 160

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...