14.16
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి
{14.19}
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అదిగచ్ఛతి
గుణములకంటెను అన్యమైన కర్తను చూడనివాడు, గుణములకంటెను తనను విలక్షణునిగ గుర్తించువాడు నా స్వరూపమునే పొందుచున్నాడు
గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్
{14.20}
జనమ మృత్యు జరా దుఃఖైః విముక్తో అమృత మశ్నుతే
దేహమునకు కారణమలగు ఈ త్రిగుణములను అతిక్రమించిన వాడు జన్మమృత్యు వార్ధక్య దుఃఖములనుండి విడిపడి మోక్షమును పొందుచున్నాడు ఀ
మన ఎరుకకు గలవి --వస్తువులు, ఆలోచనలు, కర్మలు, వ్యక్తిత్వము-- గుణములతో అంతర్లీనమైనవి. శ్రీకృష్ణుడు గుణాతీతము అని దేన్ని చెప్పుచున్నాడో అది మానవ స్థితిగతులకు అతీతము. మనము శరీరము, మనస్సులము మాత్రమే అను స్థిరభావానికి అతీతము.
మనము స్థిరభావానికి అతీతమైతే మనము సామాన్య వ్యక్తులము మాత్రమే కాదు. మనము ప్రపంచంలో ఒక శాశ్వతమైన, ఉపయోగకరమైన శక్తి. బుద్ధుడు అటువంటి శక్తి. ఆయన అమృతుడు. ఏ ఒక్క జీవి బద్ధుడైనచో తాను మరణింపడని ఆయన అన్నాడు. మనం బుద్ధుడులా జీవించాలనుకొంటే -- అనగా మానవ సంక్షేమము కొరకు, అందరి ఆనందం కొరకు--ఆ శక్తి మన జీవితంలో ప్రవేశిస్తుంది. బుద్ధుడు, క్రైస్ట్ మనలో నెలకొంటారు.
నేను 1960 లో భారత దేశం నుండి బెర్క్లీ కి వచ్చినపుడు, చాలామంది ఆ శక్తిని రసాయనాల ద్వారా వ్యక్తం చేయదలచేరు. వారు మాదక ద్రవ్యాలతో ఊహాతీతమైన స్థితికై ప్రయోగాలు చేసేవారు. మన౦ భౌతిక శరీరాలమే అనుకుంటే ఇటువంటి పెడ ద్రోవలలో పడతాం. ఇది ఎలాగంటే మనకున్న మానసిక వ్యధను మందు బిళ్ళతో పోగొట్టుకోగలమనే భావన.
ఈమధ్య కంప్యూటరులు, లేజర్ వంటివి మాదక ద్రవ్యాల బదులు వాడబడుతున్నాయి. మన వ్యక్తిత్వం భౌతికం, రసాయనం మాత్రమే అని నమ్ముతున్నాం. ఆధ్యాత్మిక చింతన, ప్రేమ, కౌశల్యం మొదలైనవి మెదడులో ఇంజనీరింగ్ ద్వారా పెంపొందించే మార్గాలు ఎందుకు వెదకరు?
మెదడునుండి ఆవిర్భవించిన తరంగాలను విశ్లేషించి ఓర్పు, అసహనత, దయ, నిర్దయ కలిగించే తరంగాలను కనిపెట్టవచ్చేమో. మన సహధర్మచారిణి మనను విసిగించినపుడు ఇంజనీర్ లచే తయారుచేయబడిన ఒకచిన్న యంత్ర౦ ద్వారా ఓర్పును తెచ్చుకుంటే బాగుంటుంది. మనకి ఇష్టంలేని పదార్థం వడ్డించ బడితే ఒక యంత్రాన్ని ఉపయోగించి మన మెదడు కి ఇష్టమైన దానిగా మార్చుకోవచ్చేమో. నేను ఇటువంటి యంత్రాలను కనుగొనలేమని అనటంలేదు. కాని ఎంత ఖర్చుతో? మానవుడిలో మానవత్వం నశిస్తుంది. మన సున్నితత్వం, వ్యక్తిత్వం, మౌలికత పోగొట్టుకొంటాం. ఎందుకంటే మన బుద్ధిని వాడడం లేదు కాబట్టి. అది లేనిదే మనకు స్వేఛ్చ లేదు. ఎన్నిక చేసుకొనే స్వేఛ్ఛ లేకపోతే మనం యంత్రాలలాగ బ్రతుకుతాం. ఇదే హక్స్లీ రచించిన బ్రేవ్ న్యూ వరల్డ్ అనే పుస్తక౦ యొక్క భూమిక. ఈనాటి అకర్తృకమైన (impersonal) జీవనం వలన మనకున్న సున్నితత్వం మాయమవుతున్నది.
నేను దీపాలు లేని టాంక్ ల గురించి విన్నాను. ఒకడు ఆ టాంక్ లో కూర్చొని బయట శబ్దాలు వినకుండా, కాంతిని చూడకుండా, జ్ఞానోదయం అయ్యేవరకూ కూర్చుంటాడు. మన౦ ఇంద్రియాలను జయించకుండా చైతన్యవంతులము కాలేము. తేడా ఏంటంటే బయట నుండి వచ్చే శబ్దాలను, కాంతిని కృత్రిమముగా నిరోధించడం. అటువంటప్పుడు మన చేతనము ఇంద్రియములనుంది విడదీయబడదు. అవి ప్రాణముతో ఇంకా నిండి ఉంటాయి. అంటే కన్ను దృశ్యాలకై ఎదురు చూస్తుంది. చెవి శబ్దాలకై రక్కించి వింటుంది. దానివలన అవి భ్రాంతిని కలిపిస్తాయి. ధ్యానంలో పూర్తి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ధ్యానంలో పంచేంద్రియముల వ్యాపారం కట్టిపెట్టి మనస్సును ఆత్మ కై అంతర్గతం చేస్తాము. ఇంద్రియ వ్యాపారాలు బుద్ధి వలన నియంత్రింపబడతాయి. దాని వలన బుద్ధి అతి శక్తివంతమౌతుంది. అందువలన కోర్కెలు స్వాధీనంలో ఉంటాయి.
ఇంద్రియముల వ్యాపారాన్ని కట్టిబెట్ట గలిగితే, జీవితం అతి తేలికగా, సులభంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. గీత దీన్ని "అకర్మలో కర్మ" అంటుంది. ఆ స్థితిలో ఉద్రిక్తత, ఘర్షణ ఉండవు. అది గుణాతీతము. అదే మానవ ఆశ్రయణం, స్థితివ్యాజ౦ (human conditioning) లకు అతీతమైన స్థితి. ౧౬౨
No comments:
Post a Comment