14.17
అర్జున ఉవాచ:
{14.21}
కైర్లి౦గై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణా నతివర్తతే
కృష్ణా! ఈ త్రిగుణములను అతిక్రమించిన వాని లక్షణమేమి? అతని ఆచారమెట్టిది? అతడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించెను?
ఒకడు సంపూర్ణముగా పరిణామం చెందుతే ఏమవుతుంది? నడవడి, స్వభావం, చైతన్యము మూర్తీభవించిన వానిని ఏమందుము?
ఇట్లు ఉన్నవారే మనకు జీవితము గూర్చి మార్గదర్శకులు. శ్రీ రామకృష్ణ, సెయింట్ తెరెసా, సెయింట్ ఫ్రాన్శిస్, మహాత్మా గాంధీ మొదలగువారు శరీరము, మనస్సులకే పరిమితులు కారు. వారి జీవితాలు ఒకానొక వ్యక్తిత్వములో ఊహకందని మార్పు చెంది సర్వోత్కృష్టమైన మానవ శక్తి గా ఆవిర్భవించిరనుటకు నిదర్శనము. వారు అట్లే ఒక కాలానికి పరిమితము కారు. సెయింట్ ఫ్రాన్శిస్ ఇప్పటికీ చిరస్మరణీయుడు. ఆయనను మనము ఒక పరిమిత కాలానికి -- అనగా 60 లేదా 70 ఏళ్లు-- చెందినవాడని భావించరాదు. ఎవడైతే తన శరీరముతో, మానసిక స్థితితో తాదాత్మ్యం చెందుతాడో వాని ప్రభావితము చేయు శక్తి పరిమితమైనది. అది ఎంతో కాలం ఉండదు. మనం ఎప్పుడైతే గుణాలకు అతీతమౌతామో మనకి దేశకాల పరిమితులు ఉండవు. గుణాతీతమైతే మనము శాశ్వతమైన ఉపయోగకరమైన శక్తిగా మారి, మన ఆత్మ శక్తిని జీవులయందు ప్రసరణము చేయవచ్చును.
ఆ శక్తిని కుండలిని అందురు. అది మనందరిలోనూ ఉన్నది. "నేను నన్ను ఒక మంచి శక్తిగా మార్చుకోలేను" అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే ఆ శక్తి మనందరికీ ఉంది. కాని మన బుద్ధి, ఇంద్రియాలు మాయచే కప్పబడి యున్నవి. మన దుర్భలమైన, పరిమితమైన శరీరములో, మనస్సులో, బుద్ధిలో అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై యున్నదనుట అతిశయోక్తిగా అనిపించవచ్చును. కానీ అది నిజము.
నన్ను అమెరికా దేశస్థులు "ధ్యానం అనగా సమ్మోహనం (hypnosis) కాదా?" అని అడిగేవారు. ధ్యానం దానికి వ్యతిరేకం. ధ్యానం ద్వారా మనం సమ్మోహనాన్ని వదిలించు కోగలం. నేను ఈ మధ్య ఒక ప్రకటనను చూసేను: "మీ మిత్రులను సమ్మోహితులను చేయడం నేర్చుకోండి". మనము సమ్మోహితమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. మానవ స్థితి సదా సమ్మోహితులుగా ఉండుట. శ్రీ రామకృష్ణ దానిని ఒక తోలుబొమ్మలాటగా తలుస్తారు. మనం "పంచ్ అండ్ జూడీ" అనే తోలుబొమ్మలాటలో పంచ్ ని అడిగితే అతని సమాధానం "మనమందరమూ స్వతంత్రులం. నేను జూడీని కొట్టవచ్చు. ఆమె నామీద గిన్నెలు విసురుతుంది. దీనిని స్వతంత్రమని అనకూడదా?" కాని స్టేజ్ వెనక వెళ్ళి చూస్తే ఒకడు దారాలతో ఆ బొమ్మలను కదిలిస్తున్నాడు.
మనమందరము పంచ్, జూడీ లమే. బొమ్మలను దారాలతో ఆడించేవాడు అహంకారం. ఒక తప్పు జరుగుతే మనం ఉగ్రుల మౌతాము. తిరిగి "నేను ఆగ్రహము చెందాలని ఎన్నుకొన్నాను" అంటాం. లేదా ఆ దారాలు సాగి బొమ్మలు క్రింద పడితే మనము తమస్ చే ఆవరింప బడినట్లు. "నేను నా స్వతంత్రతో మందంగా ఉండడానికి నిశ్చయించుకున్నాను" అని మనము అనవచ్చు. బుద్ధుడు దానికి నవ్వి బదులిలా ఇస్తాడు: "ఎవడైనా నీ యందు క్రోధముతో యున్న, నీవు శాంతముగా, దయతో, గౌరవముతో మాట్లాడిన, నువ్వు నిజంగా స్వతంత్రుడవు." మీరు మీకు కట్టబడిన దారాల నుండి విడిబడగలరు. ఆతరువాత అహంకారం ఆ దారాలను ఎంత లాగినా, మనము ఉద్రిక్తులవ్వము. 164
No comments:
Post a Comment