14.18
శ్రీ భగవానువాచ :
ప్రకాశం చ ప్రవృత్తి౦ చ మోహమేవ చ పాండవ
{14.22}
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి
పాండుతనయా! ప్రకాశరూపమైన సత్త్వ గుణము కాని, ప్రవృత్తిరూపమైన రజోగుణముకాని, మోహరూపమైన తమోగుణము కాని ప్రాప్తించినపుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు. ప్రాప్తించనపుడు ఆశించడు
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే
{14.23}
గుణా వర్తంత ఇత్యేవ యో అవతిష్ఠతి నేంగతే
ఎవడు ఉదాసీనుడై యుండునో, గుణములచే చలింపకుండునో వాడు గుణాతీతుడు
ఎవరైతే గుణాతీతులో వారికి ఇష్టాయిష్టాలు ఉండవు.
ఇది ఒక సామాన్య, లేదా తెలిసికోనవసరములేని విషయమనుకోవచ్చు. కొంతమంది అడుగుతారు: "నేను దేనినైనా యిష్టపడడం లేదా ద్వేషించడం ఆపేయాలా?" మన జీవితమంతా ఒకనిని, ఒక వస్తువును ఇష్టపడుట లేదా ద్వేషించుటయే. ఇదే మనను తోలుబొమ్మలాటలోని బొమ్మలుగా మారుస్తుంది. ఇష్టాయిష్టాలతో ఉండడమంటే రోడ్డుమీద జీవితంని అడుక్కోవడమే: "నన్ను దయతో చూడండి. నేను నడవలేను. అతి కష్టంతో నుంచున్నాను. నా బిక్ష పాత్రలో కొంచెం ఆనందాన్ని దారపోయండి". నాకు నా అమ్మమ్మ దృక్పథం నచ్చింది. ఆమె చెప్పేది: "నీవు జీవితంతో చెప్పు నేను నీవేమి ఇచ్చిన లెక్క చేయను అని. ఇచ్చిన దానిని మంచిగా వాడుకుంటాను. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. "
మనకు జీవితం మనకిష్టమైనదిస్తే మనము సంతోషపడతాము. పరిస్థితులు సానుకూలంగా ఉంటే మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. అది మన మిత్రులను పలకరిస్తుంది, అతిగా వాగుతుంది, పనులను చేయడానికి ఉవ్విళ్లూరుతుంది. "పరస్థితులు ఇలాగే ఉంటే, ఇది స్వర్గంలా ఉండదా?" అని అనుకొంటుంది. కాని పరిస్థితులు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండవు. కొంత సేపటికి జీవితం మనకు ఎదురు తిరుగుతుంది. చెప్పా పెట్టకుండా మనకు నచ్చని పరిస్థితులు వస్తాయి. మనస్సుకున్న శక్తి క్షీణిస్తుంది.
మనలో చాలామంది జీవితం అంటే ఇదే నని అనుకొంటాము : కొన్ని మధుర క్షణాలు. కొన్ని నిరుత్సాహము కలిగించే దుఃఖాలు. మధ్యలో మంచి చెడు కాని సామాన్య స్థితి.
శ్రీకృష్ణుడు చెప్పేది: "నీకది కలుగకూడదు. నువ్వు ఎన్నటికీ నిరుత్సాహము పడకూడదు. నీ భావాలు పరిస్థితులతో ముడి పెట్టకు. సుఖం వచ్చినపుడు స్పృహ లేకుండా ఉండకు. దానివలన నీకు దుఃఖము వచ్చినపుడు నిరుత్సాహ పడవు."
మనమందరమూ క్షణంలో ఉత్సాహ పడతాం. సంస్థలు మనను ఉత్తేజపరచడానికి అనేకమైన వస్తువులను తయారు చేస్తాయి: సినిమాలు, వార్తలు, తలకు రాసుకొనే నూనెలు, పెట్టుబడులు, బట్టలు. మనం వానిని పొందలేనప్పుడు డీలాపడి నిరుత్సాహం చెందడంలో ఆశ్చర్యము లేదు. నిరుత్సాహము, మానసిక దౌర్భల్యము అనేక వ్యాధులకు దారి తీస్తుంది. చాలామంది జీవితాన్ని బొటాబొటిగా గడపడానికి, ఉన్నదానితో సంతృప్తి పడడానికి కావలిసిన శక్తితో గడిపేస్తారు. వారు నిరుత్సాహమునకు ఒక అడుగు వెనుక వున్నారు. అమెరికాలోని ప్రజలలో ఒక పావువంతు తమ జీవితాలను ఆగ్రహంతో లేక మానసిక వ్యధతో గడుపుతారు. ఎందుకంటే వారికి జీవితంలో కోరికలు తీరలేదు. నా బామ్మ చెప్పినట్లు "మామిడి చెట్టుని కొబ్బరి కాయలు ఇవ్వలేదని తిట్టుకోడం"
నిరుత్సాహం రాకుండా ఉండాలంటే, శ్రీకృష్ణుడు చెప్పేది, సుఖాలున్నప్పుడు స్పృహ లేక ఉండకు. దీనికి మనమీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. అలాగే మన బుద్ధి కాపలా ఉండాలి. అలా అయినప్పటికీ, ఇంకా మన మనస్సు పరిపరి విధాలుగా పోతూవుంటే, మంత్రాన్ని మననం చేసికొని ధ్యానం చేయాలి.
మంత్రము గాలి వానలో చిక్కుకొన్న పడవను సక్రమ మార్గములో పెట్టే స్టెబిలైజర్ అనే పరికరము లా౦టిది. నేను భారతదేశం నుంచి అమెరికాకు పడవలో ప్రయాణించినప్పుడు దానికి అటువంటి పరికరము లేదు. ఏడెన్ దగ్గర వానలొచ్చినపుడు, ఒకమారు ఆకాశం కనబడేది, మరుక్షణం నీరు కనబడేది. ఆ పడవ క్రిందకూ మీదకూ అతలాకుతలం అవుతుంటే చాలా మంది ప్రయాణీకులకు వాంతులు వచ్చేవి. ఆ పడవ బ్రిటిష్ వారిది. దానిమీద చాలా మంది బ్రిటిష్ చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మానవులే. కాబట్టి వారికీ వాంతులొచ్చేయి.
నేను మొదటి రోజు బాగానే ఉన్నాను. మరుసటి రోజు నా మనస్సిలా ఆలోచించింది "దీనితో సరి. నువ్వు ఎంత దూరం వెళ్ళేవో అంతంత మాత్రమే." అందరిలాగా నాకూ వాంతులు మొదలయ్యేయి.
అప్రయత్నంగా నాకు మంత్రము గుర్తుకొచ్చింది. నేను ఎలాగైనా ధ్యానంలో కూర్చోవాలని నిశ్చయించుకున్నాను. ఒక మూలకెళ్ళి కూర్చున్నాను. కొద్ది నిమిషాల్లో ధ్యానంలో ఎంత లోతుగా వెళ్ళేనంటే, నా శరీరాన్ని మర్చిపోయేను. రెండు గంటల తరువాత బాగా ఆకలివేసింది. ఆ పడవ ఇంకా క్రిందకీ మీదకీ వెళుతోంది. నేను వంటగదికి వెళ్ళి కూర్చున్నాను. నన్ను చూసి వంటవాడు "మీరే మందులు వాడుతున్నారు?" అని అడిగేడు.
ఇది మనస్సుకున్న శక్తి. అది శాంతంగా ఉంటే శరీరము కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది కలత చెందితే, శరీరం అతలాకుతలమవుతుంది. మీ మనస్సు నే చెప్పిన పడవలా కలత చెందితే మంత్రంతో ధ్యానం చేయండి. అలాగ చేస్తే నేను పడవ మారి క్వీన్ ఎలిజబెత్ అనే పడవనెక్కి అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటినంత ఫలితం లభిస్తుంది. అది గాలివానలో సవ్యంగా ప్రయాణించింది. నేను ఆ పడవ నడిపే వాడిని ఎందుకు ప్రయాణీకులు హాయిగా ఉన్నారని అడిగితే "ఈ పడవకు స్టెబిలైజర్ అనే పరికరం ఉంది. ఇది ఎటువంటి వాతావరణంలోనైనా క్షేమంగా నడుస్తుంది" అని సమాధాన మిచ్చేడు.
No comments:
Post a Comment