Thursday, March 10, 2022

Chapter 14 Section 19

14.19

సమదుఃఖ సుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః {14.24}

తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః

గుణచలనమును మాత్రము గ్రహించి నిశ్చలుడై యుండునో, సుఖ దుఃఖముల యందు సమానముగ యుండునో, ఆత్మ యందు స్థిరుడై యుండునో, మట్టి, రాయి, బంగారములను సమముగ వీక్షించునో, ప్రియాప్రియములందు సముడో అట్టివానిని త్రిగుణాతీతుడని చెప్పబడును.

కొన్నేళ్ళ క్రితం మాతో ఉంటున్న ఒక చిన్న పిల్లడు నా భార్య క్రిస్టీన్ తొడపై కూర్చోవాలనుకొన్నాడు. ఆమె "నేను ఒక పత్రికకు వ్యాసం ఇవ్వడానికి టైప్ చేస్తున్నాను. ఉంకొకరిని అడుగు" అంది. వాడు నా దగ్గరికివస్తే నేను నా భార్య చెప్పినట్లే చెప్పాను. వాడు మేరీ దగ్గరకు వెళ్ళాడు. ఆమే కాదనడంతో వాడు విసిగిపోయి "నేను నా తొడమీదే కూర్చుంటాను" అన్నాడు.

ఎవడైతే తనలోనే స్థాపించ బడినాడో, తన కాళ్ళమీద నిలబడగలడో అట్టివానిని స్వస్థ అందురు. మీరు మీ తొడమీద కూర్చున్నట్లు ఎవరి తొడ మీద కూర్చోలేరు. ఉంకోళ్ళ తొడ మీద ఎంతవరుకు కూర్చోగలం? వాళ్ళు కూర్చున్న౦త సేపు. వాళ్ళు నిలుచుంటే కూడా సాధ్యం కాదు. మీరు మీ తొడమీదనే కూర్చోగలతే, మీరు విశ్రాంతిగా ఉంటారు. వేరే వాళ్ళ సహాయం అక్కరలేదు.

ఒకరోజు నేనూ, క్రిస్టీన్ లైబ్రరి కి వెళ్ళేము. ఆమె తన లైబ్రరి కార్డ్ పారేసుకొంది. అక్కడి వ్యక్తి కొన్ని సాంకేతిక కారణాలవలన కార్డ్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేడు. "కానీ నీ భర్త నీ పేరు మీద తీసికోవచ్చు" అని అన్నాడు. ఆ వ్యక్తికి నా పేరు, ఊరు చెప్పేను. ఆ తరువాత అతను నా ఫోన్ నెంబర్ అడిగేడు. నాకు ఫోన్ లేదని చెప్పేను. "మీరు మీ ఐడెంటిటీ చూపగలరా?" అని ఆ వ్యక్తి అడిగేడు. "చూపగలను. అదే నా పని" అన్నాను. కాని నేను జేబులన్నీ వెతికినా ఏమీ దొరకలేదు. ఆ వ్యక్తి "మీకు వాహన్నాన్ని నడిపే లైసెన్సు ఉందా?" అని అడిగేడు. "లేదు" అన్నాను. "మీరు వాహనం నడపరా?"

"నడపగలను. కాని పరులకు ఇబ్బంది కలుగుతుందని నడపను"

"మీకేమైనా క్రెడిట్ కార్డ్ లు ఉన్నాయా?"

"నేను కాష్ తోనే అన్నీ కొంటాను. అప్పుల్లో మునగడం ఇష్టంలేదు."

"అది సరే. కానీ మీ ఐడెంటిటీ ని నిర్ధారించేది కావాలి. మీ దగ్గర ఎవరైనా వ్రాసిన ఉత్తరముందా?"

"అవును. నా దగ్గర ఒక కార్డ్ ఉంది". నా దగ్గర బ్ల్యూ మౌంటేన్ సెంటర్ ఆఫ్ మెడిటేషన్ సభ్యత్వ కార్డ్ ఉంది.

"నేను మొదటి సభ్యుడిని" అని నా పర్స్ లోంచి కార్డ్ తీయబోయేను. దానిలో౦చి క్రిస్టీన్ లైబ్రరి కార్డ్ క్రింద పడింది.

శ్రీకృష్ణుడు మనకి చెప్పేది:" మీ దగ్గర కార్డ్ ఎప్పుడూ ఉంది. మీకు ఇంకొకటి అవసరం లేదు. మీరు మర్చిపోయిన జేబీలో చెయ్యి పెట్టి మీ పర్సు లోపలకి వెళ్ళి చూసుకొంటే, మీరు శాశ్వతమైన భద్రతని, సుఖాన్ని పొందుతారు." 168

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...