14.20
మానాపమానయో స్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః
{14.25}
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే
ఎవడైతే ధైర్యవంతుడో, కర్తృత్వబుద్ధిని త్యజించి యుండునో అట్టివాడు గుణాతీతుడని చెప్పబడును
గుణాతీతుడు అంటే మానవ నిర్బంధ౦ నుంచి విడిపడినవాడు. వాడు బుద్ధి, వేర్పాటు అనే విఘ్నాలను దాటినవాడు. అది లేకనే మానవాళికి ఈ శతాబ్దంలో పట్టిన చీడ. ఈ స్థితులనుండి బయటపడినప్పుడే మన సహజస్థితులు -- ప్రేమ, దయ -- పొందగలము.
మిత్రుని యందు శత్రువునందు సమ దృష్టి కలిగి యుండాలి అనగా మధ్యస్తమైన స్వభావము కాదు. శ్రీకృష్ణుడు చెప్తున్నది ఓర్పు, సహనం, దయ, పరస్పరం అర్థం చేసికోవడం. అవి మన ఇష్టుల యందే కాదు. అందరియందు. ఇవి ఎవరికీ సాధ్యంకాని నీతులు కావు. సెయింట్ ఫ్రాన్సిస్ "మనం ఒకరిని క్షమిస్తే మనం క్షమింప బడతాము" అని చెప్పింది మానవాళి మనుగడకు సంబంధించినది.
నేను తుపాకీల గురించి చదువుతున్నాను. చాలామంది తుపాకీలను తమ భద్రత కొరకై వాడుతారు. కానీ తుపాకీల వలన అభద్రత, అనుమానం ఎక్కువ అవుతుంది. మీరు దానివలన అందరినీ మిత్రులులా కాక పొంచివున్న శత్రువులుగా భావిస్తారు. మీ సంరక్షణ కొరకై అతి జాగ్రత్తగా ఉంటారు. మీరు ఎవరితో నైనా భేటీ పడగలరని మొండి నమ్మకంతో ఉంటారు. ఎవరో మన వెనుక అనుమానాస్పదంగా నడుస్తున్నారు అని తలచి తుపాకీ తీసి పేల్చడం జరగచ్చు. ప్రతి 100 హత్యలలో 65 ప్రాణ రక్షణకై వాడుతున్న తుపాకీల వలననే. కోపం, ద్వేషం, భయం వాటికి కారణాలు. తుపాకీ మిమ్మల్నీ ప్రమాదానకి గురి చేస్తుంది. మిమ్మల్ని కలహ శీలిగా, నిస్స౦శయమైన వ్యక్తిగా మారుస్తుంది. దొంగతనాలు, దోపిడీలను అరికట్టకపోగా, ఒక దౌర్జన్య కారిగా మనను తుపాకీ మారుస్తుంది. తుపాకీ ఒక పరికరం మాత్రమే. మనలోని అనుమానం, వేర్పాటు దాన్ని వాడేవి.
దేశాల మధ్య ఇదే జరుగుతున్నాది. రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముఖ్య కారణం మొదటి ప్రపంచ యుద్ధంవలన కలిగిన భయం, ద్వేషం, అనుమానం, క్రోధం, పగ మొదలగు గుణాలు. మూడవ ప్రపంచ యుద్ధం ఆత్మాహుతికి సిద్ధపడిన ప్రపంచ శక్తులు వలన కలగడంలో ఆశ్చర్యము లేదు. అమెరికా అధ్యక్షుడు, ట్రూమన్, హిరోషిమా, నాగసాకి పై వేసిన అణ్వాశ్త్రాలు, పెర్ల్ హార్బర్ దాడికి బదులుగా పగసాధింపుకై చేసినదని ఒప్పుకున్నారు. అలాగే రష్యా కి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి. హింస, క్రోధం, ద్వేషం తమను తామే పెంపొందించుకొంటాయి. అణ్వాశ్త్రాలు ఇప్పటికే 10-15 దేశాలలో ఉండగా, వీటి మధ్య జరగబోయే యుద్ధం మరొక ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అలా జరిగితే ఈమారు ప్రపంచానికే ముప్పు. అణ్వాశ్త్రాల తయారీలో పనిచేసిన శాస్త్రజ్ఞులు వాటి మంచి-చెడుల గురించి సరిగ్గా అధ్యయనం చేయలేదు. వారి కర్మలవలన ఒకటి రెండు దేశాలలో కొన్ని కోట్లమంది మరణించడమే కాదు, వాని వలన గాలి, నీరు, భూమి, జీవరాస్యులు కూడా ప్రభావితం అవుతాయి. మనందరం ఒకే ప్రపంచంలో బ్రతుకుతుతా౦ లేదా ఎవరం బ్రతకం. రెండు దేశాల మధ్య, అగ్ర రాజ్యాలు కాకపోయినా, యుద్ధం వాటికే పరిమితం కాదు. జీవరాస్యుల సామరస్యం చెడుతుంది. 170
No comments:
Post a Comment