14.20
మాం చ యో అవ్యభిచారేణ భక్తియోగేన సేవితే
{14.26}
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే
ఎవడు అకుంఠితమైన భక్తియోగము చేత నన్ను సేవించుచున్నాడో వాడు ఈ గుణత్రయము నతిక్రమించి బ్రహ్మ స్వరూపమును పొందుచున్నాడు
శ్రీకృష్ణుడు ఇచ్చట అవ్యభిచార అనే పదమును వాడేడు. దాని అర్థము ధృడమైనది, అచంచలమైనది, స్థిరమైనది. దానికి వ్యతిరేకము వ్యభిచారిణి అనగా వేశ్య. ఆమె అందరినీ సుఖపెడుతుంది. గీత బోధించునది: ఎవరైతే తమ ప్రేమ, విశ్వాసము పలువురిపై చూపెదరో వారు జీవిత గమ్యం చేరలేరు. ఇది బయట శక్తుల వలన జరిగేది కాదు. మన ప్రేమని వెదజల్లిన, చైతన్యము అన్ని దిక్కుల వ్యాపిస్తుంది. అటువంటప్పుడు దానిని సంపూర్ణము అని ఎట్లు తలంచెదము?
సాధన అనగా మన కోరికలను ఐక్యముజేయుటకు కావలిసిన శక్తిగూర్చి నేర్చుకొనుట. క్రమంగా తక్కినవన్నిటిని దాని ఆధీనమున ఉంచెదము. మన వైఖరి, తీరు, పక్షపాతము, దురభిమానము, మొదలగునవి రెండవ స్థానములో ఉండవలెను. ఇది బాధతో కూడినది. నేను బుద్ధిని, మనస్సును, దేహాన్ని అనే భావాలు తొలగాలి. ఇక్కడి ముఖ్య అంశం ఓర్పు. అనగా ఎటువంటి అవరోధాలు వచ్చినా స్థిర నిశ్చయముతో ముందుకు సాగడం.
దీనికి అచంచలమైన క్రమశిక్షణ ఉండాలి. ఎటువంటి ఉత్కృష్టమైన స్థితి పొందడానికైనా అది కావాలి. గోళీ కాయలు ఆడడానికైనా సాధన చేయాలి. అంటే పరిణామంలో ఉత్కృష్టమైన స్థితిని పొందడం. నేను నూరియేవ్ అనే బ్యాలే నాట్యం చేసే వాని గురించి చదివేను. అతను బ్యాలే నాట్యంలో చాలా గొప్పవాడు. ఆయన స్టేజ్ మీద సునాయసంగా, సుందరంగా, రంజింపజేసే విధంగా నాట్యం చేస్తాడు. కాని స్టేజ్ వెనకాల ఎంతో పరిశ్రమ చేస్తాడు. దానిని అతను రక్తసిక్తమని చెపుతాడు. మార్గొట్ ఫోన్టేన్ కూడా ఏకీభవిస్తారు. నాట్య సాధనని ఆవిడ కోడిపందేలతో పోలుస్తారు.
గీత కూడా అదే చెపుతుంది. శ్రీకృష్ణుడు సాధన ఒక యుద్ధం లాంటిదని చెప్తాడు. జీవితంలో ఉన్నత శిఖరాన్ని చేరాలంటే ప్రతి చిన్న విషయంలోనూ పోరు చేయాలి. ఎంత కష్టమైనప్పటికీ, రజస్ ను సత్త్వ౦ గా మార్చుకోవడంతో అయిపోలేదు. సత్త్వ లో కూడా ఆలోచనలు, భావములు మంచివయినప్పటికీ, వక్రమవుతాయి. పూర్తి స్వతంత్రం కావాలంటే గుణాలకు అతీత స్థితిని పొందాలి. దానికై దేశ కాలాలను దాటి మనస్సును అచంచలముగా చేసి, అహంకారము లేకుండా చేసికోవాలి.
దీన్ని గ్రహించడానికి త్రిగుణాతీతులైన వారి జీవిత చరిత్ర చదవాలి. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా యొక్క జీవిత చరిత్రను ఈమధ్య చదివేను. ఆమె మధ్య యుగంలో (medieval) ఐరోపా వాసి. అయినప్పటికీ ఆమె భావాలు ప్రస్తుత కాలానికి అనుగుణముగా ఉన్నాయి. చిన్నప్పుడు ఆమెకు ఒక ఆడపిల్లకు కావలసిన వన్నీ ఉండేవి. ఆమె మిక్కిరి సంస్కృతి కల్గి, బహు ప్రజ్ఞావంతురాలైన అందగత్తె. అయినప్పటికీ ఆమె ప్రజ్ఞను, మేధను అందరూ హర్షించలేదు. అశాశ్వతమైన విషయములు ఆమెను ఆకర్షించలేదు. బాల్యము లో కూడా ఆమె "నాకు శాశ్వతమైనది కావాలి" అని అనుకునేది. ఇది ఆధ్యాత్మిక స్థితిలో పరిపక్వత. దేనీతోనూ సంతృప్తి పడక ఉండడం. అంటే ఇవాళ ఉండి రేపు పోయే విషయాల గూర్చి పట్టించుకోక ఉండడం.
ఒకప్రక్క ప్రపంచ విషయాలు , మరొక ప్రక్క దైవ చింతన వున్నాయి. ఆమె 20 ఏళ్లు ఆ రెండింటి మధ్య కొట్టుమిట్టాడింది. నన్నెవరైనా జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది అని అడిగితే నేను "తెరెసాకి 20 ఏళ్లు పట్టింది. అటువంటిది మనం ఇంకా తక్కువ సమయంలో సాధించగలమా ?" అని సమాధానం ఇవ్వ గోరేవాడిని. ఆమె ఇలా వ్రాసేరు:
ఒకప్రక్క దేవుని గూర్చి చింతన ఉండేది. మరొక ప్రక్క ప్రపంచ విషయాలు తమ వైపు ఆకర్షించేవి. దేవుని గూర్చి చింతన నాకు గొప్ప ఆనందాన్ని కలిగించేది. కాని నేను ప్రపంచానితో తాదాత్మ్యం చెంది ఉండేదాన్ని. నేను ఈ రెండింటినీ కలిపి పట్టు కోవాలి అనుకొనేదాన్ని.
మీ ఆధ్యాత్మిక ప్రగతి గూర్చి అనుమానాలు ఉండవచ్చు. అవి సహజం. కానీ వాటివలన నిరుత్సాహము చెంది డీలా పడకూడదు. అది తామసికుని లక్షణము. అటువంటి సమయాల్లో తెరెసా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అనుమానాలు లేకుండా ముందుకు సాగండి. పదే పదే ప్రయత్నించండి. క్రిందకు పడితే మీదకు లేవడానికి శ్రమించండి. సామాన్య మానవుల మైన మనకి ఎన్నో అనుమానాలు చాలా కాలం వరకూ ఉండచ్చు.
45 ఏళ్ల వయస్సులో తెరెసా దేవునిలో స్థాపితమయ్యారు. దీనిని సహజ సమాధి అంటారు. అంటే సమాధి మన నెన్నటికీ వీడనిది. అన్ని అవస్థలలోనూ జీవిత ఐక్యము ఒక మారయినా మర్చిపోము. ఇట్లు గుణాలకు అతీతమై, ఎన్నటికీ ఆ స్థితిలోనే ఉంటాము. 172
No comments:
Post a Comment