Thursday, March 10, 2022

Eknath Gita Chapter 14 Section 22

14.22

బ్రహ్మణో హి ప్రతిష్ఠా అహం అమృతప్యావ్య యస్యచ

శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ

అమృత స్వరూపము, అవ్యయము, శాశ్వత ధర్మ స్వరూపమునగు పూర్ణానంద స్వరూపమునకు నేనే {14.27}
ఆశ్రయుడను.

శ్రీకృష్ణుడు గుణములు, కాలము, మరణములకు గల సంబంధమును వివరించుచున్నాడు. ప్రస్తుత కాలంలో కాలాన్ని పట్టుకొని దానిని ఆపాలని కోరుకునే దీనావస్థలో ఉన్నాము. మనమున్న స్థితితో ఎన్నటికీ ఉండాలని అనుకుంటాం. మనము నిర్దయమైన, సహజమైన భౌతిక మార్పులు లేకుండా ఉండాలని తలుస్తాం. దీని పర్యావసానము లోతైన అభద్రత. మనము పెరుగుతున్న కొద్దీ అనేక చిక్కుల్లో పడతాం. అవి భౌతిక, మానసికతలకు సంభందించినవి. కాలం సాగిపోతున్నాదే అనే భయానకమైన అసమగ్రతను మన ధనం, సాంకేతిక విద్య తొలగించలేవు.

ఏ శక్తీ మనను వృధ్యాప్యము నుండి తప్పించలేదు. మన మరణం మనం పుట్టిన సమయంనుంచి దగ్గర అవుతున్నది. నా అమ్మ ప్రతి ఉదయం విభూతి రాసుకోవడానికి కారణం మన దేహం ఎన్నటికీ మారేదే అని భావించడం.. ఆఖరి మార్పు మరణం. ఎవరైతే మార్పు చెందేవాటిని పట్టుకొని ఉంటారో అట్టివారు విచారము, అభద్రతలతో బ్రతుకుతారు.

శ్రీకృష్ణుడు "నీవు సంపూర్ణంగా జీవితాన్ని గడిపితే నీ చైతన్యము నాలో లీన మవుతుంది" అని అంటాడు. అది ఊహించలేని ప్రేమ. అది మనం గడిపే ప్రతి నిమిషం స్థిరమైన భద్రతను కలిపిస్తుంది. ఆ స్థితిలో మీరు ఏకాకి కారు. ప్రపంచాన్ని పీడిస్తున్న ఘోరాలను మీ శాశ్వతమైన శక్తితో బాగుచేసెదరు. మీ జీవితం ప్రతి జీవియొక్క పెట్టుబడి. ఎటువంటి ఆర్థిక విపత్తు ఆ పెట్టుబడిని ఏమీ చేయలేదు. అది ఆర్థిక పరిస్థితి పాడైనా, మెరుగు పడినా సదా వృద్ధి చెందుతూనే ఉంటుంది. మీరు అవ్యయులు. అనగా ఎప్పటికీ తరగని వారు. ఎంత ఎక్కువ ఇస్తే అంత ఓర్పు, సహనము, భద్రత, ప్రేమ పొందుతారు. 173

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...