15.1
శ్రీ భగవానువాచ :
{15.1}
ఊర్ధ్వమూల మధశ్శాఖం అశ్వథ౦ ప్రాహు రవ్యయం
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్
పైన మూలమును, క్రింద కొమ్మలను గలదియు , వేదములు పత్రములుగ గలదియు నగు అశ్వథవృక్షమును అవ్యయమని చెప్పుచున్నారు. దానిని తెలిసినవాడు వేదవిదుడు
జీవితమనే వృక్షము యొక్క దృశ్యం గీతలో దివ్యమైనది. ఆ వృక్షము భౌతికము కాదు. పదార్థము, శక్తి, మనస్సు మున్నగునవి ఈ వృక్షానికి ఆకులు వంటివి. కాని ఆకు రెమ్మను౦చి, రెమ్మ కొమ్మను౦చి, కొమ్మ కాండం నుంచి ఉద్భవించేయి. వీటినన్నిటినీ భరించే వేళ్ళు పవిత్రమైన మానవునిలో స్థాపించబడ్డాయి. వేళ్ళకు దూరంగా అనేకత్వం మరియు మార్పు: అవి లెక్కపెట్టలేనన్ని ఆకులు. కానీ వేళ్ళకు మూలాధారము భగవానుడు.
ఇటువంటి దృశ్యం అనుభవంకి వస్తుంది. భూమిపై బ్రతికినన్నాళ్ళు మనం ఒక ఆకులాగా వేర్పడ్డామని తలుస్తాం. మన ఏకాంత జీవితాలు మిగతా వృక్షానితో సంభందం లేవని తలుస్తాము. కానీ ఆ వృక్షం నుండి వేర్పడితే మనకు జీవితంలేదు. మనం వేర్వేరు అని తలచడంవలన ప్రపంచంలో అనేక అనర్థాలు వస్తున్నాయి. మన వీధుల్లో, ఇళ్ళల్లో హింసా కాండ జరుగుతున్నాది. ఎందుకంటే కొందరు ఇతరుల బాగుకయి పాటుపడక స్వార్థంతో బ్రతకడంవలన. దేశాలు, సంస్థలు తమ స్వార్థానికై పనిచేస్తున్నాయి. వాళ్ళకి పేదలపై దయ లేదు. ప్రపంచంలో మనుషులు యుద్దాలతో నలిగిపోతున్నారు. మనం ఇతరులతో వేర్పడి మన జీవితానికి అవరోధం లేక బ్రతుకుదామని అనుకుంటాం. మనము ఇలా బుద్ధిని కోల్పోతే మన జీవితాన్ని ఒక చిన్న ఆకువంటి వ్యక్తిత్వానికి దారపోస్తున్నాం. ఏ సమయం లోనైనా కామం, ఉద్రేకం కలిగితే ఈ ఉపమానమును గుర్తుకు తెచ్చుకోండి. మనం ఒక్క ఆకుతోనే సరిపెట్టుకోకూడదు. మనల్ని వృక్షంతో పోల్చుకోవాలి. 175
No comments:
Post a Comment