Thursday, March 10, 2022

Chapter 15 Section 2

15.2

అధశ్చోర్ధ్వ౦ ప్రసృతాస్తస్య శాఖాః

గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః {15.2}

అధశ్చ మూలాన్యనుసంతతాని

కర్మానుబ౦ధీని మనుష్యలోకే

ఈ వృక్షము యొక్క కొమ్మలు గుణములచే వృద్ధి నొందినవి. విషయములనెడి చిగుళ్ళు గలవియై క్రిందకి మీదికి వ్యాపించి యున్నవి. మనుష్య లోకమునందు కర్మ సంబంధమున కలుగజేయు మూలములు క్రింది వైపునకు విస్తరించి యున్నవి ఀ

జీవితముతో పోల్చబడిన అశ్వత్థ వృక్షాన్ని కొందరు మేడి చెట్టు అనుకుంటారు. కొందరు అది మర్రి చెట్టా లేదా బుద్ధునికి జ్ఞానోదయమైన బోధి (రావి) చెట్టా అని తర్జనబర్జన పడతారు.

ఆది శంకరులు ఇలా చెప్పేరు: అ అనగా "లేక". శ్వ అనగా "రేపు". స్థ అనగా "నిలుచొనియున్న". అనగా సృష్టిలో అన్నిటిలాగా ఈ వృక్షము రేపటికి ఉండదు. నిన్న ఉన్న ప్రపంచం ఈ రోజు లేదు. అది క్షణక్షణానికి మారుతుంది. మన దేహము ఇవాళ నిన్నటిలా లేదు. రేపు నేటిలా ఉండదు. మన ఎముకలు, కండరాలు, మారుతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరువాత అది పూర్తిగా ఉండదు.

మర్రి, రావి చెట్లు చాలా ఏళ్లు బ్రతుకుతాయి. పురాతన గుడులలో వాటిని చూడవచ్చు. ఆ గుడి శిధిలాల్లో ఆ చెట్లు ఇంకా జీవించి ఉంటాయి. వాటికి ఇంకో లక్షణం కూడా ఉంది. అది గాలిలో ఉండే వేళ్ళు. కొన్నిసార్లు వాటి విత్తులు భూమి మీద కాకుండా తాటి చెట్టుపై పెరుగుతాయి. అవి ఆ చెట్టును వేళ్ళతో కప్పి క్రిందకు వ్యాపించి భూమిని చేరుతాయి.

శ్రీకృష్ణుడు ఇంద్రియాలు గాలిలో వ్యాపించిన వేళ్ళతో పోల్చేడు. మనము వాటికి లొంగి ఉంటే మన చైతన్యాన్ని వేళ్ళ లోకి పంపి వాటిని పెంచిన వార మౌతాము. చివరకు అవి భూమిని చేరి, సదా మారుతున్న ప్రపంచమునందు స్థిరముగా ఉంచును. ఇంద్రియాలు మనం కోరుకొన్న వాటిని ఇస్తాయి. ప్రసార మాధ్యాలు "మీ ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంద౦డి. మీకు ఇష్టమైతే మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి" అని చెప్తాయి. 20 ఏళ్ల వయస్సు వాడు పై సందేశాన్ని లక్షల సార్లు టివి, సినిమాలు, పత్రికలలో చూస్తాడు. ఇటువంటి పరిస్థితిలో మన జీవితాలు ఆకులులాగ రెపరెప లాడడంలో ఆశ్చర్యం లేదు.

మనం ఎంత ఇతరుల విషయాలలో తల దూరుస్తామో, అంత ఇంద్రియాలను బాహ్యానికి ప్రసారింప చేస్తేము. కొంత మందికి నాలుక రుచికై ప్రాకులాడుతారు. వారు ఎంతసేపూ ఆహారం గురించే ఆలోచిస్తూ, తమ చేతనాన్ని నాలుకకే పరిమితం చేస్తారు. వాళ్ళు ప్రపంచాన్ని నాలుకతో అనుభవిస్తారు.

అట్టివారు సులభంగా కోపిష్టులు అవుతారు. వారు అభద్రతతో నుండి, తమ కోపాన్ని తగ్గించు కోడానికి మందులూ మాకులూ లేదా తిండి తింటారు. గాంధీ గారు రుచిని ఎంత నియంత్రించ గలిగితే మనస్సు అంత స్వాధీనంలో ఉంటుందని చెప్పేరు. మీ చైతన్యాన్ని నాలుక నుండి వెనక్కి లాగ గలిగితే, మీరు కోపిష్టులు కారు.

ఇది మిగతా ఇంద్రియాలకూ వర్తిస్తుంది. రోజూ ఐదారు గంటలు టివి చూసే బాలుడు తన చైతన్యాన్ని కళ్ళకు అప్పగిస్తాడు. నిరంతరము పెద్దగా పెట్టిన సంగీతాన్ని వినేవారు చైతన్యం చెవులలోకి ప్రసరింప జేస్తారు. చైతన్యము టూత్ పేస్ట్ లాంటిది. దాన్ని తేలికగా బయటకు తేవచ్చు. కానీ దానిని లోపలకు పంపించడం బహు కష్టం. ఎప్పుడైతే చైతన్యం ఈ విధంగా బహిర్గితమైందో మనం దృష్టి కేంద్రీకరించ లేక పోవడం, అభద్రత, సున్నితము లేకుండుట, ఆత్మ విశ్వాసము లేకుండుట, ఊహ లేకుండుట మొదలైన వాటితో బాధ పడెదము.

మనము చైతన్యమును ఇంద్రియ వ్యాపారముల నుండి ఎప్పుడంటే అప్పుడు వెనక్కి తీసికోగలగాలి. ఎలాగంటే ఒక తాబేలు తన తలను, కాళ్ళను చిప్ప క్రిందకు లాగుకున్నట్లు. మనం ఒక దుకాణంలోని తినుబండారములను చూసి మోహితులైతే, మన ఇంద్రియాలను నియంత్రించుకోగలగాలి. మన ఇంద్రియాలు ఎప్పటిలాగే ఉంటాయి, కాని వాటిని ఏదీ ప్రభావితం చేయదు. మనకు ఆకలి వేసినపుడు, చైతన్యాన్ని ఇంద్రియాలకు పంపించి ఆహారాన్ని స్వీకరించవచ్చు.

మన ఇంద్రియాలన్నిటికీ ఈ విధముగా శిక్షణ ఇవ్వవచ్చు. మనం వాటిని శిక్షించటంలేదు. మనం "సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు. మేఘాలు ఆవరించి నప్పుడు ఇంట్లోకి రండి" అని వాటికి చెప్తున్నా౦.

ప్రాణము ఇంద్రియాలద్వారా ప్రకటిత మౌతుంది. అందుకే ఎవరైతే ఇంద్రియాలను ఎక్కువ పని చేయించేరో, వారు తొందరగా అలసిపోతారు. అవసరమైనప్పుడు నిరోధక శక్తి లేకుండుట, బుద్ధి బలహీనత, వివేకము క్షీణించుట జరుగును. మన ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొంటే మన మనస్సును, దేహమును వాటి వలన కలిగే ముప్పులనుంచి కాపాడుకోవచ్చును.

విహారయాత్రకి వెళ్ళే పడవల ప్రకటనలు "మా విందు భోజనం మీకు ఎప్పుడూ లభిస్తుంది" అని ఉంటాయి. ఉదయమే లేచి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. మధ్యాహ్న భోజనానికి ముందు ఫలహారం చేస్తారు. మధ్యాహ్న భోజనం తరువాత టీ తో తింటారు. మళ్ళీ రాత్రి భోజనం చేస్తారు. ఎడతెరపిలేకుండా భోజనం తింటారు. అలాగే తాగడానికి పానీయాలు నిరంతరము లభిస్తాయి. రాత్రి అంతా వినోద కార్యక్రమాలు ఉంటాయి. డ్యూటి ఫ్రీ షాప్ లో ప్రియమైన వస్తువులు అక్కరలేకపోయినా కొంటారు. యాత్ర అయిపోయిన తరువాత వ్యాధిగ్రస్తులను ఆసుపత్రికి తీసికెళ్లడానికి వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా ఇష్టానుసారంగా నడచుట ప్రమాదకరం.

ఇంద్రియాలను నిగ్రహించుకొంటే ప్రాణము బుద్ధి యందు స్థాపితమౌతుంది. జీవితానికి కావలిసింది బుద్ధిని వాడుకొనే తెలివి. మేధాశక్తి ఎక్కువ ఉంటే సరిపోదు. అది మన కోపాన్ని గాని భయాన్నిగాని నివారించదు. ఎంత తర్కం ఉపయోగించినా పని చేయదు. వాళ్ళు తమ బుద్ధిని చేతనము యొక్క పొరలనుండి వెలికి తీసుకు రావాలి. అలాచేస్తే మనము అచేతనములోని భయాన్ని తొలగించుకోవచ్చు. అలాగైతే ఎట్టి భయానకమైన విషయము మనను బాధించదు.

కోపం కూడా అంతే. కోపిష్టులు అహంకారంతో ఉంటారు. వాళ్ళకి ఓర్పు తక్కువ. అలాగే కఠినమైన మాటలు వాడుతారు. ఎందుకంటే వారి అహంకారము బుద్ధిని నిరోధిస్తుంది. మన కోపాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే బుద్ధిని పదును పెట్టాలి.

అసంగత్వం అలవరుచుకొంటే బుద్ధిని భారమితి (barometer) గా ఉపయోగవించవచ్చు. ఎప్పుడు తుపానులొస్తాయో, అనగా ప్రతికూల పరిస్థితులు, ముందే తెలిసికోవచ్చు. మనము ఒక రోజు ఇంద్రియాలను కట్టడి చేసి, అహంకారమును తగ్గించుకొంటే మరుసటి రోజు బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది.

భయాలు లేక ద్వేషాలను గూర్చి విశ్లేషణము చేయవచ్చు, అతిగా మాటలాడవచ్చు, సూక్ష్మదర్శినితో చూడవచ్చు, పుస్తకాలను చదువవచ్చు. కాని గీత చెప్పిన విధంగా బుద్ధిని పదునుగా పెట్టుకోవాలి. సదా క్లేశముల గురించి చింతించుటవలన లాభములేదు. బుద్ధి పెరుగుతున్న కొద్దీ భయం, కోపం, స్వార్థం తక్కువ అవుతాయి. మనకి ఎప్పుడైతే పట్టుదల ఉందో దానివలన బద్ధకం తొలగించ బడుతుంది. భయము ఆవహరించినపుడు పట్టుదలతో ఆత్మవిశ్వాసము పొందవచ్చు. పట్టుదలతో భయాన్ని ధైర్యంగా, కోపాన్ని దయగా, ద్వేషాన్ని జాలిగా, పగని ప్రేమగా మార్చుకోవచ్చు.

గాలిలో ఉన్న వేళ్ళు ఎలా అయితే భూమి వైపు పెరుగుతాయో, ఇంద్రియాలు వస్తువులు మీదవైపు ప్రసరిస్తాయి. దీనిలో అసహజం ఏమీ లేదు. ఆయస్కాంతము వలె అవి ఆకర్షింపబడడంలో అధర్మమేదీ లేదు. శక్తులలో తప్పు లేదు. కాని వానిని దేనికై ఉపయోగిస్తామో దానిలో తప్పులు జరగవచ్చు.

ధ్యానంలో ప్రాణాన్ని ఇంద్రియములనుంచి ఉపసంహరించుకొని దాని మూలమునకు తెచ్చికొనవచ్చు. ఇది నేర్చుకోవడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చు. ధ్యానం మొదట్లో మనం బయట శబ్దాలను వింటూ మంత్రం జపిస్తాము. ఎందుకంటే చైతన్యం చెవి యందు కేంద్రీకృతమైనది. కొంత సాధనతో చైతన్యాన్ని చెవినుంచి ఉపసంహరించుకోవచ్చు. చెవి పని చేస్తుంది కాని అది వినదు. మిగతా ఇంద్రియాలకు కూడా ఇది వర్తిస్తుంది. సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఒకరోజు ధ్యానంలో ఎంత లోతుగా వెళ్ళేరంటే ఆమె పట్టుకొన్న క్రొవ్వొత్తి కరిగిపోయి చెయ్యిని కాల్చినా ఆమెకి తెలియలేదు.

మనం వినోదాలకై అలవాటుపడితే ఇంద్రియ ప్రేరేపణకై జీవిస్తాము. మనస్సులో ఒక భాగం సుఖమునకై ఎదురు చూస్తూ ఉంటుంది. చైతన్యము బైనాక్యులర్ ని పట్టుకొని బయట పక్షులకై ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇంద్రియాల స్పందన చర్మం యొక్క దళసరి మటుకే. మనం అటువంటి సుఖాలున్న ప్రపంచంలో ఉంటే, మనకి అవి తీయని ఆలోచనలుగా ఉంటాయి. మనం వాటిని వీడి తెరెసా చెప్పినట్లుగా "లోపలి కోటలో" వెళ్ళినప్పుడే మనకు పోల్చుటకు ఒక ప్రమాణం ఉంటుంది. మనము ఎప్పుడైతే ఈ విధంగా అంతర్ముఖులమైనామో, ఇంద్రియములను తుచ్చముగా చూస్తాం. 180

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...