15.10
యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం
యచ్చ౦ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం
{15.12}
ఏ ప్రకాశము సూర్యుని యందు౦డి సమస్తమైన ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నదో, అలాగుననే చంద్రుని యందును, అగ్నియందును ఏ తేజము కలదో అది అంతయు నాదే నని గ్రహించుము
ఆది శంకరుడు మన ప్రపంచము అద్దంలో ఒక పెద్ద నగరంగా ప్రతిబింబిస్తుంది అన్నాడు. అది కవిత్వం కాదు. మనము ఇతరులను భౌతికముగా చూసి, వారిని మంచి చేసుకోవడం లేదా వారితో దురుద్దేశముతో బాంధవ్యం పెట్టుకోవడం మన మనస్సు యొక్క ప్రతిబింబాలు. ప్రతిబింబమని ఎరుక రావడానికి నిజమైన వస్తువుతో పోల్చాలి. జీవితంలో సత్యం తెలిసికోవడానికి చేతన మనస్సు లోపలికి వెళ్ళాలి.
ఇటువంటి భ్రాంతి మన బాంధవ్యాలు --ముఖ్యంగా శృంగారమునకు సంభందించనవి-మీద ఉండి అనేక సమస్యలను తెస్తుంది. "మేము ప్రేమించుకుంటున్నాము" అని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే అది ప్రేమ యొక్క ప్రతిబింబం. ప్రేమ అనగా ఒకరినొకరిని అర్థంచేసికొని సహ జీవనం చేయడం. ఎప్పుడైతే లైంగిక బంధం ఉంటుందో ఐకమత్యం పోతుంది. ఎవరైతే సౌ౦దర్యమును మాత్రమే చూసి లైంగిక సంబంధాలు పెట్టుకొంటారో వాళ్ళకి అవి ఎంతో కాలం ఉండవని తెలుసు. కొన్నాళ్ళ తరువాత వారికి కోర్కె తీరి కోపం వస్తుంది.
భారత దేశంలో ఒక వేశ్యకు డబ్బంటే అతి ప్రీతి. ఒక రోజు ధనవంతుడొకడు ఆమె అద్దంముందు కూర్చొనిఉండగా ఆమెను చూడడానికి వచ్చేడు. వానికి ఆమె ప్రతిబింబం ఎంతో నచ్చి దానిని ముద్దు పెట్టుకొన్నాడు. వెంటనే ఆ వేశ్య "అది 100 రూపాయల ఖరీదు" అని చెప్పింది. అతను తెలివిగా ఒక 100 రూపాయల నోటు తీసి అద్దం ముందు పెట్టి "నువ్వు ఈ వంద రూపాయల ప్రతిబింబం తీసుకో" అన్నాడు.
మన౦ బాంధవ్యాలలో ప్రతిబింబాలనే చూస్తున్నాం. అది ఎంతో బాధాకరమైన విషయం. ఒకర్ని సొంతం చేసికోవడం వారి ప్రతిబింబాన్ని సొంతం చేసికొన్నట్టే. రోమియొ, జూలియట్ ప్రతిబింబాన్ని చూసి, అద్దాన్ని తనతో తీసుకు వెళ్తే ఎలావుంటుందో ఊహించండి. ఇదే భౌతిక శరీరాన్ని చూసేవారి పద్దతి: ఒకరిని స్వంతం చేసుకోవడం, మాయ మాటలు చెప్పడం, ఆనందించడం. కొన్నాళ్ళకు వాళ్ళు అనుమానం, అసూయ, అభద్రత, వేర్పాటు, కోపం, మానసిక వ్యధతో బాధపడతారు. ప్రేమ "ఈ వ్యక్తి వలన ఏమి పొందగలను?" అని అడగదు. అది అడిగేది "నేను ఏమి ఇవ్వగలను?" ప్రతిబింబాలను దాటి నిజ స్వరూపం చూడాలంటే అదే మార్గము.
"గుర్తుల గురించి వేచి చూడకండి" అని జీసస్ చెప్పేడు. మనం ఎడంగా ఉన్నచోటే ఇతరులతో ఐక్యమత్యంగా జీవనము చేయడానికి గుర్తులున్నాయి. మన౦ చెయ్యవలసినదంతా స్వార్థం, కోరికలు తీర్చికోవాలనే తపన ప్రక్కకు నెట్టడం.
అలా చేయకపోతే గీత చెపుతుంది: మన మానసిక ప్రపంచం చీకటైపోతుంది. ఎడంగా బ్రతకడమంటే స్వార్థం, ఇష్టం వచ్చినట్లుఉండడం, ప్రపంచ౦ యొక్క సంక్షేమం కోరక ఉండడం. చీకటి కారు చీకటైతే, మనము ఏ దిక్కులో వెళ్ళాలో తెలీక దారి తప్పి, గమ్యం ఎలా చేరాలో తెలియకపోతాం. అలాకాక మన స్వార్థం ప్రక్కన పెడితే దేదీప్యమానమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి మన దారిని సులభంగా తెలిసికొ౦టాం. క్షేమంగా, నిశ్చయంగా మన గమ్యాన్ని చేరుకొంటాం. 202
No comments:
Post a Comment