15.11
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా
{15.13}
పుష్ణామి చౌషధీ స్సర్వాః సోమో భూత్వా రసాత్మకః
నేను భూమిని ప్రవేశించి నా శక్తిచేత భూతములను ధరించుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నిటిని పోషించుచున్నాను
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
{15.14}
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్న౦ చతుర్విధమ్
నేను వైశ్వానరుడుగా ప్రాణుల యొక్క శరీరముల నాశ్రయించిన వాడనై నాలుగు విధములైన అన్నములను పచనము చేయుచున్నాను
ప్రాణ౦ సృష్టి ఆదినుండి ఉన్న శక్తి. అది అన్ని వస్తువులుగా, శక్తులుగా వ్యక్తమవుతున్నది. సృష్టి ప్రాణము వలన చైతన్యవంతమైనది. ప్రాణము యొక్క ప్రవాహము అనగా దాని శక్తి, ప్రక్రియ. ఉపనిషత్తులు ప్రాణం సూర్యుని నుండి ఆవిర్భవించి, చెట్లలో ప్రవహించి -- వాటి యందు నిక్షిప్తమై --, మానవులు తక్కిన జీవుల -- చెట్ల యొక్క ఫలాలను తిని-- కర్మలు చేయుటకు, ఇంద్రియములను మనస్సును చేతనవంతముగా నుంచుటకు కావలిసిన శక్తి నిచ్చునని చెప్పినవి. ఏ వృక్ష శాస్త్రజ్ఞుడు దీనిలో తప్పె౦చడు. శాస్త్రములు చెప్పినట్లు "శక్తి పర్యావరణ వ్యవస్త" లో ప్రవహిస్తుంది. నేను పాఠశాల పుస్తకాలలో ఆహారాన్ని జీర్ణించుకొనే ప్రక్రియను "జీర్ణము యొక్క అగ్ని" అని చదివేను. ఇదే గీత కూడా చెప్పింది.
ప్రాణం సృష్టి ఆది నుంచి కాలంలో ప్రవహించి, జీవుల ఆవిర్భవానికి కారణమైనది. అది పరిణామానికి శక్తి. చెట్టు వేళ్ళ నుంచి, కాండములోనుంచి, ప్రతి ఆకుకు ప్రవహించేది. ఒక వ్యక్తి సంపూర్ణ పరిణామం చెంది, ధ్యానమును అవలింబించిన, ప్రాణ౦ గొప్ప శక్తినిస్తుంది.
కొద్ది రోజుల క్రిందట నేను రిచ్మండ్ బ్రిడ్జ్ మీద వాహనములో వస్తున్నాను. హఠాత్తుగా ఆ బ్రిడ్జ్ కంపించడం మొదలుపెట్టింది. నేను మొదట భూకంపం వచ్చిందని భ్రమ పడ్డాను. నా భ్రమకి కారణం సాన్ ఆండ్రియాస్ అనే రేఖ కాలిఫోర్నియా లో భూకంప౦ రావడానికి ముఖ్య కారణమని పత్రికలు వ్రాస్తున్నాయి. తీరా చూస్తే ఒక పెద్ద పడవ బ్రిడ్జ్ క్రిందనుంచి వెళుతున్నాది. దాని కూతవలన బ్రిడ్జ్ అంతా కంపించింది.
ఒక పురాతనమైన సంస్కారం చేతన లోతులనుంచి వస్తే ఇలాగే ఉంటుంది. మనం దానితో పోరాడాలి. దానివలన మన వ్యక్తిత్వం అతలాకుతలం అవ్వచ్చు. మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మికతలు కూడా ప్రభావిత మవ్వచ్చు. అందువలన మనము మార్పులు తెచ్చుకొనుటకు సిద్ధపడి, నూతన జీవన విధానమును అవలంబించాలి. అందువలన జీవుల ఐకమత్యం గూర్చి ఎరుక కలగాలి. మన స్వార్థం తగ్గించుకోవాలి.
ఈ మార్పు ఓజస్ అనే శక్తివలననే సాధ్యం. ఓజస్ మన చేతన మనస్సునుండి, లోతుగా ప్రవహిస్తుంది. మన ఇంద్రియాలు, శరీరము, మనస్సు, మేధ ఆత్మచే నియంత్రింప బడతాయి. దీనిని కూడా ఓజస్ అందురు. మనలో అతి కొద్ది మంది దీనిని అనుభవించెదరు. మన వ్యక్తిత్వము బొమ్మ వాహనాలు ఒకటిని మరొకటి గ్రుద్దు కున్నట్టుగా ఉంటుంది. అనగా మన ఇంద్రియాల స్పందన, భావాలు, సమత్వం ఆ బొమ్మ వాహనాలు. ఈ అపసవ్య క్రియ తగ్గినపుడు, గొప్ప శక్తి ఒక ప్రవాహంలాగ మన జీవితంలో ప్రవేశిస్తుంది.
ఓజస్ ఒక చోటకి తేబడి సాంద్రత పెరిగి౦పబడితే దానిని కుండలిని అందురు. అది మనందరిలోనూ ఉన్న మహా శక్తి. దాని శక్తితో మన పరిణామ శిఖరాల మీద ఉండగలం. స్వార్థపరులలో కుండలిని ఎక్కువ వాడబడదు. వాళ్ళు వాళ్ళ గురించే బ్రతుకుతారు కనుక వాళ్ళకది అక్కరలేదు. జీవితం సాధారణంగా సాగాలంటే అతి కొంచెమైన కుండలిని చాలు. కానీ మానవులైనందుకు మనకి చాలా సామర్థ్యము ఉంది. ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా ప్రాణం బయటకుపోవడం అరికట్టుతామో, కుండలిని మీదకు లేస్తుంది. మనం గాఢమైన కోర్కెలను విడనాడితే, ఆ శక్తి మనకు వస్తుంది.
కానీ ఇంద్రియములను ఆనందింప జేయుటకై లైంగిక కార్యాలలో పాల్పడితే కుండలిని పైకి లేవదు. కుండలిని లైంగిక కార్యముచే మిక్కిలి ప్రభావితమౌతుంది. మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లినంత మాత్రాన సన్యాసిలాగా ఉండనక్కరలేదు. కుండలినిని మన వశంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. లైంగిక కార్యము చేయుటకు ఇఛ్చ పోతుందనను. కాని అది ఎప్పుడు ఎక్కడన్నది మన స్వాధీనంలో ఉంటుంది.
ఎప్పుడైతే కామం అనే అగ్ని ప్రజ్వలమవుతుందో, మనం మన కోర్కెలు కామని తెలిసికోవడం అతి కష్ట౦. ఆ అగ్నిలో పడ్డామా మనకి విముక్తిలేదు. మనము దాని ఆధీనంలోకి వెళతాము. అప్పుడు మనం మన కోర్కెలను వాడుకోవటం లేదు. కోర్కెలు మనని వాడుకొంటున్నాయి. గీత చెపుతున్నది మనం వాటికి దాసోహం కాకూడదు. అవి మనకు దాసోహమనాలి. లైంగిక కోరికలను అణచి వేసికొన్న కుండలిని మన శరీరమంతా వ్యాపిస్తుంది. తద్వారా దుఃఖం, విపత్తు, అపాయము మనల్ని ఏమీ చేయలేవు. 205
No comments:
Post a Comment