Thursday, March 10, 2022

Chapter 15 Section 9

15.9

యతంతో యోగినశ్చైనం పశ్య౦త్యాత్మ న్యవస్థితం {15.11}

యతంతో అప్యకృతాత్మానో నైనం పశ్య౦త్యచేతసః

ప్రయత్నము చేయు యోగులు తమ స్వరూపమైన ఆత్మను దర్శించుచున్నారు. అభ్యాసపరులైనను అజ్ఞానులు గాంచలేక యున్నారు

శ్రీకృష్ణుడు కొందరు అహంకారులై, వేర్పాటై, బద్ధకంతో ఉన్న కారణములను వివరించుచున్నాడు. అది చాలా స్ఫురద్రూపమైన విశ్లేషణం. వాళ్ళు తమ క్షేమం గూర్చి ఆలోచించకుండా అహంకారులై యున్నారు. అలాగే తమ చేతన మనస్సులోని చెడును తుడిపివేయలేకపోతున్నారు. వారు అహంకారం ఎటు వెళ్తే అటు వెళ్తారు. అనగా ఆటంకములు లేని ద్రోవను ఎంచుకొంటారు. అందువలన వారు ఒక యంత్రంలా పనిచేస్తారు.

రోడ్లమీద ఇళ్ళు మోసే వాహనాలు "వెడల్పైన బండి" అని వెనక బోర్డు తగిలించి, ఎర్ర జెండాలు వ్రేలాడదీసి వెళ్తూ ఉంటాయి. తక్కిన వాహనాలు వాటి గూర్చి ప్రక్కకు తప్పుకొంటాయి. ఎందుకంటే అట్టి వాహన౦ నడిపేవాడితో వాదించలేక.

అహంకారులు ఇటువంటివారే. మన౦ వారిని అవమానించకపోయినా, నిష్కారణంగా వారు తప్పుని ఎంచుతారు. మనము హాస్యం చేసి వారి నుండి ఒక చిరనవ్వు కోరుతాము. వాళ్ళు ఇంటికెళ్ళి, దానిని పదే పదే ఆలోచించి మరుసటి రోజు వచ్చి తగవు పెట్టుకొంటారు.

ఇదే అహంకారుల పద్దతి. సమస్య గాలిలేని బుడగవలె యుండగా, దానిలో గాలి ఊది పెద్దదిగా చేసి, సమస్యను పెంచుతారు. మన సమస్యలు మిత్రులకు చెప్పి, మన డైరీ లో వ్రాసుకొని, తీవ్రంగా ఆలోచి౦చి , కలలో వచ్చి నంత పెద్దవి కావు. మనము అనేక గంటలు వాటిని గురించి ఆలోచించి సమస్యలను పెద్దదిగా చేసేము. మనము ఎర్ర జెండాలు, "వెడల్పైన బండి" హెచ్చరికలను చూడలేకపోవచ్చు. కాని తక్కినవాళ్లకది తెలిసి మన నుంచి ఎడంగా ఉంటారు.

అనేకమంది మేధావులు, ధనవంతులు, సౌందర్యము కలవారు, సంస్కృతి ఉన్నవారు వారి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని ఎడంగా ఉంటారు. శ్రీకృష్ణుడు చెప్పేది వారికి ఐకమత్యం లేదని. అందువలన వారి అభిప్రాయం లేదా మద్దతు ఐక్యతకు శాశ్వతంగా ఉండదు. 200

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...