Thursday, March 10, 2022

Chapter 15 Section 12

15.12

సర్వస్య చాహం హృది సన్ని విష్టో

మత్తః స్మృతిర్ జ్ఞాన మపోహనం చ {15.15}

వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో

వేదాంతకృ ద్వేదవిదేవ ఛాయహమ్

నేను సర్వభూతముల హృదయముల యందున్న వాడను. నా వలననే స్మృతియు, జ్ఞానమును, మరుపును కలుగుచున్నవి. సకల వేదముల చేత తెలియ దగిన వాడను నేనే. వేదాంత కర్తను, వేదముల నెరిగిన వాడను నేనే ఀ

ఐన్స్టీన్ పదార్థము, శక్తి ఒకటేనని ప్రతిపాదించెను. ఆయనకు ప్రాణము గూర్చి బహుశా తెలిసి ఉండవచ్చును. ప్రాణము పదార్థము, శక్తి అంతర్గతంగా ఉంటూ ఉండవచ్చు. ఒక ఆగియున్న పదార్థములో అంతర్గత శక్తి ఉ౦టే, గాఢమైన కోర్కె లేదా మితిమీరిన కోపంలో ఎంత శక్తి ఉంటుందో ఊహించుకోండి. ఒక స్థిరమైన కోరిక, ఒక వ్యక్తిని 30 లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు శక్తివంతంగా కర్మ చేయిస్తుంది. అది ఒక దేశానికి స్వతంత్రత నిస్తుంది, సాంకేతిక శాస్త్ర పురోగతికి దోహదమవుతుంది, ఒక వ్యాధిని నిర్మూలిస్తుంది. అదంతా ప్రాణం యొక్క శక్తి. అణువులో గొప్ప శక్తి ఉన్నట్టే మన ఆలోచనలోనూ అంత శక్తి ఉంది. సిందూర కాయ ప్రాణాన్ని పోసుకొని సిందూర వృక్షంక్రింద ఎలా మారుతుందో, ఆలోచనల ద్వారా కర్మ జరుగుతుంది. అది పెద్దదయితే కొన్ని దశాబ్దాలు కొనసాగి, వేల కొలది మానవులను ప్రభావితం చేసి, చరిత్ర పుటల్లో మిగులుతుంది.

డాక్టర్ హాన్స్ సెల్యే ఒక ఎలకను తయారు చేసేరు. అది ఎంత హిమవంతంగా ఉన్న, ఒత్తిడి ఉన్నా బ్రతికి వృద్ధి చెంద గలదు. మామూలు ఎలుక అలా చేయలేదు. ఆ ఎలుకకి తగినంత ఆహారం ఉంటే శాశ్వతంగా జీవిస్తుంది. కాని దాని శరీరంలో ఏదో శక్తి లోపించి మరణిస్తుంది. సెల్యే దానిలో లోపమేమిటి అని ప్రశ్నిస్తారు. ఏదో దివ్య శక్తి ఉండాలి. ఆయన దాన్ని "అనుసరణ శక్తి" అన్నారు. నేను దాన్ని ప్రాణం అంటాను.

డాక్టర్ బార్బరా బ్రౌన్ దానిని "నాడీ వ్యవస్థ శక్తి" అన్నారు. దాన్ని కూడా నేను ప్రాణమంటాను. ఆమెకి ప్రాణమెలా వ్యయమవుతుందో తెలియదు. దానివలన భౌతికంగా మార్పులు వస్తాయి కాని వ్యయం అన్నది భౌతికంగా కాదు. ఆమెకి ఆ వ్యయాన్ని ఎలా ఆపాలో తెలీదు. గీత మరియు ఉపనిషత్తులు చెప్పేది: మనం ఇంద్రియముల తృప్తి కొరకై ఒక వస్తువును కోరుకొంటే ప్రాణం వ్యయమవుతుంది. ఆ కోరిక తీరుతే భౌతికంగా ఇంద్రియములు తృప్తి పొందుటవలననే గాదు, ఆ కోరిక కోరుకోవడం వలన కూడా.

ఆ వ్యయం వలన మన చైతన్యం, పరిస్థితులు మార్పులను ఓర్చడం, రోజూ కలిగే ఒత్తిడిని సహించడం తగ్గిపోతుంది. దీనిని నిరోధించాలంటే మనం ఇంద్రియాలను మన ఆధీనంలో పెట్టుకోవాలి. అలాగే ప్రాణ శక్తిని పరోపకారానికై ఒక గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు -- గాంధీ, సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అస్సిస్సీ , సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా వంటి వారు చేసినట్లు-- బహిర్గతం చేయగలగాలి. అలా కానప్పుడు ప్రాణాన్ని అంతర్ముఖం చేయాలి. ఇలా చేస్తే మన శరీరం ఆరోగ్యంగా, అందంగా, చైతన్యంతో కూడినదై ఉంటుంది.

లోతుగా చేసే ధ్యానం వలన ప్రాణం పోగవుతుంది. అది ఎలాగంటే ఒక ఆనకట్ట నదీ జలాన్ని ఉంచినట్టు. ప్రాణం ఇంద్రియముల వలన మాత్రమే వ్యయమవ్వదు. ఎప్పుడైతే మన మనస్సు పరిపరి విధాలుగా పోతుందో అప్పుడు కూడా ప్రాణ శక్తి వ్యయమవుతుంది

మానసిక విభేదం వలన కూడా ప్రాణం వ్యయమవుతుంది. విభేదాలు ఎందుకొస్తాయంటే ఒక నిస్వార్థ సేవకై ఆలోచన, ఒక స్వార్థం గురించి ఆలోచన మనస్సులో ఒకే చోట ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. సాధారణంగా స్వార్థపూరిత ఆలోచన మొదట వస్తుంది.

ప్రాణ వ్యయం నిర్ణయాలు తీసికోవడం వలననే కాక, దానికి ముందు మనం చేసే తర్జనభర్జన వలన కూడా. మనం ఇరుపక్షాలుగా వ్యవహరించి, సెయింట్ ఆగస్ టైన్ చెప్పినట్లుగా, అంతర్యుద్ధం చేస్తాం. ఎవరు గెలిచినప్పటికీ ప్రాణం వ్యయమవుతుంది.

క్లేశాలు కూడా ప్రాణ వ్యయానికి కారణం. క్లేశం చిన్నదైనా పెద్దదైనా ప్రాణానికి హాని కలిగిస్తుంది. ఒకడు ఎప్పుడు తనపై విసిరిన సవాలును ఎదుర్కొనలేడో లేదా తన సమస్యలను ఎదుర్కొనదలచుకోలేదో అప్పుడు కూడా ప్రాణం వ్యయమవుతుంది.

కొంతమంది క్లేశములను సదా ఎదుర్కొంటారు. ఒక గొడుగుని తెరవాలన్నా వారికి క్లేశం కలుగుతుంది. "అది తెరిచికోపోతే ఎలా? నేను తడిసిపోతే జలుబు వస్తుందేమో" అని ఆలోచిస్తూఉంటారు. ఒక సత్కర్మను చేసి అపజయం పొందడం, ఆ కర్మని చేయకపోవడం కన్నా మంచిది. "నేనిది చేస్తే ఈ సమస్య వస్తుంది. చేయకపోతే ఆ సమస్య వస్తుంది" అని తర్జనభర్జన చేసే వాళ్ళున్నారు. అవసరమైతే సత్కర్మ చేసి సమస్యల పాలు అవ్వడం మంచిది. ఎందుకంటే మరో మారు చెయ్య వలసి వస్తే అంత కష్టమనిపించదు.

క్లేశం శక్తిని క్షీణింపజేస్తుంది. దానివలన కలిగే లాభమేమీ లేదు. మంత్రోపాసన ద్వారా శక్తిని పొంది ఎంత పెద్ద సవాలునైనా ఎదుర్కోగలరు. మనము రోజూ చేసే కర్మలతోబాటు మరిన్ని కర్మలు చెయ్యగలిగే శక్తిని పొందుతాము.

అన్నిటికన్నా మానసిక వ్యధ ప్రాణ శక్తిని ఎక్కువ హరిస్తుంది. మనస్తత్వవేత్తలు చెప్పేది వ్యధ సహజంగా కలిగేది. దానిని నిరోధించే శక్తి అందరికీ లేదు. చాలామంది విధి వ్రాత అనుకోని వ్యధతో జీవితాన్ని గడుపుతున్నారు.

ఇది ఎందుకంటే ఎవరూ మనసుకున్న ద్వార బంధాన్ని కాపలా కాయటం లేదు. సంతోషకరమైన ఆలోచనలు వస్తే మనకు నిద్రకూడా పట్టదు. మన౦ ధారాళంగా మాట్లాడగలం. మన మనస్సులోని ద్వార బంధాన్ని బార్లా తెరిచేము. సంతోషంతో పాటు దాని కవల వ్యధ కూడా వస్తుంది. దానిని ద్వారానికవతల పెట్టలేం. మనకు కొన్ని రోజులవరకు వ్యధ ఉందని తెలీదు.

శ్రీకృష్ణుడు మనస్సును నియంత్రించడం వలన క్లేశములను నిరోధించవచ్చునని చెప్పేడు. సంతోషం, వ్యధ లేనప్పుడు మన సహజ స్థితి ఆనందం. మనకు విభేదాలనుంచి, వేదననుంచి, కోపమును౦చి , భయమును౦చి విముక్తి లభిస్తుంది. 208

No comments:

Post a Comment

Is Yoga Religion?

Before I dwell on the million dollar question, here are some interesting facts about Yoga. The practice of yoga has existed since 300...