15.13
ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ
{15.16}
క్షర స్సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే
ఈ లోకమునందు క్షరుడును, అక్షరుడును అను ఇరువురు పురుషులు కలరు. సకల భూతములను క్షరము లనియు , కూటస్థుడక్షరుడనియు చెప్పబడును ఀ
నేనీమధ్య ఆర్నాల్డ్ టోయిన్ బీ వ్రాసిన పుస్తకమును చదివేను. అందులో ఆ రచయిత మానవులలో ఒక భాగము ఆధ్యాత్మికత, రెండవ భాగము భౌతికమని వ్రాసెను. జీవావరణంలో (biosphere) మనము పరిమితమైన, భౌతికమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాము. పై శ్లోకము దీని గురించే చెప్తున్నాది. క్షర అనగా పరిమితమైనది, తరిగిపోయేది, లయమవునది. ఈ మధ్య వరకు జీవావరణం అపరిమితమైనదని తలచి దాని వనరులను మన ఇష్టానుసారం వాడుకున్నాము. ఈ కాలంలో భౌతిక వనరులు -- అనగా ఆహారము, చెట్లు, ఖనిజములు, మట్టి, నీరు, గాలి-- పరిమితమని తెలుసుకొన్నాము. టోయిన్ బీ ఇంకా ఇలా వ్రాసేరు:
"మానవుడు చేతన మనస్సుతో తక్కిన సృష్టికి యాజమానుడని తలచెను. అలా చాలా కాలంగా ఉండి, ఇప్పడు పట్టు తప్పుతున్నాడు."
మనం సాంకేతముగా ఎంత పెరిగినను, టోయిన్ బీ వ్రాసేరు, మనము జీవావరణంనుండి తప్పించకోలేము. మనం ఏ ప్రకృతినైతే పాలిద్దామని అనుకొంటున్నామో అందులోనే మన మనుగడ సాగించాలి.
టోయిన్ బీ ఇంకా ఇలా వ్రాసేరు: మన ఆధ్యాత్మిక ప్రపంచం పదార్థము లేనిది, అపరిమితమైనది. మానవుడు అట్టి ఆధ్యాత్మికతకు యజమాని అవ్వాలి.
మన ప్రకృతి అపరిమితమైనది. ఉపనిషత్తులు చెప్పినట్టు సంపూర్ణము కానిది మనకు తృప్తి నివ్వదు. మన అసలైన గృహము లయముకానిది, మార్పులేనిది అని తెలియనంత కాలము మనము వనరులను పరిమితమైనదాని నుంచి తీసి, వస్తువులను తయారుచేసుకుంటాము.
మనం పీల్చే గాలి కూడా పరిమితము. లాస్ ఏంజలీస్ లో గాలి కాలుష్యంతో నిండి పోయింది. బే ఏరియా కూడా అలాగే ఉంది. సాన్ ఫ్రాన్సిస్కో లో పిల్లల్ని బయటకు వెళ్ళి ఆడరాదని హెచ్చరించేరు. మన దురాశతో గాలిని విషపూరితం చేసేము. మనము నిజంగా మన పిల్లలను ప్రేమిస్తే, గాలి పరిమితమని తెలుసుకోవాలి. గీత చెప్పేది దానిని సమంగా వాడాలని. ఎక్కువ డబ్బు ఆర్జించడానికి కోసం గాలిలోకి విషవాయువులు వదిలి, నదులు, సముద్రములలోను అక్కరలేని వస్తువులన్నీ పారేసి కాలుష్యం పెంచరాదు. అలాగే అక్కరలేని వస్తువులు కొని వాటి తయారీకి వాడిన వనరులను వృధా చేయవద్దు.
ఆర్థిక శాస్త్రం చెపుతుంది మన ప్రధానమైన వనరులను వాడద్దని. ద్రవ్యోల్బణం ఎక్కవగా ఉన్నప్పుడు, వడ్డీని కూడా ఖర్చు పెట్టవద్దు. మనం ప్రపంచ వనరులను విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నాము. మనం ఖర్చుపెడుతున్నది అపరిమితమైన దాని మీది వడ్డీ అనుకుంటాము. కానీ అది నిజం కాదు.
షూమేషర్ అనే శాస్త్రజ్ఞుడు గాంధీ, బుద్ధుని సిద్ధాంతాలను చదివి ఆర్థిక శాస్త్రాన్ని విశ్లేషణ చేసి ఇలా చెప్పేరు:
ఒక వ్యాపారస్తుడు మూల ధనం (capital) ఖర్చయినంత సేపూ తన సంస్థ తయారీలో అన్ని సమస్యలను దాటి, లాభ దాయకమైనదని తలచడు. అలాటప్పుడు అతి పెద్దదైన మన భూమి అనే సంస్థ యొక్క వనరులను గురించి మనము ఆలోచించడంలేదు. ఉదాహరణకు మనకు 2000 సంవత్సరంలో ఎంత ఇంధన౦ కావాలో చూద్దాం. మనమిప్పుడు 700 కోట్ల టన్నుల బొగ్గును వాడుతున్నాము. అది 2000 కోట్ల టన్నులకు పెరుగనున్నది.
కేవలం ధనము గురించే సదా ఆలోచిస్తే అది ప్రకృతి విరుద్ధం. ధనము అపరిమితము కావచ్చు, కానీ ప్రకృతి యొక్క వనరులు పరిమితం.
షూ మాషర్ ఇంకా ఇలాగన్నారు: మనం ప్రకృతిలో భాగమని తలచము. మనం బాహ్యమైన ఒక శక్తిగా భావించి దానిని వాడుకొంటున్నాము. కొందరు దానితో యుద్ధం చేయ పూనుకొన్నారు. అట్టివారు గెలిచినా తమ ఉనికిని పోగొట్టుకుంటారు.
బారీ కామనర్ చెప్పింది: సాంకేతిక విజ్ఞానము అతి భయంకరమైన అపాయంగా మారింది దాని అసమర్థత వలన కాదు. అది ఎంతో సమర్థమైనది. 1945 నుంచి అట్టి విజ్ఞానము అంతకు ముందు లేనట్టి పురోగతితో మనల్ని ప్రభావితం చేసింది. దాని పర్యావసానము: మానవుడు చరిత్ర పుటలనుంచి శాశ్వతంగా నిర్మూలించబడతాడు.
టోయన్ బీ ఇంకా ఇలా అన్నారు: మానవుడు, సృష్టిలో ఉత్కృష్టమైన జీవి. కానీ అధిక శక్తిని పొంది తన జీవావరణాన్నే నాశనం చేస్తున్నాడు. అది తన ముప్పుకే. వాడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. ప్రకృతి నివసింపయోగ్యం కాకపోతే మనవుడితో పాటు తక్కిన జీవులు కూడా నశించి పోతాయి.
మనమిది ఒక వాదనలా కాకుండా, సాహిత్య పరంగా కూడా తీసికోవాలి. ఎందుకంటే రాబోయే తరాలు ఇంతకు ముందు కనీ వినీ ఎరుగని రీతిలో కష్టాలు పడవలసి వస్తాయి. 212
No comments:
Post a Comment