15.14
ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః
{15.17}
యో లోకత్రయమావిశ్య బిభర్త్వవ్యయ ఈశ్వరః
ఎవడు అవినాశియు, ఈశ్వరుడునై, త్రిలోకములను ప్రవేశించి భరించుచున్నాడో అట్టి ఉత్తమ పురుషుడే పరమాత్మ యని తెలియబడుచున్నాడు.
యస్మాత్ క్షరమతీతో అహం అక్షరాదపి చోత్తమః
{15.18}
అతో అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః
నేను క్షరాక్షరములను అతిక్రమించిన వాడను. కావున లోకము నందును, వేదము నందును పురుషోత్తముడనని ప్రసిద్ధుడ నైతిని
యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం
{15.19}
స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత
భారతా! జ్ఞానవంతుడై ఎవడు నన్ను ఇట్లు పురుషోత్తమునిగ తెలిసి కొనుచున్నాడో వాడు సకలమును తెలిసినవాడై నన్ను సర్వ విధముల భజించుచున్నాడు ఀ
పరమాత్మను పురుషోత్తముడు అనెదరు. ఆధ్యాత్మికను ప్రక్కన పెడితే, మన ప్రపంచం అనర్థమైనది. ఎందుకంటే మనకి గమ్యం తెలీదు గనుక. స్వార్థ పూరిత సంతోషం, లాభం గమ్యంగా నేను తలచను. అట్లు అయినపుడు ఘటనలు మన అవగాహనకు రావు. తటస్థమైనవి పూర్ణంతో సంబంధం లేదు. మనకు మంచి ఎన్నికలు చేసుకోడానికి ఆధారమేమీ లేదు. అందువలన మనందిరికీ ఒక ఉన్నతమైన సిద్ధాంతం అవసరం. ఒక గమ్యం అవసరం. ఎప్పుడైతే తప్పుదారి పడతామో మనం సక్రమ మార్గానికి వెనక్కి రావచ్చు. మనమందరమూ మానవులైనందుకు కొన్ని తప్పులు చేస్తాము. మనకు ఉన్నతమైన ఉద్దేశం -- అంటే క్షణికమైన సంతృప్తి గాక--ఉంటే మనము తప్పులనే ఊబిలో చిక్కుకోనక్కరలేదు. ఆ గమ్యం చేరడానికి మనం వెనక్కి అడుగులు వేసి, తప్పును సరిదిద్దుకొని, ముందుకు సాగవచ్చు.
మనలో చాలా మంది డబ్బే ప్రధాన మనుకొంటారు. కొంతమంది ఒక సంస్థను మంచి ఉద్దేశంతో ప్రారంభించి, క్రొద్ది కాలం తరువాత పెద్ద లాభాలను ఆశిస్తారు. ఎంతోకొంత లాభం రావాలనుకోవడంలో తప్పు లేదు. ఉన్నతమైన లక్ష్యం లేక లాభంకై కర్మ చేస్తే అది మన జీవితాన్ని, ఇతరులను ఛిన్నాభిన్నం చేస్తుంది.
ప్రతి దేశంలోనూ ప్రజలకు అనారోగ్యము కలిగించే వస్తువులను అమ్ముతున్నారు. ఉదాహరణకు అమెరికాలో చేసే తుపాకులు జర్మనీ లో చేసే విడి భాగలతో చేస్తారు. ఈ విధంగా జర్మనీ సంస్థలు, అమెరికా సంస్థలు లాభాలను పంచుకొంటాయి. సంపన్న దేశాలలో నిషేధింపబడిన మందులు -- ఏలనగా అవి క్యాన్సర్ లేదా అంగవైకల్యము కలిగించేవి--బీద దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే బీద దేశాలలో వాటిని నియంత్రించరు కనుక. అమెరికా, రష్యా వంటి దేశాలు ఆయుధాలను తయారు చేసి తక్కిన దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటువంటి సంస్థల జాబితా ఇక్కడ వివరించలేనంత పెద్దది.
కొన్ని దేశాలలో క్రీడాకారులిని, సినిమా పాత్రలు వేసేవారిని తమ దైవాలగా భావిస్తారు. కొందరు వారిలాగే జీవన శైలిని, మాట్లాడే విధానమును మార్చుకొన ప్రయత్నం చేస్తారు. క్రీడలు, సినిమాలు మన విశ్రమించు సమయంలో చూడడంలో తప్పు లేదు. కానీ ఉన్నతమైన ధ్యేయం లేక పోతే త్వరగా పరిగెత్తడం, టెన్నిస్ బాగా ఆడడానికి శ్రమ పడడం దండగ. మనందిరికీ ఒక ఆదర్శమైన వ్యక్తి కావాలి. మనకి ఉన్నతమైన ఆదర్శం లేనప్పుడు, ఏ ఫుట్బాల్ ఆటగాడినో, క్రికెట్ ఆడేవాడినో ఆదర్శంగా తీసికొ౦టాము.
గొప్ప మతాలు మనకు ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చి, చేతన మనస్సు లోతుల నుంచి మన మంచితనాన్ని వెలుగుకు తెస్తాయి. శ్రీకృష్ణుడు, జీసస్, బుద్ధుడు వంటివారిని ఆదర్శవంతులుగా తీసికొ౦టే, మనం క్రమంగా వారిలాగ దేదీప్యమానమైన వ్యక్తులుగా తయారవడానికి దోహదం చేస్తుంది.
సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అస్సీసి, తన చివరి రోజుల్లో, శిష్యులను వీడి లవెర్న అడవులలో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళేరు. ఒక 30 రోజుల తరువాత, సూర్యోదయమునకు ముందు, ఆయన సమాధిస్థితికి వెళ్ళేరు. అప్పుడు ఆయని జీసస్ కి చేసిన ప్రార్ధన: "నా మొదటి కోరిక నీవు అనుభవించిన కష్టం నా హృదయ గుహలలో, నా ఆత్మలో నువ్వు చూడాలి; రెండు, నీ హృదయంలో పొంగి పొరలే ప్రేమ ఎలాగాయితే భూమి మీద నీ ఆఖరి నిమిషంవరకూ వీడలేదో, అటువంటి ప్రేమ నాకూ కలగాలి" ఆయన జీసస్ తో ఎంత ఐక్యమయ్యేడంటే ఒక ప్రక్క అమితమైన ప్రేమ; రెండవ ప్రక్క జీసస్ శిలువ మీద పడ్డ కష్టాన్ని అనుభవించేడు.
సమాధి అనగా దేవునితో సంపూర్ణమైన ఐక్యం. ఎవరైతే దాన్ని సాధిస్తారో ఇతరుల యొక్క సుఖాలను, కష్టాలను స్వయంగా అనుభవిస్తారు. వాళ్ళు ఇతరుల కష్టాలు, సుఖాలు పంచుకొంటారు. తక్కినవారు -- మనలాంటి సామాన్యులు, స్వార్థపరులు, ఎడంగా ఉన్నవారు--తమ చుట్టూ ఉన్న యాతనను తెలిసికోలేరు. మనమెంత ఎడంగా ఉంటే ఇతరుల సమస్యలకు దూరంగా ఉండి, ఇతరుల కష్టాలను చూసి చూడనట్టు ఉండి మన ఆనందం కోసం అన్ని కర్మలు చేస్తాం.
మనమెంత నిస్వార్థ౦గా ఉంటామో, అంత ఇతరుల కష్టాలను చూస్తాం. అది నిశ్చలత్వానికి దారి తీసేది కాదు. ఎక్కడైతే దుఃఖం ఉందో దాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. చేతులెత్తి "నేనేమీ చేయలేను. ప్రపంచం ముక్కలై పోతోంది; అయితే అవ్వనీ" అనకూడదు. మనమెప్పుడైతే జీవులతో తాదాత్మ్యం చెందుతామో, మనకు వారి దుఃఖమును తొలగించే వనరులు దొరుకుతాయి. మరియు మన జీవితాన్ని దుఃఖాలను దూరం చేయుటకు దారబోస్తాము. 214
No comments:
Post a Comment